WPL 2023: Schedule, Venue, Teams and Players List - Sakshi
Sakshi News home page

WPL 2023: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌, వేదికలు.. ఫైనల్‌ అప్పుడే!

Published Wed, Feb 15 2023 10:34 AM | Last Updated on Wed, Feb 15 2023 12:51 PM

WPL 2023 Schedule Venues Timings Check Details - Sakshi

ఆర్సీబీలోకి స్మృతి మంధాన- ముంబై జట్టులోకి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

Women's Premier League- 2023- ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ప్రారంభ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీ జట్ల మధ్య వచ్చే నెల 4 నుంచి అమ్మాయిల మెరుపులు మొదలవుతాయి. దీనికి సంబంధించిన మొత్తం 22 మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను మంగళ వారం విడుదల చేశారు.

డీవై పాటిల్‌ స్టేడియంలో మార్చి 4న జరిగే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ తలపడుతుంది. ఫైనల్‌ 26న జరుగుతుంది. ఈ సీజన్‌లో నాలుగు రోజులు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి.  మొత్తం 22 మ్యాచ్‌ల్లో 11 చొప్పున బ్రబౌర్న్‌ స్టేడియం, డీవై పాటిల్‌ స్టేడియాల్లో నిర్వహిస్తారు.

మహిళా ప్రీమియర్‌ లీగ్‌-2023 జట్లు
1.రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
2. ఢిల్లీ క్యాపిటల్స్‌
3. యూపీ వారియర్స్‌
4. గుజరాత్‌ జెయింట్స్‌
5. ముంబై ఇండియన్స్‌

చదవండి:  వివాదంలో బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌.. ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు.. వాళ్లు సూపర్‌స్టార్లు.. ఫిట్‌నెస్‌ లేకున్నా అంటూ.. 
WPL 2023: ఆర్సీబీ మెంటార్‌గా భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement