
బీజేపీ సారధి మనోడే..
రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఎంపికపై మిత్రుల హర్షం
ఘట్‌కేసర్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన నాయకుడే ఎంపికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కే.లక్ష్మణ్‌ను ఎంపిక చేస్తున్నట్టు ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఆయనది స్వస్థలం ఘట్‌కేసర్. ఇంతకు ముందు వరకు ఉన్న జి.కిషన్‌రెడ్డిది జిల్లాలోని కందుకూరు మండలం తిమ్మాయిపల్లి. ఎమ్మెల్యే కే.లక్ష్మణ్ ఆ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. మొదటిసారి ఎన్నికైనప్పుడు ఆ పార్టీ డిప్యూటీ ప్లోర్‌లీడర్‌గా పనిచేశారు. ఘట్‌కేసర్‌లోనే ప్రాథమిక విద్య ప్రారంభించారు. తర్వాత ఆయన కుటుం బం నగరానికి వెళ్లింది.
నగరంలోని సెయింట్ ప్యాన్సిస్ స్కూల్‌లో హైస్కూల్ విద్య, టాగూర్స్‌హోమ్ జూనియర్ కళాశాల, న్యూ సైన్స్ కళాశాలలో చదివారు. పీజీ, పీహెచ్‌డీ ఓయూలో పూర్తి చేశారు. పార్టీ ప్రారంభం నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. తల్లిదండ్రులు కోవ రాములు, మంగమ్మకు ఉన్న నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లలో లక్ష్మణ్ రెండో కుమారుడు.
లక్ష్మణ్ సోదరుడు దయానంద్ ఘట్‌కేసర్ ఉపసర్పంచ్‌గా పనిచేశారు. అప్పుడప్పుడు స్థాని కంగా ఉన్న ఇంటికి వచ్చి తన మిత్రులను కలుసుకుంటుంటారు. ఘట్‌కేసర్‌కు చెందిన కే.లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంపై ఆ పార్టీనాయకులు కాలేరు రామోజీ, గుండ్లబాల్‌రాజు, లక్ష్మారెడ్డి, పలువురు మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.