
లక్ష్మణ్‌తో కోదండరాం భేటీ
♦ అధికార పార్టీ తీరుపై చర్చ
♦ టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులను కలుపుకుపోయే ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసు కుంటున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. నిరసనలకు అవకా శం లేకుండా ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ను ఎత్తేయడం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ పై అందరినీ కలుపుకొని పోవడం వంటి అం శాలపై చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలుపుకొని పోయేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఇందిరాపార్కు ధర్నాచౌక్ ఎత్తివేత, సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ల కొనసాగింపునకు వ్యతిరేకంగా కలిసొచ్చే వారిని కూడగట్టేందుకు జేఏసీ ప్రయత్నిస్తుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మంగళవారం బాగ్‌లింగంపల్లి లోని ఓ ఇంటిలో వీరు సమావేశమయ్యారు. వీరితో పాటు పాటు గాదె ఇన్నయ్య, పలు ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు.
టీఆర్‌ఎస్ అసహనానికి నిదర్శనం...
అసెంబ్లీలో విపక్షాల గొంతునొక్కేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం, ధర్నాచౌక్‌ను శివార్లకు తరలించడంవంటి సమస్యలపై స్పందిస్తున్న తీరు అధికార టీఆర్‌ఎస్‌లో పెరు గుతున్న అసహనానికి నిదర్శనమని వీరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రజాస్వా మ్యహక్కుల పరిరక్షణలో భాగంగా ఈ అం శంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొనిపోయే అంశంపై జేఏసీగా కోదండ రాం, జస్టిస్ చంద్రకుమార్, ప్రజాగాయకుడు గద్దర్, మంద కృష్ణమాదిగ, ప్రజాసంఘాలు ఫ్రంట్‌గా ముందుకువస్తే బీజేపీ మద్దతిస్తుం దని లక్ష్మణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
గతంలో కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు, హామీలకు భిన్నంగా సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులను కొనసాగించడంపై మంచిర్యాలలో చేపడుతున్న నిరసనలపై ప్రస్తావన రాగా, ఓపెన్‌కాస్ట్‌లను కొనసాగించడాన్ని బీజేపీ తప్పుపడుతోందని లక్ష్మణ్ పేర్కొన్నట్లు తెలు స్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందా లేదా పొత్తులకు తలొగ్గుతారా అని కోదండరాం ప్రశ్నించగా కచ్చితంగా ఒంటరిగానే పోటీ చేస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారని సమాచారం.
ప్రత్యామ్నాయం బీజేపీయే...
టీఆర్‌ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీ యేనని లక్ష్మణ్ పేర్కొన్నట్లు సమాచారం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ వ్యవహరి స్తోందని చెప్పినట్లు తెలుస్తోంది. ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపట్ల బీసీల్లో వ్యతి రేకత వ్యక్తమవుతోందని వ్యాఖ్యానించారని తెలిసింది. దీనిపై ముస్లింలలో కూడా ఆం దోళన వ్యక్తమవుతోందని, 12శాతానికి పెంచి తే మొదటికే మోసం వస్తుందా అన్న సందే హాలు వారిలో వ్యక్తమవుతున్నాయని పేర్కొ న్నట్లు సమాచారం.