‘నిజాం షుగర్స్‌ను కాపాడుకుందాం’
Published Mon, Apr 17 2017 8:09 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM
బోధన్ : తెలంగాణ వారసత్వ సంపద నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ (ఎన్‌ఎస్‌ఎఫ్)ని కలిసికట్టుగా కాపాడుకుందామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపు నిచ్చారు. నిజాంషుగర్స్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలన్న ప్రధాన డిమాండ్‌తో టీ జేఏసీ, నిజాంషుగర్స్ రక్షణ కమిటీ, అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం బోధన్‌లో ధర్నా, పాదయాత్ర, బహిరంగ సభను నిర్వహించారు. కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ ఒక వైపు అసెంబ్లీలో వారసత్వ కట్టడాల రక్షణకు బిల్లు ఆమోదం తెలుపుతూనే మరో వైపు వారసత్వ సంపద నిజాంషుగర్ ఫ్యాక్టరీ నాశనమవుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం విచిత్రమైన పరిస్థితి అన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయకుండా రైతులు ముందుకువస్తే అప్పగిస్తామని ప్రకటన చేసిన ప్రభుత్వం నెలలు గడిచిపోతున్నా విధివిధానాలు ప్రకటించకుండా జాప్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేందుకే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. రైతులకు ఎకరానికి రూ. 4వేల ఎరువు సహాయం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాలన్నారు.
Advertisement
Advertisement