‘శ్రీనివాస్‌రెడ్డిది ప్రభుత్వ హత్యే’ | Professor Kodandaram Comments On KCR | Sakshi
Sakshi News home page

‘శ్రీనివాస్‌రెడ్డిది ప్రభుత్వ హత్యే’

Published Sun, Oct 13 2019 8:05 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డిది ఆత్మహత్య కాదని..ప్రభుత్వ హత్యేనని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికులవి న్యాయమైన డిమాండ్లేనని పేర్కొన్నారు. ‘ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు తీసేశానని కేసీఆర్‌ అంటున్నారని..వెళ్లమంటే వెళ్లడానికి ఆర్టీసీ కార్మికులు నీ ఫామ్‌హౌస్‌లో పాలేర్లు కాదని’ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజా ప్రయోజనాలు కేసీఆర్‌కు పట్టవని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. అధైర్య పడొద్దని..ధైర్యంగా పోరా డాలని కోదండరామ్‌ పిలుపునిచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement