‘కేసీఆర్‌ తన సొంత సొమ్ముతో మొక్కులు చెల్లించాలి’ | cpm leader comment on cm kcr | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ తన సొంత సొమ్ముతో మొక్కులు చెల్లించాలి’

Published Wed, Feb 22 2017 4:33 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

‘కేసీఆర్‌ తన సొంత సొమ్ముతో మొక్కులు చెల్లించాలి’ - Sakshi

‘కేసీఆర్‌ తన సొంత సొమ్ముతో మొక్కులు చెల్లించాలి’

సూర్యాపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తిరుమల వెంకన్నకు తన మొక్కులు చెల్లించుకోవడానికి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజల సొమ్ముతో కాకుండా.. సొంత సొమ్ముతో ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ ర్యాలీలో పాల్గొనకుండా జేఏసీ చైర్మన్‌ కోదండరాం అరెస్టు చేయడాన్ని ఖండించారు. అరెస్టు చేసిన ఉద్యమకారుల్ని వెంటనే విడుదల చేయాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

అనుమతివ్వకున్నా నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించి తీరుతామని టీజేఏసీ ప్రకటించడంతో.. ఉద్యమానికి సారధ్యం వహిస్తోన్న జేఏసీ చైర్మన్‌ కోదండరాంను బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement