‘డబుల్‌’ ఇళ్లలో 3 శాతం దివ్యాంగులకు ఇవ్వాలి | k. laxman asks double bed rooms for handy caped people three percent | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ ఇళ్లలో 3 శాతం దివ్యాంగులకు ఇవ్వాలి

Published Sun, Dec 11 2016 3:46 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

‘డబుల్‌’ ఇళ్లలో 3 శాతం దివ్యాంగులకు ఇవ్వాలి - Sakshi

‘డబుల్‌’ ఇళ్లలో 3 శాతం దివ్యాంగులకు ఇవ్వాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌: జనా భా నిష్పత్తి ప్రకారం దివ్యాంగులకు మూడు శాతం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటుకు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ కోసం అసెంబ్లీలో డిమాండ్‌ చేస్తామన్నారు. మోదీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చిందని.. రాష్ట్రం లోనూ వారికి అండగా ఉంటామన్నారు. శనివారం పార్టీ దివ్యాంగుల సెల్‌ కన్వీనర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది విజువల్లీ విజ బిలిటీస్‌ మెంబర్‌ సీహెచ్‌ శ్రీశైలం అధ్యక్షత న జరిగిన దివ్యాంగుల వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 40 లక్షల మంది దివ్యాంగులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో దివ్యాంగులకు చేతికర్రలు, వీల్‌చైర్లు పంపిణీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement