
కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ఈ నెల 29న తెలంగాణ జన సమితి పార్టీ(టీజేఎస్) ఆవిర్భావ సభను నిర్వహించి తీరుతామని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సభ నిర్వహించాలన్న ప్రతీసారి ఆటంకాలు స్పష్టిస్టున్నారని మండిపడ్డారు. మిగతావారికి అనుమతులు ఇస్తారు..మాకెందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామన్నవారు తమకెందుకు భయపడుతున్నారని అడిగారు. టీఆర్‌ఎస్ నేతల గుండెల్లో ఎక్కడో భయముందని కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన తెలిపారు.
సరూర్ నగర్ స్టేడియంలో 29న టీజేఎస్ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నగరం నడిబొడ్డున సభలు జరిపితే, అక్కడికి వచ్చే వాహనాల పొగ వల్ల కాలుష్యం పెరుగుతుందని, పైగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని.. అందుకే అనుమతివ్వడం లేదని పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment