k. laxman
-
60 సీట్లపై బీజేపీ కసరత్తు కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అభ్యర్థుల ఖరారు కసరత్తు కొలిక్కి వస్తోంది. శుక్రవారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో 60 స్థానాల్లో అభ్యర్థులపై (19 ఎస్సీ, 12 ఎస్టీ సీట్లు మినహాయించి) ఒక అభిప్రాయానికి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సీట్లకు సంబంధించి మరోసారి చర్చించి, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని జాబితాల ను పంపాలని నిర్ణయించినట్టు వివరిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఆయా స్థానాల్లో ప్రాధాన్యతలు, ప్రతిపాదిత అభ్యర్థుల పేర్లను కీలక నేతలు అందజేయడంతో.. భేటీలో అన్నింటినీ సరిచూసి, కామన్‌గా ఉన్న పేర్లను ముసాయిదా జాబితా కోసం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సంఘ్‌పరివార్ క్షేత్రంలోని వారితోనూ పార్టీ నేతలు సమావేశమై, ఆయా సీట్లకు పేర్లపై స్పష్టత తీసుకున్నట్టు తెలిసింది. కసరత్తు పూర్తయ్యాక 40–45 మందితో తొలిజాబితాను ఢిల్లీలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పార్టీనేతలు చెప్తున్నారు. పలు స్థానాలపై స్పష్టత శుక్రవారం జరిగిన భేటీలో హైదరాబాద్ నగరంలోని రెండు ముఖ్యమైన స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. అంబర్‌పేట నుంచి పోటీకి కిషన్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేయగా.. ముషీరాబాద్ నుంచి బరిలో ఉండేందుకు కె.లక్ష్మణ్ విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముషీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు పలువురు ముందుకొచ్చినట్టు తెలిసింది. ఈ నియోజకవర్గంలో ఐదుగురు బీజేపీ కార్పొరేటర్లు ఉండగా.. ఒకరు బీఆర్ఎస్లోకి వెళ్లారు. మిగతా నలుగురు కూడా తమకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుతున్నారు. దీంతో ఈసారి కార్పొరేటర్లకు టికెట్ అవకాశం కల్పించరాదని నిర్ణయించినట్టు తెలిసింది. అందరూ కలసికట్టుగా పనిచేస్తే పార్టీ విజయానికి మార్గం సుగమం అవుతుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఆమెకు టికెట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. -
23 నుంచి బీజేపీ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ తమ కార్యాచరణను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఆందోళనలను చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ల నేతృత్వంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు పార్టీ సమావేశాలను నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నిరసనలు, ఆందోళనలకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. 23 నుంచి ప్రజా ఆందోళనలు: కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఉద్యమ కమిటీ సమావేశంలో.. ఈనెల 23 నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఆందోళన కార్యక్రమాల ప్రణాళికను ఖరారు చేశారు. 23న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టి.. ఆయా ఎమ్మెల్యేలు గత ఐదేళ్ల చేసిన అవినీతి, అక్రమాలు, హామీల ఉల్లంఘనపై చార్జిషిటును విడుదల చేస్తారు. 24న మంత్రుల ఇళ్ల ముట్టడి, ధర్నాలు చేపట్టి.. మంత్రుల అవినీతిపై చార్జిషిటును విడుదల చేస్తారు. 25న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి.. కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తారు. అమిత్‌షా పర్యటన, బస్సు యాత్రలపై..: 27న ఖమ్మంలో నిర్వహించే అమిత్‌షా సభకు ఏర్పాట్లపైనా రాష్ట్ర బీజేపీ నేతలు మరో సమావేశంలో చర్చించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన బస్సు యాత్రలపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం సీతారామ దేవాలయం, బాసర సరస్వతి దేవాలయం, అలంపూర్ జోగులాంబ దేవాలయాల నుంచి బీజేపీ బస్సుయాత్రలను ప్రారంభించనున్నారు. అధికార పార్టీ ఉల్లంఘనలపై ఫోకస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ చేపట్టే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు స్పందించేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇక ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో.. నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కాగా సోమవారం పార్టీ అనుబంధ సంఘాలైన ఏడు మోర్చాల సమావేశాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
కాంగ్రెస్ కూటమి ఒక దోపిడీ ముఠా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ కూటమి ఒక దోపిడీ ముఠా అని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. పార్లమెంటులో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా విపక్షా లు వ్యవహరించాయని, మణిపూర్ అంశంపై చర్చలు జరపాలని కాంగ్రెస్ గొడవ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్‌కు తోకపార్టీల్లా వ్యవహరిస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని, ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు పొందడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని సమాధానం కోసం పట్టుబట్టిన విపక్షాల నేతలు ఆయన మాట్లాడుతుంటే లోక్‌సభ నుంచి ఎందుకు పారిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. యోధుల త్యాగాలను స్మరించేలా విగ్రహాలు ఎంఐఎం పార్టీ ఒత్తిడికి లోబడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బత్తిని మొగిలయ్య గౌడ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర మరుగున పడేలా చేశాయని డాక్టర్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నెహ్రూ, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాలవే చరిత్ర అన్నట్లు ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూ షన్ క్లబ్లో బీజేపీ నాయకుడు తూళ్ల వీరేందర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన బత్తిని మొగిలయ్యగౌడ్ వర్ధంతి సభలో కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి యోధుల విగ్రహాలు పెట్టడమేకాకుండా, వారి త్యాగాలను స్మరిస్తూ కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. రజాకార్ల పోకడలను కళ్లకు కట్టేలా సినిమా తీస్తున్న రజాకర్ సినిమా బృందాన్ని ఎంపీ లక్ష్మణ్ అభినందించారు. -
అక్కడా, ఇక్కడా మాదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయంటున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కన్నడ ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై బీజేపీలో ఉత్కంఠ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ గద్దెనెక్కని సాంప్రదాయం, ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గడం వంటి అంశాల నేపథ్యంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయినా కర్ణాటకలో బీజేపీ విజయఢంకా మోగించడం తథ్యమని కమల నాథులు చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని అంటున్నారు. కర్ణాటకలో గెలిస్తే.. దక్షిణాదిలో పార్టీ విస్తరణకు, తెలంగాణలో కాషాయజెండా ఎగురవేసేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంటున్నారు. ఎగ్జిట్ పోల్స్‌తో అంతర్మథనం.. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్‌పోల్ అంచనాల్లో ఒకట్రెండు మినహా దాదాపు అన్నీ కాంగ్రెస్‌కు ఆధిక్యం వస్తుందనే పేర్కొన్నాయి. ఇది బీజేపీ వర్గాల్లో కొంత అంతర్మథనానికి దారితీసినా.. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై రాష్ట్ర నేతలు మాత్రం పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తప్పుతాయని, బీజేపీయే అధికారంలోకి వస్తుందని వాదిస్తున్నారు. ఇక కర్ణాటకలో తెలుగు మాట్లాడే ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలతోపాటు ఇతర చోట్ల కూడా తెలంగాణ ముఖ్యనేతలు పలువురు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ఇతర నేతలు దాదాపు నెలరోజుల పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు మూడు, నాలుగు రోజులపాటు వివిధ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతలు వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లో సమన్వయ, ప్రచార బాధ్యతలు నిర్వహించిన చోట్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కూడా పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. మేం పీపుల్ పోల్స్ నమ్ముకున్నాం: కె.లక్ష్మణ్ తాము ఎగ్జిట్ పోల్స్‌ను తప్పుబట్టడం లేదని, అవి ఎలా ఉన్నా తాము పీపుల్ పోల్స్‌ను నమ్ముకున్నామని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగ్జిట్‌పోల్స్ అధికశాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఉంది కదా అన్న మీడియా ప్రశ్నలపై స్పందించారు. కర్ణాటకలో తాను నెలరోజుల పాటు ఉన్నానని, బళ్లారి జిల్లా ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. యడ్యూరప్ప, బసవరాజు బొమ్మై ప్రభుత్వాలు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కర్ణాటకకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు, అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ‘మోదీ ఫాక్టర్’అనేది కచ్చి తంగా ప్రభావం చూపుతుందని తెలిపారు. సామాజిక న్యాయ సాధన దిశలో ఎస్సీ, ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్ల పెంపు, అదనంగా లింగాయత్‌లు, ఒక్కలిగలకు రెండేసి శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలు వంటివి ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చాయని పేర్కొన్నారు. కర్ణాటకలో కచ్చి తంగా తిరిగి అధికారానికి రావడం ఖాయమన్నారు. -
Telangana Politics: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. సినీ, క్రీడా, కళా రంగాల ప్రముఖు లను ఆకర్షించే పనిని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌తో, సాయంత్రం సినీ నటుడు నితిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు అంగీకరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే వారు బీజేపీలో చేరుతారా, లేక కేవలం ప్రచారానికే పరిమితం అవుతారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. రాజకీయ, సాంస్కృతిక అంశాలపై... శనివారం రాత్రి నోవాటెల్‌కు వచ్చిన సినీ నటుడు నితిన్ జేపీ నడ్డాతో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమాలతోపాటు రాజకీయ అంశాలపై వారు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రముఖ హీరోగా నితిన్ ఎదగడాన్ని జేపీ నడ్డా అభినందించారని.. సినిమా శక్తివంతమైన మాధ్యమమని, ప్రజల్లో మార్పునకు ఒక సాధనంగా పనిచేస్తుందని పేర్కొన్నారని తెలిపాయి. తాను ప్రధాని మోదీ నుంచి స్ఫూర్తి పొంది అభిమానిగా మారానని, రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని నితిన్ పేర్కొన్నట్టు వెల్లడించాయి. ఈ సమావేశం అనంతరం జేపీ నడ్డా తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణలో ఈ రోజు ప్ర ముఖ నటుడు నితిన్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. నితిన్ తన రాబోయే సినిమాల గురించీ చెప్పారు. అతనికి శుభాభినందనలు తెలియజేశాను..’’అని తన ట్వీట్లో నడ్డా పేర్కొన్నారు. క్రీడలకు ప్రాధాన్యం: మిథాలీరాజ్ ప్రధాని మోదీ హయాంలో దేశంలో క్రీడలకు ప్రాధాన్యం పెరిగిందని నడ్డాతో భేటీలో మిథాలీరాజ్ హర్షం వ్యక్తం చేశారు. క్రీడా రంగంలో శిక్షణ, మౌలిక వసతుల కల్పన పెరిగిందని.. క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. 20ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్న తనకు క్రీడారంగంలో గత 8 ఏళ్లలో చోటుచేసుకున్న సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో భారత్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మునుగోడు’పై పకడ్బందీ కార్యాచరణ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధించే దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట్ర బీజేపీ నేతలకు జేపీ నడ్డా సూచించారు. శనివారం రాత్రి నోవాటెల్ హోటల్లో పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితరులు నడ్డాతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో ముందుకెళ్లాలని, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. బీజేపీకి ప్రజా మద్దతును కూడగట్టాలని ఆదేశించారు. ప్రచారానికి ఓకే అన్న మిథాలీరాజ్, నితిన్: కె.లక్ష్మణ్ నితిన్, మిథాలీరాజ్‌లతో నడ్డా జరిపిన భేటీల్లో పాల్గొన్న ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశానికి సరైన నాయకత్వం అందిస్తున్నట్టు వారు పేర్కొన్నారని కె.లక్ష్మణ్ చెప్పారు. మోదీ కోసం తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారని.. ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని వివరించారు. ప్రధాని మోదీని స్వయంగా కలవాలని వారు కోరారని.. దీంతో వారిని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని నడ్డా తనకు సూచించారని తెలిపారు. చదవండి: (జేపీ నడ్డాతో ముగిసిన హీరో నితిన్ భేటీ) -
'లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఓపెనింగ్ వికెట్ పడబోతోంది'
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బండి సంజయ్ పాదయాత్రపై దాడులు చేస్తున్నారని బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే బండి సంజయ్ పాదయాత్రపై దాడికి తెగబడ్డారని విమర్శించారు. సంజయ్ యాత్రను అడ్డుకోవడం, అరెస్టు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. 'టీఆర్ఎస్ చౌకబారు, చిల్లర రాజకీయాలు చేస్తోంది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. అసహనంతో, నిరాశ నిస్పృహలో దాడులకు పాల్పడుతున్నారు. పాదయాత్ర యధావిధిగా అనుమతివ్వాలని, జరిగిన ఘటనపపై విచారణ జరపాలని' ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మునుగోడు బీజేపీదే లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఓపెనింగ్ వికెట్ పడబోతోందని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. లిక్కర్ స్కామ్‌ను కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ నేతలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు కేసులకు భయపడరని.. రాబోయే మునుగోడు ఎన్నికలో బీజేపీ గెలవబోతోందని విజయశాంతి పేర్కొన్నారు. చదవండి: (బండి సంజయ్‌కు షాక్.. పాదయాత్రకు పోలీసుల బ్రేక్!) -
3టీఎంసీల తరలింపుపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుమతులున్నా.. ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ నేత చెరుకు శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అఖ్తర్, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజులు తరలించేందుకు వీలుగా పనులు చేశారు. అయితే రోజుకు 3 టీఎంసీల చొప్పున 270 టీఎంసీలను రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తోంది. దీనిపై వాదనల అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది. -
కార్మికులను రెచ్చగొట్టే యత్నం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సహనంతో, గాంధీజీ అహింస సిద్ధాంతంతో సమ్మెను కొనసాగిస్తున్నారని, సీఎం కేసీఆర్ చేసే భయానక ప్రకటనలు వారిపై కించిత్తు ప్రభావం కూడా చూపడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు చెబుతున్నా, ప్రజాసంఘాలు సూచిస్తున్నా సీఎం ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నారని, పిచ్చి ప్రేలాపణలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక కూడా ఆత్మహత్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేసీఆర్ హైకోర్టునే ధిక్కరించే విధంగా మాట్లాడుతున్నారని, కోర్టులో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం లక్ష్మణ్ సమక్షంలో మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారు. -
ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కాలి
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆ నలుగురిపాలు అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేయడానికి ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కా లని పిలుపునిచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో లక్ష్మణ్ ప్రసంగించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. బీజేపీలో చేరడానికి నేతలు, కార్యకర్తలు రావడం పెను మార్పు అని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. టీడీపీ నేతలు ఉప్పెనలా బీజేపీలోకి తరలిరావడం శుభపరిణామమని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. బాబు బాగుండాలి: గరికపాటి ఎన్టీఆర్ చూపిన అభిమానంతో టీడీపీలో చేరానని, కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉన్నానని ఎంపీ గరికపాటి మోహన్‌రావు తెలిపారు. అయితే, తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిపోయిందన్నారు. మనసు రాయి చేసుకొని టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని వచ్చానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీలో చేరిన టీడీపీ నేతలు వీరే... గరికపాటి మోహన్‌రావు–రాజ్యసభ సభ్యుడు, శోభారాణి–తెలుగు మహిళ అధ్యక్షురాలు, దీపక్‌రెడ్డి–టీడీపీ జనరల్ సెక్రటరీ, ఈగ మల్లేశం–వరంగల్ రూరల్ అధ్యక్షుడు, రజనీకుమారి–తుంగతుర్తి ఇన్చార్జి, పోరిక జగన్ నాయక్–మాజీ మంత్రి, ఎర్ర శేఖర్–మాజీ ఎమ్మెల్యే, మొవ్వ సత్యనారాయణ–శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి, ముజఫర్–మలక్‌పేట్ టీడీపీ ఇన్చార్జి, సామ రంగారెడ్డి–రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, కోనేరు చిన్ని–కొత్తగూడం జిల్లా అధ్యక్షుడు, శ్రీకాంత్ గౌడ్–పఠాన్ చెరు ఇన్చార్జి, బోట్ల శ్రీనివాస్–జనగామ జిల్లా అధ్యక్షుడు, రాజ్యవర్ధన్రెడ్డి–కాంగ్రెస్ నేత, శ్రీనివాస్‌గౌడ్–నల్లగొండ ఇన్చార్జ్, అంజయ్య యాదవ్–నాగార్జున సాగర్ అసెంబ్లీ ఇన్చార్జి, సాధినేని శ్రీనివాస్–మిర్యాలగూడ అసెంబ్లీ ఇన్చార్జి, శ్రీకళారెడ్డి–కోదాడ నేత, ఓం ప్రకాశ్ మాజీ తెలుగు విద్యార్థి నేత, బాబురావునాయక్–టీడీపీ ఎస్టీ సెల్, విజయ్‌పాల్‌రెడ్డి–మాజీ ఎమ్మెల్యే నారాయణ ఖేడ్, ఉపేందర్–కాంగ్రెస్ నేత, సత్యం–మంచిర్యాల టీడీపీ అధ్యక్షుడు, రఘునాథ్‌రెడ్డి–భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, రామ్‌రెడ్డి–సూర్యాపేట ఇన్చార్జి, జయశ్రీ–టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి. -
ఆ ఎన్నికలను వాయిదా వేయండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో జరుపతలపెట్టిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ లేఖ రాశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ సరికాదని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరమే ఈ ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు అనుమతించిందంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని, ఇందులో స్పష్టత కావాలని లేఖలో కోరారు. పార్టీ గుర్తులపైనే ఈ ఎన్నికలు జరగనున్నందున తామంతా ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల కోసం తాము దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నామని, దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక గ్రామ స్థాయిలో జరిగే ఈ ఎన్నికల్లో భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయని, ఇవి ఒక్కోసారి గొడవలకు కూడా కారణమయ్యే ప్రమాదం ఉంటుందని, అలాంటప్పుడు పారామిలటరీ దళాలు రావాల్సి ఉంటుందని, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల బిజీలో ఉన్న ఆ దళాలు ఎలా రాగలుగుతాయని ప్రశ్నించారు. ఎంపీపీ, జెడ్పీ అధ్యక్షుల ఎన్నికను పరోక్ష పద్ధతిలో నిర్వహించబోతున్నారని, కానీ రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధమైనందున, ఆ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. అలాగే, ప్రస్తుతం ఎలాంటి కీలక అధికారాలు లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు అలంకారప్రాయంగానే ఉన్నాయని, వారికి అధికారాలు ఇచ్చేలా నిపుణులు కసరత్తు చేస్తున్న విషయాన్ని గుర్తించాలని కోరారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని లక్ష్మణ్ లేఖలో కోరారు. -
ఎన్నికల ప్రచారానికి బీజేపీ సిద్ధం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ సిద్ధమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెలలోనే అన్ని రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటనలుంటా యని, మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేస్తారని తెలిపారు. ‘దేశం కోసం మోదీ– మోదీ కోసం దేశం’ అనే నినాదంతో ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, మోదీ పాలన, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామన్నారు. ‘భారత్ కి మన్ కీ బాత్– మోదీ కే సాత్’ కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాల ప్రజల సలహాలు తీసుకుంటున్నామన్నారు. ‘కమల్ జ్యోతి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ని బీజేపీ ప్రభుత్వ లబ్ధిదారుల ఇళ్లలో దీపాలను వెలిగిస్తామన్నారు. కేబినెట్ లేకపోవడంతో రాష్టంలో పాలన స్తంభించిపోయిందని, వందల కొద్దీ ఫైళ్లు పేరుకుపోతున్నాయన్నారు. అనంతరం ‘రైతుబంధువు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదించండి’ అనే పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, జి.ప్రేమేందర్‌రెడ్డి, బి.జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్చి 2న బీజేపీ బైక్ ర్యాలీలు మార్చి 2న ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించిం ది. మండల కేంద్రాలను కలుపుతూ 50 నుంచి 60 కి.మీ.లు పర్యటించాలంది. ఈ కార్యక్రమాన్ని యువమోర్చా సభ్యులతో నిర్వహించాలని ఆదేశించింది. ఈ నెల 28న ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో యువజన సమ్మేళనాలు నిర్వహించాలని పేర్కొంది. విపక్షాల ఆరోపణలు అర్థరహితం కాగ్ నివేదికతో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో విపక్షాల ఆరోపణలు అర్థరహితమని తేలిపోయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ శ్రీకారం చుట్టిన దళారీ వ్యవస్థను మోదీ అడ్డుకున్నారన్నారు. కాంగ్రెస్ అబద్ధాలకోరు అని తేలింది రఫేల్ యుద్ధ విమానాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇన్ని రోజులుగా చేసిన విమర్శలు అబద్ధాలని ‘కాగ్’ రిపోర్ట్ ద్వారా తేలిపోయిందని లక్ష్మణ్ అన్నారు. సుప్రీంకోర్టు, ’కాగ్ నివేదిక’ బీజేపీ వాదనను, మోదీ నిజాయితీని తేటతెల్లం చేశాయన్నారు. ఇది రాహుల్, కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదన్నారు. -
బీజేపీదే విజయం
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ ధీమా వ్యక్తం చేశారు. మేరా పరివార్ భాజపా పరివార్ (మా కుటుంబం – బీజేపీ కుటుంబం) కార్యక్రమాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యాల యంపై బీజేపీ జెండాను రామ్‌లాల్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రాంతీయ ఎన్నికలు కావని, ప్రాంతీయ నాయకులు ప్రధానమంత్రి కాలేరని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రధాని ఎవరు అనే అంశంపైనే ఎన్నికలు జరుగబోతున్నాయన్నారు. అన్ని సర్వేలు కూడా మోదీనే ఘన విజయం సాధిస్తారని తెలియజేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ ఐదేళ్ల పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. కార్మికులు, కర్షకులు, మహిళలు, చేతివృత్తుల వారి సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, దేశాన్ని ప్రపంచంలో అందరూ గర్వించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మోదీదేనన్నారు. ఆ నాయకులకు భయం పట్టుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి పనులతో కొన్ని పార్టీలకు, కొంతమంది నాయకులకు భయం పట్టుకుందని, అందుకే ఆయనని, బీజేపీని దూషిస్తున్నారని రామ్‌లాల్ విమర్శించారు. దూషించేవారెవరూ ఎన్నికల్లో ఇంతకుముందు గెలవలేదని, ఇప్పుడూ వారికి ఓటమి తప్పదన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ఐదేళ్ల బీజేపీ పాలన చూసిన వారికి తేడా అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. మోదీ అభివృద్ధి దేశంలో ఎక్కడికి వెళ్లినా కనిపిస్తుందన్నారు. ఈనెల 28న నరేంద్ర మోదీ టెలీకాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ కార్యకర్తలతో మాట్లాడతారని తెలిపారు. మార్చి 2న దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖరరావు, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, నేతలు కిషన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, ఆచారి, ప్రేమేందర్‌డ్డి, మనోహర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మోదీని మళ్లీ ప్రధాని చేయాలి: లక్ష్మణ్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని, నరేంద్రమోదీని మరోసారి ప్రధాని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశాన్ని శక్తివంతమైన దేశంగా చేసేందుకు, నవ భారత్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. అధిష్టానం పిలుపు మేరకు మేరా పరివార్–బీజేపీ పరివార్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం లక్ష్మణ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఈనెల 15 వరకు, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఈనెల 25 వరకు తమ నివాసాలపై పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు. -
ప్రజల చూపు.. మోదీ వైపు: కె.లక్ష్మణ్
పోచారం: దేశవ్యాప్తంగా మోదీ సర్కార్ అందించిన అభివృద్ధి ఫలాలు, పేదలు, రైతులు, అసం ఘటిత కార్మికుల కోసం తీసుకున్న నిర్ణయాల ప్రభావంతో ప్రజలు మోదీ వైపే మొగ్గుచూపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని అన్నోజిగూడ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో ‘అబ్కీ బార్– ఫిర్ మోదీ సర్కార్’ పేరుతో లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ కమిటీలు వేశామన్నారు. ఈ కమిటీలకు నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్ణయించడం జరిగిందన్నారు. మోదీ సర్కార్ అందించిన అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. గెలుపే లక్ష్యంగా కమిటీలు పనిచేయాలని కోరారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 55 నెలల్లో మోదీ చేసిన అభివృద్ధి 55 ఏళ్లు పాలించి న ఇతర పార్టీలు చేయలేకపోయాయని ఎద్దేవా చేశారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆయు ష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల ఉచిత బీమా పథకం, అగ్రవర్ణాల పేదల కోసం ప్రవే శపెట్టిన 10 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, బాబూమోహన్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎంలపై మాకు అనుమానాలున్నాయ్: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: భారత్ అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన వివాదం పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రజలకు, సైన్యానికి క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలనను చూసి ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతిసేవిధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వంద ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కనీసం విలువలు పాటించడం లేదని విమర్శించారు. సైనికులకు మనో నిబ్బరం ఇవ్వాల్సింది పోయి ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 2014 లో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాఫెల్ డీల్ ఎందుకు ఫైనల్ చెయ్యలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో బ్రోకర్లతో మాత్రమే కొనుగోలు ఉండేదని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు నాయుడు కుట్ర పూరిత పొత్తు పెట్టుకున్నారు వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలు చంద్రబాబు వెర్సస్ కేసీఆర్ అన్నట్టుగా మారాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందన్నారు. ఒక్క క్షమాపణతో ఎన్నికల కమిషన్ తమ తప్పును తుడిచేసుకుందని విమర్శించారు. తాము ఓటమి మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తామన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం పార్టీ సిద్ధం అవుతుందని లక్ష్మణ్ తెలిపారు. జనవరి 11, 12 ఢిల్లీలో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో వ్యూహం రూపొందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు స్వయంగా సమీక్ష చేస్తారని చెప్పారు. 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 17 కోట్ల ఓట్లు బీజేపీకి వచ్చాయని,ఈ సారి 30 కోట్ల ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఓటమితో కార్యకర్తలు అధైర్య పడవద్దని లోపాలు సరిదిద్దుకొని ముందుకు పోవాలి సూచించారు. 2019 వచ్చే ఎన్నికల్లో మరోసారి మోదీని ప్రభుత్వాన్ని తీసుకురావడామే తమ లక్ష్యమన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు చేసింది ఏమిటో ప్రజలకు ప్రజలకు తెలుసునన్నారు. కుమార పట్టాభిషేకం ..ఇప్పుడిప్పుడే కదా అయింది కొన్ని రోజుల తరువాత ప్రభుత్వం మీద స్పందిస్తాం. ఈవీఎంల సాంకేతిక మీద మా అభ్యర్థులు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. దానిపై ఒక కమిటీ వేస్తామని చెప్పారు. తెరాస సెంటిమెంట్‌తో గట్టెక్కిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన దాని కన్నా ఎక్కువ సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో వచ్చింది. సెంటిమెంట్‌తో మాకు రావాల్సిన ఓట్లు కూడా తెరాసకు వెళ్లాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
సభపై నివేదన!
-
‘ట్విటర్ అంత ఈజీ కాదు సభ నిర్వహించడం’
సాక్షి, హైదరాబాద్ : బహిరంగ సభలను నిర్వహించడం ట్విటర్లో స్పందించినంత సులువు కాదని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభపై స్పందించారు. సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. గత వారం పది రోజులుగా వందల కోట్లు ఖర్చుపెట్టి ఒక హైప్ క్రియేట్ చేశారని, కానీ కలెక్షన్ నిల్‌గా నిలిచిందన్నారు. అది కేసీఆర్ ఆవేదన సభగా జరిగిందని విమర్శించారు. ఎన్నికల శంఖారావంలాగా, తన కొడుక్కి పట్టాభిషేకం చేయాలని వందల కోట్లు ఖర్చుపెట్టారన్నారు. కానీ ప్రజల ఆదరణ పొందని సభగా నిలిచిపోయిందన్నారు. ధనబలం, అధికారమదంతో ప్రజాధనం దుర్వినయోగం చేశారని మండిపడ్డారు. ప్రజలను తరలించే విషయంలో వందలు కోట్లు ఖర్చు పెట్టారు తప్పా ప్రజలను సమీకరించలేకపోయారన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగంలో బలం లోపించిందని, ఒక దశ దిశ లేదన్నారు. సభలో ఏం చెప్తారో అని ప్రజలు ఆశగా ఎదురుచూశారని, కానీ కేసీఆర్ ప్రసంగం వారిని నిరుత్సాహపరిచిందన్నారు. నాలుగున్నరేళ్లలో ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారని ఆరోపించారు. తాము ప్లెక్సీలు కడితే రాత్రికి రాత్రే జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారని, ఇప్పుడెందుకు అలా చేయలేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ అధికారులు అధికార పార్టీలకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. తమ అధినేత అమిత్‌షా కూడా ముందస్తు ఎన్నికలు సిద్దమని, ప్రచారం కూడా చేస్తానని చెప్పారని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. చదవండి: నూటొక్క తీరు.. శ్రేణుల హోరు -
ఎమ్మెల్యే ఫ్రోగ్రెస్ రిపోర్ట్ డాక్టర్ కె. లక్ష్మణ్
-
బీజేపీలో అటువంటి పరిస్థితి లేదు
సాక్షి, హైదరాబాద్ : దేశంలో మొత్తం 1700 పార్టీలు ఉండగా.. ప్రసుతం అన్ని పార్టీల్లోనూ కుటుంబ పాలన కొనసాగుతోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా విరమణ పొందిన వెంటనే సోనియా గాంధీ రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కానీ బీజేపీలో అటువంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. సమావేశంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి.. రేపటి రోజు మీలో ఎవరైనా దేశ అధ్యక్ష పదవి చేపట్టవచ్చంటూ పురందేశ్వరి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఇలా బీజేపీకి చెందిన చాలా మంది వ్యక్తులు అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వారేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట దేశ సంక్షేమం కోసం అంత్యోదయ మూల సిద్దాంతంతో బీజేపీ ముందుకు వెళ్తోందన్న పురందేశ్వరి... మహిళల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఒకప్పుడు మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం ఇంటి పక్కన వాళ్లను డబ్బులు అడిగేవారు.. కానీ ప్రస్తుతం మోదీ పాలనలో ఓడీ పేరిట 5 వేల రూపాయలు తీసుకునే అవకాశం కల్పించారన్నారు. అంతేకాకుండా సంపాదించుకున్న సొమ్ముకు జన్‌ధన్ ఖాతా ద్వారా భద్రత కల్పించారని పేర్కొన్నారు. మహిళా ప్రసూతి మరణాలను దృష్టిలో ఉంచుకొని మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ఆమె తెలిపారు. 2014లో చాలా మంది బీజేపీ 120, 130,150, 170 స్థానాలు మాత్రమే గెలుచుకుంటారని జోస్యం చెప్పారని కానీ అనూహ్యమైన మెజారిటీ, విజయాన్ని సాధించి.. కేంద్రంలో అధికారం చేజిక్కించుకుందని వ్యాఖ్యానించారు. 250 పై చిలుకు స్థానాల్లో గెలుపొంది దేశ వ్యాప్తంగా విస్తరించిందన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమైంది... తెలంగాణ ప్రభుత్వం నాలుగు స్తంభాల ఆట నుంచి ఐదు స్తంభాల ఆటగా మారిందని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ ఎద్దేవా చేశారు. మహిళలకు పంచే నాప్కిన్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. దసరాకు ప్రభుత్వం పంచిన చీరలు మహిళలను అవమానపరిచే విధంగా ఉండడం, రైతులకు పెట్టుబడి సహాయం విషయంలో నిర్లక్ష్యం వహించడం కేసీఆర్ పతనానికి నాంది వంటివని ఆమె వ్యాఖ్యానించారు. -
‘అమిత్ షాపై టీడీపీ గుండాలతో దాడి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని విన్యాసాలు, యాత్రలు చేసిన ప్రజల నమ్మరని ఆయన అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మజ్లిస్‌కు కొమ్ము కాస్తూ టీఆర్ఎస్ పార్టీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏవిధమైన రాజకీయాలకు పాల్పడ్డారో జనమంతా చూశారని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సమయంలో కేవలం ఐదు రాష్ట్రాల్లో ఉన్న తాము, ఇప్పుడు 22 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామన్నారు. 90 శాతం క్రైస్తవులు ఉన్న నాగాలాండ్, ముస్లింలు అధికంగా ఉన్న జమ్మూకాశ్మీర్ లోనూ బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ పెట్టే ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ కాదు ఫ్యామిలీ ఫ్రంట్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాఫ్ట్రంలో 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటి వరకు వారికి మొత్తం పరిహారం ఇవ్వలేదన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో కమిషన్ కాసుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. రైతు బంధు పథకం మొత్తం భూస్వామి బంధు పథకంగా మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వంపై రైతు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, సర్వరోగ నివారిణిలా రైతు బంధు పథకాన్నే కేసీఆర్ వల్లిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర నిధుల్లో 40 కోట్లు మజ్లిస్ పార్టీకి కేటాయించారని ఆరోపించారు. టీఆర్ఎస్ చెల్లని రూపాయి, టీడీపీ పేలని తుపాకీ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతికి భక్తునిగా వస్తే టీడీపీ గుండాలతో దాడి చేయించారని ధ్వజమెత్తారు. -
‘తీవ్రంగా బాధపడ్డా.. బీజేపీకి గుడ్ బై’
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీలో ఇమడలేక పోతున్నాను. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా’నని కరీంనగర్ నేత, బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ అన్నారు. తన అనుచరులతో కలిసి ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌తో ఆయన భేటీ అయ్యారు. పార్టీని వీడొద్దని, భవిష్యత్తులో బాగా చూసుకుంటామని ఆయనను లక్ష్మణ్ బుజ్జగించారు. అధ్యక్షుడి మాటలతో సంతృప్తి చెందని సంజయ్.. ‘బీజేపీకి గుడ్ బై’ అంటూ తన అనుచరులతో కలిసి కరీంనగర్ వెళ్లిపోయారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లా బీజేపీ రాజకీయాలు తనను తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అక్కడి పరిస్థితుల గురించి చెప్పుకుందామని కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి వస్తే ఇక్కడ మాకు అవమానం జరిగింది. పార్టీ కోసం ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాను. జైలు కూడా వెళ్లాను. అయినా నాకు పార్టీలో న్యాయం జరగలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. హిందూ ధర్మం కోసం పనిచేస్తాన’ని సంజయ్ చెప్పుకొచ్చారు. -
‘టీఆర్ఎస్కు మజ్లిస్ అంటే భయం’
పరకాల : తెలంగాణ ఉద్యమంలో ఆత్మ గౌరవ పోరాటం అన్న కేసీఆర్ ఇప్పుడు విమోచన దినాన్ని మరవడం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పరకాల అమరధామం వద్ద శనివారం సాయంత్రం జరిగిన పార్టీ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విమోచన పోరాటాన్ని కనీసం పాఠ్యాంశాల్లో చేర్చక పోవడం దారుణమని, ఉద్యమ సమయంలో సీఎం రోశయ్యను డిమాండ్ చేసిన కేసీఆర్ ..ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినాన్ని ఎందుకు జరపటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన మజ్లిస్ మెప్పు కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సీఎం కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని, ప్రజలు ముఖ్యమా..లేక మజ్లీసా తేల్చుకోవాలని హెచ్చరించారు. మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ మజ్లిస్ కు భయపడటం సిగ్గు చేటన్నారు. ‘అధికారికంగా సెప్టెంబర్ 17 జరపక పోతే... తెరాస ఓటమి పరకాల నుంచే ప్రారంభమవుతుంది. 2019 లో బీజేపీ అధికారం లోకి వస్తుంది, అప్పుడు మేమే హామీ నెరవేరుస్తాం’’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 న జాతీయ పతాకం ఎగురవేయటం సీఎం నైతిక బాధ్యతని గుర్తుచేశారు. చరిత్రను ఓట్ బ్యాంక్ రాజకీయాలతో ముడిపెట్టకూడదని, పరిస్థితి మారకుంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగులుతారని విమర్శించారు. -
సుప్రీం తీర్పుతో ముస్లిం మహిళలకు ఊరట
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్‌ను ఆరునెలల పాటు నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ముస్లిం మహిళలకు పెద్ద ఊరట కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. తలాక్‌పై తీర్పు నేపథ్యంలో పలువురు ముస్లిం మహిళలు బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ముస్లిం దేశాల్లో కూడా ట్రిపుల్ తలాక్ అమలులో లేదన్నారు. భారతదేశంలో తలాక్‌ను నిషేధించడాన్ని మతపరంగా చూడొద్దని, ఒక సామాజిక రుగ్మతగానే చూడాలని కోరారు. -
జైరాం రమేశ్‌వి దివాలాకోరు విమర్శలు
-
జైరాం రమేశ్‌వి దివాలాకోరు విమర్శలు
డాక్టర్ కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం.వెంక య్యనాయుడుపై కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్య లు దివాలాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వెంకయ్యపై నిరాధార ఆరో పణలు చేయడం బాధాకరమని అన్నారు. వెంకయ్య జీవితం తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం పరిపాటేనని తెలి పారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకు పోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటువంటి మాటలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
చేతి వృత్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం: లక్ష్మణ్
► గీత కార్మికులను ఆదుకునే చర్యలేవి?: దత్తాత్రేయ ► ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గీత కార్మికుల సదస్సు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేతి వృత్తులకు, బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గీత కార్మికుల సదస్సు హైదరాబాద్‌లో శనివారం జరిగింది. సదస్సులో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు పాల్గొన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లోనూ బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి, మార్పు వస్తుందని ఆశించినా మూడేళ్లలో పరిస్థితి మరింత క్షీణించి పోయిందన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ సబ్‌ప్లాన్ ఊసే ఎత్తడం లేదన్నారు. రాష్ట్రంలో 17 ఫెడరేషన్లు ఉంటే, వాటిని 11కు కుదించారని పేర్కొన్నారు. వాటిలో కొన్నింటికి చైర్మన్లను నామినేట్ చేసినా, వారికి కార్యాలయాలు, కుర్చీలు, నిధుల్లేవని ఆరోపించారు. కల్తీ కల్లు పేరుతో చీప్ లిక్కర్ లాబీకి తలొగ్గి గీత కార్మికులకు అన్యాయం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ పేరుతో అనేక ప్రాంతాల్లో ఈత, తాటి చెట్లను నేలమట్టం చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని చెప్పారు. ప్రతి గ్రామంలో తాటిచెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. తాటిచెట్లు ఎక్కేవారికి ఆధునిక యంత్రాలు ఇవ్వాలని, కల్లుగీత ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలని, సమగ్రచట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గీతకార్మికుల బతుకులు మారుతాయని వారు ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారని బండారు దత్తాత్రేయ అన్నారు. వారిని ఆదుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలనూ తీసుకోవట్లేదన్నారు. నీరా పరిశ్రమ అభివృద్ధికి యువతకు రూ.5 నుంచి రూ.10 కోట్ల దాకా కేంద్రం ఆర్థిక ప్రోత్సాహం ఇస్తోందన్నారు. సదస్సుకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె.నర్సింహ యాదవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, యువమోర్చా అధ్యక్షుడు భరత్‌గౌడ్ పాల్గొన్నారు. -
మూడేళ్ల వైఫల్యాలను ప్రచారం చేయాలి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాల నను గురించి ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కార్యవిస్తారక్ యోజనలో భాగంగా శనివారం పార్టీ జోనల్, జిల్లా ఇన్చార్జీల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృ హల్లో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారంలో పార్టీ ముందుండాలన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల ప్రారంభించి న 15రోజుల విస్తార్ యోజన కార్యక్రమం.. రాష్ట్రంలో ‘పల్లెపల్లెకు బీజేపీ– ఇంటింటికి మోదీ’నినాదంతో ఈ నెల 29 నుంచి జూన్ 12 వరకు సాగనుందన్నారు. దీనిని పూర్తిగా విజయవంతం చేసి ప్రజలకు పార్టీని చేరువ చేయాలన్నారు. దీనిలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వ విజయాలపై ఒక కరపత్రం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మరో కరపత్రం, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితచరిత్రపై ఇంకొక కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేస్తారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీనాయకులు పేరాల శేఖర్‌రావు, నాగం జనార్దనరెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి పాల్గొన్నారు. -
ఉప ఎన్నికలు నిర్వహిస్తే సత్తా చూపుతాం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐల నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహిస్తే తమ పార్టీ సత్తా చూపుతుందని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. ఉపఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో రాజకీయ పరిణామాల సరళి, బీజేపీ అనుకూల పవనాలు స్పష్టంగా బయటపడతాయన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 22, 23,24 తేదీల్లో నల్లగొండ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఉపఎన్నికలు, బహిరంగసభలంటూ హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడెందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ప్రధాని మోదీ ప్రభంజనంతో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఆరునెలలకు ముందే అభ్యర్థులను, మ్యానిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వచ్చి బీజేపీలో చేరాలంటూ ఆ పార్టీ ముఖ్యనాయకులు కాళ్లపై పడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు నిరాధార ఆరోపణలన్నారు. -
బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అరెస్ట్
వరంగల్ అర్బన్: జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ యార్డును సందర్శించడానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ యార్డులో రైతుల కష్టాలను తెలుసుకోవడానికి వచ్చిన లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని నిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
టీఆర్ఎస్ సభలో ప్రగతి ప్రస్తావనే లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రగతి నివే దిక బహిరంగ సభలో ప్రగతి ప్రస్తావన లేద ని, నివేదన అంతకం టే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ఓయూ, విద్యార్థుల త్యా గాల గురించి శతాబ్ది ఉత్సవాల్లో, వరంగల్ సభలో ప్రస్తావన లేకపోవడాన్ని బట్టి టీఆర్ఎస్ పతనానికి నాంది కాబోతుంద న్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వరంగల్‌లో సభ నిర్వహించారన్నారు. ప్రభుత్వం అధి కార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా, సభ చాలా పేలవంగా జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి టీఆర్స్ పార్టీయేనన్నారు. బీజేపీలో షరతులు లేని చేరికలుంటాయని, టికెట్లు, సీట్ల హామీ లిచ్చి పార్టీలో చేర్చుకునేది ఉండదని లక్ష్మణ్ ఒక ప్రశ్నకు బదులిచ్చారు. బీజేపీకి బాహుబలులను తలదన్నే మోదీ బ్రహ్మా స్త్రం ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
బీసీలకు అరచేతిలో వైకుంఠం...
కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: బీసీలకు అరచేతిలో వైకుంఠం చూపి ఓట్లు దండుకోవాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మంగళవారం బంజారా ఫంక్షన్ హాలులో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ‘యాదవ, కురుమ, గొల్ల’ల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీలను మోసం చేసే చర్యలను తిప్పికొట్టేందుకు, హక్కుల పరిరక్షణకు గ్రామగ్రామాన ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చైతన్య సదస్సులను నిర్వ హించాలని పిలుపునిచ్చారు. బీసీల మద్దతు కోసం తాయిలాలు ప్రకటిస్తున్నారే తప్ప సంక్షేమ పథకాల అమల్లో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. సీఎం మాటలకు బడుగు, బలహీన వర్గాలు మోసపోయే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలోనూ బీసీలు బీజేపీ వైపు చూస్తున్నారని, తమ పార్టీకి మద్దతునిస్తున్నారని చెప్పారు. మరోవైపు మోదీ ప్రభుత్వం బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదాను కల్పించడంపై ధన్యవాదాలు తెలుపుతూ ఈ సదస్సు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాటం నర్సింహ యాదవ్, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఎమ్మెల్యే చింత రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం
రేపు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు: లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలని శనివారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యల కు నిరసనగా సోమవారం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు భువనేశ్వర్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో తాను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై పార్టీ జాతీయ నాయకత్వం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిందన్నారు. దీనివల్ల ప్రజల్లో వైషమ్యాలు పెరుగుతాయన్నారు. కాగా, ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ పోరాటాల ద్వారా ఎదుర్కొంటామని లక్ష్మణ్ భువనేశ్వర్ నుంచి ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. నేడు నిరసన పాదయాత్ర: శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. -
తెలంగాణలోనూ గెలుస్తాం
కేంద్ర మంత్రి పొన్ను రాధాకృష్ణన్ సాక్షి, వరంగల్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ అధి కారంలోకి వస్తుందని కేంద్ర ఉపరితల రహదారులు, ఓడ రేవులశాఖ మంత్రి పొన్ను రాధాకృష్ణన్ అన్నారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్క రించుని పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా కేంద్రమంత్రి పొన్ను రాధాకృష్ణన్ గురువారం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించారు. వరంగల్ ప్రజలతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. వర్ధన్న పేట నియోజకవర్గం ఇల్లందలో దళితవాడలో సహపంక్తి భోజనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ ఉద్యమాలు చేసింది. బీజేపీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. టీఆర్ఎస్కు ఉన్న ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాలేదు. 2014 ఎన్నికల్లో చాలా కారణాలతో తెలంగాణలో గెలవలేకపోయాం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం’ అని అన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం దోహదపడుతోంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొదటి విడతగా మహబూబ్‌నగర్, వరంగల్‌లో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సుముఖత వ్యక్తం చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున తాను కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కేంద్రం దోహదపడుతోందని చెప్పడానికి ఇది ఉదాహరణ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి సరైన సమయంలో తగిన ప్రతిపాదనలు పంపిస్తే, వాటిపై నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాభివృద్ధికి కేంద్రం దోహదపడుతుందని అన్నారు. రెండు జిల్లాల్లో పాస్‌పోర్టు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేసిన మోదీ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, బండారు దత్తాత్రేయలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి
బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో డాక్టర్ కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండ గట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా పార్టీని తీర్చిదిద్దుతామన్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ విజయంతోనైనా కుహనా లౌకికవాదులు కులం, మత, భాష ప్రాతిపదికన ప్రజలను విడగొట్టే చర్యలను విడనాడాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించే విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. వచ్చే ఎన్నికలకల్లా రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతున్నదని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీ ధర్‌రావు ఆరోపించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, బద్దం బాల్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, ఎస్,.కుమార్, శేరి నరసింగరావు, సుధాకరశర్మ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మణ్‌తో కోదండరాం భేటీ
♦ అధికార పార్టీ తీరుపై చర్చ ♦ టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను కలుపుకుపోయే ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసు కుంటున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. నిరసనలకు అవకా శం లేకుండా ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ను ఎత్తేయడం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ పై అందరినీ కలుపుకొని పోవడం వంటి అం శాలపై చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలుపుకొని పోయేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఇందిరాపార్కు ధర్నాచౌక్ ఎత్తివేత, సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ల కొనసాగింపునకు వ్యతిరేకంగా కలిసొచ్చే వారిని కూడగట్టేందుకు జేఏసీ ప్రయత్నిస్తుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మంగళవారం బాగ్‌లింగంపల్లి లోని ఓ ఇంటిలో వీరు సమావేశమయ్యారు. వీరితో పాటు పాటు గాదె ఇన్నయ్య, పలు ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు. టీఆర్ఎస్ అసహనానికి నిదర్శనం... అసెంబ్లీలో విపక్షాల గొంతునొక్కేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం, ధర్నాచౌక్‌ను శివార్లకు తరలించడంవంటి సమస్యలపై స్పందిస్తున్న తీరు అధికార టీఆర్ఎస్లో పెరు గుతున్న అసహనానికి నిదర్శనమని వీరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రజాస్వా మ్యహక్కుల పరిరక్షణలో భాగంగా ఈ అం శంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొనిపోయే అంశంపై జేఏసీగా కోదండ రాం, జస్టిస్ చంద్రకుమార్, ప్రజాగాయకుడు గద్దర్, మంద కృష్ణమాదిగ, ప్రజాసంఘాలు ఫ్రంట్‌గా ముందుకువస్తే బీజేపీ మద్దతిస్తుం దని లక్ష్మణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. గతంలో కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు, హామీలకు భిన్నంగా సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులను కొనసాగించడంపై మంచిర్యాలలో చేపడుతున్న నిరసనలపై ప్రస్తావన రాగా, ఓపెన్‌కాస్ట్‌లను కొనసాగించడాన్ని బీజేపీ తప్పుపడుతోందని లక్ష్మణ్ పేర్కొన్నట్లు తెలు స్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందా లేదా పొత్తులకు తలొగ్గుతారా అని కోదండరాం ప్రశ్నించగా కచ్చితంగా ఒంటరిగానే పోటీ చేస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారని సమాచారం. ప్రత్యామ్నాయం బీజేపీయే... టీఆర్ఎస్కు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీ యేనని లక్ష్మణ్ పేర్కొన్నట్లు సమాచారం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ వ్యవహరి స్తోందని చెప్పినట్లు తెలుస్తోంది. ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపట్ల బీసీల్లో వ్యతి రేకత వ్యక్తమవుతోందని వ్యాఖ్యానించారని తెలిసింది. దీనిపై ముస్లింలలో కూడా ఆం దోళన వ్యక్తమవుతోందని, 12శాతానికి పెంచి తే మొదటికే మోసం వస్తుందా అన్న సందే హాలు వారిలో వ్యక్తమవుతున్నాయని పేర్కొ న్నట్లు సమాచారం. -
‘హైదరాబాద్’పైనే మా గురి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి మంత్రం వల్ల అస్సాం, యూపీ, మణిపూర్ వంటి ముస్లిం, క్రైస్తవ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ అఖండ విజయాన్ని సాధించిం దన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోక్‌సభ సీటును సైతం గెలుచుకునే విధంగా బీజేపీ వ్యూహాన్ని రూపొంది స్తోందన్నారు. ఇందుకు 7న జరగనున్న హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కార్య కర్తల సమన్వయ సదస్సుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు దీటుగా, నిజమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ స్థాయిల్లో బీజేపీ జెండాలను ఎగురవేసేలా కార్యక్రమాలను రూపొందించామని చెప్పారు. -
ముస్లిం రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్ల బిల్లును సభలో పెడితే తాము వ్యతిరేకిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 24న యువమోర్చా ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 శాతం మతపరమైన రిజర్వేషన్ కల్పిస్తే ఏ గతి పట్టిందో ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వానికీ అదే గతి పడుతుందని హెచ్చరించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్ల కల్పనకు బీజేపీ వ్యతిరేకమని పేర్కొన్నారు. యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తుంటే పోలీసులు కేసులు పెడుతున్నారని తెలిపారు. సోమవారం భువనగిరిలో ధర్నా చేస్తున్న బీజేపీ, బీజేవైఎం, ఇతర నాయకులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించడం అక్రమమని ఆరోపించారు. వారిపై పెట్టిన కేసులు ఎత్తివేసి విడుదల చేయాలన్నారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ను ఎత్తేశారని.. ఇంకా ఎక్కడ నిరసన తెలపాలన్నారు. -
24న చలో అసెంబ్లీ: లక్ష్మణ్
హైదరాబాద్: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు హెచ్చరించినా, టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి వైఖరితో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడం సరికాదని బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 24న బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి మతపరమైన రిజర్వేషన్ల బిల్లును రాజకీయంగా అడ్డుకుంటామన్నారు. -
‘అంబేద్కర్ కూడా వ్యతిరేకించారు’
హైదరాబాద్: మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. టీఆర్ఎస్ సర్కారుకు ఈ విషయం తెలిసి కూడా మొండిగా వ్వవహరిస్తోందని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లపై ఈ నెల 24న బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చేపట్టే చలో అసెంబ్లీ ముట్టడి పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఏనాడో చెప్పారని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను మర్చిపోయి కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. -
బీసీల కోసం ‘బ్యాలెట్ బడ్జెట్’: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ బీసీల ఓట్లను ఆకర్షించేందుకు ప్రవేశపెట్టిన బ్యాలెట్ బడ్జెట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. మంగళవారం పార్టీ నాయకులు చింతా సాంబమూర్తి, జి.మనోహర్‌రెడ్డి, జి.ప్రేమేందర్‌రెడ్డి, కృష్ణ సాగర్‌రావు, రఘునందన్‌రావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్లో పెద్దఎత్తున నిధుల కేటాయింపు పేరు తో పేద వర్గాలను కులవృత్తులకే పరిమితం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఎస్టీలు, మైనారిటీలకు 12% రిజర్వేషన్లను పెంచుతామంటున్న ప్రభుత్వం 54% ఉన్న బీసీల రిజర్వేషన్లను పెంచే విషయంలో మాత్రం చిత్తశుద్ధి కనబరచడం లేదన్నారు. బడుగుల ఉన్నతవిద్యకు ఊతమిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం బకాయిలే రూ.3,300 కోట్లుంటే బడ్జెట్లో రూ.19వందల కోట్లే కేటాయించడాన్నిబట్టి ఈ వర్గాల పట్ల ప్రభుత్వానికి ఏమేరకు చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోందన్నారు. ఎంసెట్ ర్యాంకులతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపచేస్తూ, బీసీలకు మాత్రం 10వేల ర్యాంకు నిర్దేశించి ఆంక్షలు విధించడం ఏ రకమైన అభివృద్ధో చెప్పాలన్నారు. -
అసెంబ్లీలో దూకుడుగా వెళ్లాలి
బీజేఎల్పీ నిర్ణయం హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో దూకుడుగా వ్యవహరించాలని బీజేఎల్పీ నిర్ణయించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, ప్రధాన సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని దుయ్యబట్టాలని తీర్మానించింది. రెండు పడకల గదుల ఇళ్లు, ఉద్యోగాల భర్తీ, రైతాంగ సమస్యలు, దళితులకు 3 ఎకరాల పంపిణీ, మిషన్ భగీరథ వంటి అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించింది. బుధవారం బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కె.లక్ష్మణ్,చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొనగా మరో ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరుకాలేదు. రాజ్‌భవన్ సిబ్బంది క్వార్టర్స్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఆహ్వానించకపోవడాన్ని సభలో ప్రస్తావించాలనే అభిప్రాయానికి వచ్చారు. ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కిషన్‌రెడ్డి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొస్తే తాము ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. సీపీఎంను రాజకీయంగానే ఎదుర్కొంటామని, ఆ పార్టీ త్వరలో నిర్వహించే సభను అడ్డుకోమని కె.లక్ష్మణ్ తెలిపారు. -
సంప్రదాయం కాదు
టీజేఏసీ ర్యాలీకి అనుమతి నిరాకరణపై కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి పోలీసులు అనుమతి వ్వకపోవడం మంచి సంప్రదాయం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏ అంశంపైనైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందన్నారు. ఇటువంటి నిరసనల్లో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉన్నప్పుడు నియంత్రణ అనేది సమస్యకు పరిష్కారం కాదని మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమప్పుడు కూడా జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టిన సందర్భంగా కూడా ఇబ్బందులు వచ్చాయని, అయితే శాంతియుతమైన పద్ధతుల్లోనే అవి జరిగాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగ యువత ఆవేదన, అసంతృప్తిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
బడుగులను ఓటు బ్యాంకుగా చూస్తోంది
సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీనవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఓటుబ్యాంకుగానే పరిగణిస్తోందని బీజేపీ అధ్య క్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వాల మాదిరిగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ వర్గాల పురోభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. ఎన్నికలకు ముందు ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని, గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని హామీనిచ్చి వీటి అమల్లో పూర్తిగా విఫలమయిందన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా బుధవారం పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసుల్లో మార్పునకు సేవాలాల్ ఎంతో కృషి చేశారన్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నానావత్ భిక్కునాథ్ నాయక్, ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతా సాంబ మూర్తి, ఎస్.మల్లారెడ్డి, జి.ప్రేమేందర్‌రెడ్డి, కిషన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓయూ శతాబ్ది వేడుకల్లో పాల్గొనండి
ప్రధాని మోదీకి బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ లేఖ సాక్షి, హైదరాబాద్: ఓయూ శతాబ్ది ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు రావా ల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌లో జరగనున్న ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొనాలని తెలంగాణ ప్రజలు, ఓయూ విద్యార్థులు కోరుకుంటు న్నారని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో మోదీ పాల్గొంటే విద్యార్థులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులకు స్ఫూర్తిని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానికి ఆయన ఒక లేఖ రాశారు. కొన్ని తరాలుగా తెలంగాణ ప్రజలు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. -
మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకుంటాం
కె.లక్ష్మణ్ సంగారెడ్డిజోన్: టీఆర్ఎస్ మతపరమైన రాజకీయాలకు పాల్పడుతోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. మత ప్రాతిపదికన దేశ విభజన జరిగినం దున ఆ విద్వేషాలు ఇప్పటికీ కొనసాగుతు న్నాయని చెప్పారు. మతపరమైన రిజర్వే షన్లకు వ్యతిరేకంగా సంగా రెడ్డిలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తెచ్చిం దని లక్ష్మణ్ అన్నారు. మరోమారు ఈ రిజర్వేషన్లతో ప్రజలను విడదీసే కుట్ర జరుగుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి అంగీకరించేది లేదని స్పష్టం చేశా రు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించా లన్నారు. పేద ముస్లింలకు ఉచిత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మాన వతా దృక్పథంతో స్పందించాలన్నారు. -
టీఆర్ఎస్తో రాజీ లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్తో తమ పార్టీకి ఎలాంటి రాజీ లేదని, రాబోయే 3 నెలలపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్యమ కార్యాచరణను రూపొందించుకున్నట్లు బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ప్రకటించారు. ఎన్నికలకు ముందు, అ«ధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీల అమ లులో ఘోరంగా విఫలమైందన్నారు. రెండు పడకల ఇళ్లు, దళితులకు మూడు ఎకరాలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, తండాలను గ్రామపంచాయతీలుగా మార్పు, రైతుల సంక్షేమం తదితర ముఖ్యమైన హామీల అమలును పూర్తిగా విస్మరించిందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా ముస్లింలకు 12 శాతం మతపరమైన రిజర్వేషన్ల యోచనను కేసీఆర్ తీసుకు వచ్చారన్నారు. సోమవారం పార్టీ నాయకులు చింతా సాంబమూర్తి, జి.మనో హర్రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరు లతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించకుండా తీసుకున్న ఈ నిర్ణయం ఆచరణ సాధ్యం కాదని తెలిసినా ఓటు బ్యాంకు విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మతపర రిజర్వేషన్లకు నిరసన మతపరమైన రిజర్వేషన్లు, రైతు సమస్యలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమస్యలపై పోరాడాలని ఈ నెల 20, 21 తేదీల్లో భద్రాద్రిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించి నట్లు లక్ష్మణ్ తెలిపారు. వీటిలో భాగంగా వచ్చేనెల 8, 9 తేదీల్లో జిల్లాస్థాయిల్లో సదస్సులు, 15–20 తేదీల మధ్య మండల స్థాయిలో వివిధ రూపాల్లో నిరసనలు, ఊరేగింపులు, సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి చివరల్లో అసెంబ్లీ ముట్టడి లేదా హైదరాబాద్‌లో పెద్ద కార్యక్రమాన్ని చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. -
‘డబుల్’ ఇళ్లలో 3 శాతం దివ్యాంగులకు ఇవ్వాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: జనా భా నిష్పత్తి ప్రకారం దివ్యాంగులకు మూడు శాతం డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటుకు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం అసెంబ్లీలో డిమాండ్ చేస్తామన్నారు. మోదీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చిందని.. రాష్ట్రం లోనూ వారికి అండగా ఉంటామన్నారు. శనివారం పార్టీ దివ్యాంగుల సెల్ కన్వీనర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది విజువల్లీ విజ బిలిటీస్ మెంబర్ సీహెచ్ శ్రీశైలం అధ్యక్షత న జరిగిన దివ్యాంగుల వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 40 లక్షల మంది దివ్యాంగులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో దివ్యాంగులకు చేతికర్రలు, వీల్చైర్లు పంపిణీ చేశారు. -
టీఆర్ఎస్ను ఢీకొనే శక్తి బీజేపీకే ఉంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ను ఢీకొని ప్రత్యామ్నాయంగా ఎదిగే శక్తి తమ పార్టీకే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ పోరాటానికి ప్రజలు కలసి రావాలని కోరారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్ర మాలకు మద్దతునివ్వాలన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాల యంలో ఆయన మాట్లాడారు. ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా బీజేపీ ఎదుగుతుందనే నమ్మకంతోనే వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. -
‘కేసీఆర్ మద్దతు సంతోషకరం’
హైదరాబాద్: పాత పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహోసోపేత నిర్ణయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు పలకడం సంతోషకరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా విమర్శలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తమలాగే బ్యాంకు లావాదేవీలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. మోదీ నిర్ణయానికి కేసీఆర్ మద్దతు పలకడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన నేపథ్యంలో లక్ష్మణ్ ఈవిధంగా స్పందించారు. -
అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా ఎన్డీయే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: బాబా సాహెబ్ డా. అంబేడ్కర్ జీవిత ఆశయాలను నెరవేర్చడానికి అడుగులు వేసిన మొదటి ప్రభుత్వం ఎన్డీయేనని బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవంగా నవంబర్ 26వ తేదీని ప్రకటించి, 2015లో రాజ్యాంగ గౌరవాన్ని, దేశ పౌరుల బాధ్యతను గుర్తిస్తూ పార్లమెంట్లో చర్చించిన ఘనత ప్రధాని మోదీదేనని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అంబేడ్కర్‌ను దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించిందన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం బీజేపీ కార్యాలయంలో ఎస్సీసెల్ అధ్యక్షుడు వేముల ఆశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు, నల్లధనాన్ని, అవి నీతిని అరికట్టేందుకు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందన్నారు. -
టీఆర్ఎస్ సర్కారుపై పోరుకిదే సమయం
• బీజేపీ పదాధికారుల సమావేశంలో లక్ష్మణ్ • నోట్ల రద్దుపై అవగాహనా కార్యక్రమాలకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ పదాధికారులు, పార్టీ జిల్లా శాఖల అధ్య క్షులు, ముఖ్యులతో గురువారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయడంలో టీఆర్ఎస్ విఫలమైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగు తున్నదన్నారు. టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై పోరాడటానికి ఇదే సమయ మన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని ప్రజా ఉద్యమాలపై దృష్టిపెట్టాలని పార్టీ శ్రేణులకు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. వెంటనే జిల్లా కమిటీలను పూర్తిచేయాలని అన్నారు. డిసెంబర్ 15లోపు పార్టీ సంస్థాగత వ్యవహారాలను పూర్తిచేయాలన్నారు. రాష్ట్రం లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మ కాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని లక్ష్మణ్ సూచించారు. సమావేశంలో బీజేపీ నాయకులు పి.మురళీధర్‌రావు, పి.కృష్ణ దాసు, రాజా, జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభా కర్, ఎన్.రామచందర్ రావు, నాగం జనా ర్దన్ రెడ్డి, పేరాల చంద్రశేఖర్‌రావు, నల్లు ఇంద్ర సేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అవి కాలం చెల్లిన పార్టీలు: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కాలం చెల్లినవని, దేశంలో ఆదరణ కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించడం ఆ పార్టీల దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. బుధవారం బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆకుల విజయ బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీలు నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. చౌకబారు వ్యాఖ్యలతో సీపీఐ నేత నారాయణ వార్తల్లో ఉండాలనుకుంటున్నారని, ఆయన మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. స్కిల్ ఇండియా ద్వారా రాష్ట్రంలోనూ లక్షలాది మందికి ఉద్యోగాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. -
విపక్షాల విమర్శలు తిప్పికొట్టే వ్యూహం
పెద్ద నోట్ల రద్దుపై బీజేపీ అవగాహనా కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాల ద్వారా తిప్పి కొట్టాలని బీజేపీ నిర్ణరుుంచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చర్చాగోష్టుల ద్వారా ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల తాత్కాలికం గా కొంత ఇబ్బంది కలిగినా దేశానికి, ప్రజల కు కలగనున్న దీర్ఘకాలిక ప్రయోజనాలను వివరించేందుకు వివిధ రూపాల్లో కార్యక్ర మాలను రూపొందిస్తోంది. పెద్దనోట్ల రద్దు తో నల్లధనం బయటకు వస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు మరింతగా అందడంతో పాటు, ఈ డబ్బు దేశాభివృద్ధికి, ఆర్థికాభి వృద్ధికి దోహదపడుతుందనే విషయాన్ని వివి ధవర్గాల ప్రజలకు సులభంగా అర్థమయ్యే లా చర్యలు తీసుకోవాలని నిర్ణరుుంచింది. ఈ సమావేశాలపై పార్టీ ముద్ర పడకుండా వివిధ రంగాల ప్రముఖులు ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు, సందేహాలను దూరం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణరుుంచింది. ఇటీ వల హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, పాట్నా పూర్వ చీఫ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, మాజీ డీజీపీ అరవిందరావు, బ్యాంకింగ్, ఆర్థిక రంగ ప్రముఖులతో చర్చాగోష్టి ద్వారా ఈ కార్యక్రమాలను మొదలుపెట్టింది. కరీం నగర్లో న్యాయవాదులు, ఆర్థికవేత్తల ఆధ్వర్యంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించి ఆయా అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. వీలైనంత త్వరలో ఇదే విధంగా అన్ని జిల్లాల్లోనూ గోష్టులు, సదస్సులు నిర్వహించాలని నిర్ణరుుంచింది. దీంతో పాటు... కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పార్టీ నాయకులు, కేడర్‌కు కూడా సూచనలు, సలహాలతో స్పష్టతనిస్తున్నారు. అవగాహనకు చర్యలు పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పార్టీపరంగా ప్రచార కార్య క్రమాలు నిర్వహిస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దగా లేదనే విషయాన్ని తాజా ఉపఎన్నికల ఫలితాలు స్పష్టం చేశారుు. అస్సాం, ఎంపీలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. నల్లధనం రాజకీయా లను శాసిస్తోంది. అవినీతి వ్యవస్థీకృతమైంది. వీటి ప్రక్షాళన జరగాల్సి ఉంది. నగరంలో కోటి మందికి పైగా జనాభా ఉంటే అందులో కనీసం ఒక్కశాతం కూడా బ్యాంకులు, ఏటీఎంల ముందు కనిపించడం లేదు. - కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు -
టీఆర్ఎస్ సర్కార్‌ను నిలదీయాలి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, ప్రజాసమస్యలను విస్మరించిన రాష్ట్ర సర్కార్‌ను నిలదీసేం దుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జి.మనో హర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ రుణమాఫీ అని రైతులకు సీఎం ఆశలు కల్పించారని, కానీ వడ్డీ కూడా మాఫీ చే యకపోవడంతో అది వారికి గుదిబండగా మారిందన్నారు. రైతుల పట్ల సీఎంకు కనీస సానుభూతి లేదని, కేంద్రం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా పథకంలో ప్రభుత్వం భాగస్వామి కాలేదన్నారు. ఓయూలో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేయడంలేద ని,ఫలితంగా న్యాక్ గుర్తింపు ను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. పేదలకు రెండు పడకల ఇళ్లు, దళితులకు భూపంపి ణీని విస్మరించిన ప్రభుత్వంపై ఉద్యమాల కు సన్నద్ధం కావాలని అన్నారు. -
ఉధృతంగా ఉద్యమించండి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా జిల్లాల వారీగా ఉధృతంగా పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉడీ ఘటనలో కంటే నోట్ల రద్దుతో చనిపోరుున వారే ఎక్కువంటూ సైనికుల త్యాగాలను కించపర్చేలా మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని, అప్పటి వరకు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. బీజేవైఎం దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వేముల అశోక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేసి ఆ వర్గాలకు చేరువ కావాలని కోరారు. ‘‘రాష్ట్రం ఏర్పడితే దళితుడే సీఎం అవుతారన్న టీఆర్ఎస్ హామీ మొదలు దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ఫీజు బకారుులవల్ల ఉన్నత చదువుకు నోచుకోకుండా ఉన్న దళిత విద్యార్థులు, బస్తీల్లో పడుతున్న పాట్లు వంటి అంశాలపై బీజేవైఎం క్షేత్రస్థారుులో పోరాటాలను ఉధృతం చేయాలి’’ అని కోరారు. -
మోదీ నిర్ణయంపై విపక్షాల వక్రభాష్యం
• బీజేపీ నేత లక్ష్మణ్ పెద్ద నోట్ల రద్దుపై ప్రజలను • తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజం సాక్షి, హైదరాబాద్: నల్లధనాన్ని నియంత్రించేందుకు ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దుకు తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు వక్రభాష్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మోదీ అనుకున్న విధంగా నల్లధనంపై నియంత్రణ సాధిస్తే రాజకీయంగా తమకు భవిష్యత్ ఉండదని, ఈ నిర్ణయం వల్ల తాత్కాలికంగా ఎదురవుతున్న సమస్యలను దీర్ఘకాలికమైనవిగా ప్రజల్లో భ్రమలు కలిగించేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ నిర్ణయం తర్వాత రాజకీయ పార్టీల అసలు రంగు బయట పడిందన్నారు. కొన్ని పార్టీలు ఏకంగా ఈ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ హెచ్చరికలు జారీచేయడం ఎవరి కోసమని ప్రశ్నించారు. పేదలు కూడా ధైర్యంగా ఎన్నికల్లో నిలబడే పరిస్థితి రావాలన్నది మోదీ లక్ష్యమన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో అవేర్నెస్ ఇన్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో ‘‘నల్లధనం-నిర్మూలన-నరేంద్రమోదీ’’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఉపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రలోభాలకు గురికాకండి... ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ 2004-14 మధ్యకాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ అవినీతి, కుంభకోణాలను పతాకస్థారుుకి తీసుకెళ్లిందని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు భూమి, సముద్రం, ఆకాశం అనే తేడా లేకుండా దోచుకుని, విదేశాల్లో డబ్బును దాచుకున్నారని ఆరోపించారు. జన్‌ధన్ ఖాతాల్లో లక్ష,, రెండు లక్షలు వేస్తామని ఎవరైనా వస్తే ప్రలోభాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పేదలకు లక్ష్మణ్ విజ్ఞప్తిచేశారు. ఆ విధంగా చేస్తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను కోల్పోయే ప్రమాదం ఎదురవుతుందని హెచ్చరించారు. సభకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ తిరుపతిరావు మాట్లాడుతూ ఈ నిర్ణయం వల్ల స్వల్పకాలానికి ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాలంలో మేలు జరుగుతుందన్నారు. ఆర్థిక నిపుణుడు హన్మాండ్లు మాట్లాడుతూ ఆదాయ మార్గాలు, వచ్చిన ఆదాయం గురించి తెలియజేసి పన్నులు కట్టడం ద్వారా మినహా ఈ నోట్ల రద్దు నిర్ణయం నుంచి తప్పించుకునే అవకాశం లేదని స్పష్టంచేశారు. సంస్థ ప్రతినిధులు రాకా సుధాకరరావు, చక్కిలం రఘునాథ్, తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తం
• నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయం: ఉత్తమ్ • నల్లధనానికి అడ్డుకట్ట: లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం వాడివేడిగా సాగింది. ‘తెలంగాణ సమాజంపై ప్రభావం’ అంశంపై మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయమ న్నారు. ‘సామాన్యుల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఎక్కడ చూసినా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలే కనిపిస్తున్నారుు. గంటల తరబడి వేచివున్నా ఏటీఎంలలో డబ్బులు లేక వెనుదిరిగి వెళుతున్నారు. నల్లధనాన్ని వెలికి తీయడానికి రెండున్నరేళ్లుగా మోదీ ఏంచేశారు? 100 రోజుల్లో విదేశాల నుంచి నల్లధనం తెచ్చి అకౌంట్లల్లో జమ చేస్తామన్న హామీ ఎటుపోరుుంది? ఆ విషయం అవగాహన లేక చెప్పారా... కావాలనే విస్మరించారా అనేది అర్థం కావటంలేదు. పెద్ద నోట్లు రద్దు అన్న పెద్ద మనిషి రూ.2వేల రూపాయల నోటు ఎందుకు తెచ్చారన్న దానికి సమాధానం లేదు. నోట్ల రద్దు వల్ల ఎక్కువ ప్రభావితం అరుుంది గ్రామీణ రైతులు, మధ్యతరగతి ప్రజలు. రాజకీయ అవినీతి పెద్ద సమస్యే. అందుకు మేమందరం బాధ్యలమే. నోట్ల రద్దు నిర్ణయం వెనక్కు తీసుకోవాలి. రూ.2 వేల నోటు రద్దు చేయాలి. పాత నోట్లు ఇస్తే 30శాతం కమీషన్ అనేది ఇప్పుడు హాట్‌హాట్ గా నడుస్తోంది’ అని ఉత్తమ్ ధ్వజమెత్తారు. రూ.100 నోట్లు చాలు... తెలంగాణ యునెటైడ్ ప్రంట్ కన్వీనర్ విమలక్క మాట్లాడుతూ రూ.2వేలు, రూ.500 నోట్లు వద్దని, రూ.100నోట్లు మాత్రమే రా వాలన్నారు. ఇది ఒక రాజకీయ క్రీడన్నారు. ప్రతివారి చేతిలో రూ.500 నోట్లున్నాయని, అందుకే ప్రజలు ఇబ్బందులు పడుతున్నార న్నారు. సామాజిక విశ్లేషకులు డి.నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. నోట్ల రద్దుపై శాస్త్రీయ అధ్యయనం లేదన్నారు. తెలంగాణ రైతులు చావుదెబ్బ తిన్నారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు తో రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపు తోందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నోట్ల రద్దు నిర్ణయా న్ని స్వాగతిస్తున్నామని, అరుుతే సామాన్యుల కు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ‘నల్ల కుబేరులకు ప్రధాని నిర్ణయంతో నష్టం లేదు. నష్టపోయేది ప్రజలే. దోపిడిదారులపై మోదీ సర్జికల్ దాడులు ఎందుకు చేయరు’ అని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు శ్రీశైలం,సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్ సుజాత పాల్గొన్నారు. సాహసోపేత నిర్ణయం పెదనోట్ల రద్దు సాహసోపేత నిర్ణయమని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. అమలులోని లోపాలు సరిదిద్దా లన్నారు. నల్లధనంపై తీసుకునే చర్యల వల్ల వచ్చే నిధులను రాష్ట్రాలకు పంచాల న్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ స్పందిచాలన్నారు. గ్రామల ప్రజలు, రైతులు ఇబ్బందులను పరిగణలోకి తీసు కోవాలన్నారు. మద్యం, రియల్ వ్యాపా రాల ఆదాయం తగ్గి జీతాలు ఇవ్వలేం అంటున్న పరిస్థితులు వినవస్తున్నాయని తెలిపారు. ఎలా నష్టమో స్పష్టంగా చెప్పా లన్నారు. నష్టం తీవ్రంగా ఉంటే కేంద్రం వద్దకు వెళ్దామని, అందరం కలసి ప్రధానిని కలుద్దామని చెప్పారు. తప్పుదోవ పట్టించవద్దు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దుతో బ్లాక్ మనీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. ప్రజల ను తప్పుదోవ పట్టించొద్దన్నారు. అద్భుతా లు సృష్టించటం మోదీ నైజమన్నారు. 2014లో ఎన్నికల్లో అవినీతే ప్రధాన అంశం గా మోదీ ప్రజల్లోకి వచ్చారన్నారు. కాంగ్రెస్ హయంలో అనినీతి పెరిగిపోరుుందని తెలిపారు. అనినీతి నిర్మూలన, నల్ల ధనం వెలికితీతకే పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. నోట్ల రద్దుతో ప్రభుత్వానికి వచ్చే నల్లధనం ప్రజలకే చెందుతుందన్నారు. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలపడాల్సి ఉందన్నా రు. నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు నల్ల కుబే రులకు లాభం చేసినవారవుతారన్నారు. -
రాష్ట్ర బీజేపీ కొత్త కమిటీ ప్రకటన
• 10 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, • 10 మంది కార్యదర్శులతో రాష్ట్ర కమిటీ సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కమిటీ, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ కమిటీలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు. కొంత కాలంగా రాష్ట్ర కమిటీ నియామకంపై పార్టీలో ఎదురుచూపులు సాగుతుండగా, ఎట్టకేలకు బుధవారం ప్రకటిం చారు. మొత్తం 10 మంది ఉపాధ్య క్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శు లు, 10 మంది కార్యదర్శులు, ఒక కోశాధికారితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షులుగా గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎం.ధర్మారావు, ఎస్.మల్లారెడ్డి, వెంకటరమణి, వనిత, సంకినేని వెంకటేశ్వర రావులను (పాతకమిటీ లోని వారు) కొనసాగిస్తూ సీనియర్‌నేత టి.రాజేశ్వరరావుతోపాటు గత కమిటీలో కార్యదర్శులుగా ఉన్న వై. గీత, కాసం వెంకటే శ్వర్ యాదవ్, పి.మోహన్‌రెడ్డిలకు ప్రమోషన్ ఇచ్చారు. ప్రధాన కార్యదర్శులుగా చింతా సాంబ మూర్తి, జి.ప్రేమేందర్‌రెడ్డి, టి.ఆచారి లను కొనసాగిస్తూ కొత్తగా జి.మనోహర్‌రెడ్డికి అవకాశం కల్పించారు. కార్యదర్శులుగా ఎస్. కుమార్‌ను కొనసాగిస్తూ కొత్తగా బి. జనార్దన్‌రెడ్డి, ప్రేమ్‌రాజ్ యాదవ్, పాపా రావు, ఎస్.శ్రీధర్‌రెడ్డి, షేరి నరసింగరావు, జాజుల గౌరి, ఛాయదేవి, శ్రీధర్‌రెడ్డి, నిర్మలా గోనెలను నియమించారు. గతంలో కార్యదర్శిగా పనిచేసిన శాంతికుమార్‌కు కోశాధికారిగా అవకాశం కల్పించారు. వివిధ రంగాల కమిటీలు... ప్రభుత్వ సమన్వయం-ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, అమిత్ అగర్వాల్, పొలిటికల్ ఫీడ్ బ్యాక్ కమిటీ-మాజీ డీజీపీ వి.దినేష్‌రెడ్డి, లైబ్రరీ అండ్ డాక్యుమెంట్స్-సుమంత్, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్- బి.వెంకటరెడ్డి, లా అఫైర్స్(గతంలో లీగల్ సెల్)- రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, పార్టీ జనరల్స్-ప్రొఫెసర్ జగదీశ్వరరావు, పాత కమిటీలకు సంబంధించి పాలసీ రిసెర్చి, థింక్ ట్యాంక్-జీఆర్ కరుణాకర్, మీడియా సెల్, మేనేజ్మెంట్ కమిటీని మీడియా కమిటీ-సుధాకర శర్మ, మీడియా రిలేషన్స డిపార్ట్మెంట్గా (అరుుదుగురితో ఏర్పాటు) విడదీశారు. ట్రైనింగ్- ఓఎస్ రెడ్డి, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ-ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఐటీసెల్‌ను కోఆర్డినేషన్ ఆఫ్ ఐటీ, వెబ్సైట్, సోషల్ మీడియా కమిటీగా మార్చి ఇన్చార్జిలుగా మణికిషోర్రెడ్డి, వెంకటరమణలను నియమించారు. ఎన్ఆర్ఐ-టి.ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ పి.దేవయ్య, అజీవన్ సహయోగ్- మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి, గోవర్థన్‌లను ఇన్‌చార్జీలుగా నియమించారు. జాతీయ నాయకత్వం సూచనతో.. జాతీయ నాయకత్వం సూచనల మేరకు గతంలోని కొన్ని కమిటీలతో పాటు కొత్తగా ప్రోగ్రామ్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్‌గా డి.ప్రదీప్‌కుమార్, బేటీ బచావో- బేటీ పడావో కమిటీ చైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్‌గా శ్రీవర్ధన్రెడ్డిలను నియమించారు. అలాగే స్వచ్ఛభారత్-నాగూరావు నామాజీ, క్రమశిక్షణ కమిటీ-జి.శ్యాంసుందర్‌రావు, ఫైనాన్స కమిటీ-మోరేపల్లి సత్యనారాయణ, తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌గౌడ్‌ను నియమించారు. కిసాన్ మోర్చా మినహా అంతా కొత్త వారే రాష్ట్ర పార్టీకి చెందిన మొత్తం పది మోర్చాలకు గాను కిసాన్‌మోర్చా అధ్య క్షుడిగా గోలి మధుసూదన్‌రెడ్డికి మాత్రమే మరోసారి అవకాశం కల్పించారు. బీజే వైఎం- భరత్ గౌడ్, ఎస్సీ మోర్చా- అశోక్, ఎస్టీ మోర్చా-భిక్కూ నాయక్, మజ్దూర్సెల్ -ఎస్.చంద్రశేఖర్ యాదవ్, మహిళా మో ర్చా-ఆకుల విజయ, బీసీ మోర్చా-కాటం నరసింహ యాదవ్, మైనారిటీ మోర్చా- అఫ్సర్ పాషా, లింగ్విస్టిక్ మైనారిటీ కమిటీ-భవర్లాల్ వర్మ, ప్రోటోకాల్-రవి మెహ్రాలకు అవకాశం కల్పించారు. పదిమంది అధికార ప్రతినిధులు.. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా కృష్ణసాగర్ రావు, రఘునందన్‌రావు, పుష్పలీల, అల్జాపూర్ శ్రీనివాస్‌లను కొనసాగిస్తూ కొత్తగా ఎస్.ప్రకాశ్‌రెడ్డి కె.రాములు, బండి సంజయ్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్, నరేష్, మాధవి చౌదరిలను నియమించారు. -
నెలాఖరులోగా ‘ఫీజు’ బకాయిలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ హైదరాబాద్: ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులను ఈ నెలాఖరులోగా చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల నవంబర్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని, ప్రభుత్వాన్ని స్తంభింపచేయాలని బీజేవైఎం కార్యకర్తలకు, విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులు చెల్లించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, యువకుల పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణలో వారి హక్కులనే కాలరాచే విధంగా సర్కార్ వ్యవహరిస్తోందని అన్నారు. కేజీ టూ పీజీ ఉచిత ఆంగ్ల విద్య అంటూ ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కాకమ్మ కబుర్లు చెబుతూ కార్పొరేట్‌కు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, సిబ్బంది లేరని, రేషనలైజేషన్ పేరుతో దాదాపు 450 పాఠశాలలను మూసివేశారని పేర్కొన్నారు. రెండేళ్లుగా ఫీజు బకారుులు చెల్లించకపోవడంతో 14 లక్షల మంది విద్యార్థులు, రెండు లక్షల యాభై వేలమంది లెక్చరర్లు, సిబ్బంది, 3 వేల కళాశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఆర్థికభారం పేరుతో రీరుుంబర్స్‌మెంటు పథకాన్ని నీరుగార్చడం తగదని సూచించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల రీడిజైన్ చేసి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని, విద్యార్థుల ఫీజు బకారుులు చెల్లించడానికి సీఎంకు చేతులు రావడం లేదన్నారు. కేంద్రం నుంచి వస్తున్న వివిధ రకాల నిధులు, స్కాలర్షిప్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన పేదలకు ఉన్నత విద్య అవకాశాలు అందించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేశారని, దీనితో ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారయ్యారని అన్నారు. బకారుులను చెల్లించి బడుగు, బలహీనవర్గాలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు ప్రదీప్, మహిపాల్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, ప్రధానకార్యదర్శి భరత్‌గౌడ్ పాల్గొన్నారు. -
ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి జరగదు
కుటుంబ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి: లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాభివృద్ధి జరగదని, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు సక్రమంగా అమలు కావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రాంతీయ పార్టీలకు ప్రజాసంక్షేమం కంటే కుటుంబ సంక్షేమమే ముఖ్యమన్నారు. యూపీలో సమాజ్‌వాదీ ప్రభుత్వం కుటుంబ కలహాలతో బజారుకెక్కిందన్నారు. కుటుంబ పార్టీలు ఎక్కడున్నా అదే జరుగుతుందని, ప్రజలు జాగురుకతతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ వంద రోజుల ప్రణాళిక... రూ.వంద కోట్ల స్వాహాకు దారితీసిందన్నారు. నగరంలో చిన్న వాన వచ్చినా నదుల మాదిరిగా పరిస్థితి తయారవుతోందన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ సమక్షంలో పలువురు టీడీపీ, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం సచివాలయానికి రారని, ఫామ్‌హౌస్, క్యాంప్ ఆఫీసుల నుంచే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి 85 వేల ఇళ్లు కేటాయించినా, టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీ టూ పీజీ విద్య, దళితులకు 3 ఎకరాలు తదితర హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.3,060 కోట్లు, ఆరోగ్యశ్రీ రూ.430 కోటల బకాయిలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే వాస్తు పేరిట కొత్త సెక్రటేరియట్ భవనాలకు రూ.350 కోట్లు వెచ్చించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. శ్వాస ఫౌండేషన్ రూపొందించిన ‘స్వచ్ఛ దివాళి-సేప్ దివాళి’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై మూడు నెలల ఉద్యమం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు, ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాబోయే మూడు నెలల పాటు ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు. వ్యవసాయ రంగ సమస్యలతో పాటు దళిత, ఇతర సామాజిక వర్గాలకు సరైన న్యాయం జరగకపోవడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకపోవడం, ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించడం, పేదలకు రెండు పడకల ఇళ్లు సుదూర స్వప్నంగా మారడంపై ఉద్యమించనున్నట్లు తెలిపారు. గురువారం బద్దం బాల్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, కృష్ణసాగర్‌రావుతో కలసి లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలోనే బీజేపీ బృందాలు మార్కెట్ యార్డులను సందర్శిస్తాయని, అనంతరం రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వంపై ఒత్తిడిని తెస్తామని చెప్పారు. వాస్తు పేరిట ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టేందుకు రూ.350 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. దసరా తర్వాత అసెంబ్లీని నిర్వహిస్తామని సీఎం చెప్పారని, ఇప్పటికీ ఆ ఊసే లేదన్నారు. రాజ్యాంగ విలువలపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. వెంటనే శీతాకాల సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్‌వి పిచ్చి ప్రేలాపనలు.. సైన్యం రక్తాన్ని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి వాడుకుంటోందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు పిచ్చిప్రేలాపనలు, చౌకబారు విమర్శలని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సర్వేల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడం చూసి దిగ్విజయ్, కాంగ్రెస్‌కు దిమ్మతిరిగి తమ అసహనాన్ని ఇలా బట్టబయలు చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అథమ స్థానంలోకి చేరుకోవడాన్ని జీర్ణించుకోలేక బీజేపీపై ఇలాంటి విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. దిగ్విజయ్, ఇతర కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలతో సైనికుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. -
మిడ్‌మానేరుపై అసెంబ్లీలో నిలదీస్తాం: కె.లక్ష్మణ్
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాబోయే అసెంబ్లీ సమావేశంలో మిడ్‌మానేరు అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మిడ్‌మానేరు ముంపు బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకు వచ్చిన లక్ష్మణ్ జిల్లా పార్టీ నేతలతో కలిసి మిడ్‌మానేరు ముంపు ప్రాంతాలైన మాన్వాడ, కట్కూర్, కొదురుపాక, రుద్రవరం గ్రామాల్లో పర్యటించారు. ముంపు బాధితులతో సమావేశమై వారి గోడును విన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర నేతలు గుజ్జల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌రావు, వసంత, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. 25 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మిడ్‌మానేరు కట్ట మూడు టీఎంసీలకే గండిపడటం శోచనీయమన్నారు. -
'తెలంగాణలో ప్రజాస్వామ్యం కొరవడింది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొరవడిందని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు సీఎం అయ్యాక విస్మరించడం సరికాదన్నారు. తెలంగాణ విమోచన చరిత్రను జాతీయ అంశాలుగా చేర్చాలని డా. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
‘తిరంగా’కు మతం రంగు వద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడిన అంశాల గురించి తిరంగాయాత్ర ద్వారా బీజేపీ కార్యక్రమాల ను చేపడుతుంటే, అధికార టీఆర్ఎస్ నేతలు.. వాటికి మతం రంగుపులిమి, చరిత్ర ను వక్రీకరిస్తున్నారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజాస్వామ్య పాలనకోసం నాడు నిజాం రాచరిక వ్యవస్థపై ఇక్కడి ప్రజలు పోరాటం చేశారన్నారు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కూడా నాడు తెలంగాణ విమోచన కోసం పోరాడిన వారి త్యాగాలు స్మరించుకొనే వీలులేకుండా పో యిందన్నారు. సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17పై తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలకు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చెబుతున్న మాటలకు పొంతన లేదన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభు త్వ ద్వంద్వ వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విమోచన ఉత్సవాలపై తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ ఉత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రజాకార్ల వారసత్వంగా వచ్చిన ఎంఐఎంతో అంటకాగుతోందన్నారు. తిరంగాయాత్ర సందర్భంగా భైంసాలో తమ కార్యకర్తలపై కేసులు పెట్టారని, రామగుండంలోనూ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. గోల్కొండలో నిర్వహించాలి... గోల్కొండ కోటలో సెప్టెంబర్ 17న విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. కేంద్రం కూడా ఈ ఉత్సవాలను అధికారికం గా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ స్టేట్‌ను పాకిస్తాన్లో కలపాలని నాడు నిజాం చేసిన ప్రయత్నాలను కేసీఆర్ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది తెలంగాణ విమోచనకు 70 ఏళ్లు నిండుతున్నందున ఈ సెప్టెంబర్ 17 నుంచి వచ్చే ఏడాది వరకు ఉత్సవాలను నిర్వహించేలా కమిటీ వేయాలన్నారు. -
అధికారికంగా నిర్వహించరేం? : కె.లక్ష్మణ్
సెప్టెంబర్ 17పై ప్రభుత్వానికి కె.లక్ష్మణ్ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు స్వాతంత్య్రం లభించిన సెప్టెంబర్ 17ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఉద్యమ పార్టీగా ఉంటూ అధికారంలోకి వచ్చాక ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఎంఐఎంను బుజ్జగించేందుకే ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని శనివారం విమర్శించారు. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్నే టీఆర్ఎస్ చేస్తోందని, బీజేపీ మినహా మరే పార్టీ ఎంఐఎం మతఛాందస రాజకీయాలను ఎండగట్టే సాహసం చేయడం లేదని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపడిన ఈ అంశాన్ని విలీనమా, విమోచనా, విద్రోహమా అన్న సందేహాలను వెలిబుచ్చుతూ కేసీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆగడాలు, దాని వారసత్వంగా ఏర్పడిన ఎంఐఎం పార్టీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతో అధికారికంగా నిర్వహించకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందన్నారు. సెప్టెంబర్ 17న వరంగల్‌లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని చెప్పారు. -
ప్రాజెక్టుల రీ డిజైన్ ఎవరి కోసం..?: లక్ష్మణ్
ఢిల్లీ: తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైన్ ప్రజల కోసమా? కాంట్రాక్టర్ల కోసమా? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర షరతులకు తలొగ్గి ఒప్పందాలు చేసుకున్నారని మండిపడ్డారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని కె.లక్ష్మణ్ చెప్పారు. -
మోదీ ప్రసంగంతో నూతనోత్తేజం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మహాసమ్మేళన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో రాష్ర్టంలో కార్యకర్తలకు నూతనోత్తేజం కలిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఒకే బీజేపీ ఎంపీ ఉన్నప్పటికీ సమాఖ్య విధాన స్ఫూర్తితో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. ఒకే పర్యటనతో రాష్ట్రానికి రూ.17 వేల కోట్ల అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. ఇది తెలంగాణపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణలో బీజేపీదే భవిష్యత్తు అని మోదీ చెప్పడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం, విశ్వాసం పెరిగిందని చెప్పారు. 2019లో తెలంగాణలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా కేంద్రంలో అవినీతి రహిత పాలన ఉందని మెచ్చుకున్నారని గుర్తుచేశారు. -
హైకోర్టు తీర్పు చెంపపెట్టు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వీసీల నియామకాలను రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలోని వర్సిటీలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. గవర్నర్ ప్రమేయం లేకుండా వీసీలను నియమించడమే తప్పన్నారు. నిబంధనలు, విధి విధానాలను తుంగలో తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలను కొట్టేసినా, పలు అంశాలపై మొట్టికాయలు వేసినా రాష్ట్రప్రభుత్వానికి సిగ్గు రావట్లేదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలను కోర్టులే తప్పు పడుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. -
7న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక
హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ పదాథికారులకు దిశానిర్ధేశం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 7న హైదరాబాద్‌కు రానున్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన రెండేళ్ల తరువాత తొలిసారి తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన పూర్తిస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ వివరాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ బుధవారం హైదరాబాద్‌లో ఒక ప్రకటనలో తెలియజేశారు. పర్యటన షెడ్యూల్ ప్రకారం.. నరేంద్ర మోదీ ఆగస్టు 7న హైదరాబాద్‌కు రానున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు మోదీ బీజేపీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న 'బిజేపీ బూత్ స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనం' లో ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడి కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తారు. అంతకముందు వివిధ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నరేంద్ర మోదీ పర్యటన సంబంధించి రాష్ట్ర పార్టీ బీజేపీ కార్యకర్తలను సమాయత్తం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నది. దీనిలో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాలలో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తోంది. నరేంద్ర మోదీ రాక సందర్భంగా మహబూబ్‌నగర్ లో 29న, నల్గొండలో జులై 30న, రంగారెడ్డి అర్బన్ జులై 29, మెదక్ జులై 30న, నిజామాబాద్ జులై 31న, మంచిర్యాల ఆగస్టు 3న, కరీంనగర్ 29న, వరంగల్ జిల్లాలో జులై 30న వరంగల్ కార్పొరేషన్ జులై 31న, హైదరాబాద్ లో ఆగస్టు 2న జిల్లాలలో సన్నాహాక సమావేశాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ సన్నాహాక సమావేశాలలో బీజేపీ శాసనసభ్యులు, కేంద్ర, రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. -
ముస్లింలకు వ్యతిరేకం కాదు
* బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి * పేద ముస్లింల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో పథకాలను తెచ్చిందన్నారు. రాష్ట్రంలో పేద ముస్లింల అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. పాతబస్తీలో ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు అధ్వానంగా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను, వ్యవస్థలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. పేదలకు కేంద్రం ఇస్తున్న నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై మాత్రమే బీజేపీ పోరాటమని, ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్న మజ్లిస్‌కు మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. కాంట్రాక్టర్ల కనుసన్నల్లో ప్రభుత్వం: నాగం సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆర్థిక ప్రయోజనాల కోసం.. కాంట్రాక్టర్ల కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించా రు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నడుస్తున్న ప్రాజెక్టుల్లో అంచనా వ్యయం పెంచడానికి ఇచ్చిన జీవో 146 ఆధారంగా అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచడంలో కేసీఆర్‌కు ప్రమేయం లేకుంటే సీబీఐ విచారణ జరి పించాలని డిమాండ్ చేశారు. ఈఎన్సీ మురళీధర్‌రావు ఈ అవినీతిలో కీలకపాత్రధారి అని, ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడటం, కేసీఆర్ కుటుంబ సభ్యులకు కమీషన్లు దోచిపెట్టడానికే మురళీధర్‌రావుకు పదవీకాలాన్ని పొడిగించారన్నారు. ప్రాజెక్టులను ఆలస్యం చేసినవారికి జరిమానాలను విధించకుండా, అంచనాలను పెంచడం వెనుక భారీ అవినీతి ఉందన్నారు. కరువులో రైతులను ఆదుకోవడానికి కేంద్రం ఇచ్చిన నిధులనూ కాంట్రాక్టర్లకు ఇస్తూ, రైతుల రక్తాన్ని సీఎం కేసీఆర్ పీల్చుకుంటున్నారని నాగం విమర్శించారు. -
‘మల్లన్న సాగర్’ బాధితులకు అండగా ఉంటాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ శామీర్‌పేట్: మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూములు కొల్పోతున్న బాధితులకు తమ పార్టీ అండ గా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేట, దుబ్బాక ప్రాం తంలో నూతనంగా నిర్మించనున్న వుల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వల్ల భూవుులు కోల్పోతున్న బాధితులను పరావుర్శించేందుకు బుధవారం ఆయ న మెదక్ జిల్లా సిద్దిపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌కు అలియూబాద్ చౌరాస్తా వద్ద ఆ పార్టీ నాయకుడు విష్ణువర్దన్‌రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు. భూవుులు కోల్పోతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉం డాలన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో సువూరు 17 గ్రావూల ప్రజలకు అన్నిరకాల హోదాలు కోల్పోయే ప్రవూదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూనిర్వాసితులపై రెచ్చగొట్టే వాఖ్యలు చేసి వుధ్యతరగతి ప్రజలవుధ్య చిచ్చుపెట్టే చర్యలు వూనుకోవాలని హితవు పలికారు. కేవ లం నాలుగు గ్రావూల కోసం 40వేల గ్రావూల ప్రజలను ఇబ్బందులకు గురిచేయూలా అనే ధోరణిలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వుధ్యతరగతి ప్రజలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయున్నారు. దీనిని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నిపుణులను నియుమించి బాధితులకు అన్నిరకాల సౌకర్యా లు కల్పించేలా కృషిచేయూలన్నారు. వుుఖ్యం గా భూవుులు, ఇతర వృత్తి, వ్యాపారులు కోల్పోతున్న నిరాశ్రయుులకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇవ్వడానికి ఈ యూత్ర చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రవుంలో బీజేపీ రాష్ట్రకార్యదర్శి కొంపల్లి మోహన్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, మేడ్చల్ బీజేపీ అధ్యక్షుడు జగన్‌గౌడ్, శామీర్‌పేట్ అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ హృదయ్కువూర్, నాయుకులు ఈశ్వర్‌గౌడ్, శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్నాయుక్, కొరివి కృష్ణ, భాషా, జి.వూధవరెడ్డి, బి.నాగరాజుచారి, బి.లక్ష్మణ్, నరేందర్‌గౌడ్, బాబుగౌడ్ పాల్గొన్నారు. -
మాతోనే తెలంగాణ అభివృద్ధి
♦ కుటుంబ పార్టీలతో రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందవు ♦ సూర్యాపేట బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం గత రెండేళ్లలో రూ.90 వేల కోట్ల కన్నా ఎక్కువ నిధులిచ్చింది. కానీ కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి క్షేత్రస్థాయికి చేరడం లేదు. కుటుంబ పార్టీలతో తెలంగాణకు, దేశానికి మేలు జరగదు. తెలంగాణ సమగ్రాభివృద్ధి ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీతోనే సాధ్యం’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉద్ఘాటించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. గత రెండేళ్లుగా మోదీ ప్రభుత్వం అవినీతి లేని పాలన అందిస్తోందని అన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయని, పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన ‘అభివృద్ధి పథంలో భారత్’ పేరిట నిర్వహించిన బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... దేశానికి మాట్లాడే ప్రధానిని ఇచ్చాం.. తెలంగాణ ఏర్పాటై రెండేళ్లవుతున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటై మే 26 నాటికి రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి ఏమిచ్చిందని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ప్రశ్నిస్తున్నారు. సోనియాజీ.. మీకు వినగలిగే శక్తి ఉంటే వినండి. ఏం ఇచ్చినా ఇవ్వకున్నా ఈ దేశానికి ఓ మాట్లాడే ప్రధానిని ఇచ్చిన ఘనత మాది. పదేళ్ల యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మాట్లాడే మాటలు కేవలం సోనియాకు, ఆమె కుమారుడికి మాత్రమే వినిపించేవి. వారికి తప్ప ఇంకెవరికీ వినపడేవి కావు. కానీ ఇప్పటి ప్రధాని మాటలను ప్రపంచం వింటోంది. ఈ రెండేళ్లలో మేం అవినీతి లేని పాలననిచ్చాం. మీరు(యూపీఏ) అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, స్కాంలు జరగని ప్రదేశం ఉందా? అంతరిక్షంలో 2జీ, ఆకాశంలో వెస్ట్‌ల్యాండ్, భూమిపై ఆదర్శ సొసైటీ, కామన్వెల్త్, సముద్రంలో సబ్‌మెరైన్, పాతాళాన్ని కూడా వదలకుండా బొగ్గు స్కాం.. ఇలా ఈ విశ్వంలో ఏ స్థానాన్ని వదలకుండా కుంభకోణాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. అలాగే రెండేళ్ల క్రితం దేశ సరిహద్దుల్లో కాల్పులు పాకిస్తాన్ ప్రారంభించి పాకిస్తానే ముగించేది. కానీ ఇప్పుడు కాల్పులు పాకిస్తాన్ ప్రారంభిస్తే భారత్ ముగిస్తోంది. ఇటలీ కళ్లద్దాలు పెట్టుకున్న రాహుల్ బాబాకు ఈ విషయం కనబడదు. మన్మోహన్ విదేశాలకు వెళ్తే ఎవరికీ తెలిసేది కాదు ఈ రెండేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యలెన్నో తీసుకున్నాం. దేశ ఆర్థికాభివృద్ధి 7.6 శాతంతో ముందుకెళుతోంది. ప్రపంచంలో ఏ దేశానికి రానన్ని పెట్టుబడులను తీసుకురాగలిగాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్‌కు తీసుకురాగలిగాం. ఉపాధి కల్పన కోసం స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా పథకాలు తెచ్చాం. దేశంలోని 3.84 కోట్ల మందికి రూ.లక్ష రూపాయల రుణాన్ని అందజేశాం. జనధన్ యోజనతో 22 కోట్ల కుటుంబాలకు బ్యాంక్ అకౌంట్లిచ్చాం. రూ.12, రూ.300లతో ప్రమాద, జీవిత బీమా అందజేశాం. మోదీ విదేశాల చుట్టూ తిరుగుతున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కానీ మోదీ కన్నా మన్మోహనే ఎక్కువసార్లు విదేశాలకు వెళ్లారు. అయితే అప్పుడు ప్రధానిగా ఉన్న మౌనీబాబా ఎప్పుడు విదేశాలకు వెళ్లినా సామాన్యులకు తెలిసేది కాదు. కాగితాల్లో రాసిచ్చిన ఇంగ్లిష్ చదివి వచ్చేసేవారు. ఒక దేశంలో మాట్లాడాల్సింది మరో దేశంలో మాట్లాడిన సంద ర్భాలు కూడా చూశాం. కానీ మోదీ ఏ దేశానికి వెళ్లినా వేలాది మంది స్వాగతం పలుకుతున్నారు. ఇటీవల అమెరికా చట్టసభలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన ప్రసంగానికి హర్షధ్వానాలు, గౌరవం లభించాయి. అది మోదీకి వచ్చిందో, బీజేపీకి వచ్చిందో కాదు. ఇది తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు లభించిన గౌరవం. 2019లో తెలంగాణలో మాదే అధికారం: కె.లక్ష్మణ్ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. టీడీపీ నేతలు వలసబాట పట్టడంతో ఆ పార్టీ ఖాళీ అయిపోతోందని, ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బీజేపీ ఉంటుందని, నిజమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని చెప్పారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదన్నారు. మజ్లిస్ ఒత్తిళ్లకు తలొగ్గి సెప్టెంబర్-17న తెలంగాణ విమోచన దినోత్సవాలను కేసీఆర్ అధికారికంగా జరపడం లేదన్నారు. ఈసారి జరపకపోతే బీజేపీ ఆధ్వర్యంలోనే గ్రామగ్రామాన పెద్దఎత్తున విమోచన ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీలోని బీజేపీ తరఫు ఐదుగురు ఎమ్మెల్యేలు ధర్మం కోసం పనిచేస్తారని చెప్పారు. రజకార్లను నిలువరించిన నల్లగొండ గడ్డ స్ఫూర్తితో మరో పోరాటానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సభలో కేంద్రమంత్రి హన్స్‌రాజ్ అహిర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర రావు, యువమోర్చా జాతీయ మాజీ అధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మతతత్వ మజ్లిస్‌కు సమాధానం చెప్పగలదా? రజాకార్లకు ఎదురొడ్డి నిలిచిన గడ్డ ఇది. ఈ గడ్డపై నేను అడుగుతున్నా. ఓవైసీల నాయకత్వంలోని మతతత్వ మజ్లిస్ పార్టీకి అధికార టీఆర్ఎస్ దీటైన సమాధానం చెప్పగలదా? లేదు. అది కేవలం బీజేపీకే సాధ్యం. కొత్తగా ఆవిర్భవించిన ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి. తెలంగాణ సంస్కృతికి పట్టం కట్టాలి. అందుకు తెలంగాణను బీజేపీకి సొంతిల్లుగా చేయాలి. బీజేపీకి మద్దతివ్వండి. పార్టీని గ్రామగ్రామానికి తీసుకెళ్లండి. తెలంగాణకు ఇవన్నీ వచ్చాయా? కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధి కోసం రూ.90 వేల కోట్లు ఇచ్చాం. దేశంలోనే అన్ని రాష్ట్రాలకన్నా ఎక్కువ నిధులిచ్చాం. దేనికెన్ని ఇచ్చారని ఎవరైనా అడిగినా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూడాలని నేను కోరుకుంటున్నా. కుటుంబ పార్టీల వల్ల తెలంగాణలో కానీ, దేశంలోని కానీ అభివృద్ధి జరగదన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి. తెలంగాణలోని ప్రతి గ్రామంలో 24 గంటల విద్యుత్, రోడ్ల నిర్మాణం, హాస్పిటళ్ల ఏర్పాటు, ప్రతి ఎకరానికి నీరు, ఉద్యోగాలు వచ్చాయా? అదే బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవన్నీ అప్పుడే జరిగిపోయాయి. ఈ రాష్ట్రాన్ని పాలించిన వాళ్లు ఈ జిల్లా ప్రజలకు కనీసం ఫ్లోరైడ్ రహిత నీటిని అందించారా? 35 ఏళ్లకే తెల్లజుట్టుతో ఉన్న యువకులను చూస్తుంటే నా హృదయం జ్వలించిపోతోంది. కేంద్రం పంపే నిధులన్నీ మీకు క్షేత్రస్థాయి వరకు చేరడం లేదు. -
ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది
కోదండరాంపై రాజకీయ దాడి తగదు: కె.లక్ష్మణ్ సూర్యాపేట: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అందుకే టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రశ్నించారని, దాంట్లో తప్పేమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం వచ్చిన ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నది ప్రజలను ముంచేందుకా? అని కోదండరాం ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో తప్పేమీ లేదన్నారు. రాజకీయ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కోదండరాంపై మంత్రులు ప్రతి విమర్శలకు దిగుతున్నారన్నారు. కోదండరాంపై టీఆర్ఎస్ ముప్పేట దాడి చేయడం సిగ్గు చేటన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. -
బీజేపీ వల్లనే తెలంగాణ: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు లేకున్నా తెలంగాణ ఏర్పాటుకోసం చిత్తశుద్ధితో వ్యవహరించి, పార్లమెంటులో బిల్లుకు మద్దతు ఇవ్వడం వల్లనే రాష్ట్ర ఏర్పాటు కల నెరవేరిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్రావిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీ సీనియర్ నేతలు జి.కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్, ఎన్.రామచందర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, అమర్‌సింగ్ తిలావత్ పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ 1969 నుంచి 2014 దాకా ఎంతోమంది త్యాగధనులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టే సమయంలో ఎన్నో కుట్రలు జరిగినా రాష్ట్ర ఏర్పాటువైపే పార్టీ నిలబడిందన్నారు. -
అవినీతి లేదంటే నవ్వుకుంటున్నారు
సీఎం క్యాంపు ఆఫీసు వేదికగా రాజకీయ అవినీతి: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ అవినీతి లేదని సీఎం కేసీఆర్ అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయమే రాజకీయ అవినీతికి వేదికగా మారిందన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా 63గా ఉన్న సంఖ్యను 80 దాటించారని, దీని వెనుక ఉన్న అవినీతి సంగతి ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులు, రాజకీయ అవినీతికి సీఎం తన క్యాంపు కార్యాలయాన్నే వేదికగా చేసుకున్నారన్నారు. రాజకీయ అవినీతికి అర్థాన్ని, నిర్వచనాన్ని మార్చేశారని, పార్టీకి- ప్రభుత్వానికి మధ్య ఉండే లక్ష్మణరేఖను చెరిపే శారని అన్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలపై ఆధారాలతో సహా మీడియాలో వస్తున్నా సీఎంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథలో జరిగిన అవినీతి గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అవినీతి కారణాలతోనే ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసినట్టుగా సీఎం ప్రకటించారని, అయితే ఇప్పటిదాకా ఆ అవినీతి ఏమిటో, ప్రజా సొమ్ము ఎంత దుర్వినియోగ మయిందో చెప్పలేదన్నారు. రాష్ట్రంలో 1,700 పరిశ్రమలు, 1.20 లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయంటున్న సీఎం.. ఆ వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన కంపెనీల పేర్లు, వాటిలో ఉద్యోగాలు పొందిన వారి పేర్లను వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎందుకు ఓటెయ్యాలె..? పచ్చి అబద్ధాలు, అవాస్తవాలతో ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు 2019లో ఎందుకు ఓటేయాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. ‘‘దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసినందుకా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసినందుకా? డబుల్ బెడ్రూం ఇళ్లు రెండేళ్లయినా ఇవ్వనందుకా? గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని, తాండాలను పంచాయతీలుగా చేస్తానని మోసం చేసినందుకా? ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నందుకా? తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన మజ్లిస్‌ను మిత్రపక్షమంటూ ప్రజలను మోసం చేస్తున్నందుకా? సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం చేస్తామని అధికారంలోకి రాగానే మజ్లిస్ మెప్పు కోసం మాట తప్పినందుకా? టీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలె..?’’ అని లక్ష్మణ్ ప్రశ్నించారు. అస్సాం, హరియాణా స్ఫూర్తితో తెలంగాణలోనూ తాము అధికారంలోకి వస్తామన్నారు. బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్ జీర్ణం చేసుకోలేకపోతున్నారన్నారు. యువతను మోసగిస్తున్నారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా యువకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం మోసం చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారమిక్కడ బీజేపీ యువమోర్చా రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన యువత ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. -
'మోదీ సర్కారుకు అన్ని వర్గాల్లో ఆదరణ'
పార్టీ కార్యాలయంలో వేడుకలు హైదరాబాద్: రెండేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దేశప్రజలకు విశ్వాసం పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, శాసనసభ్యులు జి.కిషన్‌రెడ్డి, ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, పార్టీ జాతీయ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, నేతలు చింతా సాంబ మూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కె.సత్యనారాయణ, రిటైర్డు డీజీపీ దినేశ్‌రెడ్డి, రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ అభివృద్ధి పథంలో భారత్ అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు, మారుమూల ప్రాంతాలకు తీసుకుపోవాలని సూచించారు. -
అడుగులు నేర్చిన ఆదర్శం
సందర్భం మోదీ రెండేళ్ల పాలన మహిళలు ఆరాధనా శక్తిగానే కాదు ఆర్థికశక్తిగా కూడా ఎదగాలనేది మోదీ ప్రభుత్వ లక్ష్యం. ఆకాశంలో సగం, అవకాశాల్లో కూడా సగం ఉండాలని భావించి మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. గత రెండేళ్ల పాలనలో ముద్ర యోజనలో 79 శాతం రుణాలు మహిళలకే లభించాయి. బాలికల కోసం 2,61,400 పాఠశాలల్లో మరుగుదొడ్ల వసతి కల్పించారు. తద్వారా బాలికల హాజరు శాతం ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగింది. 44 లక్షల మంది గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చారు. ‘భారత ప్రజల అంచనాలకు మించి నరేంద్రమోదీ సర్కారు విజయాలు సాధించింది’ అంటూ బీజేపీ అగ్ర నేత అభినందించడం ఎంతో వాస్తవం. చరిత్రాత్మక ప్రజా తీర్పుతో 2014 మే మాసంలో అధికారం చేపట్టిన మోదీ ఏ విధంగా చూసినా రెండేళ్ల పాటు దేశానికి విశిష్టమైన పాలన అందించారు. అయితే సాధించవలసినది ఇంకా ఎంతో ఉందన్న స్పృహతో మిగిలిన పాలనా కాలాన్ని కూడా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో మోదీ ఉన్నారు. అందుకే రెండేళ్ల పాలన సందర్భాన్ని ‘అభివృద్ధి పథంలో భారత్’ నినాదంతో నిర్వహించుకోవాలని, నేటి నుంచి (26వ తేదీ)జూన్ 15 వరకు ఎన్డీయే విజయాలను ప్రజలకు తెలియచేయాలని బీజేపీ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 33 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగానే 16 మంది కేంద్ర మంత్రులతో, ఎనిమిది బృందాలు తెలం గాణలో పర్యటించనున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రజలకు చేరువ కావడానికి ప్రధాన కారణం- గ్రామీ ణాభివృద్ధికీ, పేదలూ రైతుల సంక్షేమానికీ, మహిళలు, యువత, కార్మికుల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడమే. పారదర్శకతతో, అవినీతి మచ్చ లేకుండా జవాబుదారీతనంతో పనిచేస్తూ, అట్టడుగు వర్గాలను అభివృద్ధిలో భాగ స్వాములను చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కింది. మోదీ నాయకత్వం స్ఫూర్తిదాయకమైనది. మునుపెన్నడూ లేని రీతిలో దేశ ప్రజలు ఆయన మీద విశ్వాసం పెంచుకున్నారు. అందుకు నిదర్శనం-వెసులుబాటు ఉన్నవారు ఎల్పీజీ రాయితీని వదులుకోవలసిందంటూ ప్రధాని ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందన. కోటి మందికి పైగా రాయితీని వదులుకున్నారు. ఇలా ఆదా అయిన సొమ్ముతో పేద, బడుగు వర్గాల మహిళలను కట్టెల పొయ్యిల నుంచి విముక్తం చేయడానికి మోదీ ప్రభుత్వం నడుం కట్టింది. ఐదు కోట్ల మందికి రూ. 1,600 రాయితీతో ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నది. ముద్ర పథకం ప్రవేశపెట్టి చిరు వ్యాపారులను, నిరుపేదలను వడ్డీ వ్యాపారుల అధిక వడ్డీల బాధ నుంచి విముక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ యువకులు, మహిళలు ఉద్యో గార్థులుగానే ఉండిపోకుండా, ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరు కోవడానికి వీలు కల్పిస్తూ ప్రధాని స్టాండప్ ఇండియా పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద దేశంలోని 1.25 లక్షల బ్యాంకుల శాఖలలో ఒక్కొక్క శాఖ రెండు రకాల రుణాలు ఇస్తున్నాయి. రెండున్నర లక్షల మంది యువతకు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం వచ్చింది. స్టాండప్ ఇండియా పథకంలో 10 లక్షల నుంచి కోటి రూపాయల రుణ సదుపాయం కల్పించారు. మనిషిని మనిషి లాగడం (రిక్షాలో) అమానవీయమని రామ్మనోహర్ లోహియా ఎప్పుడో అన్నారు. కానీ దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు, కమ్యూనిస్టులు కూడా ఈ విషయం పట్టించుకోలేదు. కానీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలోనే కోటిన్నర మందికి ఈ-రిక్షాలు అందచేశారు. మత్స్యకారులకు ఈ-పడవలు కూడా అందచేశారు. మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియాను స్కిల్ ఇండియాతో అనుసంధానం చేసిన మోదీ ప్రభుత్వం దేశంలో పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి యువతకు విస్తృతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తోంది. స్వచ్ఛభారత్ ప్రధాని సమున్నతా శయంతో ఆరంభించిన పథకం. దీనికి స్పందన కూడా అంతే స్థాయిలో ఉంది. ప్రపంచం కుగ్రామంగా మారిన ప్రస్తుత సాంకేతిక యుగంలో భారతీయ యువతను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం స్కిల్ ఇండియాను ప్రవేశపెట్టింది. భారత్‌లో పరిశుభ్రత అన్న ఆలోచన స్థిరపడడానికి ఇది దోహదం చేస్తోంది. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి చేత ప్రకటింప చేయడంలో మోదీ విజయం సాధించారు. గ్రామాభివృద్ధి, రైతు సంక్షేమం మోదీ మొదటి నుంచి గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారు. పంచా యతీలకు, గ్రామ సభలకు ప్రాధాన్యం కల్పిస్తూ అంబేడ్కర్ జన్మదినం ఏప్రిల్ 14 నుంచి పంచాయతీరాజ్ దివస్ పేరుతో 24వ తేదీ వరకు గ్రామాలలో కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామ సభలలో ప్రధాని స్వయంగా పాల్గొని తన నిబద్ధతను చాటుకున్నారు. ఒక్కొక్క పంచాయతీకి రూ. 80 లక్షలు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి బాటలు వేశారు. మున్సిపాలిటీలకు కూడా నేరుగా నిధులు మంజూరు చేసి స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి వినూత్న చర్యలు చేపట్టారు. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని లాభసాటి వృత్తిగా మార్చాలన్న దృక్పథంతో మోదీ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. రైతులకు సేద్యం పట్ల అవగాహన కల్పించ డానికి సరైన సూచనలు, సలహాలు సమాచారం అందించడానికి కిసాన్ రేడియో, కిసాన్ చానల్‌ను ప్రారంభించారు. భూమికి సైతం పరీక్షలు నిర్వహించి కార్డులు ఇవ్వాలని తద్వారా ఏ పొలంలో ఏ పంట వేయాలి, ఏ ఎరువు వాడాలి అనే పూర్తి వివరాలతో రాబోయే 3 ఏళ్లలో 14 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులను వితరణ చేయాలని తలపెట్టారు. ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు వేపపూత యూరియాను తప్పనిసరి చేయడం, ఉపాధి హామీ పథకం (ఎమ్‌జి ఎన్ఆర్ఈజీఏ) క్రింద 5 లక్షల చెరువులు, కుంటలను నిర్మించడం రైతుకు ఎనలేని ప్రయోజనాలు చేకూర్చేవే. మహిళా సంక్షేమానికి చర్యలు మహిళలు ఆరాధనా శక్తిగానే కాదు ఆర్థికశక్తిగా కూడా ఎదగాలనేది మోదీ ప్రభుత్వ లక్ష్యం. ఆకాశంలో సగం, అవకాశాల్లో కూడా సగం ఉండాలని భావించి మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. గత రెండేళ్ల పాలనలో ముద్ర యోజనలో 79 శాతం రుణాలు మహిళలకే లభిం చాయి. బాలికల కోసం 2,61,400 పాఠశాలల్లో మరుగుదొడ్ల వసతి కల్పిం చారు. తద్వారా బాలికల హాజరు శాతం ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగింది. 44 లక్షల మంది గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చారు. పోలీస్ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు (ఇప్పటికే 8 రాష్ట్రాలు అంగీకరించాయి). పొగబారిన వంటింటి యాతనల నుంచి విముక్తం చేసి ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వంటింటిని కల్పించి పేద మహిళల ఆరోగ్యం కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపు మోదీ అధికారం చేపట్టిన తరువాత బ్రిక్స్ కూటమిలో భారత్ ప్రత్యేకతను సంతరించుకుంది. చైనాను మించిన వేగంతో ఆర్థికాభివృద్ధి చెందుతున్న దేశంగా ఖ్యాతి తెచ్చుకుంది. డాలరు పతనమై, ప్రపంచం తలకిందులైన కాలంలో కూడా భారత్ నిలదొక్కుకోగలిగింది. కార్మికుల ప్రయోజనాలే ప్రధానంగా ప్రభుత్వం పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయడం, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ సదుపాయం కల్పించడం ద్వారా అవకతవ కలకు చరమగీతం పాడింది. దాదాపు 1054 కాలం చెల్లిన చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. జన్‌ధన్‌యోజన, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథా రిటీ, గంగా ప్రక్షాళన, స్మార్ట్ సిటీలు, అసంఘటిత కార్మిక రంగానికి అటల్ పింఛను యోజన కూడా విశిష్టమైన సంక్షేమ పథకాలుగా పేర్గాంచాయి. బుల్లెట్ రైళ్ల యోచన కార్యరూపం దాలిస్తే భారత్‌కు కొత్త రూపు తథ్యం. విదేశాంగ విధానం మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని భారత ప్రజలతో పాటు, సార్క్ దేశాల ఉత్సవంగా నిర్వహించడం మంచి సంకేతాలను పంపింది. మాల్దీవులతో సహా సార్క్ దేశాలను ఆయన ఆ ఉత్సవానికి ఆహ్వానించారు. చివరి క్షణం దాకా ఉత్కంఠలో ఉంచినా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు. అయితే నాటి అటల్ బిహారీ వాజ్‌పేయి వలెనే పాకిస్థాన్‌తో సత్సంబంధాలకు మోదీ ఎంత యత్నించినా ఆ దేశం ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థల ప్రభావం నుంచి బయట పడలేకపోతోంది. చైనాతో సంబంధాలు యథావిధిగానే ఉన్నప్పటికీ, ఆ దేశం ప్రభావం శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల మీద తగ్గించడంలో భారత్ విజయం సాధించింది. అమెరికాతో భారత్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. భూటాన్, మాల్దీవులు, మైన్మార్, శ్రీలంకల సంబంధాలకు కాంగ్రెస్ హయాంలో జరిగిన చేటును సరిదిద్దే ప్రయత్నంలో మోదీ ఎంతో ముందుకు వెళ్లగలిగారు. బంగ్లా-భారత్ ల్యాండ్ బౌండరీ ఒప్పందం ఇందుకు నిదర్శనం. దీనితో బంగ్లాలో చైనా సాగిస్తున్న నౌకాశ్రయాల నిర్మాణాల జోరు తగ్గింది. యెమెన్ సంక్షోభ వేళ కేరళకు చెందిన వందలాది మంది నర్సులను సురక్షితంగా సొంత గడ్డకు చేర్చడంలో మోదీ, విదేశాంగ మంత్రి సుష్మ, మరో కేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన కృషి శ్లాఘనీయమైనది. వాజ్‌పేయి బాటలోనే పాక్‌తో సంబంధాలను మెరుగుపరచాలని మోదీ చేస్తున్న కృషి ఫలించాలని అందరూ ఆశిస్తున్నారు. సాగని కుట్రలు ముప్పయ్ సంవత్సరాల తరువాత భారతదేశంలో స్వతంత్రంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిదంటే, అది మోదీకి ఉన్న ప్రజాదరణతో సాధ్యమైంది. దీనిని అస్థిర పరచడానికి పాత శత్రువులే కొత్త వ్యూహాలతో ముందుకు వచ్చారు. అవినీతి జాడ లేని మోదీ ప్రభుత్వాన్ని చూస్తుంటే సహజంగానే కాంగ్రెస్‌కు గుబులు పట్టుకుంది. ఎన్ని చిక్కులు కల్పించాలని చూసినా అన్నిటిని అధిగమించడం చూస్తే వామపక్షవాదులకు కూడా కన్నెర్రగానే ఉంది. మోదీకి గానీ, కేంద్రానికి గానీ సంబంధం లేని వివాదాలను, అల్లర్లను అంటగట్టడానికి తమ వంతు విఫలయత్నం చేశారు. ఈ వివాదాలను ప్రజలు పట్టించుకోలేదు. కొన్ని అపజయాలు తప్పకపోయినా, ఈ రెండేళ్లలో ఆరు రాష్ట్రాలలో బీజేపీ కొత్తగా అధికారంలోకి రాగలిగింది. మోదీ ప్రాచుర్యానికీ, ప్రాభవానికీ ఇదే నిదర్శనం. డాక్టర్ కె. లక్ష్మణ్ వ్యాసకర్త బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొబైల్ : 9246537889 -
ప్రజారంజకంగా ఎన్డీయే రెండేళ్ల పాలన
♦ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ♦ మోదీ చేసిన అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో ప్రజారంజక, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో అమలయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సోమవారం పార్టీ నేతలు ఎన్.రామచందర్‌రావు, ప్రకాశ్‌రెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులతో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లవుతున్న సందర్భంగా ఈ నెల 26 నుంచి జూన్ 15 వరకు దేశవ్యాప్తంగా ‘అభివృద్ధి పథంలో భారత్’ అనే నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది కేంద్రమంత్రులు 7 బృందాలుగా ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తారని లక్ష్మణ్ వెల్లడించారు. పేద మహిళలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించడానికి ఉజ్వల పథకం కింద 1600 రూపాయల సబ్సిడీతో దేశవ్యాప్తంగా 5కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు లక్ష్మణ్ చెప్పారు. -
నీడలా వెంటాడుతాం..
కరువు సహాయక చర్యల్లో టీఆర్ఎస్ సర్కారు మీనమేషాలు ఓట్లు, సీట్లు, నోట్లు తప్ప ప్రజలగోడు పట్టదా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కరువు జిల్లాగా ప్రకటించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా ముకరంపుర : ‘టీఆర్ఎస్ సర్కారు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ఓట్లు, సీట్లు, నోట్ల రాజకీయాలే తప్ప ప్రజాసంక్షేమా న్ని పట్టడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తున్నా.. సహాయక చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. కరువుపై చర్చిస్తే పరువుపోతుందని భావిస్తున్న రాష్ట్ర సర్కారుపై తిరుగుబాటుకు ఈ ధర్నా కనువిప్పు కావాలి. కరువుపీడిత ప్రాంతాలకు న్యాయం జరిగే వరకూ... ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకూ ప్రభుత్వాన్ని నీడలా వెంటాడుతూనే ఉంటాం.. రాజీలేని పోరాటం చేస్తూనే ఉంటాం..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హెచ్చరించారు. జిల్లాను కరువుప్రాంతంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువుతో చేతివృత్తులు, పేద, బడుగుబలహీనవర్గాల ప్రజలు 40 లక్షల మంది ఇప్పటికే పల్లెలను వదిలి వలసబాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ఎద్దేవా చేశారు. అనేక వాగ్దానాలతో అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్.. హామీలన్నింటినీ నీటిమూటలు చేసిందన్నారు. ఉద్యమానికి ఊపిరిలూదిన శ్రీకాంతాచారి నుం చి ఆదిరెడ్డి వరకు ఆత్మబలిదానాలనూ ప్రభుత్వం విస్మరించిందన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీతోపాటు కేజీటూపీజీ ఉచిత విద్యను అమలు చేస్తామన్న సీఎం ఆ ఊసే మరిచారన్నా రు. రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయనకున్న వారి ఆశలకు భంగపాటే ఎదురవుతోందన్నారు. రెండేళ్ల పాలనలో ఆ పార్టీ బలోపేతం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కరువుపై దృష్టి మళ్లించేందుకే.. కరువుపై చర్చలేకుండా.. ప్రజల దృష్టిని మరల్చడానికే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ఎత్తుకున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా కనీసం తాగునీరు కూడా అందించలేకపోవడం కేసీఆర్ పాలనకు అద్దంపడుతోందన్నారు. రెండేళ్లలో టీఆర్ఎస్ సర్కారు లక్షల కోట్ల అప్పు చేయడం తప్ప సాధించిందే మీ లేదన్నారు. తుదిదశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ దోపిడీ చేసేందు కు కొత్తగా ప్రాజెక్టుల రీడైజైన్లు అంటూ ముందుకుపోవడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలకు అందించిన సహాయంపై శ్వేత ప త్రం విడుదల చేయాలన్నారు. కరువు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు, వాణి జ్య పంటలకు రూ.20 వేల పరిహారమందిస్తూ పన్నులు, ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారింగా నిర్వహించకపోతే పలెపల్లెనా జాతీయ జెండాలు ఎగిరే సి ఘనంగా నిర్వహిస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో రాష్ట్ర కార్యదర్శులు చింత సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, కాశిపేట లింగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాాలు పద్మజారెడ్డి, నాయకులు బల్మూరి వనిత, ఆకుల విజయ, జిల్లా కార్యదర్శులు కన్నం అంజయ్య, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, ఆది శ్రీనివాస్, నారాయణరావు, ఆది కేశవరావు, కోమల ఆంజనేయులు, జగన్మోహన్రావు, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, హన్మంత్‌గౌడ్, లింగంపల్లి శంకర్ తదితరులున్నారు. లక్ష్మణ్‌కు ఘనంగా స్వాగతం బీజేపీ రాష్ట్ర సారథిగా జిల్లాకు తొలిసారిగా వచ్చిన లక్ష్మణ్‌కు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారుు. ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్, రామగుండం బీజేపీ నాయకుడు కౌశిక్ హరి ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వేదికపైకి బండి సంజయ్‌ను ఆహ్వానించగానే కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు. కౌశిక్ హరి లక్ష్మణ్‌కు కండువా కప్పారు. బైక్‌ర్యాలీలో బాస సత్యనారాయణ, బేతి మహేందర్‌రెడ్డి, కౌశిక్‌హరి, గడ్డం నాగరాజు, కోమల మహేశ్, లక్ష్మణ్, లక్ష్మినర్సయ్య ఉన్నారు. వేదికపై బీజేపీ సాంస్కృతిక విభాగం కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
ప్లీనరీపై ఉన్న శ్రద్ధ కరువుపై చూపరా? : కె.లక్ష్మణ్
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో కరువు విలయతాండ వం చేస్తుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో సీఎం, జిల్లా స్థాయిలో మంత్రులు కరువుపై సమీక్షలు నిర్వహించకపోవడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ మీద, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో సీఎం కేసీఆర్ చూపుతున్న శ్రద్ధను కరువుపై కూడా చూపాలన్నారు. నెలాఖరులోగా కరువుపై సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోకపోతే వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, ప్రదీప్ కుమార్, లాయక్ అలీతో కలసి బుధవారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు కరువు పరిస్థితిపై వినతి పత్రం అందజేశారు. తమ పార్టీ తరఫున 10 బృందాలు జిల్లాల్లో పర్యటించి కరువు పరిస్థితులపై అధ్యయనం చేశాయని, ఆ వివరాలను సీఎస్ రాజీవ్ శర్మకు అందజేశామని తెలిపారు. కరువుపై చర్చించడానికి గత మూడు వారాలుగా సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదన్నారు.