టీఆర్‌ఎస్‌ సభలో ప్రగతి ప్రస్తావనే లేదు | bjp k. laxman comments on TRS GOVT | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ సభలో ప్రగతి ప్రస్తావనే లేదు

Published Sat, Apr 29 2017 2:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

టీఆర్‌ఎస్‌ సభలో ప్రగతి ప్రస్తావనే లేదు - Sakshi

టీఆర్‌ఎస్‌ సభలో ప్రగతి ప్రస్తావనే లేదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రగతి నివే దిక బహిరంగ సభలో ప్రగతి ప్రస్తావన లేద ని, నివేదన అంతకం టే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  కె.లక్ష్మణ్‌ విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ఓయూ, విద్యార్థుల త్యా గాల గురించి శతాబ్ది ఉత్సవాల్లో, వరంగల్‌ సభలో ప్రస్తావన లేకపోవడాన్ని బట్టి టీఆర్‌ఎస్‌ పతనానికి నాంది కాబోతుంద న్నారు.

 శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వరంగల్‌లో సభ నిర్వహించారన్నారు. ప్రభుత్వం అధి కార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా, సభ చాలా పేలవంగా జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి టీఆర్‌స్‌ పార్టీయేనన్నారు. బీజేపీలో షరతులు లేని చేరికలుంటాయని, టికెట్లు, సీట్ల హామీ లిచ్చి పార్టీలో చేర్చుకునేది ఉండదని లక్ష్మణ్‌ ఒక ప్రశ్నకు బదులిచ్చారు. బీజేపీకి బాహుబలులను తలదన్నే మోదీ బ్రహ్మా స్త్రం ఉందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement