మూడేళ్ల వైఫల్యాలను ప్రచారం చేయాలి: లక్ష్మణ్‌ | K. Laxman commented on trs three years rule | Sakshi
Sakshi News home page

మూడేళ్ల వైఫల్యాలను ప్రచారం చేయాలి: లక్ష్మణ్‌

Published Sun, May 28 2017 1:47 AM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM

మూడేళ్ల వైఫల్యాలను ప్రచారం చేయాలి: లక్ష్మణ్‌ - Sakshi

మూడేళ్ల వైఫల్యాలను ప్రచారం చేయాలి: లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాల నను గురించి ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ కార్యవిస్తారక్‌ యోజనలో భాగంగా శనివారం పార్టీ జోనల్, జిల్లా ఇన్‌చార్జీల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృ హల్లో ఉన్నారన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారంలో పార్టీ ముందుండాలన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల ప్రారంభించి న 15రోజుల విస్తార్‌ యోజన కార్యక్రమం.. రాష్ట్రంలో ‘పల్లెపల్లెకు బీజేపీ– ఇంటింటికి మోదీ’నినాదంతో ఈ నెల 29 నుంచి జూన్‌ 12 వరకు సాగనుందన్నారు. దీనిని పూర్తిగా విజయవంతం చేసి ప్రజలకు పార్టీని చేరువ చేయాలన్నారు. దీనిలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వ విజయాలపై ఒక కరపత్రం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మరో కరపత్రం, పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జీవితచరిత్రపై ఇంకొక కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేస్తారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీనాయకులు పేరాల శేఖర్‌రావు, నాగం జనార్దనరెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement