permit
-
సోలార్‌ప్యానెల్స్ పెట్టుకుంటేనే...గ్రేటర్లో ఇళ్లకు అనుమతి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్లపై సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రతీ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలనే కచ్చితమైన నిబంధన తీసుకురావాలనుకుంటోంది. తద్వారా నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్ అవసరాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకొని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. గ్రామాలను కూడా సోలార్ ఎనర్జీ హబ్‌లుగా మార్చాలని భావిస్తోంది. ప్రతీ గ్రామంలోనూ నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే సబ్స్టేషన్లకు వీటిని అనుసంధానిస్తారు. తద్వారా ఆ గ్రామాలకు విద్యుత్ సమస్య ఎదురుకాకుండా చూడాలన్న అభిప్రాయానికి వచ్చారు. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రోడ్‌మ్యాప్ రూపొందించారు. ఎన్నికల తర్వాత ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనూ పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం మంత్రివర్గంలో ఈ కీలక నిర్ణయం తీసుకొని అమలు చేయాలని భావిస్తున్నారు. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే.. సోలార్ ఎనర్జీనే ప్రధానం అన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం థర్మల్, హైడల్ జనరేషన్తోపాటు సౌర, పవనవిద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. హైడల్ పవర్ అందుబాటులో లేని సమయంలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు బయట నుంచి ఎక్కువ మొత్తానికి విద్యుత్ కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్లలోనూ..: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోనూ ఫ్లోటింగ్ సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితోపాటు చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పాదనతోపాటు, నీరు ఆవిరవ డాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమైతే రిజర్వాయర్ల నుంచి నీరు వెళ్లే కాలువ గట్లపై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వల్ల వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో ఇప్పటికే సింగరేణి సంస్థ ఫ్లోటింగ్ సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో బొగ్గు తవ్విన తర్వాత ఆ ప్రాంతాలనూ ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రీనర్ ఎనర్జీకి స్కాండినేవియన్ దేశాలు అధిక ప్రా ధాన్యం ఇస్తున్న మాదిరిగానే తెలంగాణలోనూ ఆ మోడల్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతోపాటు వాటి నిర్వహణ, బొగ్గు ధరలు ఏటేటా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ ధర పెరుగుతూ వస్తోంది. ఇది ప్రభుత్వంపైనే కాకుండా వినియోగదారులకు మోయలేని భారంగా మారుతున్న తరుణంలో సోలార్ పవర్‌ను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చింది. థర్మల్ కేంద్రాలతో భారీగా వెలువడే కాలుష్యాన్ని కూడా అరికట్టడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. -
సబ్సిడీ ఇచ్చాకే ‘జీరో బిల్లు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే విద్యుత్ సబ్సిడీ నిధులను విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విడుదల చేయాలని.. అలా చేస్తేనే వినియోగదారులకు ‘జీరో’ బిల్లులు జారీ చేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం–2003లోని నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ అందించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ‘గృహజ్యోతి’ పథకానికి షరతులతో ఆమోదం తెలిపింది. ముందుగా ఇవ్వాలి.. లేదా రిఫండ్ చేయాలి.. అర్హులైన పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసే ‘గృహజ్యోతి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. లబ్ధిదారులకు జీరో బిల్లుల జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీ అనుమతి కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఈఆర్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చట్టం ప్రకారం.. ఫ్రంట్ లోడెడ్ లేదా బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులకు సబ్సిడీ చెల్లింపు జరగాలని తెలిపింది. ఫ్రంట్ లోడెడ్ విధానంలో.. డిస్కంలు బిల్లింగ్ చేపట్టడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదే బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లిస్తే.. తర్వాత వారికి రాష్ట్ర ప్రభుత్వం రిఫండ్ చేస్తుందని వివరించింది. సకాలంలో రాబట్టుకోవాలి.. గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇంధన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఈఆర్సీ ఆమోదించింది. ఒక నెలకు సంబంధించి అందాల్సిన సబ్సిడీ వివరాలను తదుపరి నెల 20వ తేదీలోగా డిస్కంలు అందజేస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని మార్గదర్శకాల్లో ఇంధన శాఖ పేర్కొన్నట్టు తెలిపింది. అయితే సకాలంలో సబ్సిడీ రాబట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. 2024–25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక టారిఫ్ సవరణ ప్రతిపాదనలను కూడా సత్వరమే సమర్పించాలని కోరింది. -
బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు
రాంచీ: జార్ఖండ్‌లో కొత్తగా ఏర్పాటైన చంపయ్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైన వేళ ప్రభుత్వ సానుకూల ఉత్తర్వును రాంచీ కోర్టు వెలువరిచింది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీలో చంపయ్ సర్కార్ చేపట్టే బలపరీక్షలో పాల్గొనేందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌కు అనుమతినిస్తూ రాంచీలోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. జార్ఖండ్ భూకుంభకోణం ఉదంతంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ హేమంత్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. -
అటవీశాఖ క్లియరెన్స్ ఇస్తేనే ఆంక్షల సడలింపు
తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే మార్గంలో వన్య మృగాల నుంచి ఎలాంటి ముప్పు లేదని అటవీశాఖ అధికారులు ధ్రువీకరిస్తేనే 12 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టంచేశారు. అప్పటి వరకు చిన్నారులపై ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల వరకే నడకదారుల్లో చిన్నారులకు అనుమతి ఉంటుందని, భక్తుల భద్రతే తమకు ముఖ్యమని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో సోమవారం చైర్మన్ క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు ఆహారం, తాగునీరు, కాఫీ, టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గోగర్భం సర్కిల్ నుంచి కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూలను తనిఖీ చేశారు. అనంతరం చైర్మన్ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెరటాశి మాసం, సెలవుల కారణంగా నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. క్యూలు నాలుగు నుంచి ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లాయని, ఇలాంటి భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పంతో వీఐపీ బ్రేక్, సుపథం, స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు చెప్పారు. క్యూల్లో ఉండే భక్తులు ఎక్కడా అసహనానికి లోను కాకుండా అవసరమైన తగిన వసతులు కల్పించామని తెలిపారు. ఈ నెల 15 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అధికారుల పనితీరు బ్రహ్మాండం తిరుమలకు భక్తులు పోటెత్తడంతో ఈవో, జేఈవో, సీవీఎస్వో ఇతర అధికారులందరూ ప్రత్యక్షంగా ఏర్పాట్లు పరిశీలిస్తూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని చైర్మన్ అభినందించారు. భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూస్తున్నారని వివరించారు. కాగా, ఆదివారం అర్ధరాత్రి వరకు తిరుమల శ్రీవారిని 88,623 మంది దర్శించుకున్నారు. హుండీలో రూ. 4.67 కోట్లు వేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది. జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీదేవి, డీఎఫ్‌వో శ్రీనివాసులు పాల్గొన్నారు. -
స్క్రాప్‌గా మార్చి.. కొత్త ఆటోలు తెచ్చి..!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో కాలంచెల్లిన ఆటోరిక్షాలను స్క్రాప్‌గా మార్చి ఆ పర్మిట్లపై కొత్త ఆటోలను తీసుకొనే విధానంపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తేసేందుకు రవాణాశాఖ సిద్ధమైంది. పాత పర్మిట్లపై కొత్త ఆటోలు పొందే విషయంలో భారీ అక్రమాలు జరిగాయంటూ గతంలో ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ విధానం అమలును నిలిపివేస్తూ గతేడాది డిసెంబర్లో రవాణాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. కానీ ఇప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో మళ్లీ పాత పద్ధతిని అమల్లోకి తెస్తున్నట్లు మరో ఆదేశాన్ని జారీచేసి దాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. వేలల్లో అక్రమాలు... కాలంచెల్లిన ఆటో రిక్షాలను తుక్కుగా మార్చి ఆ పర్మిట్ల ఆధారంగా కొత్త ఆటోలు తీసుకొనే పద్ధతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాన్ని తీసుకోకపోవడాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు బ్రోకర్లు, రవాణా శాఖ అధికారుల అండదండలతో భారీ అక్రమాలకు తెరలేపారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిజానికి తుక్కుగా మార్చిన ఆటోరిక్షా ఛాసిస్‌ను మూడు ముక్కలు చేయాల్సి ఉంటుంది. కానీ దాన్ని తుక్కుగా మార్చినట్లు రికార్డుల్లో చూపుతూ తక్కువ ధరలకు ఆ ఆటోను మరొకరికి విక్రయించే వారన్నది ఆరోపణ. అటు పాత ఆటో పర్మిట్ లేకుండా తిరుగుతుండగా దాని పర్మిట్‌తో మరో కొత్త ఆటో రోడ్డెక్కేదని ఫిర్యాదుల సారాంశం. అలా దాదాపు 8 వేల వరకు ఆటోలు అక్రమంగా తిరుగుతున్నాయంటూ కొన్ని ఆటో సంఘాలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆ ఫిర్యాదుల ఒత్తిడితో అధికారులు ఆ పద్ధతిని నిలిపేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్క్రాప్ పాలసీని అమలులోకి తెస్తామంటూ అప్పట్లో అధికారులు చెప్పారని యూనియన్ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఆ విధానమంటూ లేకుండానే పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో వేల సంఖ్యలో ఆటోరిక్షాలు అక్రమంగా తిరిగేందుకు అవకాశం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోకుండా పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నారంటూ ఆటోరిక్షా యూనియన్ నేత దయానంద్ తాజాగా లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అయితే ‘పాత పద్ధతినే పునరుద్ధరిస్తున్నప్పటికీ తుక్కుగా మార్చిన ఆటోరిక్షా ఫొటోలను తీయాలని, ఆటో ఛాసీస్ను మూడు ముక్కలు చేయాలని, ఆ వివరాలు పొందుపరచాలని నిబంధన లు విధించాము, వాటిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశాము’ అంటూ ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
ఏపీ: ఇకపై ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్
సాక్షి, అమరావతి: ఇకపై ఏపీలో ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్ తప్పనిసరి చేశామని.. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసినట్లు భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వీజీ వెంకటరెడ్డి తెలిపారు. ఇసుకకు ఈ-పర్మిట్ కోసం మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేశామని, ఇప్పుడు అమలులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు ఇతర మినరల్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఈ-పర్మిట్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇకపై ఇసుక తవ్వకాలకు కూడా ఇదే విధానం వర్తింపచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ఇకపై రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఆన్లైన్లో ఈ-పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయా రీచ్‌ల పరిధిలోని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా డీఎంజీ కార్యాలయం నుంచి ఈ-పర్మిట్‌ను జారీ చేస్తామన్నారు. ఈ పర్మిట్ వల్ల ఏ రీచ్‌లో ఎంత ఇసుక తవ్వకానికి సంబంధించి అనుమతులు ఇచ్చాం. ఏ మేరకు మైనింగ్ జరిగిదనేది ఖచ్చితంగా తెలుస్తుందని, ఆన్లైన్లో దీనికి సంబంధించిన వివరాలు నమోదవ్వడం వల్ల మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందన్నారు. చదవండి: వ్యాక్సినేషన్: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటిస్తున్నాం: కన్నబాబు -
ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలు తరచూ సమ్మెలకు దిగడం వల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని శాశ్వతంగా అధిగమించడానికి రాష్ట్రంలోని 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లోనే కేబినెట్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్టీసీ సమస్యను కార్మిక సంఘాలు న్యాయస్థానాలకు తీసుకెళ్లినందున, అది తేలేవరకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ప్రజలకు మరింత అసౌకర్యం కలగనుంది. దీంతో ప్రత్యా మ్నాయాలు ఆలోచిస్తోంది. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ (అమెండ్మెంట్ యాక్టు)–2019 ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఈ చట్టం 2019 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కల్పించిన అధికారాల ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వడం వల్ల వారు ఆదాయం కోసం తమకు కేటాయించిన రూట్లలో ఎక్కువ ట్రిప్పులు నడుపుతారు. షిఫ్టుల గొడవ లేకుండా ఎక్కువ సమయం వాహనాలను ప్రజల రవాణాకు అందుబాటులో ఉంచుతారు. అధిక రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. టెండర్లకు అనూహ్య స్పందన రూట్లకు పర్మిట్లు ఇస్తే నడపడానికి ప్రైవేటు వాహన యజమానులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం వెయ్యి రూట్లలో పర్మిట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే, 21,453 దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రైవేటు వాహన యజమానులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉందని రవాణా అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. విద్యార్థులకు పరీక్షలు ఉన్నప్పుడు, పండుగల సీజన్ ఉన్నప్పుడు.. ఇలా అదను చూసుకుని కార్మిక సంఘాలు సమ్మెలకు పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాయి. ఇలా సమ్మె జరిగినప్పుడల్లా ప్రజలకు విపరీతమైన అసౌకర్యం కలుగుతున్నది. దాదాపు 40 ఏళ్ల నుంచి ఇదే తంతు నడుస్తున్నది. దీన్నుంచి శాశ్వతంగా విముక్తి కావడానికి వివిధ రూట్లలో బస్సులు నడిపేందుకు ప్రైవేటు వారికి అవకాశం కల్పించడమే ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని అధికారికంగా వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్‌కు సైతం డబ్బుల్లేవ్.. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెపై వివిధ కేసులను హైకోర్టు విచారణ జరుపుతోంది. ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలియదు. హైకోర్టు తీర్పు వచ్చినా ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు ఆర్టీసీ నష్టాల్లో ఉందని, సమ్మె వల్ల వచ్చే ఆదాయం కూడా రావట్లేదని ప్రభుత్వం వాదిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఆర్టీసీ చిక్కుకుంది. దీని ఫలితంగా బస్సులకు డీజిల్ పోసే పంపులకు బకాయిలు పేరుకుపోయాయి. ఏ క్షణమైనా బంకులు డీజిల్ పోయడం ఆపేయొచ్చు. దీనివల్ల ప్రస్తుతం తిరుగుతున్న బస్సులు కూడా ఏ క్షణమైనా ఆగిపోయే అవకాశం ఉంది. మరోవైపు తీసుకున్న అప్పులకు కిస్తీలు చెల్లించలేని స్థితిలో ఆర్టీసీ కూరుకుపోతోంది. ఏ క్షణమైనా ఆర్టీసీని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ)గా గుర్తించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ప్రైవేటు ట్రావెల్స్ అగడాలు మళ్లీ మొదటికి!
రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలు మళ్లీ జోరందుకున్నాయి. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు పొందిస్టేజి క్యారియర్లుగా దూసుకెళ్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కార్గో రవాణా, ఒకే పర్మిట్‌తో మరికొన్ని బస్సుల్ని తిప్పి రహదారి పన్ను ఎగ్గొడుతున్నా.. రవాణా శాఖ చోద్యం చూస్తోందన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. గత ఆర్నెల్ల కాలంలో వీటిపై రవాణా శాఖ ఒక్క కేసూ నమోదు చేయకపోవడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ల ఎదుటే టికెట్ కౌంటర్లు, పికప్ పాయింట్లు ఏర్పాటుచేసి మరీ ప్రైవేట్ యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. – సాక్షి, అమరావతి 491- రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సుల సంఖ్య 50 - వీటిలో స్లీపర్ బస్సుల సంఖ్య 750 - ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సులు 600 - వీటిలో 2 ప్లస్ వన్ బెర్తులున్న బస్సులు 70,000 - ఈ బస్సుల్లో ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలతో ఆర్టీసీ ఏటా రూ.2,700 కోట్లు ఆదాయం పోగొట్టుకుంటోందని గతంలో సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ప్రైవేటు ట్రావెల్స్‌ను అడ్డుకోలేమని ఇటీవలే ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య చెప్పడాన్ని చూస్తే సర్కారు ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలను ఏ విధంగా కొమ్ము కాస్తోందో అర్ధమవుతోంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రైవేటు బస్సులను అడ్డుకునేందుకు, వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పలు కమిటీలు ఏర్పాటుచేసింది. అంతేకాక, వీటి ఆగడాల నిరోధానికి ప్రత్యేకంగా మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లను నియమించినా ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాల్లేవు. నాడు వద్దన్నదే నేడు ముద్దు ఇదిలా ఉంటే.. అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించి తమ రాష్ట్రం మీదుగాగానీ.. తమ రాష్ట్రం నుంచి గానీ తిప్పడంలేదని అక్కడ ప్రభుత్వం ఏకంగా ప్రైవేట్ బస్సుల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను గతంలో రద్దుచేసిన సంగతి తెలిసిందే. కానీ, ఆ బస్సుల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి అనుమతించారు. మరోవైపు.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్లేందుకు డ్రైవర్లు కొంత మోతాదులో మద్యం సేవించాలని ప్రైవేటు ఆపరేటర్లే ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ ఇటీవలే ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లు పలువురు మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డారు. గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పోలీసుల తనిఖీల్లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవరు మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తనిఖీల్లో వెల్లడైంది. అలాగే, జాతీయ రహదారులపై టోల్గేట్లలో బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు చేయాలి. ఇందుకు ప్రభుత్వం గతేడాది రూ.10 కోట్లతో వాటిని కొనుగోలు చేసింది. కానీ, అధికారులు తనిఖీలు చేయకుండా ప్రైవేటు బస్సులను వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కార్మిక చట్టాలూ గాలికి.. ఇదిలా ఉంటే.. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు డ్రైవర్ల సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నాయి. డ్రైవర్లకు కనీస సదుపాయాలు కల్పించడంలేదు. ప్రైవేటు ఆపరేటర్లు మోటారు వాహన కార్మికుల చట్టం అమలుచేస్తున్నారా? లేదా? అన్నది కార్మిక శాఖ కనీసం పరిశీలించడం లేదు. గతేడాది ఫిబ్రవరిలో కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన తర్వాతే రవాణా శాఖ డ్రైవర్ల పనివేళలు, రెండో డ్రైవరు నిబంధనపై మొక్కుబడిగా ఆదేశాలిచ్చిందే తప్ప వాటి అమలును పట్టించుకున్న పాపాన పోలేదు. నిబంధనలకు విరుద్ధంగా కార్గో రవాణా రవాణా చెక్‌పోస్టుల్లో ప్రతీ వాహనాన్ని ఆ శాఖాధికారులు విధిగా తనిఖీ చేయాలి. ముఖ్యంగా ప్రయాణీకుల్ని తరలించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఓ కన్నేయాలి. సామర్థ్యానికి మించి వాహనం ఉందో లేదో పరిశీలించాలి. కానీ, అటువంటిదేమీ జరగకపోవడంతో దాదాపు 15 సంస్థలు ప్రయాణీకుల మాటున చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం తదితర నగరాల నుంచి పెద్దఎత్తున అక్రమంగా సరుకు తరలిస్తున్నారు. ఇటీవలే గుంటూరులో ఓ ప్రైవేటు బస్సులో 50 కేజీల వెండి, ఫర్నీచర్ సామాగ్రి రవాణా అధికారులకు దొరకడం ఇందుకు ఉదాహరణ. గతంలోనూ ప్రైవేటు బస్సుల్లో బాణాసంచా తరలించడంతో అగ్ని ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలున్నాయి. అయినా ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలను బేఖాతరు చేస్తూ జీరో వ్యాపారానికి తోడ్పాటునందిస్తున్నాయి. -
నిలిచిన కొబ్బరి వర్తకం
సాక్షి, పాలకొల్లు అర్బన్(పశ్చిమగోదావరి జిల్లా): కొబ్బరి వర్తకులు ఈ పర్మిట్ తో వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవాలని జీఓ జారీ చేయడంతో జూలై 1 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి వర్తకం పూర్తిగా స్తంభించిపోయింది. రోజు వారీ జరిగే సుమారు రూ.3 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. దీనివల్ల ప్రత్యక్షంగానూ, పరోక్షంగా 30 వేల కుటుంబాలకు ఉపాధి కరువయ్యింది. ఎగుమతి, దిగుమతి, ఒలుపు, దింపు కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ పర్మిట్ అంటే.. ప్రతి వర్తకుడు రైతు నుంచి కొనుగోలు చేసిన కొబ్బరికాయలకు ప్రతి 15 రోజులకో, లేదా నెలాఖరుకో వ్యాపార లావాదేవీలను బట్టి వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు పన్ను చెల్లించేవారు. అయితే గత నెల జూన్ 1 నుంచి ఈ పర్మిట్ ద్వారా పన్ను చెల్లించాలని జీఓ జారీ చేశారు. దీంతో వర్తకులు ఆందోళనకు దిగడంతో కొంత వెసులుబాటు కల్పించారు. అయితే అదే జీఓను ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించుకోవడంతో కొబ్బరి వర్తకులు జూలై 1 నుంచి వ్యాపార లావాదేవీలు నిలిపి వేసి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ఈ పర్మిట్ విధానం ప్రకారం వర్తకుడు రైతు నుంచి కొనుగోలు చేసిన కొబ్బరికాయలకు ఏ రోజు పన్నును ఆ రోజే ఈ పర్మిట్ విధానంలో చెల్లించాలి. ఇది వర్తకులకు సాధ్యం కాదంటున్నారు. గుమస్తాలకు ఆన్లైన్లో పన్ను చెల్లించడం వీలు కాదంటున్నారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొబ్బరి కాయలను ఎగుమతి చేసుకునే సరికి అర్థరాత్రి అవుతుంది. ఆ సమయంలో నెట్ సౌకర్యం అందుబాటులో ఉండదంటున్నారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సిగ్నల్స్ కూడా సరిగా పని చేయవంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆన్లైన్లో పన్నులు ఏవిధంగా చెల్లిస్తామని కొబ్బరి వర్తకులు ప్రశ్నిస్తున్నారు. ధర పడిపోతుందని ఆందోళన కొబ్బరి వర్తకులు సమ్మె కారణంగా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచి నిలిచిపోవడంతో కేరళ రాష్ట్రం నుంచి ఎగుమతులు ఊపందుకుంటాయి. దీంతో సమ్మె విరమించినా కొబ్బరి ధర పడిపోతుందని రైతులు, వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 40 కోట్ల కొబ్బరి కాయలు ఎగుమతి ఉభయ గోదావరి జిల్లా నుంచి ప్రతి రోజు సుమారు 40 కోట్ల కొబ్బరి కాయలు మహారాష్ట్ర, ముంబై, పుణే, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. దీని ద్వారా రోజువారీ రూ.3 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో 200 మంది కొబ్బరి వర్తకులున్నారు. రోజుకు 100 లారీల కొబ్బరి కాయలు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. లారీకి మూడు నుంచి 5 లక్షలు కొబ్బరి కాయలు ఎగుమతి చేస్తే సుమారు 40 కోట్లు కొబ్బరికాయలు ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఉపాధి కరువైన ఒలుపు, దింపు కార్మికులు కొబ్బరి వర్తకం ప్రధానంగా ఒలుపు, దింపు, హమాలీలు (ఎగుమతి కూలీలు), గుమస్తాలపై ఆధారపడుతుంది. ప్రస్తుతం గత వారం రోజుల నుంచి వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 30వేల మంది కుటుంబాలకు ఉపాధి కరువైంది. దీంతో గత వారం రోజుల నుంచి ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఏ రోజు కారోజు పని చేసుకుని ఉపాధి పొందే కూలీలకు పనులు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఉపాధి లేక ఇబ్బందులు ప్రభుత్వం వెంటనే జీఓ వెనక్కి తీసుకోవాలి. ఈ పర్మిట్ వల్ల ఇబ్బందులు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ చెల్లింపులు కష్టం. అంతే కాకుండా గుమస్తాలకు అవగాహన తక్కువ. దాదాపు 30 ఏళ్ల నుంచి ఒక షాపులో గుమస్తాగా పనిచేస్తున్నా. కొబ్బరి కాయ నాణ్యతను పరిశీలించి రైతుల నుంచి కొనుగోలు చేస్తాం. – కాపిశెట్టి కృష్ణ, గుమస్తా గుదిబండగా మారింది ఒలుపు, దింపు కార్మికులకు ఉపాధి కరువైంది. ఏ రోజు కారోజు పనిచేసుకుని ఉపాధి పొందే ఒలుపు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ గుదిబండగా మారింది. కార్మికుల స్థితిగతులను అర్థం చేసుకుని ప్రభుత్వం ఆ జీఓను వెనక్కి తీసుకోవాలి. – దూలం భాస్కరరావు, ఒలుపు కార్మికుడు -
నో పర్మిట్.. నో వే బిల్
ప్రభుత్వం జీఎస్టీని అమలు చేస్తూ రవాణా వ్యవస్థను ఆన్లైన్ చేసినా అక్రమాలు తగ్గడం లేదు. నెల్లూరు నుంచి చిత్తూరు జిల్లా మీదుగా కర్ణాటకకు నిత్యం సిలికా, ఇసుక రవాణా అవుతోంది. ఈ వాహనాలకు మైనింగ్ నుంచి ట్రాన్సిట్ పాస్గానీ ఈ–వేబిల్లులు గానీ లేకపోవడం గమనార్హం. ఈ విషయం రెండు రోజుల క్రితం పలమనేరు స్పెషల్ బ్రాంచ్ అధికారుల దాడుల్లో తేటతెల్లమైంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల హస్తం ఉండడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పలమనేరు: సాధారణంగా సిలికాను తరలించాలంటే మైనింగ్‌శాఖ నుంచి మినరల్ ట్రాన్సిట్ పాస్ రెగ్యులేషన్స్–1976 మేరకు ట్రాన్సిట్ పాస్‌ను పొందాలి. అనంతరం సరుకు లోడింగ్ చేసేచోట ఆన్లైన్లో ఈ–వేబిల్లును పొందాలి. ఇందుకు లారీకి అమర్చిన జీపీఆర్ఎస్ను అనుసంధానం చేయాలి. వేబిల్లులోని సమయంలోపు అన్లోడింగ్ జరగాలి. ప్రస్తుతం జీఎస్టీతో కలిపి ఈ వ్యవహారం సాగుతోంది. జరుగుతున్నది ఇలా ఎలాంటి రికార్డులు లేకుండానే నెల్లూరు జిల్లా గూడూరు నుంచి సిలికాను బెంగకూరుకు తరలిస్తున్నారు. మరికొందరు మైనింగ్ పర్మిట్‌ను పొంది సిలికాకు వేబిల్లు తీసుకుని నిర్ణీత గడువులోపు రెండు, మూడు ట్రప్పులు తోలుతున్నారు. మరి కొందరు డూప్లికేట్ వేబిల్లులను చూపెడుతున్నట్టు సమాచారం. మార్గమధ్యంలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు మినహా మరే శాఖ అధికారులు పట్టికున్నా వేబిల్లు ఒరిజినలా నకిలీనా అనే విషయాన్ని కనుక్కోలేకపోతున్నారు. దీనికి తోడు అధికారుల సాయం ఎలాగూ ఉంది కాబట్టి వీరి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. రంగంపేట, పూతలపట్టు వద్ద డంపింగ్ పాయింట్లు చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్, పూతలపట్టు వద్ద రహస్య ప్రదేశాల్లో సిలికా డంపింగ్ పాయింట్లు ఉన్నట్టు తెలిసింది. ఇదేచోట ఇసుక కూడా డంప్ చేస్తారు. గూడూరు నుంచి సిలికాతో వచ్చిన లారీలు బెంగళూరులో దాన్ని దించేసిన తర్వాత డంపింగ్ పాయింట్‌కు వస్తాయి. అక్కడి నుంచి మళ్లీ ఇసుక లోడు చేసుకుని వెళుతున్నాయి. దీనికి వేబిల్లులో ఉండే రెండు రోజుల గడువును వాడుకుంటున్నారు. ఏది సిలికానో.. ఏది ఇసుకో నెల్లూరు జిల్లా గూడూరు నుంచి సిలికా ఇసుకతో పాటు మామూలు ఇసుక కూడా బెంగళూరుకు తరలుతోంది. అక్కడ మైనింగ్ లీజుదారులు సిలికా ఇసుకను సబ్‌లీజు, లేదా సేల్స్ ద్వారా టన్ను రూ.500 దాకా విక్రయిస్తున్నారు. 20 టన్నులకు రూ.10 వేలు అవుతోంది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి కొన్ని లోడ్లు సిలికాను, మరికొన్ని లోడ్లు ఇసుకను తరలిస్తున్నాడు. మరికొందరు కింద ఇసుక దానిపైన కాస్త సిలికా ఇసుక కనిపించేలా తార్పాల్ కప్పి బెంగళూరుకు తరలిస్తున్నారు. బెంగళూరులో లారీ ఇసుక రూ.80 వేలకు పైమాటే బెంగళూరులో సిలికా ఇసుక టన్ను రూ.35 వేలు, ఇసుక రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు (12 చక్రాల లారీ) పలుకుతున్నాయి. సిలికా ఇసుకను తీసుకెళితే డీజిల్‌కు రూ.20 వేలు, లోడింగ్, అన్లోడింగ్, డ్రైవర్ బత్తాలు, చెక్ పోస్టుల మామూళ్లు పోగా రూ.5 వేలకు పైగా గిట్టుబాటు అవుతోంది. ఇదే ఖర్చులతో ఇసుకను తీసుకెళితే లోడుకు రూ.40 వేలకు పైగా మిగులుతుంది. గూడూరు నుంచి నిత్యం 200 లోడ్లు గూడూరు నుంచి బెంగళూరుకు తిరుపతి, చిత్తూరు, పలమనేరు మీదుగా రోజుకు 200 లోడ్ల ఇసుక వెళుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పలమనేరు పోలీసులు మూడు గంటల వ్యవధిలోనే 30 లారీలను పట్టుకున్నారు. దీన్ని బట్టి ఎన్ని లారీలు వెళుతున్నాయో అర్థమవుతుంది. అధికార పార్టీ నేతల అండదండలు ఈ అక్రమ రవాణాలో లారీ యజమానులు, సిలికా ఇసుక కొనుగోలుదారులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్టు సమాచారం. విజిలెన్స్, పోలీసు, ఆర్టీవో, సేల్స్ ట్యాక్స్ తదితర శాఖల అధికారులకు నెలవారీ మామూళ్లు చేరుతున్నాయని తెలిసింది. దీంతో వీరి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. -
మూడు స్కూల్బస్లు సీజ్
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– నంద్యాల ఆర్అండ్బీ రహదారిలో పర్మిట్లు లేకుండా తిరుగుతున్న మూడు స్కూల్ బస్సులను సీజ్ చేసినట్లు నంద్యాల ఆర్టీఓ వెంకటరమణ చెప్పారు. శనివారం ఈ రహదారిలో వాహనాల తనిఖీ నిర్వహించి స్కూల్బస్సులతోపాటు రికార్డులు లేని నాలుగు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడితే డ్రైవర్, వాహన యజమానిపై చార్జిషీట్ వేయడం జరుగుతుందన్నారు. ఈ విధానం మే 1వ తేదీ నుంచి అమలవుతోందని, వాహన చోదకులు తప్పని సరిగా లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. సమావేశంలో స్థానిక ఎస్ఐ శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
సంప్రదాయం కాదు
టీజేఏసీ ర్యాలీకి అనుమతి నిరాకరణపై కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి పోలీసులు అనుమతి వ్వకపోవడం మంచి సంప్రదాయం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏ అంశంపైనైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందన్నారు. ఇటువంటి నిరసనల్లో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉన్నప్పుడు నియంత్రణ అనేది సమస్యకు పరిష్కారం కాదని మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమప్పుడు కూడా జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టిన సందర్భంగా కూడా ఇబ్బందులు వచ్చాయని, అయితే శాంతియుతమైన పద్ధతుల్లోనే అవి జరిగాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగ యువత ఆవేదన, అసంతృప్తిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
మూడో డిపో!
♦ జిల్లాలో కొత్త కల్లు డిపో ఏర్పాటుకు నాయకుల సన్నాహాలు ♦ రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు స్వామిగౌడ్ పేరిట అనుమతి ♦ మూడో కల్లు డిపో వెనుక ‘రాజధాని గౌడ్’ ♦ గీత కార్మికులకు న్యాయం జరిగేనా? ♦ ఉత్తర్వులు అందలేదంటున్న ఈఎస్ గంగారాం సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో మూడో కల్లు డిపో ఏర్పాటుకు అనుమతి లభించింది. ఈనెల 14వ తేదీన ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ మూడో డిపో ఏర్పాటుకు సంబంధించి ఆర్సీ 111443 /27 ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిసింది. బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి మూడో డిపో ఏర్పాటు గురించి తెలియజేసినట్లు మూడో డిపో నిర్వాహకులు తెలిపారు. అనూహ్యంగా.. కొన్నేళ్లుగా నిజామాబాద్‌లో 1, 2 కల్లుడిపోలు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయంగా కొందరు మూడో డిపోకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒకటి, రెండు డిపోల కార్మికులకు అన్యాయం జరుగుతుందని మూడో డిపోకు అనుమతి ఇవ్వలేదు. ఒకటి, రెండు డిపోల్లో కొందరు రాజకీయ నాయకులు, అధికార పార్టీకి చెందిన వారు, వ్యాపార వేత్తలు ఉండడంతో.. వారే మూడో డిపో ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారని ప్రచారంలో ఉంది. దీంతో ఏళ్లుగా ఒకటి రెండు డిపోల గుత్తాధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. కార్మికుల పేరుతో కాంట్రాక్టర్లే కోట్లకు పడగలెత్తారు. కార్మికులకు మాత్రం న్యాయం జరుగలేదు. ఒకటి, రెండు డిపోల మధ్య వివాదం నడుస్తోంది. ఇది రెండేళ్ల క్రితం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా ఒకటి, రెండు డిపోలు కోర్టు స్టేతో కొనసాగుతూ వస్తున్నాయి. పలుసార్లు వివాదాస్పదంలో పడి నిలిచాయి. గతంలో కల్తీకల్లు సేవించి పలువురు చనిపోయిన సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో మూడో డిపోకు అనుమతి ఇవ్వాలని స్వామిగౌడ్ మరోసారి అధికారులకు విన్నవించుకున్నారు. ఏడాదిగా ముమ్మర ప్రయత్నాలు చేస్తూవస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కల్తీకల్లు నియంత్రణలో కఠినంగా వ్యవహరించింది. పలు చోట్ల ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. అధికారులు సేకరించిన శాంపిళ్లలో కల్తీ తేలడంతో ఒకటి, రెండు డిపోలను మూసివేశారు. ఇదే సందర్భంలో మూడో డిపో ఏర్పాటు చేయాలని కోరుతున్న స్వామిగౌడ్.. అనుమతి ఇవ్వలంటూ మరోమారు ఎక్సైజ్ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో మూడో డిపోకు అనుమతి వచ్చింది. ఈ డిపోకు సంబంధించి మూడు నెలల క్రితం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన ‘చిక్కడిపల్లి గౌడ్ ’, హైదరాబాద్‌లో మంత్రిని కలిసి అనుమతి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు. చివరకు వారితో కుదిరిన ఒప్పందం మేరకు మూడో డిపోను స్వామిగౌడ్ పేరిట మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గీత కార్మికులకు న్యాయం జరిగేనా? సాధారణంగా కల్లుడిపోలు గీత కార్మికులకు ప్రయోజనం కలిగించేలా ఉంటాయి. అలా ఉండడమే కల్లుడిపోల ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశం కూడా. అయితే నిజామాబాద్‌లో కొన్నేళ్లుగా అ పదానికి అర్థమే మారిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ముగాసే వ్యాపారవేత్తలు, రైసుమిల్లు వ్యాపారులు, కొందరు ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన వారి చేతుల్లోకి కల్లుడిపోలు వెళ్లాయి. గీత కార్మికుల ప్రయోజనాలను గంగలో కలిపి.. కల్లీ కల్లు వ్యాపారంతో కోట్లకు పడగలెత్తారు. అయితే ఇటీవల ప్రభుత్వం కల్లీకల్లుపై ఉక్కుపాదం మోపడం, నిజామాబాద్‌లోని రెండు డిపోల మధ్యన నెలకొన్న వివాదం తదితర కారణాలతో రెండు డిపోలు మూతపడగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రి, చిక్కడపల్లి గౌడ్ సహకారం, భాగస్వామ్యంతో మూడో డిపోకు అనుమతి లభించింది. అయితే ఒకటి, రెండు డిపోలు మూతపడిన నేపథ్యంలో మూడో డిపోకు అనుమతి లభించగా... ఈ డిపోతోనైనా అసలైన గీత కార్మికులకు న్యాయం జరుగుతుందా? అన్న చర్చ జరుగుతోంది. గతంలో రెండు డిపోల్లో కలిపితే రోజుకు రూ. 14 లక్షల వరకు కల్లు విక్రయాలు జరిగేవి. కొద్ది రోజులుగా ఆ రెండు డిపోలు మూతపడగా.. కొత్తగా ప్రారంభించే మూడో డిపోకు భారీగానే కలెక్షన్లు వస్తాయని భావిస్తున్నారు. మూడో డిపోకు అనుమతి పొందిన నిర్వాహకులు మాత్రం కార్మికులకు న్యాయం చేస్తామని, నగరంలోని గీత కార్మికులను కలుపుకొని డిపో నిర్వహిస్తామని పేర్కొంటున్నారు. సుమారు 2 వేల మంది గీత కార్మికులకు తోడు, ఒకటి, రెండు డిపోల రద్దుతో ఇబ్బందుల్లో పడ్డ గీత కార్మికులకు చేయూతనిస్తామని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఒకటి, రెండు డిపోలు 2 వేల మంది గీత కార్మికులు స్థానికంగా ఉన్నవారుకాగా.. మూడో డిపోకు సంబంధించిన గీత కార్మికులు సగం మంది బయటవారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. -
ఆ అధికారులను కోల్‌కతా మ్యాచ్‌కు రానివ్వలేదు
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం కోల్ కతా వచ్చేందుకు పాక్ దౌత్యవేత్తలకు కేంద్రం అనుమతి నిరాకరించింది. మార్చి 19న భారత్- పాకిస్తాన్ మధ్య కోల్ కతాలో వరల్డ్ టీ 20 మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పాకిస్తాన్ అధికారులు ఏడుగురు కోల్ కతా వచ్చేందుకు అనుమతి కోరగా.. చివరినిమిషం వరకు తమకు అనుమతి ఇవ్వలేదని, చివరినిమిషంలో ఇద్దరు అధికారులకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో వారు కూడా కోల్‌కతాకు వచ్చే అవకాశం లేదని పాక్ వర్గాలు తెలిపాయి. కోల్ కతా మ్యాచ్ కోసం పాక్ దౌత్యవేత్తలకు భారత్ అనుమతి నిరాకరించడం నిజమేనని భారత్ కు చెందిన డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ ఇస్లామాబాద్ లో తెలిపారు. అయితే, ఇద్దరు దౌత్యవేత్తలకు కోల్ కతా వచ్చేందుకు ప్రయాణ అనుమతులు మంజూరు చేశామని, మరో ఐదుగురికి మాత్రం నిరాకరించామని భారత అధికారులు తెలిపారు. ఆ ఐదుగురికి పాకిస్తాన్ అంతర్గత భద్రతా సిబ్బందితో, ముఖ్యంగా ఐఎస్ఐతో సంబంధాలు ఉండటం వల్లే అనుమతి నిరాకరించామని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 వరకు మొత్తం ఏడుగురిలో ఏ ఒక్కరికి అనుమతులు రాలేదని పాకిస్తాన్ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టును ప్రోత్సహించేందుకే దౌత్యవేత్తలు కోల్ కతాకు వెళుదామనుకుంటున్నారని, ఈ విషయంలో భారత ప్రభుత్వం అనవసరంగా సమస్యను సృష్టిస్తోందని పాక్ దౌత్యవర్గాలు ఆరోపిస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా పాక్ జట్టు మ్యాచులు జరగనున్న కోల్ కతా , మొహాలీలను సందర్శించేందుకు పాకిస్తాన్ దౌత్యవేత్తలు, ప్రముఖులతో సహా 45 మందికి అనుమతి ఇవ్వాలని కేంద్ర విదేశాంగ శాఖను పాక్ కోరిందని తెలుస్తోంది. అయితే పాక్ మ్యాచ్ ఆడుతున్న ప్రతిచోటుకీ అంతమందిని అనుమతించడం సాధ్యం కాదని, ఇటువంటి నిర్ణయాలు అన్యోన్యత ఆధారంగా తీసుకుంటారని ఓ భారతీయ అధికారి తెలిపారు -
మందులోనూ కల్తీ
వైన్‌షాపుల్లోని బాటిళ్లలో నీళ్లు కలిపి అక్రమ అమ్మకాలు ఎస్టీఎఫ్ దాడుల్లో వెలుగు చూస్తున్న నిజాలు నిజామాబాద్ మినహా మిగతా జిల్లాల్లో9 నెలల్లో 51 కేసులు బాటిళ్లు తెరిచి ఏమాత్రం అనుమానం రాకుండా మళ్లీ సీల్ మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్‌లలో ప్రత్యేక నిపుణులు సాక్షి, హైదరాబాద్: నిఖార్సైన మందు కూడా మద్యం దుకాణాల్లో దొరకడం లేదు. అన్ని చోట్ల కల్తీ మాదిరే మందు బాటిళ్లు కూడా కల్తీ అవుతున్నాయి. డిమాండ్ ఉన్న, ఖరీదైన మద్యం బాటిళ్లలో నీళ్లు, చీప్‌లిక్కర్ కలిపి విక్రయిస్తున్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ కల్తీ అధికంగా ఉంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) జరిపిన దాడుల్లో దొరికిన కల్తీ మద్యం సీసాల సీల్ చూసి అధికారులే ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ సీసాలో మద్యాన్ని ప్రయోగశాలలో పరిశీలిస్తే తప్ప కల్తీ అయినట్లు వారు గుర్తించలేకపోయారు. సీల్ చేసిన మద్యం సీసాలపై ఎక్సైజ్ శాఖ వేసే రంగుల లేబుళ్లను కూడా అంటిస్తారని, పర్మిట్ రూంలలో మందు బాబులు తాగేసిన లూజ్ సేల్ బాటిళ్లపైన ఉండే లేబుళ్లను తెప్పించి అనుమానం రాకుండా అతికించి విక్రయిస్తారని ఎస్టీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో మినహా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు ఎస్టీఎఫ్ అధికారులు వైన్‌షాపులపై దాడులు చేసి కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకొని దుకాణాలను సీజ్ చేశారు. జూలై నుంచి ఇప్పటి వరకు 51 కేసులు నమోదుచేసినట్లు ఎస్టీఎఫ్ అధికారి శశిధర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బేవరేజెస్ కార్పొరేషన్ ముద్రించిన లేబుళ్లతో సీల్ చేసిన మద్యం సీసాలనే అమ్మాల్సి ఉన్నా దుకాణదారులు అదనపు ఆదాయం కోసం కల్తీకి పాల్పడుతున్నారు. స్థానిక ఎక్సైజ్ అధికారులు, సిబ్బందికి మామూళ్లు ఇచ్చి వారి చేతులను కట్టేస్తున్నారు. కల్తీ ఎలా జరుగుతుందంటే... సాధారణ మూతలు ఉన్న సీసాలతో పాటు కల్తీకి అవకాశం లేకుండా సీసా మధ్యలో ప్రత్యేకంగా అమర్చిన ప్లాస్టిక్ తొడుగులు ఉండే ప్రీమియం మద్యం సీసాల మూతలను కూడా ఏమాత్రం అనుమానం రాకుండా తీసి యథాతథంగా అమరుస్తున్నారు. ఈ సీసాల మూతలు తీసే నిపుణులు హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండల్లో ఉన్నట్లు సమాచారం. దుకాణ యజమానులు లేదా వారికి తెలియకుండా అందులో పనిచేసే వర్కర్లు సీసాల మూతలు తీసే నిపుణులను సంప్రదించి ప్రణాళిక బద్ధంగా కల్తీ చేస్తారు. రూ.300 నుంచి 450 ఎంఆర్పీ కలిగిన 750 ఎంఎల్ సాధారణ మద్యం సీసాలు 12 కలిగిన కేస్‌లను అజ్ఞాత ప్రాంతానికి తరలించి ఆ సీసాల మూతలు తీసి ఓ బకెట్లో మద్యం నింపి అందులో సగం వరకు నీళ్లు, కొంత చీప్ లిక్కర్ కలిపి మళ్లీ సీసాల్లోకి నింపుతారు. కొత్త బాటిల్‌పై ఉన్నట్లే సీల్ చేసి, వాటిపైన లేబుళ్లను కూడా అతికించి దుకాణాలకు తరలిస్తారు. ఇదంతా చేసినందుకు నిపుణులకు ఒక కేస్‌కు రూ. 1,000 వరకు చెల్లిస్తారు. -
ఆర్టీసీ బస్సు పర్మిట్ల గడువు పెంపు
హైదరాబాద్: తెలంగాణ-సీమాంధ్ర ప్రాంతాల మధ్య తిరుగుతున్న రెండు ప్రాంతాల ఆర్టీసీ బస్సులకు ప్రస్తుతం ఉన్న పర్మిట్‌ను మరో ఏడాదికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి విభజన అధికారికం కానుండటంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల్లో సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీమాంధ్ర నుంచి తెలంగాణకు దాదాపు 2 వేలకుపైగా బస్సులు తిరుగుతుండగా, తెలంగాణ నుంచి సీమాంధ్రకు అందులో మూడోవంతు కూడా వెళ్లటం లేదు. దీంతో రెండు రాష్ట్రాలకు ఆ బస్సులను జనాభా నిష్పత్తి ఆధారంగా పంచాలనే విషయంలో వివాదం కొనసాగుతోంది. జూన్ 2 నుంచి సీమాంధ్ర బస్సులను అడ్డుకుంటామని కొందరు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పర్మిట్లను మరో ఏడాది వరకు కొనసాగించొచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వు జారీ చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొలువు దీరిన తర్వాత పర్మిట్ల విషయంలో తీసుకునే నిర్ణయం ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని అందులో పేర్కొంది. -
ఎర్రచందనం ఎగుమతికి గ్రీన్ సిగ్నల్
8,500 మెట్రికల్ టన్నుల అమ్మకానికి డీజీఎఫ్టీ అనుమతి ఫలించిన ఆరేళ్ల సుదీర్ఘ ప్రయత్నం {పభుత్వానికి భారీ ఆదాయం ఈ-ఆక్షన్‌కు అటవీశాఖ కసరత్తు స్మగ్లింగ్‌కు అడ్డుకట్టపడుతుందని అధికారుల ఆశ సాక్షి, హైదరాబాద్: స్మగ్లర్లపై దాడులు చేసి పట్టుకున్న ఎర్రచందనం విక్రయానికి అనుమతించాలంటూ ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ఎట్టకేలకు 8,500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఎగుమతికి కేంద్రం అనుమతించింది. సుదీర్ఘ సంప్రదింపులు, ముఖ్యమంత్రి మొదలు అధికారుల వరకు పలుమార్లు సమర్పించిన వినతుల అనంతరం ఎర్రచందనాన్ని దుంగల రూపంలో ఎగుమతి చేసేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జెనీవా కేంద్రంగా ఉన్న కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ (సైటీస్) అనుమతించిన మేరకు 8,500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఎగుమతికి అనుమతిస్తున్నట్లు తాజాగా డీజీఎఫ్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. దీంతో అటవీశాఖ దీని విక్రయానికి ఈ-ఆక్షన్ నిర్వహించాలని నిర్ణయించింది. టెండర్ నిబంధనల రూపకల్పన కోసం నిపుణుల కమిటీ వేయాలని నిశ్చయించింది. కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం రాగానే ఈ-ఆక్షన్‌కు నోటిఫికేషన్ వెలువడుతుంది. ప్రభుత్వానికి భారీ రాబడి.. ఎర్రచందనం విక్రయం ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం రానుంది. అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యమైన (ఎ-గ్రేడ్) ఎర్రచందనం టన్ను ధర రూ.20 లక్షల నుంచి రూ. 25 లక్షలు పలుకుతోంది. టన్ను రూ. 20 లక్షలనుకుంటే 8,500 టన్నులకు రూ.1,500 కోట్లు వస్తుంది. అయితే ఈ దుంగలు ఏళ్ల తరబడి ఎండకు ఎండి, వానకు తడవడంవల్ల నాణ్యత దెబ్బతింది. అందువల్ల ఇవి ‘ఎ’ గ్రేడ్ కిందకు రావు. నిల్వ సమయం పెరిగేకొద్దీ రంగు, ఆకట్టుకునే తత్వం కోల్పోతాయి. అందువల్ల ప్రభుత్వం విక్రయించే వాటికి అంత ధర రాదు. టన్నుకు సగటున రూ. పది లక్షలు వచ్చినా రూ.750 కోట్ల ఆదాయం రావచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. గ్లోబల్ టెండర్లతో స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట గ్లోబల్ టెండర్ల (ఈ-ఆక్షన్) ద్వారా ఎర్రచందనం విక్రయిస్తే స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని అటవీశాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘అక్రమంగా నరుకుతున్న, రవాణా చేస్తున్న వారిపై దాడిచేసి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం 11,800 మెట్రిక్ టన్నులు గోదాముల్లో ఉంది. దీనిని చట్టబద్ధంగా విక్రయిస్తే అంతర్జాతీయంగా ఉన్న డిమాండు తీరుతుంది. దీంతో ధర పడిపోతుంది. ధర తగ్గడం, న్యాయమైన మార్గంలో కొనే అవకాశం ఉన్నందున స్మగ్లర్ల నుంచి కొనడానికి అంతర్జాతీయ సంస్థలు వెనుకంజ వేస్తాయి. దీంతో సహజంగానే స్మగ్లింగ్ తగ్గిపోతుంది. వానకు తడిసి, ఎండకు ఎండి కుళ్లిపోయే బదులు మావద్ద ఉన్న ఎర్రచందనాన్ని ఎగుమతి చేయడం ఏవిధంగా చూసినా ఉత్తమమే. ఎర్రచందనం విక్రయం ద్వారా వచ్చే రాబడిని అరుదైన అడవుల పరిరక్షణకు వినియోగించవచ్చు. డీజీఎఫ్టీ అనుమతితో 2004-05లో మొదటిసారి 1,100 టన్నులు విక్రయించాం. తర్వాత రెండేళ్లు స్మగ్లింగ్ పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ 2007-08 నుంచి డిమాండు పెరగడంతో స్మగ్లింగ్ ఎక్కువైంది’ అని అటవీశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు. -
క్రషింగ్ ప్రారంభం
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : ఉయ్యూరు కేసీపీ కర్మాగారంలో 2013-14 సీజన్‌కు సంబంధించి క్రషింగ్ ప్రారంభమైంది. సంస్థ చైర్మన్ వినోద్.ఆర్.సేథి సోమవారం రాత్రి 9.58 గంటలకు స్వీచాన్ చేసి లాంఛనంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా కర్మాగార ఆవరణలో చెరుకు లోడుతో ఉన్న ట్రక్కుకు ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి పర్మిట్ విడుదల చేశారు. సేథి మాట్లాడుతూ చెరుకు రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంస్థ పనిచేస్తున్నట్లు చెప్పారు. టన్ను మద్దతు ధర రూ.2400 ప్రకటించామన్నారు. దేశంలో ఏ కర్మాగారమూ అమలు చేయని రాయితీలను ఇక్కడ రైతులకు ఇస్తున్నామన్నారు. రైతు ఆపదలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆదుకునే చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కర్మాగారానికి లాభాలు వచ్చినప్పుడు వాటిలో కొంత రైతులకు పంచుతున్న ఘనత తమదేనన్నారు. రైతులకు సీజన్ ముగిసేలోపే పూర్తి చెల్లింపులు జరుపుతున్నామన్నారు. 14 రోజులకే తొలి పేమెంట్ అందిస్తున్నామన్నారు. ఈ విధంగా చెల్లింపులు మరెక్కడా లేవన్నారు. రైతులంతా కర్మాగారానికి సకాలంలో చెరుకు రవాణా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీవోవో జీ వెంకటేశ్వరరావు, జీఎంలు వీవీ పున్నారావు (కేన్), కే కృష్ణ (పరిపాలన), సీకే వసంతరావు (ఫైనాన్స్), హరిబాబు (ప్రాసెస్), డీజీఎం సీతారామారావు (ఇంజినీరింగ్), సీడీసీ చైర్మన్ నెరుసు సతీష్, కార్యదర్శి సత్యనారాయణ, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎస్వీ కృష్ణారావు, కార్యదర్శి భాగ్యనిరంజనరావు తదితరులు పాల్గొన్నారు. -
పర్మిట్ల జారీకి చేయి తడపాల్సిందే!
టెక్కలి, న్యూస్‌లైన్ : ‘గ్రానైట్ లీజుదారులకు పర్మిట్లు జారీలో మైన్స్ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెళియాపుట్టి మండలం గోకర్ణపురం క్వారీయింగ్‌కు సంబంధించి పర్మిట్లు జారీలో చేసిన జాప్యంపై సదరు లీజుదారులు సోమవారం రాత్రి ఆత్యహత్యాయత్నానికి పాల్పడి, ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో టెక్కలి మైన్స్ కార్యాలయంలో అక్రమాలు మరోసారి చర్చనీయాంశమయ్యింది. ఇటీవల కొందరు సిబ్బంది, అధికారులు కలిసి లీజుదారుల నుంచి వివిధ రకాలుగా వేలాది రూపాయలు అక్రమంగా దోచుకోవడం, ప్రభుత్వ ఆదాయానికిగండి పెడుతున్న వైనంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన సంగతి పాఠకులకు విదితమే. తాజా ఘటనతో టెక్కలి మైన్స్ కార్యాలయ వ్యవ హారాలు మరోసారి ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టిలో పడ్డాయి. గ్రానైట్ లీజుదారులకు సకాలంలో పర్మిట్లు జారీ చేయడంలో సిబ్బంది మామూళ్ల వసూళ్లకు దిగుతున్నారన్న ఆరోపణలున్నాయి. పర్మిట్ల జారీలో క్యూబిక్ మీటర్‌కు ఒక్కో రేటు చొప్పున వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు లీజుదారులే బాహాటంగా ఆరోపిస్తున్నారు. పర్మిట్ల జారీలో జాప్యం చేయడంతో లీజుదారులపై బయ్యర్ల ఒత్తిడి పెరగడంతో అడిగిన లంచాల ను ఇస్తారనే ఏకైక కారణంతో మైన్స్ కార్యాలయ అధికారులు పర్మిట్ల జారీ ప్రక్రియను జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రావాల్సిన రెండు వేల రూపాయల రాయల్టీకి గండి పడుతోంది. నెలలో ఒక్క టెక్కలి డివిజన్లో ఉన్న 187 క్వారీల నుంచి సుమారు ఆరు వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రవాణా జరుగుతాయి. పర్మిట్లు నిలిపి వేసినా, ప్రభుత్వాదాయానికి గండిపడిన మొత్తం లక్షల్లోనే ఉంటుంది. సోమవారం జరిగిన ఘటనతో లీజుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. వివరణ కోరిన జిల్లా కలెక్టర్..! సోమవారం రాత్రి గోకర్ణపురం క్వారీ లీజుదారులతో మైన్స్ ఏడీ ప్రసాద్ చేసిన వివాదాంశం చర్చనీయాంశమైంది. ఈ మేరకు మంగళవారం పత్రికల్లో వచ్చిన కథనాలపై కలెక్టర్ సౌరభ్‌గౌర్ తీవ్రంగా స్పందించి ఏడీని వివరణ కోరారు. దీంతో ఉదయాన్నే ఆయన కలెక్టర్‌ను కలిసి పరిస్థితిపై పూర్తి వివరణిచ్చినట్లు తెలిసింది. అక్కడ ఏమి జరిగిందోగాని టెక్కలి కార్యాలయంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. లీజుదారులైన ధనుంజ యరెడ్డి, మురళీకృష్ణలను పిలిపించుకున్న ఏడీ, వారికి వెంటనే పర్మిట్లు జారీ చేశారు. ఈ విషయం ధ్రువీకరణ కోసం ‘న్యూస్‌లైన్’ ఫోన్లో ప్రయత్నించినప్పటికీ ఏడీ ప్రసాద్ అందుబాటులోకి రాలేదు. లీజుదారుడు ధనుంజయరెడ్డి మాత్రం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తనకు మంగళవారం మధ్యాహ్నం కార్యాలయానికి పిలిపించి ఏడీ పర్మిట్లు ఇచ్చారని అంగీకరించారు. -
ఢిల్లీకే పరిమితం కానున్న ఆంటోనీ కమిటీ