'గుర్రం ముందుకు... బండి వెనక్కు చందం'
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆరు నెలల పాలనంతా వాయిదాలమయం అని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటాలు, మాటలకే పరిమితమైందని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ప్రారంభించలేదన్నారు. గుర్రం ముందుకు... బండి వెనక్కు చందంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి జీవితచరిత్రలను పాఠ్యాంశాలుగా చేర్చాలని డిమాండ్ చేశారు.