లోక్‌సభ ఎన్నికల డ్యూటీ కేటాయింపులో వింతవైనం వెలుగు చూసింది. ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్ కమిషనర్‌పై వేటు పడింది.
వివరాల్లోకి వెళితే జబల్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న రచయితా అవస్థి.. మరణించిన ఒక మహిళా ఉద్యోగిని ఎన్నికల విధులకు కేటాయించారు. అలాగే ఆమె చేయాల్సిన పనులను కూడా సంబంధిత రిపోర్టులో పేర్కొన్నారు. తరువాత ఎన్నికల ఉద్యోగుల డేటా బేస్‌ను ఎన్నికల కార్యాలయానికి పంపారు. అయితే దీనిలో చనిపోయిన ఒక మహిళా ఉద్యోగి పేరు కూడా ఉందని జిల్లా ఎన్నికల అధికారి గుర్తించారు.
ఈ నేపధ్యంలో ఎన్నికల అధికారులు సంబంధిత అధికారులను విచారించారు. చివరికి ఇది అసిస్టెంట్ కమిషనర్ రచయితా అవస్థి తప్పిదమని తేలింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, అసిస్టెంట్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి దీపక్ సక్సేనా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment