అవసరమైతే మిలియన్‌ మార్చ్‌! | TSRTC Strike: RTC JAC Decide To Hold Million March | Sakshi
Sakshi News home page

మిలియన్‌ మార్చ్‌!

Published Thu, Oct 31 2019 1:44 AM | Last Updated on Thu, Oct 31 2019 4:11 AM

TSRTC Strike: RTC JAC Decide To Hold Million March - Sakshi

బుధవారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరి సభలో అభివాదం చేస్తున్న అఖిల పక్ష నేతలు  

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆర్టీసీ పరిరక్షణకు జరుగుతున్న పోరాటంలో కార్మికులు విజయతీరాలకు ఎంతో దూరంలో లేరు. అనుమానమొద్దు.. విజయం మనదే. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ ఒంటరయ్యారు. ఆయన వెంట మంత్రుల్లేరు. ఎమ్మెల్యేలు లేరు. కానీ ఆర్టీసీ కార్మికుల వెంట రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, అన్నింటికీ మించి ప్రజలున్నారు. ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసే క్రమంలో అవసరమైతే ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ నిర్వహిద్దాం’అని టీజేఎస్‌ అధినేత కోదండరాం అన్నారు. ప్రభుత్వంలో విలీనం అయితే తప్ప ఆర్టీసీ బతకదని, దాన్ని కచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమ్మె కార్యాచరణలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ‘సకల జనభేరి’సభకు ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా కార్మికులు సభకు తరలివచ్చారు. ఇండోర్‌ స్టేడియంలో మాత్రమే సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో, లోపల స్థలం లేక భారీ సంఖ్యలో కార్మికులు బయటే ఉండిపోయారు. ఇంత భారీ ఉద్యమం శాంతియుతంగా నిర్వహించటం చిన్న విషయం కాదని, ప్రపంచవ్యాప్తంగా అరుదైనదని పేర్కొన్నారు.

కార్మికలు తమ జీతాల కోసం సమ్మె చేయట్లేదని, సంస్థను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నారని చెప్పారు. ఈ తపన ఎంత బలంగా ఉందో.. సకల జనభేరి సభకు 50 వేల మంది రావటమే నిదర్శనమన్నారు. ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తప్పుపడుతున్నా ఇప్పటివరకు సీఎంలో చలనం లేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులే కారణమంటూ సీఎం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ చెబుతున్నట్లు కారి్మకులకు సగటు జీతం రూ.50 వేలు లేనే లేదని, వారివన్నీ తక్కువ జీతాలేనని స్పష్టం చేశారు. చిన్నచిన్న కారణాలకే కారి్మకుల ఇంక్రిమెంట్లు కట్‌ చేస్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన చర్చల సమయంలో కార్మిక సంఘం నేతలను అధికారులు అవమానించారని మండిపడ్డారు. దీన్ని కారి్మక సంఘం నేతలు సమర్థంగా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పటికే 15 మంది కారి్మకులు మృతి చెందారని, ఇంకా ఎంతమందిని సీఎం బలి తీసుకుంటారని ప్రశ్నించారు. 

ప్రభుత్వ హత్యలే: చాడ వెంకటరెడ్డి 
కేసీఆర్‌కు రాజ్యాంగంపై అవగాహన లేదని, అందుకే ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ తీరులో ఇప్పటికే 15 మంది ఆర్టీసీ కారి్మకులు మృతిచెందారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. హైకోర్టు అక్షింతలు వేస్తుంటే.. తప్పుడు లెక్కలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆ విషయం గ్రహించి కోర్టు మొత్తం కూపీ లాగుతోందన్నారు. అంతిమ విజయం కారి్మకులదేనని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. 

ప్రైవేటీకరించటం ఉందా: రేవంత్‌రెడ్డి 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం తమ ఎజెండాలో లేదని సీఎం అంటున్నారని, మరి ఆరీ్టసీని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు చేస్తున్న అంశం ఏ ఎజెండాలో ఉందో చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తన వ్యాపారాలకు పనికొచ్చేవే చేస్తున్నారని, అవన్నీ ఎన్నికల మేనెఫెస్టోలో పెట్టే చేస్తున్నారా అని ప్రశ్నించారు. మీరు, మీ కొడుకు, కూతురు, అల్లుడు, బంధువులు సీఎం, మంత్రులు, ఎంపీలు అవుతారని మేనిఫెస్టోలో ప్రకటించారా అని ఎద్దేవా చేశారు. ‘సభాప్రాంగణానికి చేరుకునేందుకు 3 కిలోమీటర్ల దూరం నడిచి రావాల్సిన పరిస్థితి ఏర్పడేలా వేల మంది కార్మికులు వచ్చారు. ఇవి నిరసనలు కాదా.. ధర్నాలు కాదా.. కేసీఆర్‌కు కని్పంచట్లేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్‌కు కూతవేటు దూరంలో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తే సీమాంధ్ర సీఎం అనుమతించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో కారి్మకులు సభ నిర్వహించుకుంటామంటే అవకాశం లేకుండా చేయటం విడ్డూరమన్నారు. నిజానికి ఆర్టీసీ నష్టాల్లో లేదని, నష్టాల్లోకి నెట్టేశారన్నారు. ధనవంతులు తిరిగే విమాన ఇంధనంపై ఒక శాతం పన్ను వేస్తూ, పేదలు తిరిగే ఆర్టీసీ బస్సుల డీజిల్‌పై 27.5 శాతం పన్ను వేయటం లాంటివాటి వల్ల నష్టాలు వచ్చాయన్నారు. విమాన ఇంధనంపై పన్ను తగ్గించి ప్రైవేటు సంస్థకు రూ.500 కోట్ల లాభం చేకూర్చి, డీజిల్‌పై పన్ను పెంచి ఆర్టీసీపై రూ.700 కోట్ల భారం మోపారన్నారు. వేల మంది పోలీసు పహారా పెట్టినా 21న ప్రగతి భవన్‌ ముట్టడి సందర్భంగా ‘కోట గోడ’ను కొట్టామని, ప్రజలు తలుచుకుంటే ప్రగతి భవనే ఉండదని హెచ్చరించారు. కోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దుతుంటే కేసీఆర్‌ గాడిద పండ్లు తోముతడా అని మండిపడ్డారు. 

బుధవారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరికి హాజరైన ఆర్టీసీ కార్మికులు

ఇప్పుడెందుకు నష్టాలు: ఎల్‌.రమణ 
తాను రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నష్టాల ఆరీ్టసీని లాభాల్లోకి తెచ్చానన్న కేసీఆర్, సీఎం అయ్యాక తీవ్ర నష్టాల్లోకి ఎందుకు వెళ్లిందో చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకే దాన్ని ప్రైవేటీకరించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆర్టీసీ కారి్మకులు కీలకమవుతారని, సాధారణ ప్రయాణికులకు వాస్తవాలు చెప్పటం ద్వారా కనీసం కోటి మందిని ప్రభావితం చేయగలుగుతారని, అది ఎన్నికల ఫలితాన్ని శాసిస్తుందన్నారు. 

డిస్మిస్‌ భయం లేని ఆత్మగౌరవ ఉద్యమం: మందకృష్ణ మాదిగ 
సెల్ఫ్‌ డిస్మిస్‌ అంటూ కేసీఆర్‌ ఎంత బెదిరించినా ఆర్టీసీ కారి్మకులు ఆత్మ గౌరవంతో ఉద్యమం చేస్తున్నారని ఎమ్మారీ్పఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్‌ ఓటమి దిశలో ఉన్నారని, ఆర్టీసీ కారి్మకులు గెలుపుబాటలో ఉన్నారని పేర్కొన్నారు. లోటు బడ్జెట్‌ ఉన్న ఆంధ్రలో ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, మిగులు బడ్జెట్‌ రాష్ట్రం తెలంగాణలో ప్రైవేటీకరిస్తారా అని ప్రశ్నించారు. 

ఈ సభ చూస్తే కేసీఆర్‌కు దడ: జితేందర్‌రెడ్డి 
సరూర్‌నగర్‌ సభకు వచి్చన కారి్మక జన ప్రవాహం చూస్తే ప్రగతి భవన్‌లో కేసీఆర్‌కు దడ ఖాయమని బీజేపీ నేత జితేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఆర్టీసీ కారి్మకులను ఉద్యమంలో వాడుకుని ఇప్పుడు వారినే డిస్మిస్‌ పేరుతో బెదిరించటం దారుణమన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత కరెంటు సరిగా లేకపోయినా దిక్కుండదని, కేసీఆర్‌కు కావాల్సింది ఓట్లు తప్ప ప్రజల సంక్షేమం కాదన్నారు. ఇప్పటికే ఏ పథకానికీ నిధుల్లేకుండా పోయాయని, ఈ దివాలా ప్రభుత్వం ఎందుకు, కేసీఆర్‌ను దింపేస్తే సరిపోతుంది కదా అని పేర్కొన్నారు. సభలో కాంగ్రెస్‌ నేతలు వి.హనుమంతరావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ నేత వివేక్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం నేత నరసింహారావు, చెరుకు సుధాకర్, విమలక్క, జాజుల శ్రీనివాసగౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.  

గమ్యం చేరి తీరాలి: అశ్వత్థామరెడ్డి 
కారి్మకులు గెలుపు కోసం పోరాడుతుంటే, ప్రభుత్వం ఓడిపోవొద్దని పోరాడుతోందని, ఏదో సమయంలో కచి్చతంగా ప్రభుత్వం పట్టు సడలి ఓడిపోవటం ఖాయమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. గమ్యాన్ని చేరి తీరాల్సిందేనని, ఇందుకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతామని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయనుకుంటే ఆరీ్టసీని ప్రైవేటీకరించే తరహా పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. నిర్బంధాన్ని ఛేదించుకుని వేల సంఖ్యలో కారి్మకులు ఈ సభకు తరలి వచ్చారని, ఇదే ఉత్సాహంతో అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగుతారని జేఏసీ కోకనీ్వనర్‌ రాజిరెడ్డి అన్నారు. ప్రభుత్వంలో ఆరీ్టసీని విలీనం చేస్తే యూనియన్లనే తాము రద్దు చేసుకుంటామన్నారు. 

నేడు దీక్షలు 
రాష్ట్రవ్యాప్తంగా కారి్మకులంతా ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని ఈ సభలో తీర్మానించారు. గురువారం రాత్రి వరకు ఈ దీక్ష కొనసాగనుంది. నిరాహార దీక్ష చేస్తూ ప్రస్తుతం నిమ్స్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు దీక్ష విరమించేలా చేయాలని కూడా తీర్మానించారు. గురువారం ఉదయం 9 గంటలకు నిమ్స్‌కు వెళ్లి ఆయనకు నిమ్మరసం ఇచ్చి విరమింపచేయాలని నిర్ణయించినట్లు జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement