‘అంబేద్కర్ కూడా వ‍్యతిరేకించారు’
మతపరమైన రిజర్వేషన్లపై ఈ నెల 24న బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చేపట్టే చలో అసెంబ్లీ ముట్టడి పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఏనాడో చెప్పారని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను మర్చిపోయి కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.