సాక్షి, హైదరాబాద్: ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమంలో భాగం గా ఆదివారం ఇందిరాపార్కు సమీపంలోని ఎల్‌ఐసీ కాలనీ, పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న ధర్నాచౌక్ ఆక్రమణను చేపట్టిన అనంతరం, దీని పున రుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి వారం సమయా న్నిచ్చింది.
అనంతరం తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీలోని వివిధ వామ పక్షాలు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలు ఆదివారం ఎల్‌ఐసీ కాలనీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పాదయాత్రను చేపట్టి ధర్నాచౌక్ పునరుద్ధరణ అవసరాన్ని అక్కడి ప్రజలకు వివరించాలని నిర్ణయించాయి. ధర్నాచౌక్ పునరుద్ధరణకు స్థానిక ప్రజల మద్దతును కూడగట్టాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ పాదయాత్రలో కమిటీ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొంటారు.