Minority Cell
-
బీజేపీ నాయకురాలు సనాఖాన్ హత్య.. భర్తే చంపి, నదిలో పడేసి!
మహారాష్ట్ర బీజేపీ మైనారిటీ సెల్ నాయకురాలు అదృశ్యం కేసు విషాదంతంగా మారింది. పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమె మధ్యప్రదేశ్‌లోని దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే సనాను ఆమె భర్త అంతమొందించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు అమిత్ అలియాస్ పప్పు సాహుని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాం కోసం గాలిస్తున్నారు. నాగ్‌పూర్ నివాసి, బీజేపీ మైనారిటీ సెల్ సభ్యురాలు సనా ఖాన్ ఇటీవల భర్త అమిత్ సాహును కలిసేందుకు జబల్పూర్కు వెళ్లారు. రెండు రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా రాలేదు. సనాఖాన్ నాగ్‌పూర్ నుంచి ప్రైవేట్ బస్సులో బయలుదేరి, మరుసటి రోజు జబల్పూర్ చేరుకున్న తర్వాత తన తల్లికి ఫోన్ చేసింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు జబల్పూర్ వెళ్లి వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. సనా చివరి లొకేషన్ ఆధారంగా ఆచూకీ కోసం నాగ్‌పూర్, జబల్పూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. చదవండి: పెళ్లి కుదిరింది.. 9 రోజుల్లో నిశ్చితార్థం ఉందని చెప్పిన వినిపించుకోకుండా.. అయితే జబల్పూర్లో భర్త సాహూను కలవడానికి వెళ్లిన్నట్లు తల్లికి చెప్పగా.. ఇదే విషయాన్ని ఆమె పోలీసులకు తెలియజేసింది. నాగ్‌పూర్ పోలీసులకు భర్తపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో సనా ఖాన్‌ను హత్య చేసినట్లు వెల్లడించాడు. తన ఇంట్లోనే సనా తలపై తీవ్రంగా కొట్టి చంపేసినట్లు చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని జబల్పూర్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరాన్ నదిలో పడేసినట్లు తెలిపాడు. బాధితురాలి మృతదేహం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. జబల్పూర్లోని ఘోరా బజార్ ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అమిత్ షా లిక్కర్ స్మగ్లింగ్ వ్యాపారంలో భాగస్వామిగా ఉంటూ.. రోడ్డు పక్కన ఫుడ్ కోర్టును కూడా నడుపుతున్నాడని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో సనా, పప్పుల మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. -
వైఎస్ఆర్సీపీలోకి విజయవాడ మైనారిటీ సెల్ అధ్యక్షుడు
-
టీపీసీసీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మార్పు
-
వైఎస్సార్సీపీ మైనార్టీ అధ్యయన, ప్రచార కమిటీ
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్సీపీ మైనార్టీ అధ్యయన, ప్రచార కమిటీలో వివిధ పదవులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కన్వీనర్, సభ్యులను నియమించినట్లు ఒక ప్రకటలో వెల్లడించారు. కన్వీనర్‌గా వి. ఖాధర్ భాషా( చిత్తూరు) నియమితులయ్యారు. సభ్యులుగా హబీబ్ అబ్దుల్ రహ్మాన్(హైదరాబాద్), షేక్ మొహమ్మద్ ఇక్బాల్(కర్నూలు), ఐ.హెచ్ ఫారూఖీ(విశాఖ పట్నం), సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ(చిత్తూరు), బి.హెచ్. ఇలియాస్(కడప), షేక్ రఫి(నెల్లూరు), షేక్ మొహమ్మద్ రఫి(కడప), షేక్ జాన్ భాషా(తూర్పు గోదావరి), డి.యస్. హబీబుల్లా(కర్నూలు), షేక్ ఆసిఫ్(కృష్ణా), యూనిస్ పాషా( కృష్ణా), హంజా హుస్సేని(నెల్లూరు), గౌస్ లాజాం( కడప)లు నియమితులయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా షేక్ బెపారి ఎమ్మెల్యే అంజన్ భాషా(కడప), ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్(గుంటూరు), హైరేహల్ నదీం అహ్మద్( అనంతపురం), అబ్దుల్ హఫీజ్ ఖాన్(కర్నూలు) లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. -
రెచ్చిపోయిన జేసీ వర్గీయులు..
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. తాడిపత్రిలో జేసీ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు గయాజ్ బాషా ఆలియాస్ మున్నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జేసీ వర్గీయుల నుంచి మున్నా తృటిలో తప్పించుకున్నారు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తిని పరామర్శించి వస్తున్న సమయంలో జేసీ వర్గీయులు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వారి నుంచి మున్నా ప్రాణాలతో బయటపడ్డారు. అతనికి సంబంధించిన రెండు వాహానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మున్నాను హతమార్చేందుకు జేసీ వర్గీయులు కుట్రపన్నారని తెలుస్తోంది. అంతేకాక వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం, నిధుల గోల్మాల్ వెనుక టీడీపీ నేతల పాత్రపై మున్నా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో దాడికి ప్లాన్ చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. జేసీ ప్రభాకర్ దౌర్జన్యాలు పెరిగిపోయ్యాయి.. వైఎస్ఆర్సీపీ నేత మున్నాపై జరిగిన హత్యాయత్నాన్ని తాడిపత్రి టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, ఫయాజ్ భాషా, జగదీశ్వర్ రెడ్డి ఖండించారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని వారు పేర్కొన్నారు. పబ్లిక్‌గా దాడులు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. జేసీ అరాచకాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ నేతలు అన్నారు. -
వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి నియామకం
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా డీఎస్ హబీబుల్లాను నియమిస్తున్నట్లు గురువారం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హబీబుల్లా నియామకం జరిగినట్లు తెలిపింది. డీఎస్ హబీబుల్లా నంద్యాల నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు. -
ఒక్కచాన్స్... ప్లీజ్
విజయనగరం ఫూల్‌బాగ్: పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్... ఇదీ పట్టణంలోని అశోక్‌బంగ్లాలో ఒక తెలుగుతమ్ముడు జిల్లా నాయకునికి వేడుకోలు. సార్ ప దేళ్లపాటు పార్టీ కోసం ఎంతో పనిచేశాను. కో- ఆప్షన్ ఇప్పించండి’ ఇది మరో తెలుగు తమ్ముడి విజ్ఞాపన. మున్సిపాల్టీలో పాల కవర్గం ఇంకా కొలువు తీరలేదు. కానీ కో-ఆప్షన్ పదవుల కో సం తెలుగుతమ్ముళ్లు పైరవీలు సాగిస్తున్నారు. మూడు కో-ఆప్షన్ పదవులే విజయగనరం మున్సిపాల్టీలో మూడు కో-ఆప్ష న్ పదవులు ఉంటాయి. రిజర్వేషన్ ప్రకారం ఒకటి మైనార్టీ వర్గానికి, మరొకటి మహిళలకు కేటాయించాల్సి ఉంది. మరొక పదవి మున్సిప ల్ చట్టాలపై అవగాహన ఉండి, చదువుకున్న వారికే లభిస్తుంది. మైనార్టీ వర్గాల నుంచి ఎస్‌కెఎం భాషాతోపాటు టీడీపీలోకి వచ్చిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదితో పాటు పలువురు ముస్లిం నాయకులు ఈ పదవిని ఆశిస్తున్నారు. టీడీపీ మైనార్టీ సెల్ నాయకునిగా ఉన్న ఎస్కేఎం భాషా భార్య కౌన్సిలర్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఎస్‌కెఎం భాషాకు ఈసారి కో-ఆప్షన్ పదవి దక్కకపోవచ్చునని టీడీపీ వర్గాల అభిప్రాయం. మహిళా కోటా నుంచి టీడీపీ జిల్లా కార్యదర్శి ఐవీపీ రాజు భార్య పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఐవీపీ రాజు పార్టీ పెద్దల వద్ద తన అభిప్రాయం వ్య క్తం చేసినట్టు సమాచారం. దీంతో ఆమెకు కో- ఆప్షన్ పదవి కేటాయించడం లాంఛన ప్రాయమైనట్టు తెలుస్తోం ది. ఇక మూడో కో-ఆప్షన్ పదవి కోసం పోటీ భారీస్థాయిలో ఉంది. ఈ జాబితా చాంతాడంత ఉంది. టీడీపీ నాయకులు కేఏపీ ప్రసాద్‌రాజు కూడా కో-ఆప్షన్ పదవిని ఆశిస్తున్నారు.అదేవిధంగా డాక్టర్ వీఎస్ ప్రసాద్, డాక్టర్ రామయ్య కూడా తమతమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి లేనట్లేనా? మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణకు దాదాపుగా ఖరారైపోయింది. ప్రసాదుల రామకృష్ణ యాదవసామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పా టు మున్సిపాలిటీలో ఏడుగురు కౌన్సిలర్లు యా దవ సామాజిక వర్గానికి చెందినవారు విజయం సాధించారు. దీంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈసారి కో-ఆప్షన్ పదవి ద క్కకపోవచ్చుననే వార్తలువినిపిస్తున్నాయి. యా దవ సామాజిక వర్గం నుంచి ఇప్పలి అప్పల కొండ, కిల్లాన మహేష్‌యాదవ్, కాగిత శ్రీనివాస్‌యాదవ్ బంటుపల్లి శ్రీనివాస్‌యాదవ్, గొల గాని రమేష్‌యాదవ్, గువ్వల తిరుపతిరావుయాదవ్, పూసర్ల రమణయాదవ్, నైదాన శ్రీని వాసరావుయాదవ్తో తదితరులుఆశిస్తున్నారు. కౌన్సిలర్‌గా పోటీచేసి ఓడిపోయిన మద్దాల ము త్యాలరావు, టీడీపీ నాయకుడు గొల్లకోటి గురునాథ్ కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. పారిశ్రామిక చైర్మన్ ఆశలు వీటి అగ్రహారం ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవాడ చైర్మన్‌కు మున్సిపాల్టీలో కో-ఆప్షన్ పదవిని నామినేటెడ్ చేసే అవకాశాలు కల్పిస్తున్నా యి. ఒక వేళ ఇదే జరిగితే మున్సిపాల్టీలో కో-ఆప్షన్ సభ్యుల సంఖ్య మూడు నుంచి నా లుగుకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పారి శ్రామికవాడ చైర్మన్ మచ్చి రామలింగస్వామి కూడా కో-ఆప్షన్ పదవిని ఆశిస్తున్నారు. ఈయ న మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఖరారైన ప్రసాదుల రామకృష్ణకు బంధువు. అందువల్ల తనకు అవకాశం ఉందని భావిస్తున్నారు. అశోక్ రాకతోనే లెక్కతేలేది.. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఈ నెల 13వ తేదీన జిల్లాకు రానున్నట్టు తెలుస్తోంది. ఆయన వస్తే ఎవరెవరికి పదవులు వస్తాయనేది తేలు తుంది. తమ వద్దకు వచ్చిన ఆశావహులకు అశోక్ వస్తేగాని ఏమీ చెప్పలేమని టీడీపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ద్వారపురెడ్డి, జగదీష్, ఐవీపీ రాజు, ప్రసాదుల రామకృష్ణ చెప్తున్నట్టు సమాచారం.