అరెస్టు టీజేఏసీ కార్యాలయంలో చైర్మన్ కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని కోర్టుల ప్రమేయం లేకుండా అరెస్టు చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసే వారిపైనా చర్యలు తీసుకోబోతున్నారని, ‘పరుష పదజాలం’ అంటే కొలమానమేంటని ప్రశ్నించారు. రాజకీయ కక్షతో తీసుకునే నిర్ణయాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. శుక్రవారం టీజేఏసీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలు మారకుండా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేవని, ఫిబ్రవరిలో పార్టీపై ప్రకటన చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment