సంప్రదాయం కాదు | k.laxman fired on trs government on tjac rally permit | Sakshi
Sakshi News home page

సంప్రదాయం కాదు

Published Wed, Feb 22 2017 2:41 AM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM

సంప్రదాయం కాదు - Sakshi

సంప్రదాయం కాదు

టీజేఏసీ ర్యాలీకి అనుమతి నిరాకరణపై కె.లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌: టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి పోలీసులు అనుమతి వ్వకపోవడం మంచి సంప్రదాయం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏ అంశంపైనైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందన్నారు. ఇటువంటి నిరసనల్లో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉన్నప్పుడు నియంత్రణ అనేది సమస్యకు పరిష్కారం కాదని మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమప్పుడు కూడా జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టిన సందర్భంగా కూడా ఇబ్బందులు వచ్చాయని, అయితే శాంతియుతమైన పద్ధతుల్లోనే అవి జరిగాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగ యువత ఆవేదన, అసంతృప్తిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement