
బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీలో ఇమడలేక పోతున్నాను. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా’నని కరీంనగర్ నేత, బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ అన్నారు. తన అనుచరులతో కలిసి ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌తో ఆయన భేటీ అయ్యారు. పార్టీని వీడొద్దని, భవిష్యత్తులో బాగా చూసుకుంటామని ఆయనను లక్ష్మణ్ బుజ్జగించారు. అధ్యక్షుడి మాటలతో సంతృప్తి చెందని సంజయ్.. ‘బీజేపీకి గుడ్ బై’ అంటూ తన అనుచరులతో కలిసి కరీంనగర్ వెళ్లిపోయారు.
అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లా బీజేపీ రాజకీయాలు తనను తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అక్కడి పరిస్థితుల గురించి చెప్పుకుందామని కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి వస్తే ఇక్కడ మాకు అవమానం జరిగింది. పార్టీ కోసం ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాను. జైలు కూడా వెళ్లాను. అయినా నాకు పార్టీలో న్యాయం జరగలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. హిందూ ధర్మం కోసం పనిచేస్తాన’ని సంజయ్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment