Unemployees rally
-
నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు
విజయనగరం మున్సిపాలిటీ : ఎన్నికలకు ముం దు మాయమాటలు చెప్పి నిరుద్యోగ యువత ఓట్ల దక్కించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వారి ఆశలపై నీళ్లు చల్లారని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తన నివాసం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఇంటికొక ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రెండు వేలు ఇస్తామని, ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి న తరువాత వారి జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరకొర నిధులతో నిరుద్యోగ యువతకు వెయ్యి రూపాయలు భృతి అంటూ ప్రకటనలు చేయడం కంటితుడుపు చర్యగా అభివర్ణించారు. వయో పరిమి తిని 35 ఏళ్లకు పరిమితం చేయడం ద్వారా చాలా మంది నిరుద్యోగ యువతను అనర్హులుగా చేస్తున్నారన్నారు. పచ్చ చొక్కా నాయకులకే ఆ భృతిని పరిమితం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పటం ఖాయమన్నారు. 11న నిరుద్యోగుల యువ గర్జన నిరుద్యోగులకు, యువతకు ముఖ్యమంత్రి చం ద్రబాబు చేసిన మోసానికి నిరసనగా ఈ నెల 11న శనివారం పట్టణంలో యువగర్జన పేరిట నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటిం చారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కోట నుంచి ప్రారంభమయ్యే యువగర్జన ర్యాలీకి పెద్ద ఎత్తున నిరుద్యోగులు యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా యువ జన విభాగం అధ్యక్షుడు సం ఘం రెడ్డి బంగారునాయుడు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జి.వి.రంగారావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఎంఎల్ఎన్.రాజు, జిల్లా యువజన విభా గం ప్రధాన కార్యదర్శి బోడేసింగి ఈశ్వరరావు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు చాణక్య, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి పొట్నూరు కేశవ్, కరకవలస అనిల్, పట్టణ విద్యార్థి విభాగ అధ్యక్షుడు నెలపర్తి రాజకుమార్‌లతో పాటు యువజన విద్యార్థి విభాగం నాయకులు తాడ్డి సురేష్, అవాల కుమార్, చిన్ని, రవితేజ, సప్పా ప్రసాద్,వైగేర్ ప్రసాద్, తరుణ్,తెడ్ల ప్రసాద్ , బూడి అప్పలరాజు, బాలు,రజనీ, శెట్టి సుధాకర్, రమేష్, దివాకర్, సురేష్,, గుప్త, కృష్ణ పాల్గొన్నారు. -
కోదండరామ్ విడుదల, ఇంటికి తరలింపు
-
కోదండరామ్ విడుదల, ఇంటికి తరలింపు
నిరుద్యోగుల నిరసన ర్యాలీ నేపథ్యంలో అరెస్టు చేసిన తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు విడుదల చేశారు. కామాటిపురా పోలీసు స్టేషన్లో ఉన్న ఆయనను రాత్రి 7 గంటల సమయంలో విడుదల చేసి, తార్నాక ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటికి తరలించారు. ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అందుకు నోటిఫికేషన్లను విడుదల చేయాలన్న డిమాండుతో నిరుద్యోగుల నిరసన ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించాలని కోదండరామ్ నేతృత్వంలోని జేఏసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే నగరంలో నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించగా.. కోర్టు సైతం నాగోల్ ప్రాంతంలోని మెట్రో గ్రౌండులో నిర్వహించుకోవాలని తెలిపింది. అయితే.. అక్కడ ఏర్పాట్లు కష్టమని, తాము ఎలాగోలా ర్యాలీ నిర్వహిస్తామని కోదండరామ్ తెలిపారు. దాంతో ఆయనను బుధవారం తెల్లవారుజామునే 3 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసి, కామాటిపుర పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రి 7 గంటల సమయం దాటిన తర్వాత ఆయనను విడుదల చేసి, అక్కడి నుంచి ఇంటికి తరలించారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే అవకాశం తమకు ఇవ్వలేదని ఈ సందర్భంగా కోదండరామ్ అన్నారు. నిరుద్యోగుల ర్యాలీ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన ఇంటి మీద పడి పోలీసులు తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేశారిన మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యల పరిష్యారం కోసం తమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపటి(గురువారం) విద్యా సంస్థల బంద్‌కు తమ మద్దతు ఉంటుందని కోదండరామ్ తెలిపారు. గురువారం ఉదయం తన నివాసంలో టీజేఏసీ భేటీ ఉంటుందని, అనంతరం భవిష్యాత్ కార్యాచరణ పై చర్చిస్తామని అన్నారు. -
‘కేసీఆర్ తన సొంత సొమ్ముతో మొక్కులు చెల్లించాలి’
సూర్యాపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తిరుమల వెంకన్నకు తన మొక్కులు చెల్లించుకోవడానికి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజల సొమ్ముతో కాకుండా.. సొంత సొమ్ముతో ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ ర్యాలీలో పాల్గొనకుండా జేఏసీ చైర్మన్ కోదండరాం అరెస్టు చేయడాన్ని ఖండించారు. అరెస్టు చేసిన ఉద్యమకారుల్ని వెంటనే విడుదల చేయాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. అనుమతివ్వకున్నా నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించి తీరుతామని టీజేఏసీ ప్రకటించడంతో.. ఉద్యమానికి సారధ్యం వహిస్తోన్న జేఏసీ చైర్మన్ కోదండరాంను బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
సంప్రదాయం కాదు
టీజేఏసీ ర్యాలీకి అనుమతి నిరాకరణపై కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి పోలీసులు అనుమతి వ్వకపోవడం మంచి సంప్రదాయం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏ అంశంపైనైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందన్నారు. ఇటువంటి నిరసనల్లో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉన్నప్పుడు నియంత్రణ అనేది సమస్యకు పరిష్కారం కాదని మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమప్పుడు కూడా జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టిన సందర్భంగా కూడా ఇబ్బందులు వచ్చాయని, అయితే శాంతియుతమైన పద్ధతుల్లోనే అవి జరిగాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగ యువత ఆవేదన, అసంతృప్తిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
రాజధాని దిగ్బంధం!
⇒ టీజేఏసీ ర్యాలీని అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు ⇒ అడుగడుగునా బలగాల మోహరింపు ⇒ రంగంలోకి 12 వేల మందికిపైగా సిబ్బంది ⇒ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్కు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి.. ⇒ ఉస్మానియా ప్రాంతం అష్టదిగ్బంధం సాక్షి, హైదరాబాద్: పోలీసులు అనుమతివ్వకున్నా బుధవారం నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించి తీరుతామని టీజేఏసీ ప్రకటించడంతో.. వాటిని ఎలాగైనా అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు, అదనపు బలగాల ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరాన్ని దాదాపు అష్ట దిగ్భంధనం చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే 12 వేలకు పైగా సిబ్బందిని మోహరించనున్నారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టిన అధికారులు ఆ ప్రాంతాల్లోనే 3 వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు. సికింద్రాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్క్ ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో నిషేధాజ్ఞలు జేఏసీ పిలుపు నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ నగరంలో ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. నగరవ్యాప్తంగా నిఘా, పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కీలక ప్రాంతాల్లో ఉన్న ఎత్తయిన భవనాలపై బైనాక్యులర్లతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. వారు గుంపులుగా జన సంచారాన్ని, ర్యాలీలను గమనించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. ఇక మూడు కమిషనరేట్లలో పోలీసు సిబ్బందికి ‘స్టాండ్ టు’ప్రకటించి అందరూ కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అశ్వక దళాలు, టియర్ గ్యాస్ స్క్వాడ్స్, వాటర్ క్యానన్స్, వజ్ర వాహనాలను అందుబాటులో ఉంచారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెంట్రల్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ర్యాలీ, సభల్లో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వచ్చే వారిని అడ్డుకోవడానికి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దాదాపు 350 వరకు చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. కమాండ్–కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. నగరవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా రోడ్లపై కదలికల్ని ఎప్పటికప్పుడు గుర్తించే ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు అరెస్టులు షురూ! టీజేఏసీ ర్యాలీ, సభలను అడ్డుకోవడంలో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల అధికారులు ముందçస్తు అరెస్టులు కూడా ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, పికెట్ల వద్ద సోదాలు, తనిఖీలు నిర్వహించి.. మంగళవారం రాత్రి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మందిని ప్రశ్నించి.. తిప్పి పంపుతున్నారు. ఏడో నంబర్ జాతీయ రహదారి, శామీర్‌పేట, రాజీవ్ రహదారిలతో పాటు ఘట్కేసర్–వరంగల్, ఎల్బీనగర్–విజయవాడ, కూకట్పల్లి–ముంబైæ, శంషాబాద్–బెంగళూర్, సాగర్, శ్రీశైలం రహదారులపై పికెటింగ్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ర్యాలీలో పాల్గొంటే క్రిమినల్ కేసులు: డీసీపీ జోయల్ టీజేఏసీ తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభలకు అనుమతి లేదని... హైదరాబాద్‌లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున ర్యాలీ, సభలకు ప్రయత్నించినా, వాటిలో పాల్గొన్నా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ డి.జోయల్ డేవిస్ హెచ్చరించారు. ర్యాలీలు, సభల్లో పాల్గొనడానికి ఎవరూ రావద్దని స్పష్టం చేశారు. విద్యార్థులతో పాటు వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న వారు సైతం ర్యాలీ, సభలకు దూరంగా ఉండాలని సూచించారు. నిషేధాజ్ఞలు అతిక్రమిస్తే కేసులతో వారి భవిష్యత్తు నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది సెంట్రల్ జోన్లో దాదాపు వెయ్యి కార్యక్రమాలకు అనుమతిచ్చామని, అంతకంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తుల్ని తిరస్కరించామని... అంతేగాని జేఏసీపై వివక్ష చూపుతున్నారనడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఆ మార్గంలో ప్రయాణించొద్దు: ట్రాఫిక్ చీఫ్ అనుమతి లేనప్పటికీ కూడా టీజేఏసీ బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించవచ్చని ట్రాఫిక్ చీఫ్ జితేందర్ అభిప్రాయపడ్డారు. ఆ ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే ఆస్కారముందని పేర్కొన్నారు. అందువల్ల ఆ మార్గాల్లో వెళ్లకుండా ప్రత్యామ్నాయాలు దారులు ఎంచుకోవాలని వాహనదారులకు సూచించారు. ముఖ్యమైన పనులపై వెళ్లేవారు ముందే బయలుదేరడం మంచిదని పేర్కొన్నారు. అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోంది: చాడ సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీని భగ్నం చేసేం దుకు అన్ని జిల్లాల్లో విద్యార్థులు, యువత, రాజకీయపార్టీల నాయకులను అరెస్ట్ చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఖండించారు. ప్రభుత్వ తీరు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని ఒక ప్రకటనలో మండిపడ్డారు. జేఏసీ ర్యాలీపై టీఆర్ఎస్ ఆత్మవంచన: మల్లు రవి సాక్షి, హైదరాబాద్: జేఏసీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి అనుమతినివ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మవంచన చేసుకుంటోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. వేలాది ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా చెబుతున్న ప్రభుత్వ వాదనలో నిజముంటే లక్షలాది నిరుద్యోగులు ఎందుకు ఆగ్రహావేశాల్లో ఉన్నారని ప్రశ్నించారు. జేఏసీ నిరసన ర్యాలీకి ఆమ్ ఆద్మీ మద్దతు సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ బుధవారం తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కైనా స్పందించి ర్యాలీకి అనుమతితో పాటు ఖాళీగా ఉన్న 1.07 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆప్ కార్యదర్శి సిల్వేరు శ్రీశైలం మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.