మూడు స్కూల్‌బస్‌లు సీజ్
Published Sat, Jun 17 2017 10:19 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– నంద్యాల ఆర్‌అండ్‌బీ రహదారిలో పర్మిట్లు లేకుండా తిరుగుతున్న మూడు స్కూల్ బస్సులను సీజ్ చేసినట్లు నంద్యాల ఆర్టీఓ వెంకటరమణ చెప్పారు. శనివారం ఈ రహదారిలో వాహనాల తనిఖీ నిర్వహించి స్కూల్‌బస్సులతోపాటు రికార్డులు లేని నాలుగు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడితే డ్రైవర్, వాహన యజమానిపై చార్జిషీట్ వేయడం జరుగుతుందన్నారు. ఈ విధానం మే 1వ తేదీ నుంచి అమలవుతోందని, వాహన చోదకులు తప్పని సరిగా లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. సమావేశంలో స్థానిక ఎస్‌ఐ శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement