డీజిల్ బంక్ సీజ్
కోనరావుపేట : పెట్రోల్, డీజిల్‌లో కల్తీ చేసి అమ్ముతున్నారని వాహనదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోనరావుపేటలోని ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన పెట్రోల్‌బంక్‌ను అధికారులు ఆదివారం తనిఖీ చేశారు. బంక్‌లోని డీజిల్, పెట్రోల్‌తో వాహనాలు చెడిపోతున్నాయని పలువురు ఉదయం ఆందోళన చేశారు. దీంతో డీటీసీఎస్ రవీందర్, ఆర్‌ఐ నాగరాజు వినియోగదారుల సమక్షంలో విచారణ చేపట్టారు. డీజిల్ కల్తీతో తమ ఆటోలు చెడిపోతున్నాయని డ్రైవర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు బంక్‌లో ఉన్న డీజిల్ నమూనాలు సేకరించారు. ల్యాబ్‌కు పంపించి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతవరకు డీజిల్ బంక్ సీజ్ చేస్తున్నామని చెప్పారు.