మహారాష్ట్ర బీజేపీ మైనారిటీ సెల్ నాయకురాలు అదృశ్యం కేసు విషాదంతంగా మారింది. పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమె మధ్యప్రదేశ్‌లోని దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే సనాను ఆమె భర్త అంతమొందించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు అమిత్ అలియాస్ పప్పు సాహుని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాం కోసం గాలిస్తున్నారు.
నాగ్‌పూర్ నివాసి, బీజేపీ మైనారిటీ సెల్ సభ్యురాలు సనా ఖాన్ ఇటీవల భర్త అమిత్ సాహును కలిసేందుకు జబల్‌పూర్‌కు వెళ్లారు. రెండు రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా రాలేదు. సనాఖాన్ నాగ్‌పూర్ నుంచి ప్రైవేట్ బస్సులో బయలుదేరి, మరుసటి రోజు జబల్‌పూర్ చేరుకున్న తర్వాత తన తల్లికి ఫోన్ చేసింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు జబల్‌పూర్ వెళ్లి వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. సనా చివరి లొకేషన్ ఆధారంగా ఆచూకీ కోసం నాగ్‌పూర్, జబల్‌పూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
చదవండి: పెళ్లి కుదిరింది.. 9 రోజుల్లో నిశ్చితార్థం ఉందని చెప్పిన వినిపించుకోకుండా..
అయితే జబల్‌పూర్‌లో భర్త సాహూను కలవడానికి వెళ్లిన్నట్లు తల్లికి చెప్పగా.. ఇదే విషయాన్ని ఆమె పోలీసులకు తెలియజేసింది. నాగ్‌పూర్ పోలీసులకు భర్తపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో సనా ఖాన్‌ను హత్య చేసినట్లు వెల్లడించాడు. తన ఇంట్లోనే సనా తలపై తీవ్రంగా కొట్టి చంపేసినట్లు చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని జబల్‌పూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరాన్ నదిలో పడేసినట్లు తెలిపాడు.
బాధితురాలి మృతదేహం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. జబల్‌పూర్‌లోని ఘోరా బజార్ ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అమిత్ షా లిక్కర్ స్మగ్లింగ్ వ్యాపారంలో భాగస్వామిగా ఉంటూ.. రోడ్డు పక్కన ఫుడ్ కోర్టును కూడా నడుపుతున్నాడని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో సనా, పప్పుల మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment