
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఓ పెట్రోల్ పంపు సిబ్బంది ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికే టోకరా ఇచ్చారు! ఆయన కారు ట్యాంక్ సామర్థ్యమే 50 లీటర్లయితే ఏకంగా 57 లీటర్ల పెట్రోల్ కొట్టినట్టు బిల్లు చేతికిచ్చారు.
న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు అధికారులు పెట్రోల్ బంకును సీల్ చేశారు. ఆ ప్రాంతంలోని ఇతర బంకుల నిర్వహణ తీరుపై విచారణకు ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది.
చదవండి: ఆల్‌టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..!
Comments
Please login to add a commentAdd a comment