seeze
-
మూడు స్కూల్బస్లు సీజ్
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– నంద్యాల ఆర్అండ్బీ రహదారిలో పర్మిట్లు లేకుండా తిరుగుతున్న మూడు స్కూల్ బస్సులను సీజ్ చేసినట్లు నంద్యాల ఆర్టీఓ వెంకటరమణ చెప్పారు. శనివారం ఈ రహదారిలో వాహనాల తనిఖీ నిర్వహించి స్కూల్బస్సులతోపాటు రికార్డులు లేని నాలుగు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడితే డ్రైవర్, వాహన యజమానిపై చార్జిషీట్ వేయడం జరుగుతుందన్నారు. ఈ విధానం మే 1వ తేదీ నుంచి అమలవుతోందని, వాహన చోదకులు తప్పని సరిగా లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. సమావేశంలో స్థానిక ఎస్ఐ శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
డీజిల్ బంక్ సీజ్
కోనరావుపేట : పెట్రోల్, డీజిల్‌లో కల్తీ చేసి అమ్ముతున్నారని వాహనదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోనరావుపేటలోని ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన పెట్రోల్‌బంక్‌ను అధికారులు ఆదివారం తనిఖీ చేశారు. బంక్‌లోని డీజిల్, పెట్రోల్‌తో వాహనాలు చెడిపోతున్నాయని పలువురు ఉదయం ఆందోళన చేశారు. దీంతో డీటీసీఎస్ రవీందర్, ఆర్ఐ నాగరాజు వినియోగదారుల సమక్షంలో విచారణ చేపట్టారు. డీజిల్ కల్తీతో తమ ఆటోలు చెడిపోతున్నాయని డ్రైవర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు బంక్‌లో ఉన్న డీజిల్ నమూనాలు సేకరించారు. ల్యాబ్‌కు పంపించి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతవరకు డీజిల్ బంక్ సీజ్ చేస్తున్నామని చెప్పారు. -
మెడికల్ షాపు సీజ్
మాకవరపాలెం : అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపును డ్రగ్స్ అధికారులు సీజ్ చేశారు. మండలంలోని కొండలఅగ్రహారం గ్రామానికి చెందిన వై.సత్యనారాయణ జి.కోడూరులో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. దీనికి అనుమతులు లేవంటూ స్థానికులు డ్రగ్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం నర్సీపట్నం డ్రగ్ అధికారి ఆర్.లలిత షాపులో తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకపోవడంతో వీఆర్వో రాజారావు, కార్యదర్శి అనంత్‌నాగ్ సమక్షంలో షాపులో ఉన్న 65 రకాల మందులను సీజ్ చేసి తీసుకువెళ్లారు.