
కోదండరామ్‌కు ఆ విషయం తెలియదా?
జేఏసీ చైర్మన్ కోదండరామ్‌పై కర్నె ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఢిల్లీలో అబద్దాల చిట్టాతో సంచరిస్తున్నారని, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కోదండరామ్ అబద్దాలతో ఎవరినీ మెప్పించలేరని అభిప్రాయపడ్డారు.
టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం లక్షా నలభై అయిదు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిందని మాట్లాడుతున్నారని, అప్పులు తీర్చగలిగే వారికి ఎవరైనా అప్పులు ఇస్తారని పేర్కొన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాలు అప్పులు చేయడం లేదా ? ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే అప్పులు తెస్తున్నామన్న విషయం కోదండరామ్‌కు తెలియదా అని ప్రశ్నించారు. అసలు ఎలాంటి తెలంగాణ కావాలో కోదండరామ్ స్పష్టం చేయాలన్నారు.