డబ్ల్యూపీఎల్ ట్రోఫీలో ఇరు జట్ల కెప్టెన్లు లానింగ్, హర్మన్‌ప్రీత్
ముంబై: ప్రతిష్టాత్మకంగా తొలి సారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి ఘట్టానికి చేరింది. టోర్నీ మొదటి విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. టోర్నీ ఆరంభంలో దూకుడు కనబర్చి దూసుకెళ్లిన ముంబై ఆ తర్వాత వెనుకబడటంతో ఫైనల్ చేరేందుకు ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. ఢిల్లీ మాత్రం సరైన సమయంలో సత్తా చాటి వరుస విజయాలతో పాటు రన్‌రేట్‌ను పెంచుకొని అగ్రస్థానంతో తుది పోరుకు అర్హత సాధింది.
ఢిల్లీ బ్యాటింగ్ భారం ఓపెనర్ లానింగ్‌తో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లపై ఉంది. ఆల్‌రౌండర్‌గా మరిజాన్ కప్ ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించింది. మరో వైపు హర్మన్‌ప్రీత్ ఫామ్‌లో లేకపోయినా నాట్ సివర్, హీలీ మాథ్యూస్ ముంబైకి భారీ స్కోరు అందించగలరు. అమేలియా కెర్ రూపంలో ధాటిగా ఆడే మరో బ్యాటర్ కూడా ఉంది. ప్రత్యర్థి కంటే బలమైన బౌలింగ్ లైనప్ ముంబై ఆశలను పెంచుతోంది. సైకా ఇషాక్ 15 వికెట్లతో ఫామ్‌లో ఉండగా, పేసర్ ఇసీ వాంగ్ పదునేమిటో ఎలిమినేటర్‌లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఫైనల్ సమరం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment