duty
-
యాద్రాది: డ్యూటీలకు డుమ్మా.. టీచర్లపై వేటు
సాక్షి, యాద్రాది: దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లపై వేటు పడింది. 2005, 2006 నుంచి విధులకు రాని 16 మంది టీచర్లను తొలగిస్తూ యాద్రాది భువనగిరి జిల్లా డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.యాద్రాది జిల్లాలో 18 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరుకావడం లేదు. 2005 నుంచి ఇప్పటివరకు డుమ్మా కొడుతున్న వారుండగా.. గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఇద్దరు డ్యూటీలో చేరారు. మిగిలిన 16 మంది స్పందించలేకపోవడంతో. గత మే నెలలో కూడా గెజిట్ నోటీసు విద్యాశాఖ జారీ చేసింది. అయినా టీచర్ల నుంచి స్పందన రాకపోవడంతో వారందరికీ సర్వీస్ నుంచి తొలగిస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. -
గెస్ట్ టీచర్లపై బోధనేతర భారం!
సాక్షి, అమరావతి : గెస్ట్ టీచర్లు అంటే రెగ్యులర్ టీచర్లు కాదు అని అర్థం. వీరి విధులు కూడా పరిమితంగానే ఉంటాయి.. చెల్లించే వేతనాలు కూడా అంతంతే. కానీ, రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఉన్న 1,253 మంది గెస్ట్ టీచర్లపై అపరిమితమైన భారం మోపుతున్నారు. ముఖ్యంగా టీడీపీ కూటమి సర్కారు వచ్చాక మునుపెన్నడూలేని రీతిలో వీరు అవస్థలు పడుతున్నారు. పేరుకు గెస్ట్ టీచర్లు అయినా వీరు చేయాల్సిన విధులు అన్నీఇన్నీ కావు. రాత్రిపూట విధుల నుంచి డిప్యూటీ వార్డెన్ చేసే పనుల వరకు అన్నీ వీరే చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. తక్కువ జీతంతో ఎక్కువ పనిభారం మోస్తున్న ఈ గెస్ట్ టీచర్లు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక ఉద్యోగం పోతుందనే భయంతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలోని మహాత్మ జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో జరుగుతున్న ఇదో రకం శ్రమ దోపిడి. పగలు బోధన.. రాత్రి కాపలా..నిజానికి.. విద్యార్థులకు నిర్ధేశించిన సబ్జెక్టుల వారీగా బోధించడమే గెస్ట్ టీచర్ల విధి. కానీ, అందుకు విరుద్ధంగా పగలు బోధన.. రాత్రి కాపలా అనే రీతిలో వారిపై ప్రభుత్వం అదనపు బాధ్యతలు మోపుతోంది. ఫలితంగా ఉద్యోగ భద్రత, వేతనం, సరైన సౌకర్యాలు లేకుండానే అవస్థలుపడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం తాజాగా రాత్రి విధులు అప్పగించడంపట్ల వీరు ఆవేదన చెందుతున్నారు.ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు కేటాయించిన గురుకులాల్లో ఉండాలని బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ‘డే స్టడీ–నైట్ స్టే’ పేరుతో రోజుకు ఇద్దరు టీచర్లు రాత్రిపూట విద్యార్థులతో కలిసి ఉంటూ వార్డెన్ తరహా బోధనేతర విధులు కూడా అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పనులకు గురుకులాల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేయాల్సిన ప్రభుత్వం వీటిని కూడా గెస్ట్ టీచర్లకు అప్పగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలదన్నట్లు వసతి గృహాల్లో డిప్యూటీ వార్డెన్లు చేయాల్సిన పనులను కూడా ఆ పోస్టులు భర్తీ చేయకుండా వాటిని ఈ గెస్ట్ టీచర్లకు అప్పగించడంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వేతనంలేక వెతలు..ఇదిలా ఉంటే.. ఈ గెస్ట్ టీచర్లకు బడ్జెట్ కేటాయింపు జరగకపోవడంతో గతనెల వేతనాలు చెల్లించలేదు. ఇచ్చే అరకొర జీతాలు కూడా సకాలంలో ఇవ్వకపోతే బతికేది ఎలా అంటూ వీరు వాపోతున్నారు. వాస్తవానికి.. రాష్ట్రంలో రెగ్యులర్ టీచర్‌కు నెలకు రూ.లక్ష, కాంట్రాక్టు టీచర్‌కు రూ.50 వేలు, గెస్ట్ టీచర్‌కు కేవలం రూ.19వేలు వేతనం చెల్లిస్తున్నారు. పైగా.. గెస్ట్ టీచర్‌కు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కూడా ఉండవు. -
చైనా వస్తువుల దిగుమతులకు చెక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా చైనా నుంచి దిగుమతయ్యే ఐదు వస్తువులపై ఐదేళ్లపాటు అమలయ్యేలా యాంటీడంపింగ్ డ్యూటీకి తెరతీసింది. వీటిలో గ్లాస్ మిర్రర్, సెల్‌ఫోన్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ తదితరాలున్నాయి. తద్వారా పొరుగు దేశం నుంచి భారీగా దిగుమవుతున్న వస్తువులకు చెక్ పెట్టింది. దీంతో చౌక దిగుమతుల నుంచి దేశీ తయారీదారులకు రక్షణ లభించనుంది.యాంటీడంపింగ్ డ్యూటీ విధించిన చైనా వస్తువుల జాబితాలో ఐసోప్రొపిల్ ఆల్కహాల్, సల్ఫర్ బ్లాక్, సెల్‌ఫోల్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్, థెర్మోప్లాస్టిక్ పాలీయురెథేన్, అన్ఫ్రేమ్డ్ గ్లాస్ మిర్రర్ చేరాయి. సాధారణ ధరలకంటే తక్కువ ధరల్లో ఈ వస్తువులు చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. రెవెన్యూ శాఖ, పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ విడిగా జారీ చేసిన ఐదు నోటిఫికేషన్ల ద్వారా డ్యూటీలు ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయని వెల్లడించింది.మెడికల్, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఐసోప్రొపిల్ ఆల్కహాల్‌పై టన్నుకి 82 డాలర్ల నుంచి 217 డాలర్ల మధ్య వివిధ కంపెనీలపై సుంకాన్ని విధించింది. చర్మంపై యాంటీసెప్టిక్, హ్యాండ్ శానిటైజర్గానూ ఈ ప్రొడక్ట్ వినియోగమవుతోంది. టెక్స్టైల్ డయింగ్, పేపర్, లెదర్ తయారీలో వినియోగించే సల్ఫర్బ్లాక్పై టన్నుకి 389 డాలర్ల సుంకాన్ని ప్రకటించింది.ఇదీ చదవండి: డాలర్లు దండిగా.. కొరతలోనూ చింత లేని బంగ్లాదేశ్!ఈ బాటలో ఆటోమోటివ్, మెడికల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో వినియోగించే థెర్మోప్లాస్టిక్ పాలీయురెథేన్పై కేజీకి 0.93 డాలర్ల నుంచి 1.58 డాలర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్‌గా వినియోగించే సెల్‌ఫోన్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్‌పై కేజీకి 1.34 డాలర్లు చొప్పున డ్యూటీ విధించింది. అన్ఫ్రేమ్డ్ గ్లాస్ మిర్రర్లపై టన్నుకి 234 డాలర్ల యాంటీడంపింగ్ సుంకాన్ని ప్రకటించింది. వాణిజ్య శాఖ పరిశోధన విభాగం డీజీటీఆర్ సూచనలమేరకు ప్రభుత్వం తాజా చర్యలను చేపట్టింది. -
పిల్లలతో అనుబంధాలు తెగిపోతున్నాయ్
ఖిలా వరంగల్: ‘ నెలల తరబడి డ్యూటీలోనేనా.. వారానికి ఒక్కసారి ఇంటికి పంపరా.. పిల్లలతో అనుబంధాలు తెగిపోతున్నాయి’ అంటూ టీజీ పోలీసు కుటుంబ సభ్యులు మంగళవారం వరంగల్‌లోని రంగశాయిపేట గవిచర్ల క్రాస్ రోడ్డు జంక్షన్లో చంటి పిల్లలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ‘కొత్తగా తీసుకొచ్చే లీవ్ మాన్యువల్‌తో నెలకు ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబానికి దూరమై మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులకు ఒకసారి ఇచ్చే నాలుగు రోజుల పర్మిషన్ లీవ్ పాత పద్ధతినే కొనసాగించాలి’ అని ఈ సందర్భంగా పల్లవి, నవ్యశ్రీ, అంజలి తదితరులు కోరారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్‌లో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచి కొత్తగా తీసుకొస్తున్న లీవ్ మాన్యువల్‌పై పోలీసు కుటుంబాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీస్ కుటుంబాలు ఆందోళనకు దిగుతాయని ముందస్తుగా గమనించిన పోలీసులు ఆర్టీఏ జంక్షన్, బెటాలియన్ ప్రధాన గేటు వద్ద భారీగా మోహరించారు. పోలీసుల అంచనాలకు అందకుండా ఇతర ప్రాంతాల్లోని పోలీస్ కుటుంబాలు వివిధ మార్గాల్లో రంగశాయిపేట జంక్షన్‌కు చేరుకొని రోడ్డుపై బైఠాయించాయి. విషయం తెలుసుకున్న ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, టీజీ ఎస్పీ కమాండెంట్ రాంప్రకాశ్, ఏసీపీలు నందిరాంనాయక్, తిరుపతి, సీఐలు వెంకటరత్నం, రమేష్‌లు మహిళా పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పినా పోలీసు కుటుంబాలు ససేమిరా అనడంతో వారిని వ్యానులో ఎక్కించి బెటాలియన్‌కు తరలించారు. వినతిపత్రం స్వీకరించి సాయంత్రం వదిలేశారు. ఈ కార్యక్రమంలో 200 మంది పోలీసు కుటుంబాలు పాల్గొన్నాయి. బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందిని ఉదయాన్నే స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆఫీసులకే పరిమితం చేశారు. -
స్తంభించిన వైద్యసేవలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్యకళాశాలలో రెసిడెంట్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఆ అఘాయిత్యానికి నిరసనగా శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 వరకు 24 గంటల పాటు వైద్యసేవల బంద్‌కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునివ్వడంతో రాష్ట్రంలో అత్యవసర వైద్యసేవలు మినహా మిగిలిన సేవలు స్తంభించాయి. అన్ని జిల్లాల్లోను ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు.ఐఎంఏ, పలు వైద్యసంఘాల ఆధ్వర్యంలో వైద్యులు, విద్యార్థిసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల వారు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలతో పాటు అనేకచోట్ల కొవ్వొత్తులతో ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. ఆర్జీ కర్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని ఈ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో వైద్యులపై దాడులు, అత్యాచారం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని కోరారు. ఇందుకోసం ఓ ప్రత్యేక రక్షణ చట్టాన్ని రూపొందించాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలకు కూడా దూరంగా ఉండి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వ వైద్యులు సైతం అన్ని ఆస్పత్రుల్లో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఐఎంఏ చేపట్టిన ఈ బంద్ ఆదివారం ఉదయం 6 గంటలకు ముగుస్తుంది. -
115 మంది పోలీసులు ‘అదృశ్యం’!
దేశంలో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపధ్యంలో యూపీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల కోసం యూపీలోని కాన్పూర్ నుంచి నోయిడాకు వెళ్లిన 115 మంది పోలీసులు అదృశ్యమైన ఉదంతం వెలుగు చూసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ నోయిడా పోలీస్ డిప్యూటీ కమిషనర్ తనిఖీలో, కాన్పూర్ నుండి వచ్చిన 138 మంది పోలీసులలో 115 మంది అదృశ్యమైనట్లు తేలింది. ఈ పోలీసులకు దాద్రీలోని అన్షు పబ్లిక్ స్కూల్లో వసతి సౌకర్యం కల్పించారు. నోయిడా పోలీసులు ఈ గైర్హాజరైన పోలీసులపై కేసు నమోదు చేశారు. అలాగే ఈ విషయాన్ని డీజీపీ హెడ్‌క్వార్టర్‌లోని ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాగా ఇలాంటి పలు ఘటనలు వెలుగులోకి రావడంతో, ఎన్నికల విధులకు హాజరైన పోలీసులను రోజువారీగా లెక్కించాలని అన్ని జిల్లాల పోలీసు కమిషనర్లకు లా అండ్ ఆర్డర్ ఏడీజీ అమితాబ్ యష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అదృశ్యమైన పోలీసులు ఎన్నికల విధులకు గైర్హాజరై, వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
మృత ఉద్యోగికి ఎన్నికల డ్యూటీ.. అధికారి సస్పెండ్!
లోక్‌సభ ఎన్నికల డ్యూటీ కేటాయింపులో వింతవైనం వెలుగు చూసింది. ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్ కమిషనర్‌పై వేటు పడింది. వివరాల్లోకి వెళితే జబల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న రచయితా అవస్థి.. మరణించిన ఒక మహిళా ఉద్యోగిని ఎన్నికల విధులకు కేటాయించారు. అలాగే ఆమె చేయాల్సిన పనులను కూడా సంబంధిత రిపోర్టులో పేర్కొన్నారు. తరువాత ఎన్నికల ఉద్యోగుల డేటా బేస్‌ను ఎన్నికల కార్యాలయానికి పంపారు. అయితే దీనిలో చనిపోయిన ఒక మహిళా ఉద్యోగి పేరు కూడా ఉందని జిల్లా ఎన్నికల అధికారి గుర్తించారు. ఈ నేపధ్యంలో ఎన్నికల అధికారులు సంబంధిత అధికారులను విచారించారు. చివరికి ఇది అసిస్టెంట్ కమిషనర్ రచయితా అవస్థి తప్పిదమని తేలింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, అసిస్టెంట్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి దీపక్ సక్సేనా హెచ్చరించారు. -
ఎన్నికల విధుల్లో ఎవరుంటారు? మినహాయింపు ఎవరికి?
దేశంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు వివిధ బాధ్యతలను అప్పగిస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, జాతీయ బ్యాంకులు, ఎల్ఐసీతో సహా వివిధ సంస్థల ఉద్యోగులు ఎన్నికల విధులలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పోలింగ్ బృందాలలో ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, సెక్టార్, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, సహాయ వ్యయ పరిశీలకులు, డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు మొదలైనవారు ఉంటారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల బాధ్యత రాష్ట్ర పోలీసులు, సెక్టార్, జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులపై ఉంటుంది. వీరు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని జిల్లాలలో ఎన్నికల నిర్వహణలో భాగస్వాములవుతారు. ఎన్నికల విధులలో నియమితులైనవారు గైర్హాజరయ్యేందుకు అవకాశం ఉండడు. విధులకు హాజరుకానివారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. కేంద్రం లేదా రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్నవారిని మాత్రమే ఎన్నికల విధులలో నియమిస్తారు. అవసరమైతే పదవీ విరమణ తర్వాత డిప్యూటేషన్‌లో ఉన్న ఉద్యోగులను కూడా ఎన్నికల విధులలో నియమిస్తారు. కాంట్రాక్టు లేదా రోజువారీ ఉద్యోగులను ఎన్నికల డ్యూటీలో నియమించరు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో భార్యాభర్తలిద్దరికీ విధులు అప్పగించరు. దంపతుల్లో ఒకరు పిల్లలను లేదా వారి వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడానికి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగి అప్పటికే విదేశాలకు వెళ్లే ప్లాన్‌లో ఉంటే, అతను ఎన్నికల డ్యూటీ నుంచి మినహాయింపును కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇందు కోసం ముందుగా ప్రయాణాన్ని బుక్ చేసుకోవాలి. దరఖాస్తులో ప్రయాణ రుజువుగా సంబంధిత టికెట్, వీసాను జత చేయాలి. ఇదేవిధంగా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికల విధుల నుంచి మినహాయింపును కోరవచ్చు. అయితే ఇటువంటి సందర్భంలో సంబంధిత ఉద్యోగి అవసరమైన అన్ని వైద్య ధృవపత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. -
18 వేల అడుగుల ఎత్తులో.. మైనస్ 38 డిగ్రీల టెంపరేచర్లో..
నిజామాబాద్: ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన మహ్మద్ షాదుల్ ఎత్తైన మంచు పర్వతంపై తన స్వగ్రామం పేరును ప్రదర్శించి మమకారం చాటుకున్నారు. షాదుల్ రెండ్రోజులుగా జమ్మూకశ్మీర్‌లోని లదాఖ్‌లో గల 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపై మైనస్ 38 డిగ్రీల టెంపరేచర్లో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా స్వగ్రామం అన్నాసాగర్ పేరుతో ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. గ్రామస్తులు షాదుల్‌ను అభినందించారు. ఇవి చదవండి: ఎట్టకేలకు ‘రూట్’ క్లియర్! -
భయం ప్రకృతి వరం
అన్ని జీవులతో పాటు మనిషికి కూడా భయం పుట్టుకతోనే ఉంది. సహజమైన భయానికి తోడు మానవుడు కృత్రిమమైన భయాన్ని కల్పించుకో గలడు. మనిషి ఆ విధంగా కల్పించుకున్న భయాలు ఎన్నో! అన్నీ భయాలే. రేపటి సంగతి ఏమిటి? ఈ భయం కారణంగానే దాచుకోటాలు, దోచుకోటాలు మొదలైనవి. ఆహార నిద్రాభయమైథునాలు సర్వజీవులకు సామాన్యమే. ప్రకృతి సిద్ధం. ఆహారం ప్రాణం నిలబడటానికి. శరీరం అనే యంత్రం పని చేయటానికి తగిన శక్తి నిచ్చే ఇంధనం ఆహారం. రక్షణ కోసం ప్రకృతి చేత సమకూర్చ బడింది భయం. తెలియకపోవటం వల్ల భయం కలుగుతుంది. భయపడటం వల్ల రక్షణ జరుగుతుంది. భయం లేకపోతే చీకటిగా ఉన్న చోటుకి అయినా నిస్సందేహంగా వెళ్ళటం జరుగుతుంది. ఎత్తు పల్లాలు తెలియక దెబ్బలు తగలటమో, గోతిలో పడటమో, ముళ్ళో రాళ్ళో కాలికి గుచ్చుకుని గాయాలు కావటమో, ఏ తేలో పామో ఉండి ప్రాణం మీదికి రావటమో జరిగే అవకాశం ఉంది. తెలియని వారెవరైనా ఉండి మీద పడితే ప్రాణ హాని కూడా జరగ వచ్చు. భయం ఇంకా తెలియని పసిపిల్లలు చీమలని, పాములని కూడా పట్టుకునే ప్రయత్నం చేయటం గమనించ వచ్చు. వెలుగుతున్న దీపాన్ని పట్టుకోటానికి చూస్తారు. ఒకసారి వేడి తగిలితే మరొకసారి భయపడతారు. మానవులకు జంతువుల కన్న అధికంగా మెదడు, దానితో ఆలోచన, విచక్షణాజ్ఞానం కూడా ఇచ్చింది ప్రకృతి. దానిని ఉపయోగించుకుని మేలు పొందటానికి బదులు లేనిపోని భయాలు సృష్టించుకుని బాధ పడటం జరుగుతోంది. తన అభిప్రాయాలని ఇతరులు అంగీకరించరేమో! తన గురించి ఏమనుకుంటారో? అనుకున్నది జరగదేమో! అపజయాన్ని ఎదుర్కోవలసి వస్తుందేమో! ఇవన్నీ కల్పితాలే కాని, సహజసిద్ధం కావు కదా! ఈ భయాల వల్ల రక్షణ కలగక పోగా దుఃఖం కలుగుతుంది. జంతువులకి భయం ఉంది కాని, దుఃఖం లేదు. అవి భయాలని తాముగా కల్పించుకో లేదు కదా! వాటి భయం వాటికి రక్షణ నిస్తుంది. ఎదుటివారి భయాన్ని తమకు రక్షణగా చేసుకో గలిగిన తెలివితేటలు కూడా ఉన్నాయి మనిషికి. పొలాల్లో కాపలా ఉండేవారు కాని, అడవిలో సంచరించేవారు కాని, రాత్రిళ్ళు నెగళ్లు (మంటలు) వేసుకుంటారు. అడవి జంతువులు మంటలని చూసి భయపడి సమీపించవు అని. మృత్యుభయం అన్నింటి కన్న పెద్దభయం. బుద్ధిజీవులైన మానవులకి మృత్యువు తప్పదని తెలుసు. తెలియని జంతువులే నయం. ప్రాణాల మీద ఆశని సునాయాసంగా వదులుకోగలవు. శరీరం కష్టపడుతుంటే దానిని వెంటనే వదిలేస్తాయి అని పశువైద్యులు చెప్పిన మాట. మానవులు స్పృహ లేక పోయినా బతికి ఉండాలని ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు. జంతువులు మరణభయాన్ని జయించి నట్టు చెప్పుకోవచ్చును. మనిషి స్వయంకృతంగా తెచ్చి పెట్టుకున్న దుఃఖహేతువయిన భయాలు శారీరక, మానసిక అనారోగ్యాలకి కారణాలు అవుతాయి. అటువంటి భయాలని వదలాలి. కొన్ని భయాలు ఉండాలి. ధర్మం తప్పుతానేమో, ఇతరులకి నా పనుల వల్ల బాధ కలుగుతుందేమో, కర్తవ్యనిర్వహణలో ఏమరుపాటు కలుగుతుందేమో .. వంటివి ఆరోగ్యకరమైన భయాలు. భయం అన్నది ప్రమాదాలని కొని తెచ్చుకోకుండా కాపాడటానికి ప్రకృతి సర్వజీవులకు ప్రసాదించిన వరం. జంతువులకు భయం వర్తమాన కాలానికి మాత్రమే పరిమితమై ఉంటుంది తరచుగా. కాని, మనిషి మాత్రం భూత భవిష్యత్ కాలాలలోకి కూడా భయాన్ని విస్తరింప చేయ గలడు. జరిగిపోయిన దానిని తలుచుకుని, మళ్ళీ అట్లా అవుతుందేమోనని భయం. జరిగింది మంచి అయితే మళ్ళీ అట్లా జరగదేమోనని భయం. వృద్ధాప్యంలో పిల్లలు చూడరేమోనని భయం. వాళ్ళ చిన్నతనంలో సరిగా చదవరేమో, అందరిలో అవమానం పాలు అవాలేమో, వాళ్ళకి తగిన ఉద్యోగం వస్తుందో రాదో, సరైన సంబంధాలు కుదురుతాయో లేదో... ఇలా సాగుతూ ఉంటాయి. వాటికోసం తగిన ప్రయత్నం చేయాలి కాని భయపడితే ఏం ప్రయోజనం? – డా. ఎన్. అనంత లక్ష్మి -
సిగరెట్ అక్రమ రవాణా.. చర్యలు తీసుకోవాలన్న ప్రతినిధులు
ప్రభుత్వ ఖజానాకు ఏటా దాదాపు రూ.13,000 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతున్న సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ (ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్) గతంలో ప్రభుత్వాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. అక్రమ రవాణా ప్రక్రియలో భాగంగా నేరాలు కూడా పెరుగుతున్నట్లు మెమోరాండంలో పేర్కొన్నారు. సిగరెట్ స్మగ్లింగ్‌ను అరికట్టడానికి పన్నులను తగ్గించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో వాణిజ్య పంటల సాగులో ఉన్న లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులకు అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇదీ చదవండి: ఓవెన్ సైకిళ్లు వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి.. అక్రమ రవాణాను అరికట్టడానికి పసిడిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నారన్న వార్తలను అసోసియేషన్ ప్రస్తావిస్తూ, ఇదే రకమైన చర్యలు సిగరెట్ పరిశ్రమకు సంబంధించి ఉండాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఫోన్ల స్మగ్లింగ్ నిరోధానికీ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఫోన్ అక్రమ రవాణా వల్ల కేంద్ర ఖజానాకు సుమారు 3వేలకోట్ల నష్టం వాటిల్లుతుండగా, సిగరెట్ అక్రమ రవాణా విషయంలో ఈ మొత్తం సుమారు రూ.13వేలకోట్లు ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టేలా బడ్జెట్లో చర్యలుంటాయని ఆశిస్తున్నారు. -
అలాంటివేం లేవు.. టెస్లాకు షాకిచ్చిన భారత ప్రభుత్వం
అమెరికా విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ కార్ల దిగుమతిపై సుంకం రాయితీలు, స్థానిక విలువ జోడింపు మినహాయింపుల ప్రతిపాదనలేవీ పరిగణగించడం లేదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం నుంచి టెస్లా పలు రాయితీలు, మినహాయింపులు ఆశిస్తున్న విషయం తెలిసిందే. భారీ బ్యాటరీలు, సెమీకండక్టర్లు, అయస్కాంత భాగాలపై స్థానిక విలువ జోడింపు నుంచి టెస్లా, ఇతర బహుళజాతి కార్ కంపెనీలను మినహాయించే ప్రతిపాదన ఏదైనా ఉందా అంటూ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై విధించే సుంకంపై రాయితీ కూడా ఏమీ ఉండదని తెలిపారు.. ఇది కూడా చదవండి: AI warning: బ్యాంకులకూ ముప్పు తప్పదా? హెచ్చరిస్తున్న జెరోధా సీఈవో నితిన్ కామత్ భారత ప్రభుత్వం రూ.25,938 కోట్ల బడ్జెట్ వ్యయంతో ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించిందని పేర్కొన్న ఆయన ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడి భాగాలతో సహా రేపటితరం ఆటోమోటివ్ టెక్నాలజీస్ ఉత్పత్తుల్లో దేశీయ తయారీని పెంచడమే లక్ష్యంగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు వివరించారు. -
డిపాజిటర్ల సొమ్ము: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం బ్యాంకుల ప్రధానవిధి అని రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బ్యాంకులో వారి సొమ్మను కాపాడటం అనేది అది పవిత్రమైన విధి, మన కిష్ట దైవాన్ని సందర్శించడం కంటే చాలా ముఖ్యమైనదని ఆర్బిఐ గవర్నర్ వెల్లడించారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ చిన్న పొదుపుదారులు, మధ్యతరగతి, పదవీ విరమణ చేసిన వారి డిపాజిట్లపై ఆధారపడినందున ఇది చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల (యుసిబి) డైరెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించిన శక్తి కాంత దాస్ బ్యాంకుల బాధ్యతను గుర్తు చేశారు. అయితే ఆగస్టు 30న గవర్నర్ ప్రసంగం చేయగా, ఆ వీడియోను ఆర్బీఐ సోమవారం యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ బ్యాంకు అతి ముఖ్యమైన బాధ్యత. ఇది పవిత్రమైన విధి. గుడి , మసీదు, గురుద్వారా మరే ఇతర మతపరమైన పవిత్ర ప్రదేశానికి వెళ్లి నమస్కరించడం లాంటివాటి కంటే కూడా పవిత్రమైందని తాను నమ్ముతానని చెప్పారు. అఆగే డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందా అనేది పర్యవేక్షిస్తూ, బ్యాంకులతో కలిసి పనిచేయడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యతఅని, దీనికి సంబంధించి ఎప్పటికపుడు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండాలని, ఈ రంగంలో యూసీబీలు ముఖ్యమైన భాగమని కూడా ఆయన గుర్తు చేశారు. ముఖం్యంగా సహకార బ్యాంకింగ్ స్థలంలో, ఎంటిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, డిపాజిటర్ సొమ్ము నిలిచిపోయిన సందర్భాలు ఎ క్కువవుతున్న తరుణంలో గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
పోలీసు సేవలకు సలాం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఏపీ పోలీసులకు మంగళవారం విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినో త్సవంలో సీఎం జగన్ పతకాలు అందజేశారు. 2021, 2022, 2023కు సంబంధించి 65 మంది పో లీసులు కేంద్రం పరిధిలో ప్రకటించిన ప్రెసిడెంట్ పో లీస్ మెడల్(పీపీఎం), పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్విస్(పీఎం), పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ (పీ ఎంజీ), అసాధారణ్ ఆసూచన కుశ లత పదక్‌తో పా టు ముఖ్యమంత్రి శౌర్య పతకాలను అందుకున్నారు. పీపీఎం 2021–22: భావనాసక్సేనా (జాయింట్ సె క్రటరీ, విదేశాంగ శాఖ, న్యూఢిల్లీ), వెంకటరామిరెడ్డి, (ఐజీపీ–శిక్షణ), పి.సీతారాం(గ్రేహౌండ్స్ క మాండెంట్), ఎన్.సుధాకర్‌రెడ్డి (ఎస్డీపీఓ, పలమనేరు) పీఎం 2021–22: ఎస్వీ రాజశేఖరబాబు (డీఐజీ, లా అండ్ ఆర్డర్), ఎం.రవీంద్రనాథ్‌బాబు(ఏఐజీ, లా అండ్ ఆర్డర్), కె.రఘువీర్‌రెడ్డి(ఎస్పీ, నంద్యాల), కేఎస్వీ సుబ్బారెడ్డి(కమాండెంట్, 6 బెటాలియన్), కె.నవీన్‌కుమార్(ఏఎస్పీ, గ్రేహౌండ్స్), కె.సుబ్రహ్మ ణ్యం (ఏడీసీపీ, విశాఖ), వి.వి.నాయుడు(ఏసీపీ దిశ, విజయవాడ), సీహెచ్.రవికాంత్ (ఏసీపీ, ఎస్బీ విజ యవాడ), జి.రవికుమార్(డీఎస్పీ, సీఐడీ), కె.వి.రా జారావు, (డీఎస్పీ పీటీఓ), జె.శ్రీనివాసులురెడ్డి (ఎస్ డీపీఓ, నెల్లూరు), వి.శ్రీరాంబాబు(డీఎస్పీ, సీఐడీ), కె.విజయపాల్ (ఎస్డీపీఓ, రాజమండ్రి), సి.శ్రీనివాసరావు (డీఎస్పీ దిశ, ప్రకాశం), జి.వీరరాఘవరెడ్డి (ఎస్డీపీఓ, మార్కాపురం), వై.రవీంద్రరెడ్డి (ఏఆర్ డీఎస్పీ, తిరుపతి), పి.వి.హనుమంతు(అసిస్టెంట్ క మాండెంట్, 6వ బెటాలియన్), బి.విజయ్‌కుమార్ (అసిస్టెంట్ కమాండెంట్, గ్రేహౌండ్స్), బి.గుణరా ము (సీఐ, విజయవాడ), ఎం.కోటేశ్వరరావు (ఎస్ఐ, శ్రీకాకుళం), జి.కృష్ణారావు(ఎస్ఐ, విజయవాడ), ఆర్.రామనాథం, (ఆర్ఎస్ఐ, విజయవాడ), ఇ.శివశంకర్‌రెడ్డి (ఆర్ఎస్ఐ, 2వ బెటాలియన్), ఎం.వెంకటేశ్వర్లు(ఏఆర్ఎస్ఐ, నెల్లూరు), ఎస్.సింహాచలం (ఏఆర్ఎస్ఐ, 3వ బెటాలియన్), టి.నరేంద్రకుమార్ (ఏఎస్ఐ, గుంటూరు), పి.భాస్కర్(ఏఎస్ఐ, కడప), ఎన్.శ్రీనివాస్(ఏఎస్ఐ, కొవ్వూరు), ఎస్.వీరాంజనేయులు(ఏఎస్ఐ, విజయవాడ). పీఎంజీ 2021: ఆర్.రాజశేఖర్ (డీఏసీ), సీహెచ్.సాయిగణేశ్ (డీఏసీ), కె.పాపినాయుడు (ఎస్ఐ, అనకాపల్లి), డి.మబాషా (ఏఏసీ), టి.కేశవరావు(హెచ్‌సీ, ఎస్ఐబీ), ఎం.మునేశ్వరరావు (గ్రేహౌండ్స్ ఎస్సీ), గ్రేహౌండ్స్ జేసీల్లో ఎస్.బుచ్చిరాజు, జి.హరిబాబు, బి.చక్రధర్, ఎం.నాని, పి.అనిల్ కుమార్. అసాధారణ్ ఆసూచన కుశలత పదక్ 2022: సి.శ్రీకాంత్ (ఐజీపీ, సీఐడీ), ఎ.బాబ్జీ (ఎస్ఐబీ, ఎస్పీ), ఇ.జి.అశోక్ కుమార్(ఏఎస్పీ, ఎస్ఐబీ), ఎ.వెంకటరావు(డీఎస్పీ, తీవ్రవాద విభాగం, విశాఖ), కె.నిరీక్షణరావు(ఎస్ఐ, ఎస్ఐబీ). ముఖ్యమంత్రి శౌర్య పతకం(2023): బి.సుధాకర్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్), కె.విజయశేఖర్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఐబీ), కె.హరీష్ (ఆర్ఎస్ఐ), పి. రమేశ్(ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ), టి.రవికుమార్(ఎస్ఐ, గ్రేహౌండ్స్), గ్రేహౌండ్స్ ఆర్ఎస్ఐలు టి.సత్యనారా యణ, పి.సతీశ్‌కుమార్, సీహెచ్.శివ, గ్రేహౌండ్స్ ఎ స్పీలు షామలరావు, రవి, నాగరాజు, గ్రేహౌండ్స్ జే సీలు ఎస్కే కరీం బాషా, బి.వాసుదేవ రెడ్డి, సయ్యద్ హబీబుల్లా, ఎస్.సిద్దయ్య, ఎం.గౌరునాయుడు. -
లీవు లేకుండా 74 ఏళ్లుగా ఉద్యోగం..! 16 ఏళ్ల వయసులో ఎంట్రీ
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మహిళ ఉద్యోగానికి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా ఏకంగా 74 ఏళ్లపాటు విధులకు హాజరయ్యారు. మెల్బా మెబానె 16 ఏళ్ల వయసులో 1949లో టైలర్ అనే స్టోర్‌లో ఉద్యోగంలో చేరారు. 1956లో ఆ సంస్థను డిలార్డ్ సొంతం చేసుకుంది. లిఫ్ట్ ఆపరేటర్‌గా జాయినయి దుస్తులు, కాస్మటిక్ విభాగంలో 74 ఏళ్లపాటు పనిచేశారు. 90 ఏళ్ల వయసులో ఇటీవలే రిటైరయ్యారు. ఇప్పుడిక మంచి ఆహారం తీసుకుంటూ, ప్రయాణాలు చేస్తూ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని అన్నారు. -
టెన్త్ స్పాట్‌కు తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనానికి తిప్పలు తప్పడం లేదు. ఓవైపు ఇబ్బందులు, మరోవైపు టీచర్ల అనాసక్తి కారణంగా జవాబు పత్రాలను దిద్ది మార్కులు వేసే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కొందరు టీచర్లు అనారోగ్యమనో, మరో అత్యవసర కారణమో చూపుతూ స్పాట్ వ్యాల్యూయేషన్‌ను తప్పించుకుంటున్నారని.. మరికొందరు చెప్పకుండానే హాజరుకావడం లేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలూ ఉండటం లేదని, అసలే వేసవి కావడంతో తీవ్రంగా అవస్థలు పడుతున్నామని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ వేసినా కూడా.. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే టెన్త్ పరీక్షలు ముగిశాయి. స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను గురువారం నుంచి మొదలు పెట్టారు. గతంలో మూల్యాంకన కేంద్రాలు 12 ఉంటే, ఈసారి 18కి పెంచారు. జిల్లా ల వారీగా సబ్జెక్టు, లాంగ్వేజ్ నిపుణులను మూ ల్యాంకన విధులకు తీసుకున్నారు. సాధారణంగా విద్యాశాఖ అధికారులు మూల్యాంకన ప్రక్రియ మొదలవడానికి కేవలం రెండు రోజుల ముందుగా టీచర్లకు విధులు వేస్తుంటారు. ఈసారి కూడా అలా గే చేశారు. అయితే డ్యూటీ వేశారని తెలియడంతోనే కొందరు టీచర్లు నేరుగా వైద్యులను సంప్రదించి, ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు మెడిక ల్ సర్టిఫికెట్ తీసుకొచ్చి.. మూల్యాంకనం విధుల నుంచి తప్పించాలని కోరారు. మరికొందరు తొలి రోజు విధులకు హాజరవ్వలేదు. కరీంనగర్, ఆదిలా బాద్ జిల్లాలో ఎక్కువ మంది ఇలా డుమ్మా కొట్టడంతో అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. కఠినంగా వ్యవహరించాల్సిందే.. మూల్యాంకన విధులకు హాజరవని టీచర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. బలమైన కారణాలుంటే తప్ప, మెడికల్ సర్టిఫికెట్లను అనుమతించకూడదని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే కొన్ని సంఘాల నేతలు తమ వారిని విధుల నుంచి తప్పించాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆన్లైన్ మూల్యాంకన విధానం చేపడితే ఈ తిప్పలు ఉండవని.. విద్యాశాఖ ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. మొత్తంగా 30 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండగా.. వివిధ సమస్యలతో ఈ ఏడాది స్పాట్ వాల్యూయేషన్ ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది టెన్త్ ఫలితాల వెల్లడిపైనా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ విషయమై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. టీచర్లు చెప్తున్న ఇబ్బందులేమిటి? ♦ మూల్యాంకనం చేసే జవాబుపత్రాలకు ఒక్కోదానికి రూ.10 చెప్పున టీచర్లకు చెల్లిస్తారు. ఒక్కో టీచర్ రోజుకు 36 కన్నా ఎక్కువ సమాధాన పత్రాలను దిద్దలేరు. దూరప్రాంతాల నుంచి వచ్చే టీచర్లకు టీఏ, డీఏలేమీ ఇవ్వడం లేదు. పైగా మూల్యాంకన కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉండాలి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అని కొందరు టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ♦ మూల్యాంకన కేంద్రాలను ఎక్కువగా ప్రైవేటు స్కూళ్లలో ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థు లు కూర్చునే చిన్న బల్లలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాటిపై కూర్చుని పేపర్లు దిద్దడం కష్టంగా ఉంటోందని, వెన్నునొప్పి వస్తోందని టీచర్లు అంటున్నారు. ♦ ఈసారి ఆరు పేపర్లతోనే టెన్త్ పరీక్షలు నిర్వహించారు. గతంలో మొత్తంగా 11 పేపర్లు ఉండేవి. దీనితో ఎక్కువ పేపర్లు మూల్యాంకనం చేసే అవకాశం ఉండటం లేదని అంటున్నారు. ♦ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాలకు టీచర్లు కచ్చితంగా ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా క్యాంపు ఆఫీసర్లు గేటు వద్దే ఆపేస్తున్నారు. దీన్ని టీచర్లు అవమానంగా భావిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ కష్టాలు చూడకుండా నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
'సహాయం చేయడమే మా కర్తవ్యం': మోదీ
తుర్కియే, సిరియాలో ఫిబ్రవరి 6న భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు భారత బలగాలు భూకంప ప్రభావిత దేశానికి సహాయా సహకారాలు అందించేందుకు సమయాత్తమయ్యాయి. అందులో భాగంగా ఆపరేషన్ దోస్త్ పేరుతో మొత్తం మూడు ఎన్డీఆర్ఎప్ బృందాలు ఫిబ్రవరి 7న ప్రభావిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి. అంతేగాదు భూకంప బాధిత ప్రజలకు విస్తృతమైన సేవలందించడానికి భారత సైన్యం, వైద్య బృందం భారీ సంఖ్యలో మోహరించి సహాయ సహకారాలు అందించింది. ఈ క్రమంలో టర్కీ నుంచి తిరిగి వచ్చిన సిబ్బందిని ఉద్దేశించి మోదీ మీరు మానవాళికి గొప్ప సేవ చేశారని, అలాగే భారతదేశాన్ని గర్వించేలా చేశారని అన్నారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్ వేదికగా...మేము ప్రంపంచాన్ని కుటుంబంగా పరిగణిస్తాం. సంక్షోభంలో ఉన్న ఏ సభ్యునికైనా.. త్వరగా సహాయం చేయడం మా కర్తవ్యంగా భావిస్తాం. భారతదేశం గత కొన్నేళ్లుగా స్వయం సమృద్ధి కలిగిన దేశంగా తన గుర్తింపును బలోపేతం చేసిందని, ఇది నిస్వార్థంగా ఇతర దేశాలకు సహాయం చేస్తోంది. ప్రపంచంలో ఏ సంక్షోభం వచ్చినా.. మొదట స్పందించేందకు భారత్ ఎప్పుడూ సదా సిద్దంగానే ఉంటుంది. అలాగే ప్రపంచంలోనే అత్యుత్తమ రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్‌గా మన గుర్తింపును పటిష్టం చేసుకోవాలి. అలాగే విపత్తు ప్రతిస్పందన సహాయక చర్యల్లో మన బలగాల కృషి అభినందనీయమని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా అంతకు ముందురోజే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో...టర్కీలో ఆపరేషన్ దోస్త్ కింద మోహరించిన భారత సైన్యం, వైద్య బృందం భారత్‌లోకి తిరిగి వచ్చింది. సుమారు 151 ఎన్డీఆర్ఎప్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్లతో కూడిన మూడు బృందాలు భూకంప ప్రభావిత టర్కీయేకు సహాయం అందించాయి. అని పేర్కొన్నారు. (చదవండి: పెళ్లికి ముందు రోజే వధువు కాలికి ఆపరేషన్.. ఆస్పత్రి వార్డులో తాళికట్టిన వరుడు) -
Nepal Plane Crash: వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన
నేపాల్ విమానా ఘటన తర్వాత పలువురు గురించి వస్తున్న ఆసక్తికర విషయాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ఆ ఘటన బాధిత కుటుంబాలకు అంత తేలిగ్గా మర్చిపోలేని అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆ దుర్ఘటన రోజు విధులు నిర్వర్తించేందకు వెళ్లిన ఫ్లైట్ అటెండెంట్ ఓషిన్ అలే మగర్ది మరో విషాద గాథ. ఆ ఫ్లైట్ అటెండెంట్ అలే మగర్ రెండేళ్లుగా యతి ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తోంది. ఆమె ఖట్మాండ్లో తన కుటుంబంతో నివశిస్తోంది. వాస్తవానికి ఆరోజు విధులు నిర్వర్తించాల్సింది కాదు. ఇంట్లో తండ్రి మోహన్ అలే మగర ఆమెను ఆరోజు డ్యూటీ మానేయమని, సంక్రాంతి పండుగ చేసుకుందామని చెప్పారు. అయినా సరే ఆమె పట్టుపట్టి మరీ ఆ రోజు విధులకు వెళ్లింది. పైగా తాను రెండు విమానాల్లో చేయాల్సిన డ్యూటీని ముగించుకుని సంక్రాంతి రోజుకల్లా వచ్చేస్తానంటూ వెళ్లిందన ఆమె తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. కచ్చితంగా సంక్రాంతి రోజున ఇంట్లోనే ఉంటానని హామీ ఇచ్చిందంటూ విలపించారు. అంతలోనే ఈ ప్రమాదం బారిన పడి కానరాని లోకాలకు వెళ్లిపోయిందని ఆవేదనగా చెప్పారు. ఆమెకు పెళ్లై రెండేళ్లే అయ్యిందని, ఆమె భర్త యూకేలో ఉన్నట్లు తెలిపారు. ఐతే ఇప్పుడూ ఆ ఫ్టైల్ అటెండెంట్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..నెటిజన్లు ఆ యతి ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోడానికి కొన్ని క్షణాల ముందు రికార్డు చేసిన వీడియో అని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇది గతేడాది సెప్టెంబర్ 11న రికార్డు చేసిన వీడియో అని, విమానం క్రాష్ జరగడానికి ముందు తీసినది కాదని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేసిన వీడియో ఆధారంగా తెలుస్తోంది. కాగా, నేపాల్‌లో ఆదివారం యతి ఎయిర్‌లైన్ ఏటీఆర్ 72 విమానం కూలి సుమారు 68 మంది దాక మృతి చెందిన సంగతి తెలిసిందే. The Air hostess in #YetiAirlinesCrash Live life to the fullest as long as you are alive because death is unexpected! Just sharing TikTok video of Air Hostess Oshin Magar who lost her life in #NepalPlaneCrash today जहां भी रहो ऐसे ही रहो! Rest in Peace !!💐#Nepal #planecrash pic.twitter.com/Bh6DBDnhnt — Deep Ahlawat 🇮🇳🎭 (@DeepAhlawt) January 15, 2023 (చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు) -
వీఆర్ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు
► వీఆర్ఏ ఏం చేయాలి..?: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గ్రామంలో రెవెన్యూ సంబంధ వ్యవహారాలు చూసే ఉద్యోగి. ప్రభుత్వ భూముల రక్షణ, పంటల విస్తీర్ణం వివరాల సేకరణ, పంచనామాల నిర్వహణ వంటి పనులు చేయాలి. అధికారిక వ్యవహారాల్లో పైఅధికారులకు సహకరించాలి. ► మరి ఇప్పుడేం చేస్తున్నారు?: పైఅధికారుల ఇల్లు ఊడ్వటం, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, కూరగాయలు తేవడం, వంట చేయడం, అధికారి సొంత కారుకు డ్రైవర్‌గా పనిచేయడం.. ఇలాంటి పనులెన్నో చేస్తూ అనధికారిక ‘పాలేర్లు’గా మారిపోయారు. ► ఎందుకీ సమస్య?: రెవెన్యూ శాఖలో వీఆర్వో వ్యవస్థ రద్దయిన తర్వాత వీఆర్ఏలకు సర్వీస్‌రూల్స్ రూపొందించకపోవడంతో.. జిల్లా కలెక్టర్లు మొదలుకొని డిప్యూటీ తహసీల్దార్ల దాకా వీఆర్ఏలను సొంత పనులకు వాడుకుంటూ.. కొత్త ‘ఆర్డర్లీ’వ్యవస్థకు తెరతీసిన తీరు వివాదస్పదంగా మారింది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో 23 వేల మంది వీఆర్ఏలున్నారు. కొత్త రెవెన్యూ చట్టం–2020 ప్రకారం వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ గ్రామాల్లో వీఆర్ఏల(గ్రామ రెవెన్యూ సహాయకుల)ను కొనసాగించాలని నిర్ణయించింది. మొదట్లో వారు గ్రామాల్లో ఉంటూ ప్రభుత్వ భూముల రక్షణ, పంటల విస్తీర్ణం వివరాల సేకరణ, కోర్టు సమన్లను అందచేయటం, పంచనామాల నిర్వహణ వంటి పనులు చేసేవారు. ప్రస్తుతం వారికి కొత్త విధులు అప్పగించకపోవటం, వారి డ్యూటీ ఏమిటనేది తేల్చకపోవడంతో.. అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో అన్నిపనులకు వినియోగిస్తున్నారు. స్వీపర్లు మొదలుకుని డ్రైవర్లు, వంట మనుషులు, నైట్ వాచ్మన్ల దాకా పని చేయించుకుంటున్నారు. వాస్తవానికి అర్హతల మేరకు వీఆర్ఏలను ఖాళీగా ఉన్న ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపేందుకు 2017 ఫిబ్రవరి 24న ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. కాదంటే భయం.. చేయలేక ఆగమాగం..: వీఆర్ఏలకు చాలా కాలంగా సర్వీస్ రూల్స్ అంటూ లేకపోవటంతో పైఅధికారులు ఏది చెప్తే అది చేయక తప్పని పరిస్థితిలో ఉన్నారు. కొన్నిసార్లు మరీ ఇంట్లో పనిమనుషులుగా కూడా వాడుకుంటున్నారు. చేయబోమని ఎవరైనా అంటే.. దూర ప్రాంతాలకు బదిలీ చేయడం లేదా ఆర్డీవో, జిల్లా కలెక్టరేట్లకు సరెండెర్ చేయడం వంటి కక్షసాధింపు చర్యలకు కొందరు అధికారులు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చెప్పిన పనులు చేయలేక ఓ వైపు.. కాదంటే ఏ ఇబ్బంది ఎదురవుతుందోననే ఆందోళనతో మరోవైపు వీఆర్ఏలు మానసిక క్షోభకు గురవుతున్నారు. పోటీ పరీక్షలో గెలిచి వచ్చినా.. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్ఏలలో 2,900 మంది రాతపరీక్ష ద్వారా నేరుగా ఎంపికయ్యారు. మిగతా వారు వంశపారంపర్యంగా కొనసాగుతున్న వారు. వారికి ప్రతినెలా రూ.10,500 వేతనం చెల్లిస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి, పోటీపరీక్ష ద్వారా ఉద్యోగం పొందినవారు కూడా ఇప్పుడు అధికారుల ఇళ్లలో పనిచేయాల్సి రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు తగిన విధులు అప్పగించడంగానీ, ఇతర శాఖల్లో విలీనం చేయడంగానీ చేస్తే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చని పేర్కొంటున్నారు. వీలైనంత త్వరగా డ్యూటీ చార్ట్, సర్వీసు రూల్స్ ప్రకటించాలని కోరుతున్నారు. టెన్నిస్ కోర్టు బాల్ బాయ్స్‌గా.. ఇటీవల నిర్మల్ జిల్లా కేంద్రంలో వీఆర్ఏలకు టెన్నిస్ కోర్టు బాల్ బాయ్స్‌గా డ్యూటీలు వేశారు. రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రతిరోజు సాయంత్రం లాన్ టెన్నిస్ ఆడే సమయంలో.. అటూఇటూ వెళ్లిపోయిన బంతులను తెచ్చి ఇచ్చేందుకు రోజుకు ముగ్గురి చొప్పున వారానికి ఇరవై ఒక్క మంది వీఆర్ఏలకు అధికారికంగా డ్యూటీలు వేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చస్తూ బతుకుతున్నం ఎంకాం చదువుకుని, డీఎస్సీ ద్వారా పోటీ పరీక్ష రాసి వీఆర్ఏగా ఎంపికయ్యా. ఇప్పుడు మా పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ పని చెబితే ఆ పని చేయాల్సి ఉంటుంది.ఉన్నత చదువులు చదివిన వారంతా ఈ ఉద్యోగాన్ని ఎంచుకుని చస్తూ బతుకుతున్నరు. సర్వీస్ రూల్స్ కోసం ఎదురు చూస్తున్నం. – ఎ.వెంకటేశ్‌యాదవ్, వీఆర్ఏ, జిన్నారం బానిసల కంటే అధ్వానం మాకు రెవెన్యూ విధులు మినహా ఇతర పనులేవీ చెప్పొద్దని సీసీఎల్ఏ ఉత్తర్వులు (ఏ2–1635–2012) ఉన్నా వాటిని ఎవరూ పాటించడం లేదు. ఉన్నత ఆశయంతో పోటీపరీక్ష రాసి ఉద్యోగంలో చేరిన మాకు.. ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. ఆడ, మగ తేడా లేకుండా అధికారులు అప్పగించిన పనులన్నీ చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల బానిస కంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. – రమేశ్బహదూర్, వీఆర్ఏ, తిమ్మాజిపేట పనిఒత్తిడి, ఇతర సమస్యలకు బలి.. – మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో నైట్ వాచ్‌మన్ డ్యూటీలో ఉన్న వీఆర్ఏ దుర్గం బాపురావు హత్యకు గురయ్యాడు. – యాదాద్రి జిల్లా పులిగిల్లలో నైట్ డ్యూటీకి వెళుతూ వీఆర్ఏలు పల్లెర్ల పురుషోత్తం, ఈదుల కిష్టయ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. – నిజామాబాద్ జిల్లా ఖండిగావ్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గౌతమ్ హత్యకు గురయ్యాడు. – మాచారెడ్డి, ఘనపూర్ తహసీల్దార్‌కు డ్రైవర్‌గా పనిచేస్తూ చల్లా రమేష్ పనిఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. – నిజామాబాద్ జిల్లా పెగడపల్లిలో పనిఒత్తిడితో హర్షవర్ధన్ బలవన్మరణానికి పాల్పడ్డారు. -
మహిళా పోలీసుకు డిప్యూటీ తహసీల్దార్ లైంగిక వేధింపులు
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ఊటీలో మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు ఇచ్చిన డిప్యూటీ తహసీల్దార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఊటీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాబు (35) డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి సాయంగా ఓ మహిళా పోలీసు సహా ఇద్దరు పోలీసులను కేటాయించారు. మగ కానిస్టేబుల్ వాహనాలను తనిఖీ చేయమని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళా పోలీసును డిప్యూటీ తహసీల్దారు లైంగిక వేధించినట్లు తెలిసింది. ఆమె దీనిని ఖండించారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో బాధితురాలు ఊటీలో ని మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు డిప్యూటీ తహసీల్దారును అరెస్టు చేశారు. చదవండిః ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు -
5 నెలల గర్భంతో డ్యూటీ చేస్తున్న డీఎస్పీ
-
ప్రసవం అయిన 14 రోజులకే విధుల్లోకి!
లక్నో : ‘సృష్టిలో దేవుడు స్త్రీకి అత్యంత శక్తిని ఇచ్చాడు. బిడ్డలను కనడమే కాదు వారి పాలనను కూడా అంతే సక్రమంగా చూస్తుంది’ అంటోంది ఐఎఎస్ అధికారి సౌమ్య పాండే. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ఐఏఎస్ అధికారి సౌమ్య పాండే ప్రసవం అయిన 14 రోజులకే తిరిగి విధుల్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. కుమార్తెతో డ్యూటీ చేస్తున్న సౌమ్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చదవండి: ఆమ్రపాలి: ఒంగోలు టూ పీఎంవో బిజీగా మహమ్మారి పనులు.. ‘కోవిడ్–19 సమయంలో సక్రమంగా పనులు చేయడం మనందరి కర్తవ్యం’ అంటున్న సౌమ్య కరోనా సమయంలో ఎస్డీఎం అధికారిగా నియమించబడ్డారు. డెలివరీ అయిన 14 రోజుల తరువాత తన మూడు వారాల కుమార్తెతో కార్యాలయానికి వచ్చి, పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ– ‘గ్రామంలోని మహిళలు గర్భధారణ సమయంలో ఇంటి సంబంధిత పనులన్నీ చేస్తారు. ప్రసవించిన తరువాత ఆ పనులతో పాటు పిల్లల సంరక్షణ కూడా చేస్తారు. అదేవిధంగా, నా మూడు వారాల శిశువుతో పరిపాలనా పని చేయగలుగుతున్నాను. చదవండి: ఘజియాబాద్‌లో బీజేపీ బంధువు దారుణ హత్య ఈ పరిస్థితులలో నా కుటుంబం నాకు మద్దతు ఇచ్చింది. తహసీల్, ఘజియాబాద్ జిల్లా పరిపాలన నాకు ఒక కుటుంబం లాంటిది. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఘజియాబాద్‌లో ఎస్డిఎమ్ ఆఫీసర్‌గా ఉన్నాను. సెప్టెంబరులో నా ఆపరేషన్ సమయంలో 22 రోజుల సెలవు వచ్చింది. ప్రసవించిన రెండు వారాల తర్వాత నేను తహసీల్‌లో చేరాను. ఈ అంటువ్యాధి సమయంలో పనిచేసేటప్పుడు ప్రతి గర్భిణీ స్త్రీల అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల’ని సౌమ్య పాండే సూచనలు చేసింది. -
మొబైల్ రేట్లకు రెక్కలు!
సాక్షి,న్యూఢిల్లీ: డిస్ప్లేల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం 1 శాతం సుంకం విధించిన నేపథ్యంలో మొబైల్ ఫోన్ల ధరలు 3శాతం దాకా పెరిగే అవకాశం ఉందని ఇండి యా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. యాపిల్, హువావే, షావోమి, వివో, విన్స్ట్రాన్ వంటి సంస్థలకు ఇందులో సభ్యత్వం ఉంది. ‘మొబైల్ ఫోన్ల రేట్లపై 1.5-3 శాతం దాకా సుంకాల ప్రభావం ఉంటుంది‘ అని ఐసీఈఏ నేషనల్ చైర్మన్ పంకజ్ మహీంద్రూ ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ప్రస్తుతం దిగుమతులను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా మార్కెట్ వాటాను కూడా పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దశలవారీగా తయారీని ప్రోత్సహించే కార్యక్రమంలో (పీఎంపీ) భాగంగా డిస్ప్లే అసెంబ్లీ, టచ్ ప్యానెళ్లపై అక్టోబర్ 1 నుంచి దిగుమతి సుంకాలను అమలు చేయాలని 2016లోనే కేంద్రం నిర్ణయించింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, దేశీయంగా తయారీ పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం పీఎంపీని తెరపైకి తెచ్చింది. వేదాంత గ్రూప్ చైర్మన్ వల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ సుమారు రూ. 68,000 కోట్ల పెట్టుబడితో 2016లో ట్విన్‌స్టార్ డిస్ప్లే టెక్నాలజీస్ పేరుతో దేశీయంగా తొలి ఎల్సీడీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్టు మొదలుకాలేదు. -
ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మళ్లీ బడి బాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీ, హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రతి సోమ, మంగళవారాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ప్రాథమిక పాఠశాల టీచర్లు వారంలో ఒక రోజు ప్రతి మంగళవారం హాజరు కావాలని పేర్కొంది. బ్రిడ్జి కోర్సులను రూపొందించేందుకు హాజరుకావాలని ప్రభుత్వం వెల్లడించింది. నాడు-నేడు పనులు అన్ని స్కూళ్లల్లో ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
విధులకు 7 నెలల గర్భిణి
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని డిపోకు చెందిన ఏడు నెలల గర్భిణి అయిన కండక్టర్ సుమలత శుక్రవారం విధులకు హాజరయ్యారు. 55 రోజుల సమ్మె, సెప్టెంబరు నెల వేతనం లేకపోవడం, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తాను విధులకు హాజరైనట్లు సుమలత తెలిపారు. కాగా, మంథనికి చెందిన స్థానికుడు మారుపాక సత్యనారాయణ.. సుమలతకు రూ.5 వేల నగదు, పండ్లు, బట్టలు అందించారు -
విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులు
సాక్షి, కరీంనగర్/ఆదిలాబాద్/నిజామాబాద్: ఆర్టీసీలో నవ శకం మొదలైంది. 55 రోజుల తర్వాత తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది డిపోల పరిధిలో 3,800 మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆరు డిపోల వద్ద శుక్రవారం ఉదయం 3.30 గంటల నుంచి ఇప్పటివరకు దాదాపు 15 మంది కండక్టర్లు,డ్రైవర్లు విధుల్లోకి చేరారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు 5 గంటల నుంచే డ్రైవర్లు,కండక్టర్లు తొలి షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్ కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల డిపోలో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరారు. మెదక్ జిల్లాలో 2,890, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,098 మంది కార్మికులు విధుల్లోకి చేరారు. ఖమ్మం టౌన్: ఖమ్మం డిపోలో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరవుతున్నారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 2600 మంది విధులకు హాజరుకానున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కార్మికులు విధులకు హాజరయ్యారు. చదవండి: డ్యూటీలో చేరండి -
ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు
సాక్షి, సిరికొండ: డిసెంబర్ మొదటి వారంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈవీఎం యంత్రాలు, వీవీప్యాట్లు జిల్లాకు చేరుకున్నాయి. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. 42 అంశాలతో ప్రతి ఎన్నికల సిబ్బంది వివరాలను అధికారులు వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. అలాగే ఎన్నికల భత్యాన్ని నేరుగా సిబ్బంది ఖాతాలకు జమ చేయడానికి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల అకౌంట్ నంబర్లను కూడా సేకరిస్తున్నారు. జిల్లాలో ఎన్నికల సన్నద్ధత, ఉద్యోగుల వివరాల సేకరణపై ప్రత్యేక కథనం.. అధికారులకు శిక్షణ పూర్తి ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 17,88,036 మంది ఓటర్లు ఉన్నారు. 1,903 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. జిల్లా స్థాయిలో ఇప్పటికే కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు, ఈవీఎంలు గోదాంలకు చేరుకున్నాయి. ఆయా ఈవీఎం, వీవీప్యాట్ల తొలిదశ పరిశీలన పూర్తయింది. జిల్లా స్థాయి అధికారులైన ఈఆర్వో, ఏఈఆర్వోలకు శిక్షణ పూర్తయింది. ఎన్నికల అధికారులు, ఎన్నికల సిబ్బందికి సంబంధించిన కరదీపికలు జిల్లాకు చేరుకున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యోగుల వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం ఈ ఎన్నికల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల పూర్తి వివరాలు అధికారులు ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. 42 అంశాల వారీగా ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగుల ఓటరు గుర్తింపు కార్డులు మొదలుకొని బ్యాంకు ఖాతా నంబర్ వరకు ప్రతి ఒకటి ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఉద్యోగి పేరు. శాఖ గ్రామం, సొంత మండలం, నియోజకవర్గం, విధుల్లో ఎప్పుడు చేరారు, పదవీ విరమణ ఎప్పుడు, ఇంతకు ముందు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారా, జీతభత్యాలు, ఎలక్టోరల్ సంఖ్య, బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ కోడ్ మొదలైన వివరాలను ఇప్పటికే ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. విధులకు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 10 వేల మంది ఉపాధ్యాయులు, 15 వేల మంది ఉద్యోగులున్నారు. ఎన్నికల సంఘం కొత్త జిల్లాల కేంద్రంగానే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడం, ఓట్ల లెక్కింపు కూడా కొత్త జిల్లాల ప్రకారమే చేయాలని నిర్దేశించడంతో ఉద్యోగుల కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉండే సిబ్బంది సరిపోకపోవడంతో పొరుగు, ఒప్పంద సేవల ఉద్యోగులను ఎన్నికల విధులకు వినియోగించుకునే అవకాశం ఉంది. అలాగే అంగన్వాడీ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలను కూడా ఎన్నికల విధుల్లో వినియోగించుకోనున్నారు. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో 10 వేల మంది ఇతర ఉద్యోగులను వినియోగించుకునే అవకాశం ఉంది. భత్యం పంపిణీలో పారదర్శకత ఈ సారి జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల ఖర్చులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయ ఉద్యోగులకు ఎన్నికల భత్యం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా శాఖల ఉద్యోగ, ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి అధికారులు ఆన్లైన్లో ఎంట్రీ చేశారు. ఇతర సిబ్బందికి చెల్లించే భత్యాలను కూడా బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. విధుల ధ్రువపత్రాలు సకాలంలో అందేనా? ప్రతిసారి ఎన్నికల్లో పాల్గొన్న ఎన్నికల సిబ్బందికి విధుల ధ్రువపత్రాల జారీలో ఆలస్యమవుతోంది. పోలింగ్ జరిగిన రోజు రాత్రికల్లా పోలింగ్ యంత్రాల పరికరాలను అందజేసిన తర్వాత ప్రత్యేక కౌంటర్ల ద్వారా విధుల ధ్రువపత్రాలను ఇవ్వాలి. కానీ ప్రతిసారి ఎన్నికల్లో ధ్రువపత్రాలు ఇవ్వకపోవడంతో తాము ఎన్నికల విధుల్లో పాల్గొన్నట్లు సర్వీసు పుస్తకాల్లో నమోదు చేసుకోవడం, అవసరమైన అర్జిత సెలవులు పొందడం కష్టమవుతోంది. కావున అధికారులు ఆ దిశగా ఆలోచించి ఎన్నికల సిబ్బందికి సకాలంలో ధ్రువపత్రాలు అందచేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
జీవితంలో మరోసారి కనిపించకు!
పూర్వం ఒక వ్యక్తి ఉండేవాడు. పెద్దల నుంచి వచ్చిన వ్యాపారాన్ని నిర్వహించుకుంటూ, ఉన్న కొద్దిపొలంలో వ్యవసాయం చేసుకుంటూ, పశువులను పెంచుకుంటూ ఉన్నంతలో బాగానే జీవించేవాడు. అయితే, ఒకరోజు ఉన్నట్టుండి ఆ వ్యక్తికి చావు గురించిన చింత పట్టుకుంది. చావు తన దరి చేరకుండా ఉండాలని కోరుతూ యముని గురించి ఘోరతపస్సు చేశాడు. యముడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అతను భక్తితో చేతులు జోడించి, ‘‘యమరాజా! నువ్వు ఎవరికైనా ఒకసారే కనిపిస్తావు. నాకు నువ్వు ఇప్పుడు ఒకసారి కనిపించావు కాబట్టి మరోసారి నాకు కనిపించకు. అది చాలు నాకు’’ అన్నాడు వినయంగా. అతని తెలివితేటలకు యముడు ఆశ్చర్యపోయాడు. తాను రెండోసారి కనిపించకూడదంటే ఇతడికి మరణం రానట్లే కదా లెక్క. అయినా ఏదైతే అదవుతుందిలే అనుకుని ‘తథాస్తు’ అన్నాడు. వ్యాపారి ఆనందానికి అంతులేదు. వెంటనే వెళ్లి పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడు. వాళ్లు పెరిగి పెద్దవాళ్లయ్యారు. వాళ్లకు పెళ్లిళ్లయి, పిల్లలు పుట్టారు. వారూ పెరిగి పెద్దయ్యారు. వారికీ ళ్లయ్యాయి. ఇలా తరాలు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ, ఎంత వయసు మీదపడినా, ఇతనికి మాత్రం మరణం రావడం లేదు. దాంతో ఇంట్లోవాళ్లు, బయటివాళ్లు అందరూ ఇతనికి సేవలు చేయలేక ఇంకెప్పుడు చచ్చిపోతావంటూ బయటికే తిట్టసాగారు. ఇతనికి బతుకు దుర్భరంగా మారింది. తాను అనాలోచితంగా కోరుకున్న వరమే, ఇప్పుడు శాపంగా మారిందని తెలుసు కున్నాడు. దాంతో చావుకోసం తపస్సు చేయాలనుకున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదన్నది నిజం. దీనిని గుర్తించి, బతికి ఉన్నన్నాళ్లూ సంతోషంగా జీవించాలి కానీ, చావు గురించి భయపడటం, చావును చూసి దిగులు పడటం అవివేకం. ఎప్పటికీ జీవించే ఉండాలని కోరుకోవడం దురాశ. మన చేతిలో లేని చావును గురించి చింతపడేకంటే, చేతిలో ఉన్న జీవితాన్ని ఫలప్రదం చేసుకునేందుకు ప్రయత్నించడం కర్తవ్యం. –డి.వి.ఆర్. -
నిర్ణయం
‘‘నాన్నగారి అంత్యక్రియలు తమ్ముడిని నిర్వహించమంటాను. నాకు బి.పి. షుగర్ ... పన్నెండు రోజులు చన్నీటి స్నానం నాకు పడదు ... ఉదయం లేవగానే నీరసంగా ఉంటుంది. కాఫీ, టిఫిన్లు పడనిదే ఏపనీ చేయలేను.’’ చెప్పాడు శివశంకరం, గోపాలరావు పెద్దకొడుకు.‘‘తండ్రి అంత్యక్రియలు, తదనంతర కార్యక్రమాలు చేయడం పెద్దకొడుకు విధి, కర్తవ్యం ... అప్పుడే నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. అన్నయ్య చేయవలసిన విధిని నన్ను నిర్వర్తించమనడం భావ్యంకాదు ...’’ కొంచెం కోపంగా అన్నాడు రెండో కొడుకు భానుమూర్తి. బ్రతికి ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కొడుకుల వాదోపవాదాలు విని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసేవాడు గోపాలరావు. ప్రస్తుతం వారి వాదనలకు స్పందించలేని స్థితిలో ఉంది గోపాలరావు భౌతికకాయం.కొడుకుల నిర్వాకం తల్లి చెవిన వేసింది గోపాల్‌రావు కూతురు భ్రమరాంబ.తనయుల మనస్తత్వం తెలిసిన తల్లి శాంతకుమారి మౌనంగా రోదించింది.పరిస్థితిని గమనిస్తున్న గోపాలరావు తమ్ముడు రాజేశ్వరరావు రంగంలోకి దిగాడు. అతనే అన్నయ్యకు సీరియస్ గా వుందనివినగానే పరుగు పరుగున వచ్చి పిల్లలకు ఫోను చేశాడు. అన్నయ్య చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించాక అంత్యక్రియలు నిర్వహించడానికి పంతులుగారిని పురమాయించాడు.‘‘నువ్వు అలా అనకూడదురా శివం. తండ్రికి అంత్యక్రియలు చేయడం పెద్దకొడుకుగా నీ విధి. కర్మ చేస్తున్న పన్నెండు రోజులు కర్త ఆరోగ్యం ఆ పరమేశ్వరుడే కాపాడతాడు. చనిపోయిన నీ తండ్రి ఆత్మ నీకు శక్తినిస్తుంది.వాదోపవాదాల కిది సమయంకాదు. మరేం ఆలోచించకండి. ఇద్దరూ వెళ్ళి స్నానం చేసిరండి ... క్విక్’’ అంటూ తన నిర్ణయం ప్రకటించాడు రాజేశ్వరరావు. బంధువులందరూ తనవైపే చూస్తూండటంతో తలవంచక తప్పలేదు శివశంకరానికి.గోపాలరావు అంత్యక్రియల కార్యక్రమం య«థావిధిగా సాగింది. గోపాలరావు, శాంతకుమారి దంపతులకు ఇద్దరు మగపిల్లల తరువాత ఆడపిల్ల పుట్టింది.గోపాలరావు జిల్లా పరిషత్ స్కూల్ టీచరుగా చేసి రిటైరయ్యాడు. విజయవాడలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు.పెద్దకొడుకు శివశంకరం ఎంటెక్ చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులో వున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు.రెండో కొడుకు భానుమూర్తి సి.ఎ. చేసి చార్టర్డ్ అకౌంటెంట్‌గా హైదరాబాద్ లోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని భార్య కాలేజీ లెక్చరర్. వారికి ఓ అమ్మాయి. డబ్బుకు లోటులేని జీవితం.గోపాలరావు అల్లుడుప్రకాశరావు. రాజమండ్రి మునిసిపల్ ఆఫీసులో ఉద్యోగం. కూతురు భ్రమరాంబ స్కూల్ టీచర్‌గా చేస్తోంది. వారి సంతానం ఒక అబ్బాయి. గోపాలరావు హైబీపీతో బాధపడుతున్నాడు. ఆ రోజు రాత్రి హఠాత్తుగా విపరీతమైన గుండెనొప్పితో కూలబడ్డాడు గోపాలరావు. విజయవాడ లోనే వుంటున్న మరిదికి ఫోన్ చేసింది శాంతకుమారి. రాజేశ్వరరావు వెంటనే బయలుదేరి వచ్చి అన్నగారిని అంబులెన్స్‌లో కార్పొరేట్ హాస్పిటల్‌కు తరలించాడు. ఆసుపత్రికి చేరుకునే సరికే గోపాలరావు విగతజీవుడయ్యాడని నిర్ధారించారు డాక్టర్లు.గోపాలరావు కొడుకులకీ, అల్లుడికీ విషాదవార్త తెలియజేశాడు రాజేశ్వరరావు. తెల్లవారుజామునే ముగ్గురూ కుటుంబ సమేతంగా కార్లలో విజయవాడ వచ్చారు. తండ్రి శవంపై పడి రోదించారు. శివశంకరం ఆఫీసు పని తప్ప మరే పనిలోనూ కలుగజేసుకోడు. ఎన్ని గంటలైనా విసుగూ, విరామం లేక ఆఫీసు వ్యవహారాలు చక్కబెట్టే శివశంకరానికి ఇంటి పని అంటే పరమ చిరాకు. ఇంటి విషయాలన్నీ అతని భార్యే నిర్వర్తిస్తుంది. బాధ్యతారాహిత్యం అతని నరనరాల్లో జీర్ణించుకుంది. ఎప్పుడో నెలకోసారి తప్ప తల్లిదండ్రులతో మాట్లాడి ఎరుగడు. తన సంతానం విషయంలోనూ ఎప్పుడూ పట్టించుకోలేదు.తండ్రి పోయాడని బాబయ్య చెప్పింది వినగానే ఒక్కసారి గుండెల్లో కలుక్కుమంది శివశంకరానికి. తండ్రి శవాన్ని చూసి రోదించాడు. బాబయ్య ఓదార్చి ప్రక్కకు తీసుకెళ్ళి చేయవలసిన కార్యక్రమాలు వివరించాడు. పది రోజుల నిత్యవిధి తెలియజేశాడు. అన్నీ విన్న శివశంకరం నీరసించిపోయాడు. పన్నెండు రోజులు రోజూ ఉదయమే కృష్ణ ఒడ్డుకు వెళ్లి స్నానాలు చేస్తే ఆరోగ్యం పాడవుతుందని భావించాడు. ఆరోగ్యం పాడయితే ఆఫీసు పని దెబ్బతింటుంది ... అమ్మో ... గుండెపై చేత్తో రాసుకున్నాడు. తమ్ముడిచేత కార్యక్రమాలు చేయించి తను ప్రేక్షకపాత్ర వహిస్తే సరిపోతుందని తలచాడు. తండ్రికి అంత్యక్రియలు, తదుపరి కార్యక్రమాలు చేయడం తనవల్ల కాదని భానుమూర్తి భావించాడు. పెద్దల జోక్యంతో తండ్రికి అంత్యక్రియలు, దశదిన కార్యక్రమాలు జరిపే భారం మీదవేసుకోక తప్పదని గ్రహించాడు శివశంకరం దహన కార్యక్రమం పూర్తిచేసుకుని శ్మశానం నుండి తిరిగి వచ్చారు అన్నదమ్ములు. దీపానికి దండం పెట్టుకున్నారు. భోజనాల తరువాత అంత్యక్రియలకు హాజరైన బంధువులు నిష్క్రమించారు. సాయంత్రం దశదిన కార్యక్రమాలు, ఆ తరువాత రెండు రోజులు చేయవలసిన కార్యక్రమాలు తెలియజేసి మొత్తం కార్యక్రమానికి, దానాలకు లక్ష రూపాయలవుతుందన్నారు పంతులుగారు.‘‘అమ్మో ... అంత ఖర్చే ... దానాలు అంతంత ఇవ్వనవసరం లేదు. మొత్తం ఇరవై వేలలో కానిచ్చేయండి’’ అన్నాడు భానుమూర్తి. లెక్కలు వేయడంలో ఎక్స్పర్ట్ అతను. శివశంకరం ఇరవై వేలు మరీ తక్కువని ముప్పయి వేలలో పూర్తి చేయమన్నాడు. విషయం శాంతకుమారి చెవిన పడింది.‘‘మీ నాన్నగారి జీవితం ఏ లోటూ లేకుండా సాగింది. ఆయన చనిపోయాక చేయవలసిన కర్మలలో ఏలోటూ రాకూడదు. కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరగాలి. దానాలు కూడా స్వీకరించినవారికి సంతృప్తికరంగా ఉండాలి. మీ నాన్నగారి పేర సేవింగ్స్ బ్యాంకులో నాలుగైదు లక్షల బ్యాలెన్స్ వుంది. ఆ డబ్బు తీయండి. మీ చేతినుండి ఏమీ ఇవ్వనవసరం లేదు.పంతులు గారు చెప్పినట్లు లక్ష రూపాయలు ఖర్చుపెడదాం’’ తనయులను ఆదేశించింది శాంతకుమారి.అన్నదమ్ములు మరి మాట్లాడలేదు.రెండవ రోజునుండి వర్క్ ఫ్రవ్‌ు హోవ్‌ు ప్రారంభించాడు శివశంకరం. క్లయింట్స్ ఇన్కవ్ుటాక్స్ ఫైల్స్ అర్జెంటుగా చూడాలంటూ మూడవ రోజు హైదరాబాద్ వెళ్లి తొమ్మిదవ రోజు తిరిగి వచ్చాడు భానుమూర్తి. పది రోజులు స్కూలు మానేయడంతో పిల్లల చదువులు పాడయిపోతాయని సణుక్కున్నారు కోడళ్లు. శాంతకుమారి దుఃఖం వర్ణనాతీతం. ఆ పది రోజులు ఇంట్లో అందరికీ భారంగా గడిచాయి.గోపాలరావు బంధుమిత్రులు పదో రోజు ధర్మోదకాల కార్యక్రమాలలో పాల్గొన్నారు.పన్నెండోరోజు సాయంత్రం శివశంకరం, భానుమూర్తి హైదరాబాద్ ప్రయాణమయ్యారు. తల్లికి తోడుగా భ్రమరాంబ మరో రెండు రోజులుండి రాజమండ్రి వెళ్లిపోయింది. ఒంటరిగా మిగిలిన శాంతకుమారికి భవిష్యత్తు శూన్యమనిపించింది. మాటిమాటికీ భర్త గుర్తుకు వస్తున్నాడు. గదుల్లో తిరుగుతుంటే భర్త వెన్నంటి వున్నట్లు ఫీలవసాగింది. కుర్చీలో కూర్చుంటే ఎదురుగా భర్త ఉన్నట్లు, కబుర్లు చెపుతున్నట్లు అనిపిస్తోంది. డైనింగ్ టేబుల్ పై కంచంలో అన్నం వడ్డించుకుంటే ... ఎదురుగా భర్త లేనిలోటు మనసును పిండింది. ముద్ద నోట్లోకి వెళ్ళక కంచం వదిలి లేచిపోయిందిశాంతకుమారి. మంచం మీద బోర్లా పడుకుని విలపిస్తుంటే తలగడ తడిసిపోయింది. సాయంత్రానికి నీరసం ఆవహించింది. ఫోను మ్రోగింది. బలవంతంగా రిసీవర్ ఎత్తి ‘‘హల్లో’’ అంటే ‘‘ఏం చేస్తున్నావమ్మా’’ అంటున్న కూతురు.ఏడుపు శబ్దం వినిపించి ఉలిక్కిపడింది భ్రమరాంబ.‘‘బాధపడకమ్మా... తేరుకోవాలి... పోయినవాళ్లతో మనం పోలేం కదా... గుండె చిక్కబట్టుకో... పిల్లల్ని, మనవల్ని గుర్తుతెచ్చుకో... నాతో రమ్మంటే రానన్నావు... నేనొచ్చి అక్కడ వుందామంటే నేను లేందే ఆయనకు, పిల్లలకు ఇక్కడ క్షణం గడవదు... అన్నం తిన్నావా...’’ ఆప్యాయంగా మాట్లాడింది కూతురు.‘‘ఊ’’ అని శాంతకుమారి ఎక్కువ మాట్లాడలేకపోయింది. ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ... మరో పది రోజుల తరువాత ఓ ఆదివారం భ్రమరాంబ భర్తతో కలిసి తల్లిని చూడడానికి వచ్చింది.చిక్కిశల్యమైన శాంతకుమారిని చూసి కంటతడి పెట్టింది. అత్తగారిని తమ ఇంటికి వచ్చేయమన్నాడు అల్లుడు.శాంతకుమారి ఆ ఇల్లు వదలిరాలేనంది. ‘‘నెమ్మదిగా కోలుకుంటున్నాను. ఆయన జ్ఞాపకాలు వెన్నంటుతున్నాయి. ఆయన స్మృతుల మధ్య బ్రతుకుతున్నాను. ఈ ఇంటికి తాళం వేయలేను.’’ అల్లుడి అభ్యర్థనను సున్నితంగా త్రోసిపుచ్చింది అత్తగారు.ప్రకాశరావు భార్యతో ఏంచేయాలా అని ఆలోచించాడు. ఆరు గదుల ఇంట్లో అత్తగారు ఒక్కరే ఉండటం కష్టమే ననుకున్నాడు. ఎవరైనా తోడుంటే బాగుండుననియోచించాడు. త్రీ బెడ్ రూవ్‌ు, హాలు, కిచెన్ ఉన్న ఇంటిని పరిశీలించాడు.‘‘దక్షిణం వైపు ఉన్న రెండు బెడ్రూమ్లని కలిపి చిన్న ఫ్యామిలీకి అద్దెకివ్వవచ్చు. పెరటివైపు గుమ్మం పెడితే సరిపోతుందని’’ అత్తగారిని ఒప్పించాడు.ఆరోజే మేస్త్రీని పిలిచి ఆ ఏర్పాట్లు చేయమని పురమాయించాడు. తల్లికి ధైర్యం చెప్పి సోమవారం ఉదయం భ్రమరాంబ భర్తతో కలిసి రాజమండ్రి వెళ్ళిపోయింది. వారం రోజుల్లో గుమ్మం పెట్టే కార్యక్రమం పూర్తయింది. బెడ్రూవ్ు కి, హాలుకి మధ్య ఉన్న తలుపు క్లోజ్ చేస్తే పెరటి వైపు రెండు గదుల పోర్షన్ సెపరేట్ అయింది.టు–లెట్ బోర్డు పెట్టిన మరునాడు ఒక జంట చూడటానికి వచ్చారు.వారిద్దరికీ నెల రోజుల క్రితమే వివాహం జరిగిందని చెప్పారు. అతని పేరు చంద్రకాంత్ ... భార్య మంజుల... చంద్రకాంత్ ఎవ్ుఎస్సీ చదివాడు. ప్రయివేటు స్కూల్లో టీచరుగా చేస్తున్నాడు.ఈ వివరాలు చెప్పి ‘‘అద్దె ఎంత’’ అని అడిగారిద్దరూ.ఇద్దరి మాటతీరు శాంతకుమారిని ఆకట్టుకుంది. చంద్రకాంత్ పెద్దగా మాట్లాడకపోయినా మంజుల గలగలా మాట్లాడుతోంది.‘‘నేను ఇంటిపై సంపాదించాలని అద్దెకివ్వడం లేదు. నాకు కాస్త మాట సహాయం చేస్తారని అద్దె కిస్తున్నాను. మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి’’ చెప్పింది శాంతకుమారి. వారు చెప్పిన మొత్తానికి శాంతకుమారి అంగీకరించింది.రెండురోజుల్లో మంచిరోజు చూసుకుని ఆ పోర్షన్ లోకి ప్రవేశించారు చంద్రకాంత్ దంపతులు.‘‘ఏం చేస్తున్నారు అత్తయ్యగారూ’’ అంటూ భర్త స్కూలుకు వెళ్లగానే శాంతకుమారిని పలకరించింది మంజుల.శాంతకుమారి వెనకే ఇంట్లో తిరుగుతూ ఆమె కుటుంబ విషయాలు ఆరాతీసింది.చాలాకాలం నుండి పరిచయమున్న వ్యక్తిలా కలివిడిగా తిరుగుతున్న మంజులను చూసి అబ్బురపడిందిశాంతకుమారి. తన భర్త మంచితనం, ఉపకార స్వభావం, ఎవరికీ కలలోనైనా హాని తలపెట్టని తత్వం వివరించింది శాంతకుమారి.తన తండ్రి చిన్న ఉద్యోగస్తుడనీ, తాను డిగ్రీ చదివానని, భర్త పోస్ట్‌గ్రాడ్యుయేట్ అని వివరించింది మంజుల.సాయంకాలం భర్త స్కూలునుండి వచ్చేవరకు శాంతకుమారితో కబుర్లు చెపుతూ గడిపింది మంజుల. మరోవారం తరువాత ఆదివారం మధ్యాహ్నం భోజన సమయానికి అప్పడాలు వేయించి మంజులకు ఇచ్చింది శాంతకుమారి ‘‘ఇంగువ అప్పడాలు మావారికి చాలా ఇష్టం ... మీరూ రుచిచూడండి’’ అంటూ.ఆ మరునాడు ...‘‘మావారి జీతం మా కుటుంబ నిర్వహణకి అంతంతమాత్రంగా సరిపోతుంది. నేను ఖాళీగా కూర్చోకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలనుకుంటున్నాను. నా చదువుకి పెద్ద ఉద్యోగాలేం రావు. నిన్న మీరిచ్చిన అప్పడాల రుచి చూశాక నాకో ఐడియా వచ్చింది. అప్పడాలు చాలా రుచిగా వున్నాయి. మీరు సహాయం చేస్తే అప్పడాలు తయారుచేసి షాపులకు సరఫరా చేద్దామనుకుంటున్నాను. మీదగ్గర పిండి కలపడం నేర్చుకుంటాను. అలాగే వడియాలు పెట్టడం నేర్పండి ...’’ అడిగింది మంజుల మాటల సందర్భంలో.‘‘దానికేం భాగ్యం ... నా చేతిలో విద్య. నీతో నేనూ చేతులు కలుపుతా ... అప్పడాలు పిండి కలపడమే కాదు ... వత్తిపెడతాను కూడా ... నాకూ కాస్త కాలక్షేపమవుతుంది’’ అంగీకరించింది శాంతకుమారి.నాలుగు రోజుల తరువాత ...ఓ మంచిరోజున విఘ్నేశ్వరుని పూజించి, శాంతకుమారి కాళ్ళకు దండంపెట్టి, మొదటి అప్పడం వత్తింది మంజుల.తనూ అప్పడాల కర్ర తీసి పని ప్రారంభించింది శాంతకుమారి.వత్తిన అప్పడాలను ఎప్పటికప్పుడు డాబాపై ఎండబెట్టింది మంజుల.వారం రోజుల తరువాత అప్పడాల ప్యాకెట్లు తయారుచేసి ‘‘అమ్మకం అయ్యాకే డబ్బు ఇస్తామన్న’’ ఒప్పందంపై అప్పడాల ప్యాకెట్లు షాపుల్లో పంచింది మంజుల.తరువాత గుమ్మడికాయ వడియాలు తయారుచేసి షాపులకు పంచింది.కొన్నవాళ్లు మళ్లీ అవే అప్పడాలు కావాలని షాపుల్లో ఎంక్వయిరీలు చేస్తుండడంతో నెల రోజులలోనే మంజుల బ్రాండ్ అప్పడాలకు గిరాకీ పెరిగింది. షాపు ఓనర్లే ఫోను చేసి మరికొన్ని ప్యాకెట్లు పంపమని ఆర్డర్లు పంపసాగారు. మంజుల, శాంతకుమారిలకు తీరిక లేకుండాపోయింది. ఆలోచించే తీరిక లేని శాంతకుమారి మానసిక వేదన క్రమంగా ఆవిరవసాగింది.చంద్రకాంత్, మంజులలు ఇంట్లో వ్యక్తుల్లా కలిసిపోవడంతో శాంతకుమారికి మానసిక ధైర్యం లభించింది. ఆరు నెలలు గడిచాయి. ఏభైవేల రూపాయలు తెచ్చి శాంతకుమారి చేతిలో పెట్టింది మంజుల, ‘‘అత్తయ్యగారూ ... మీ రుణం తీర్చలేనిది’’ అంటూ.‘‘నా మానసిక వేదనకి ఉపశమనం కలిగించావు. నువ్వు చేసిన ఉపకారం నిర్వచించలేనిది’’ అని మంజుల ను ఆశీర్వదించి డబ్బు తిరిగి యిచ్చింది శాంతకుమారి.మంజుల వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుండడంతో శాంతకుమారి మంజులను అభినందించింది.శాంతకుమారిని చదవమంటూ భారత, భాగవత, రామాయణ గ్రంథాలు తెచ్చియిచ్చాడు చంద్రకాంత్. శాంతకుమారికి గ్రంథపఠనంతో కాలం పరుగెడుతున్నట్లే తెలియడంలేదు. గ్రంథపఠనం ఆమెకు వింత అనుభూతినిచ్చింది. మానసిక ప్రశాంతత కూర్చిందిగోపాలరావు మరణించి సంవత్సరం గిర్రున తిరిగింది.సంవత్సరీకాలకు శివశంకరం, భానుమూర్తి, భ్రమరాంబ కుటుంబ సమేతంగా వచ్చారు.బంధువులందరూ వచ్చి వెళ్లారు.శాంతకుమారి ఆదేశంతో గోపాలరావు సంవత్సరీకాల కార్యక్రమం శాస్తోక్త్రంగా జరిపించబడింది.శాంతకుమారి అన్ని విషయాలలో మంజుల సహాయం తీసుకోవడం శివశంకరం భార్య వినీతకు నచ్చలేదు.‘‘ఆ మంజుల మీ అమ్మగారిని బాగా బుట్టలో వేసుకొంది. మీ అమ్మగారు కూడా ఆ మంజులనే ప్రతి విషయంలోనూ సంప్రదిస్తున్నారు. అత్తయ్యగారు అత్తయ్యగారు అంటూ మంజులరాసుకు పూసుకు తిరుగుతోంది. ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్లిపోయాక పెద్దావిడతో మరింత సఖ్యత పెంచుకుని అత్తయ్యగారి దగ్గరున్న డబ్బూ, నగలూ ఆమె హస్తగతం చేసుకున్నా అడిగే దిక్కుండదు. మీ అమ్మగారిని ఆస్తి పంపకం చేయమని మన వాటా మనం పట్టుకుపోవడం శ్రేయస్కరం’’ చెప్పింది వినీత.భార్య మాటలను సీరియస్ గా తీసుకున్నాడు శివశంకరం. తమ్ముడితో సంప్రదించాడు. అన్నయ్య చెప్పిన విషయం వినగానే తమ్ముడి మనసులో మంజులపై అనుమాన బీజం మొలకెత్తింది.అన్నదమ్ములిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. కొడుకులిద్దరూ ఆస్తి పంచమనగానే శాంతకుమారి ఆశ్చర్యపోయింది. ‘‘ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది’’ అడిగింది నీరసంగా.‘‘ఈ ఇల్లు అమ్మేసి చెరిసగం తీసుకుని హైదరాబాదులో మరింత విలువైన ఆస్తిని కొనుక్కుంటాం. నాన్నగారి పేర ఉన్న డిపాజిట్లు, నీ దగ్గరున్న బంగారం కేష్ చేసుకుని షేర్లలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరిని లాభాలొస్తాయి. అయినా ఆర్థిక విషయాలు నీకంత అర్థంకావు. తమ్ముడు సీఏ కదా, వాడికి పెట్టుబడుల విషయం బాగా తెలుసు ... ఇక నీ విషయం ... నువ్వు మాతో హైదరాబాదు వచ్చేద్దువు గాని ... సంవత్సరంలో ఆరు నెలలు మా యింట్లో, మరో ఆరునెలలు తమ్ముడి ఇంట్లో ఉండవచ్చు ... మాతో వుంటే నీకు ఖర్చు ఏమీ ఉండదు కనుక నీ పెన్షన్ బ్యాంకులో దాచుకోవచ్చు. ఆస్తి పంచకపోతే ఇవన్నీ కుదరవు ... ఇప్పుడు వెంటనే మాతో వచ్చేయి. ఇల్లు అమ్మకం పెడదాం. రేపే బ్యాంకులోడబ్బు డ్రా చేసేద్దాం ...’’ విపులంగా వివరించాడు శివశంకరం.తనయుల మనసులో భావాన్ని తల్లి గ్రహించగలిగింది.ఇల్లు అమ్మి ఆస్తి పంచేసి కొడుకుల పంచన చేరితే తన విలువ దిగజారుతుందని ఆమెకు తెలుసు.కాస్సేపు ఆలోచించింది శాంతకుమారి. భర్తను మనసులో తలచుకుంది.బ్రతికుండగా భర్త ఇచ్చిన విలువైన సలహాలు గుర్తుచేసుకుంది. ‘‘ధనమూలమిదం జగత్’’ అన్న విషయం శాంతకుమారికి తెలుసు.తనిప్పుడు కొడుకుల అభ్యర్థనకు తలొగ్గితే భావిజీవితం బాధాకరంగా ఉండక తప్పదని భావించింది.మనసు ధృఢపరచుకుంది.తాము ఏంచెప్పినా కాదనలేని బలహీనురాలు తమ తల్లి అని భావిస్తున్న కొడుకులవైపు సాలోచనగా చూసి సులోచనాలు సవరించుకుంది. తల పైకెత్తింది. ఆమె గొంతు గంభీరంగా మారింది.‘‘మీ మాట కాదంటున్నందుకు అన్యధా భావించకండి. బ్యాంకు డిపాజిట్లను పుణ్యకార్యాలకు, దానధర్మాలకు వినియోగిద్దామనుకుంటున్నాను. నేను బ్రతికున్నంతకాలం ఈ ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను. మీ నాన్నగారు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు పదిలపరచుకున్న ఈ గూడుని వదలి నేనుండలేను. నేను బ్రతికుండగా ఈ యిల్లు అమ్మే ప్రసక్తి లేదు. నా తదనంతరం ఈ యిల్లు, మిగిలిన బ్యాంకు బ్యాలన్స్ మీ ఇద్దరే కాదు భ్రమరాంబతో కలిపి ముగ్గురూ పంచుకోండి. మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు హైదరాబాదు వచ్చి మీ ఇళ్లలో ఉండగలిగినన్ని రోజులుంటాను. మీకు సెలవులు కుదిరినప్పుడు మనవళ్లతో వచ్చి నన్ను సంతోషపెట్టండి. ఇదే నా తుది నిర్ణయం ...’’ ఆత్మవిశ్వాసంతో ప్రకటించింది శాంతకుమారి. - ఇంద్రగంటి నరసింహమూర్తి -
మెరుపులు..మరకలు
ఒంగోలు టౌన్ : జిల్లా కలెక్టర్‌గా వి.వినయ్‌చంద్ బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది సమయంలో పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యల పరిష్కారంలో చొరవ చూపలేకపోయారు. జిల్లా పాలనలో తనదైన ముద్ర ఇది..అని చెప్పుకోదగినవేవీ లేవు. అయితే గతంలో నిరుపయోగంగా ఉన్న మినరల్ ఫండ్ నిధులను సద్వినియోగం చేశారు. ఆ నిధులతో రిమ్స్‌లో ప్లేట్లెట్ మిషన్ కొనుగోలు చేయించడంలో కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రులకు సంబంధించిన వైద్య పరికరాల కొనుగోలు చేయించడంలో కూడా శ్రద్ధ తీసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ఆర్ధిక సంవత్సరంలో 4.05 లక్షల కుటుంబాలకు ఉపాధి పనులు కల్పించడంలో కలెక్టర్ ముఖ్య భూమిక పోషించారు. 106.1 శాతం లేబర్ బడ్జెట్ సాధించి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశారు. జిల్లాలో 2.39 కోట్ల పనిదినాలు కూలీలకు కల్పించి రూ.601 కోట్ల ఖర్చు చేయడం ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిపారు. జిల్లాలో 540 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో కూడా చొరవ తీసుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్పొరేట్ స్కూల్స్‌కు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యను అందించేందుకు కృషి చేశారు. జెడ్పీ సమావేశాలకు దూరం: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత కీలకమైన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు వినయ్‌చంద్ దూరంగా ఉంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో కలెక్టర్ లేకుండా జిల్లా పరిషత్ సమావేశాలు ఏమిటంటూ సభ్యులు బాయ్‌కాట్ చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ వినయ్‌చంద్ జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాగునీటిని అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వందల కోట్ల రూపాయలతో ప్రతిపాదనల కోసం కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాసనసభ్యులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికార తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను మాత్రమే పిలిచి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇదే విషయమై ఇటీవల జరిగిన ఒక సమావేశంలో సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ జిల్లా యంత్రాంగం తీరును ఎండగడుతూ శాసనసభా కమిటీ ప్రివిలైజేషన్ కమిటీ దృష్టికి తీసుకువెళతానని స్పష్టం చేశారు. ఏడాదిలో ఒక్క విలేకరులసమావేశమూ లేదు.. కలెక్టర్‌గా వినయ్‌చంద్ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలో ఒక్కసారి కూడా పాత్రికేయుల సమావేశం నిర్వహించకపోవడం విశేషం. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలకు సంబంధించి కింది స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించే సమయంలో పాత్రికేయుల సమావేశాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఆయన వంతు వచ్చేసరికి మాత్రం ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఒంగోలు కార్పొరేషన్‌పై దృష్టేదీ.. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ దానిపై ఆయన ముద్ర కనిపించలేదు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టే పనుల్లో అధికారపార్టీ నేతలు అడ్డగోలుగా టెండర్లు దక్కించుకొని పనులు చేసుకుంటున్నప్పటికీ వాటిని నియంత్రించడంలో వినయ్‌చంద్ మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది. అదేవిధంగా పర్చూరు మండలంలోని దేవరపాలెం దళితుల భూములను నీరు–చెట్టు కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వారిని భూముల్లో నుంచి వెళ్లగొట్టిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ సమయంలో జిల్లా కలెక్టర్ తగిన రీతిలో స్పందించలేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. కలెక్టర్ సమీక్షలంటే జాప్యమే.. కలెక్టర్ వినయ్‌చంద్ సమీక్ష సమావేశాలు ఉన్నాయంటే అధికారులు హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సమీక్ష సమావేశానికి సకాలంలో హాజరైతే ఆ సమావేశం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అధికారులు గంటల తరబడి ఫైళ్లు చేతిలో పెట్టుకొని ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అధికారులు ఎదురు చూసిన ఘటనలు ఉన్నాయి. జిల్లా అధికారుల్లో అనేకమంది షుగర్‌తో బాధపడుతున్నారు. అన్ని గంటలపాటు వారు ఎదురుచూసే సమయంలో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. ఎవరైనా ఆ ఒక్కరోజే! జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు ఎవరైనా వస్తే ఒక్కరోజు మాత్రమే ఆయనను కలుసుకునే అవకాశం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలోనే ప్రజలు కలెక్టర్‌ను కలవాలని, మిగిలిన రోజుల్లో కలిసేందుకు మాత్రం అనుమతి ఉండటం లేదు. ఏదైనా అత్యవసర సమయాల్లో కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నించి విఫలమైన సందర్భాలు అనేకం చోటు చేసుకున్నాయి. -
పిడుగులాంటి వార్త.. అయినా తొణకలేదు
లక్నో : ఓ వైపు కుటుంబంలో తీవ్ర విషాదం. మరోవైపు ఓ ప్రాణం చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. రెండింటిలో ఏది ముఖ్యమంటే... తన వృత్తి ధర్మమే ముఖ్యమని ఆయన నిర్ణయించుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ షారన్పూర్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ భూపేంద్ర తోమర్(57) ఫిబ్రవరి 23న బడాగావ్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇంతలో సర్సిరి గ్రామంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పొడిచారని.. రక్తపు మడుగులో అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైర్లెస్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే ఆయన తన వాహనాన్ని ఘటనా స్థలం వైపు తిప్పారు. ఆ సమయంలో ఆయనతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఇంతలో ఆయనకు మరో కాల్ వచ్చింది. ఆయన కూతురు జ్యోతి హఠాన్మరణం చెందిందని ఆ వార్త సారాంశం. ఓ వైద్య కేంద్రంలో సహయకురాలిగా పని చేసే కూతురికి ఏడాది క్రితమే ఆయన వైభవంగా వివాహం చేసి పంపించారు. అలాంటిది ఉన్నట్లుండి ఆమె చనిపోయిందన్న వార్తతో ఆయన ఉలిక్కిపడ్డారు. అయినా తన వాహనాన్ని వెనక్కి తిప్పకుండా.. వాహనాన్ని క్షతగాత్రుడి వైపునకు వెళ్లారు. ఆంబులెన్స్ ఆలస్యం కావటంతో తమ వాహనంలోనే తీసుకెళ్లి అతని ప్రాణాలను పోలీసులు కాపాడగలిగారు. ‘ నా కూతురి మరణ వార్త తెలిశాక నేను బాధపడటం తప్పించి చెయ్యగలిగింది ఏం లేదు. ఆ సమయంలో ఓ వ్యక్తి ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. అందుకే అతన్ని కాపాడాలన్న నిర్ణయంతో ముందుకు వెళ్లా ’ అని భూపేంద్ర చెబుతున్నారు. పిడుగులాంటి వార్త తెలిశాక కూడా వృతి ధర్మంతో ఓ ప్రాణం కాపాడిన భూపేంద్రను పోలీస్ శాఖ ఘనంగా సన్మానించింది. భూపేంద్రను సన్మానిస్తున్న ఉన్నతాధికారులు -
డ్యూటీ వేయాలా.. రూ. వెయ్యి కొట్టు
ఏడాది క్రితం సీఎం చంద్రబాబుబందోబస్తుకు వెళ్ళిన హోంగార్డుకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి.ఆ హోంగార్డుకు ఆసుపత్రి ఖర్చు ఏకంగా రూ.2 లక్షల వరకు అయ్యింది.అటు ప్రభుత్వం గానీ.. ఇటు సంక్షేమసంఘం కానీ రూపాయి ఇవ్వలేదు.. అరకొరజీతాలతో బాధలు పడే ఆ కుటుంబంఅష్టకష్టాలు పడింది.విధులు నిర్వర్తిస్తూ ఒక హోంగార్డుమరణించాడు. అంత్యక్రియల ఖర్చులకు రూ.వెయ్యి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మూడు నెలలకు అన్ని విచారణలు చేసి రూ.15 వేలు ప్రభుత్వం నుంచి అందించారు. కుటుంబ యజమాని మరణంతో ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది.. పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : రోజంతా రోడ్డుపై నిలబడి విధులు నిర్వర్తించాలి. పోలీస్ శాఖలోని సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్నా హోంగార్డుల కుటుంబాలకు వెతల బతుకులే. శాంతిభద్రతల పరిరక్షణలోనూ, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా ఏది జరి గినా అందరికంటే ముందు విధుల్లో ఉండేది హోంగార్డులే. ఎండావానా.. దుమ్మూధూళిని లెక్కచేయకుండా పోలీస్ సిబ్బందితో సమానంగా ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నా అరకొర జీతాలే. పనిచేస్తేనే రోజువారీ వేతనం చెల్లించే పరిస్థితి ఉంది. రోడ్డు ప్రమాదం జరిగినా.. మరణించినా ప్రభుత్వం నుంచి ఆదుకునే అవకాశం లేదు. ఇక జిల్లా కార్యాలయం అంతా అవినీతిలో కూరుకుపోయింది. ప్రతిపనికీ రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహిళా సిబ్బంది బాధలు వర్ణణాతీతంగా మారాయని ఆవేదన చెందుతున్నారు. అధికారులతోపాటు కార్యాలయంలోని హోంగార్డులు సైతం మహిళలను అన్ని రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఉన్నతాధికారులకు చెప్పుకున్నా న్యాయం జరిగే పరిస్థితి లేదని వాపోతున్నారు. సొమ్ము చెల్లించుకుంటేనే హోంగార్డులు వివిధ శాఖల్లో డ్యూటీలు వేయాలంటే సొమ్ములు చెల్లించుకోవాల్సిందేనంట. రూ.వెయ్యి కొడితే తప్ప డ్యూటీలు వేయని దుస్థితి నెలకొంది. హోంగార్డులకు సంబంధించిన జిల్లా కార్యాలయంలో ఏ పని చేయాలన్నా సొమ్ము ముట్టనిదే పని ముందుకు వెళ్ళదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 873 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. వీరంతా ఆర్టీసీ, రవాణాశాఖ, ఎఫ్‌సీఐ, సబ్‌జైలు, పవర్‌ప్లాంట్ ఇలా ఇతర శాఖలు, ప్రైవేటు సంస్థల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్టీఓ కార్యాలయంలో డ్యూటీకి డిమాండ్ ఉంది. ఇక్కడ విధుల్లో వేయాలంటే రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ ఇచ్చుకోవాల్సిందే. ఆర్టీసీ, ఎఫ్‌సీఐ, ద్వారకాతిరుమల ఆలయం ఇలా కొన్ని శాఖల్లో రూ.500 నుంచి రూ.1000 సమర్పించుకోవాలి. ఇక రవాణా శాఖలో పనిచేస్తున్న హోంగార్డులకు గత నాలుగు నెలలుగా వేతనాలే ఇవ్వలేదు. ప్రమాదంలో మరణిస్తే హోంగార్డులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే మట్టి ఖర్చులకు రూ.5 వేలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. కానీ జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మరణిస్తే కేవలం రూ.1000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మిగిలిన సొమ్ము లెక్కలు చెప్పే పరిస్థితి లేకపోగా, అడిగే అవకాశం హోంగార్డులకు లేకుండా పోయింది. ఆ శాఖలోని అధికారులే సొమ్ములు మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బీమా సొమ్ముకు సైతం హోంగార్డుల వేతనాల్లోంచే కోతలు వేసి మరీ చెల్లించే దుస్థితి ఉంది. మూడు నెలల అనంతరం విచారణలు చేసి మరో రూ.15 వేలు కుటుంబానికి అందజేస్తారు. టీడీపీ ప్రభుత్వం చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హోంగార్డులను రెగ్యులర్ చేస్తామంటూ ప్రకటించింది. కానీ రెగ్యులర్ కాదు కదా..రోజువారీ వేతనం సైతం పెంచేందుకు చర్యలు తీసుకోలేదని హోంగార్డులు ఆవేదన చెందుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో హోంగార్డుల రోజువారీ వేతనాన్ని రూ.400 నుంచి రూ.675 కు పెంచారు. బందోబస్తుకు వెళితే అదనంగా రూ.200 చెల్లిస్తున్నారు. హోంగార్డులకు ఆరోగ్య కార్డులు, మెటర్నరీ లీవులు, ప్యాటర్నిటీ సెలవులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఏపీలో మాత్రం హోంగార్డులకు అదనపు విధులకు వారి సొంత ఖర్చులతోనే వెళ్ళాల్సి వస్తోంది. గతంలో ఏఆర్ అధికారులు వాహనాల్లో తీసుకువెళ్ళగా ప్రస్తుతం ప్రయాణ ఖర్చులు వారే భరించాల్సి వస్తోంది. -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- పారిశుద్ధ్య పరిరక్షణపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ - శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో సమావేశం కర్నూలు(టౌన్): పారిశుద్ధ్యలోపం తలెత్తితే అందుకు బాధ్యలైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించి పారిశుద్ధ్యలోపం తలెత్తేందుకు కారణమైతే ఐపీసీ 408, 409 సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. ఇందుకు సంబంధించి శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నగరపాలక ఆరోగ్యశాఖ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య సమస్యపై ఇటీవలి కాలంలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, మున్సిపల్ కార్మికులు సీరియస్‌గా తీసుకొని మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రతిరోజు రెండు పూటల పనులు చేపడుతున్నట్లు మస్టర్లలో దొంగ సంతకాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పిన కలెక్టర్.. ఇకపై పనులను తానే స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. సక్రమంగా పనులు చేస్తే అభినందిస్తానని చెప్పిన ఆయన పనులు సరిగా లేకుంటే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. వార్డులవారీగా శానిటేషన్ వివరాలు తన దృష్టికి తీసుకు రావాలన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం దోమల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కల్యాణ చక్రవర్తి, పర్యావరణ ఇంజినీర్ బాలసుబ్రమాణ్యం, శానిటరీ సూపర్ వైజర్ మురళీకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు సి.వి. రమణ, నాగరాజు, శ్రీనివాసులు, రమేష్‌బాబు, సూపరింటెండెంట్ గంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే వేటు
– జిల్లా పంచాయతీ అధికారిణి బి.పార్వతి కర్నూలు(అర్బన్): ప్రస్తుత వేసవిలో ఈఓఆర్డీ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తే వేటు తప్పదని జిల్లా పంచాయతీ అధికారిణి బీ పార్వతి హెచ్చరించారు. గురువారం ఉదయం ఆమె తన చాంబర్లో ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు జిల్లాలోని ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు తాము పరిచేస్తున్న ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి విధుల్లో ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో యుద్ధ ప్రాతిపదికన చలువ పందిళ్లు, చలి వేంద్రాలు ఏర్పాటు చేసి శుద్ధమైన నీటిని అందించాలన్నారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్లు మినహా, ఎట్టి పరిస్థితుల్లోను అద్దె ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలు లేదన్నారు. ఈ మూడు నెలలు గ్రామ స్థాయిలోని సిబ్బంది ఎలాంటి సెలవులు పెట్టకుండా జాగ్రత్తగా పని చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను కేవలం మంచినీటి సరఫరాకు ఖర్చు చేయాలన్నారు. ఏప్రెల్ 2వ తేదీన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఈఓఆర్డీలు పాల్గొనాలన్నారు. ఈ నెల 31వ తేదీలోగా అన్ని గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులను వసూలు చేసేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 10 ఎంపీటీసీ, 20 సర్పంచు, 68 వార్డు మెంబర్ల స్థానాల్లో ఎలక్ట్రోల్స్‌ను ఏప్రెల్ 7వ తేదీన ప్రచురించడం జరుగుతుందన్నారు. సమావేశంలో కర్నూలు, ఆదోని డివిజనల్ పంచాయతీ అధికారులు విజయ్‌కుమార్, ఏలీషా, కార్యాలయ ఏఓ వీరభద్రప్ప పాల్గొన్నారు. -
బస్సు డ్రైవర్ మృతి ఘటనలో విషాదం
-
విధి నిర్వహణలో అలసత్వం తగదు
బలవంతులు, బలహీనులంటూ రాజీలు చేయకండి – నేర సమీక్షా సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులకు ఎస్పీ ఆదేశం కర్నూలు: విధి నిర్వహణలో అలసత్వం వీడి నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలవంతులు, బలహీనులంటూ సమస్యలపై స్టేషన్లకు వచ్చిన బాధితులను రాజీ చేయకండని తెలిపారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏటీఎం కార్డు నెంబర్ తెలుసుకుని ఘరానా మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలన్నారు. దారి తప్పితే ఎంతటి వారైనా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లారీ దొంగతనాలపై నిఘా ఉంచాలన్నారు. శివరాత్రి బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నేరం జరిగిన చోట కీలక ఆధారం ఏదో ఒకటి ఉంటుందని, వాటితో కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. రౌడీయిజం, గూండాయిజం జిల్లాలో ఎక్కడ ఉన్నా పూర్తిగా అణచివేయాలన్నారు. గణేష్ నిమజ్జనం, బక్రీద్, పుష్కరాలు, వివిధ రకాల బందోబస్తుల్లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ–బీట్స్ అమలుపై వర్క్‌షాప్ జిల్లా పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశపెట్టనున్న ఈ–బీట్స్ అమలుపై వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ–బీట్స్‌ను బలోపేతం చేసి నేరాలను తగ్గించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. గస్తీలకు వెళ్లే పోలీసు సిబ్బంది విషయంలో సీఐలు, ఎస్ఐలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు డి.వి.రమణమూర్తి, బాబుప్రసాద్, ఎ.జి.కృష్ణమూర్తి, వెంకటాద్రి, హరినాథరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, బాబా ఫకృద్దీన్, రామచంద్ర, హుసేన్ పీరాతో పాటు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు
– సదరన్ రేంజ్ కమాండెంట్ చంద్ర మౌళి ఆదోని టౌన్: విధుల పట్ల నిర్లక్ష్యం వద్దని హోంగార్డ్స్ సదరన్ రేంజ్ కమాండెంట్(రాయలసీమ రేంజ్)చంద్రమౌళి అన్నారు. బుధవారం ఆదోనిలో హోం గార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 880 మంది రెగ్యులర్, 220 మంది ఆన్ పెయిడ్హోం గార్డులు ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలను హోం గార్డులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ నెల 23 నుంచి జిల్లాలో మూడు టీంలుగా విభజించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. స్త్రీలు, విద్యార్థులు, చిన్న పిల్లలు, మీడియా పట్ల ఎలా వ్యవహరించుకోవాలో శిక్షణలో వివరించనున్నామన్నారు. నంద్యాల, ఆదోని, కర్నూలు పట్టణాల్లో ట్రాఫిక్‌లో విధులు నిర్వహించే సమయంలో సమయ పాలన, స్నేహభావం కలిగి ఉండాలన్నారు. -
విధుల్లో చేరిన డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి బుధవారం సాయంత్రం విధుల్లో చేరారు. గత నెల 14వ తేదీన ఏసీబీ దాడుల అనంతరం ఆమె అదే నెల 24వ తేది నుంచి సెలవులో వెళ్లారు. ఈ నెల సైతం 15 రోజుల పాటు సెలవు పొడిగించుకునేందుకు ఆమె ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక డీఎంహెచ్‌వోగా డాక్టర్ రామకృష్ణరావును డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి నియమించారు. ఇదే సమయంలో ఆమె బుధవారం తిరిగి విధుల్లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
విధులకు హాజరైన డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి సోమవారం విధులకు హాజరయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై గత శుక్రవారం ఏసీబీ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. కర్నూలుతో పాటు గతంలో ఆమె పనిచేసిన విజయనగరం, విశాఖపట్టణంలోనూ సోదాలు చేసిన విషయం విదితమే. సోదాల సమయంలో ఆమె బ్యాంకు అకౌంట్లు, లాకర్లు, రికార్డులు, బీరువాలు, కంప్యూటర్లను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల అనంతరం సోమవారం సాయంత్రం ఆమె తిరిగి విధులకు హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. -
అవిశ్వాసుల బెదిరింపులు
ప్రవక్త జీవితం ‘అల్లాహ్ గొప్పవాడు, పరమ పవిత్రుడు. నేను కేవలం ఆయన సందేశ వాహకుణ్ణిమాత్రమే. ఆయన ఆదేశించింది చేయడమే నా బాధ్యత. ఆయన తలచుకుంటే ఏమైనా చేయగలడు. మీరడిగే తియ్యటి సెలయేర్లు, ఉద్యానాలు, అందమైన భవంతులు నాకు అనుగ్రహించగలడు’ అన్నారు ప్రవక్త ప్రశాంతంగా. ‘సరే, ముహమ్మద్ ! మేము నీ ముందు ఎన్నో ప్రతిపాదనలు ఉంచాం. నువ్వు దేనికీ అంగీకరించలేదు. ఇక మా తడాఖా ఏమిటో చూపిస్తాం. సిద్ధంగా ఉండు. ఎవరడ్డమొస్తారో మేమూ చూస్తాం’ అన్నారు బెదిరిస్తూ. చివరికి అంతా కలిసి ముహమ్మద్ ప్రవక్త అడ్డు తొలగించుకోవాలని తీర్మానించుకున్నారు. కానీ వారిలో ఒకడు ప్రవక్త హత్యానంతర పరిస్థితులపై భయసందేహాలు వ్యక్తపరిచాడు. ‘అవును. ముహమ్మద్‌ను చంపితే అబూతాలిబ్ ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకోడు. కచ్చితంగా ఎదురు తిరుగుతాడు. వాళ్ళ వంశం మొత్తం ఏకమైపోతుంది. పైగా వాళ్ళు ఖురైష్ జాతి అగ్రనాయకులు. అలాంటి వారి విషయంలో తీవ్ర నిర్ణయం సరికాదేమో’ అన్నాడు మరొకడు. దీంతో వారి ఉత్సాహమంతా జావగారిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ చల్లబడిపోయారు. ఇప్పుడేమిటి కర్తవ్యం? తల బద్దలు కొట్టుకున్నారు. చర్చోపచర్చల అనంతరం అందరూ కలసి ఒక స్థిరనిర్ణయానికొచ్చారు. దాని ప్రకారం - అందరూ కలిసి ఓ నవ యువకుణ్ణి వెంటబెట్టుకొని అబూతాలిబ్ దగ్గరికి వెళ్ళారు. ‘ఈ యువకుడి పేరు వలీద్. ఎంతో సౌందర్యవంతుడు, గొప్ప పరాక్రమ శాలి, వ్యూహకర్త. ఈరోజు నుండి ఇతను మీ కొడుకే. మీకు మంచి సలహాలు, సూచనలిస్తూ అన్ని విధాలా అండదండగా ఉంటాడు. కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఇతనికి బదులుగా మాకు ముహమ్మద్‌ను అప్పగించండి చాలు. అతని సంగతి మేము చూసుకుంటాం. లేని పోనివి సృష్టించి అతడు మన జాతిని కకావికలం చేశాడు. అతని చేష్టల పట్ల మీరుకూడా సంతృప్తిగా లేరనే అనుకుంటున్నాం. మీకు కూడా ఒకమంచి యువకుడు, ముహమ్మద్ కంటే యోగ్యుడు లభించినట్లవుతుంది’ అన్నారు ఛీ..! ఎంత నీచానికి దిగజారారు? సంఘంలో పెద్దమనుషులుగా చలామణి అవుతున్నవారి నోట ఇలాంటి మాటలా! ఎంతటి అమానుషత్వం... ఎంతటి క్రూరత్వం! అనుకున్నారు మనసులో.. పెద్దమనుషులుగా వచ్చినవారి నోట ఇలాంటి మాటలువిని అబూతాలిబ్ మనసు చాలా బాధ పడింది. కొద్దిసేపటి తరువాతగాని ఆయన తేరుకోలేకపోయారు. ‘చాలు చాలు.. ఇక ఆపండి మీ ప్రేలాపనలు. ఈ యువకుణ్ణి ఉంచుకొని, బదులుగా నా ముహమ్మద్‌ను మీకు అప్పగించాలా..! నేను మీ వాణ్ణి దగ్గరుంచుకొని చక్కగా మేపుతుంటే, మీరు మావాణ్ణి చిత్రహింసల పాలుచేస్తూ చంపేస్తారా? ఎంత అన్యాయం.. ఎంత అమానవీయం.. ఎంతటి అమానుషం! దైవసాక్షిగా చెబుతున్నాను. ఇది జరగని పని. ముమ్మాటికీ జరగని పని. ఏం చేసుకుంటారో చేసుకోపోండి’ అన్నారు అబూతాలిబ్ ఆగ్రహంతో. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతాది వచ్చే వారం) -
ట్రాఫిక్ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ట్రాఫిక్ పాయింట్లను తనిఖీ చేసిన ఎస్పీ కర్నూలు: ట్రాఫిక్ విభాగంలో పని చేసే పోలీసులు విధులలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలపై పోలీసు దండయాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం కర్నూలు నగరంలో ట్రాఫిక్ పాయింట్లను తనిఖీ చేశారు. ఆర్ఎస్ఐలతో మ్యాన్‌ప్యాక్‌లో మాట్లాడి, అప్రమత్తం చేశారు. రాజ్‌విహార్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, మౌర్యా ఇన్ జంక్షన్, జిల్లా పరిషత్ జంక్షన్ తదితర ట్రాఫిక్ పాయింట్లలో ఎస్పీ సందర్శించి ట్రాఫిక్ పోలీసుల పనితీరును పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వాహన జామ్‌లు తలెత్తకుండా సాఫీగా ప్రయాణించేందుకు ట్రాఫిక్ విభాగం పోలీసులు చర్యలు తీసుకోవాలని విధుల్లో ఉన్న సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ పాయింట్లలో ఉన్న సెక్టార్ ఇంచార్జిలైన ఆర్ఎస్ఐలతో మ్యాన్‌ప్యాక్‌లో మాట్లాడి, ట్రాఫిక్ జామ్ గురించి అడిగి తెలుసుకొని పలు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ మానిటరింగ్ చేశారు. ట్రాఫిక్ పాయింట్లలో నిలబడి ట్రాఫిక్ క్రమబద్దీకరణపై స్వయంగా వీడియో తీశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, రాంగ్రూట్లో వెళ్తున్న వ్యక్తికి రూ.100 జరిమానా విధించారు. ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ దస్తగిరి, ట్రాఫిక్ ఆర్ఎస్ఐలు ప్రతాప్, శ్రీనివాసగౌడ్, సోమశేఖర్‌నాయక్, వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ పాయింట్లలో విధులు నిర్వహించారు. ఆయా ప్రాంతాలను తనిఖీ చేసి, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు. -
అన్నవరంలో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం
-
కారు బోల్తా: ఎనిమిది మందికి గాయాలు
ఘట్కేసర్: బైక్ ఢీకొట్టి ఇన్నోవా బోల్తాపడిన ఘటనలో ఎనిమిది మంది గాయపడిన సంఘటన ఘట్కేసర్ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏదులాబాద్కు చెందిన అంజన్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం బైక్‌పై డ్యూటీకి వెళుతుండగా బైపాస్ రోడ్డులోని మైసమ్మగుట్ట దేవాలయ సమీపంలో వరంగల్ వైపు వెళతున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీనిని చూసిన అంజన్‌కుమార్ పక్కకు తప్పుకోగా కారు బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అంజన్‌కుమార్‌కు స్వల్పగాయాలు కాగా, కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్, గోపి, మేఘనాధ్, మేకలింగం, ప్రవళిక, వనజాక్షి్మ, డ్రైవర్ రాజుకు గాయపడ్డారు. గాంధీనగర్‌కు చెందిన వారు వరంగల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న గన్‌మెన్‌పై కేసు
వరంగల్ : హన్మకొండ వడ్డేపల్లిలో పోశమ్మ బో నాల పండుగ సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న నగరంలోని ఏసీపీ గన్‌మెన్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ సారయ్యపై సుబేదారి పోలీసులు కేసు నమో దు చేశారు. పోశమ్మబోనాల పండుగ సందర్భం గా సుబేదారి పోలీస్‌స్టేçÙన్కు చెందిన మహిళా పీసీలు శిరీష, ప్రమీలకు వడ్డేపల్లిలోని దేవాల యం వద్ద డ్యూటీ వేశారు. ఈ క్రమంలో మొ క్కులు చెల్లించుకునేందుకు కాజీపేట ఏసీపీ వద్ద పనిచేస్తున్న గన్‌మెన్ సారయ్య తన భార్య మం జులతో వచ్చారు. అయితే, సారయ్య భార్య నేరుగా దేవాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిం చగా మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య గొడవ జరగడం తో కానిస్టేబుల్ సారయ్య, అతని భార్య మంజు ల తనపై దాడి చేశారని మహిళా పీసీ శిరీష ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ పరిశీలకుల నియామకం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ నియోజకవర్గాల పరిశీలకులుగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన లో తెలిపింది. పరిశీలకులుగా నియమితులైన నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని ఆధ్వర్యంలో పనిచేస్తారని పేర్కొంది. నియోజకవర్గం పరిశీలకుని పేరు ఏలూరు మాజేటి సురేష్‌కుమార్ దెందులూరు ముప్పిడి సంపత్‌కుమార్ ఉంగుటూరు గంటా ప్రసాదరావు పోలవరం గన్నమని జనార్దనరావు చింతలపూడి బండి పట్టాభి రామారావు (అబ్బులు) కొవ్వూరు పోతుల రామతిరుపతి రెడ్డి గోపాలపురం పోల్నాటి శ్రీనివాస్ బాబు (బాబ్జి) నిడదవోలు ఊదరగొండి చంద్రమౌళి తణుకు మేడపాటి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి తాడేపల్లిగూడెం చెలికాని రాజమోహనరావు (రాజాబాబు) ఆచంట రుద్రరాజు బాల సూర్యనారాయణరాజు (పీడీ రాజు) నరసాపురం చెల్లెం ఆనందప్రకాష్ పాలకొల్లు బలగం సేతుబంధన సీతారామ్ భీమవరం నడపన చినసత్యనారాయణ ఉండి వి.సూర్యనారాయణరాజు (కనకరాజు సూరి) -
అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు
విధులు శ్రద్ధగా నిర్వహించాలి తాంసీ సర్వసభ్య సమావేశంలో అటవీశాఖ మంత్రి జోగు రామన్న తలమడుగు (తాంసి) : ప్రభుత్వం అనేక అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని తాంసీ సర్వసభ్య సమావేశంలో మంత్రి జోగురామన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తాంసీ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా సమావేశంలో మొదటి ఎజెండా అంశం వ్యవసాశాయ శాఖ సమీక్ష కాగా వ్యవసాయ శాఖ అధికారులు వారి నివేదికను చదివి వినిపించారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు ఎంత మంది రైతులకు ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారని అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారులు సరైన సమాధానం చెప్పకపోయే సరికి మంత్రి వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో రుణాలు తీసుకుని రైతుల వివరాలు, కారణం తెలపాలని ఆదేశించారు. జల్కోరి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ఎందుకు పనులు నిలిచిపోయాయని సంబంధిత అధికారుల్ని మంత్రి ప్రశ్నించారు. సంబదిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, టెండర్ రద్దు చేయాలని పంచాయతీ రాజ్ ఏఈ గులబ్ని ఆదేశించారు. అటవీప్రాంతంలో మొక్కలు నాటాలని శాఖ అధికారులను ఆదేశించారు. బెల్షారిరాంపుర్ గ్రామ సర్పంచ్‌ను గ్రామ కార్యాదర్శి గంగన్న ఇష్టమెచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని వెంటనే అతడిని విధులనుంచి తొలగించాలని పలువురు మంత్రికి విన్నవించారు. అనతరం తాంసీ జెడ్పీ పాఠశాలలో మంత్రి మొక్కలు నాటారు. గ్రామంలో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. కేజీబీవీ పాఠశాలలో తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ ముడుపు దమోదర్‌రెడ్డి, సాక్షరభారత్ డీడీ దుర్గాభవాని, ఎంపీపీ మంజుల శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత నారాయణ, ఎంపీడీవో భూమయ్య, ఇరిగేషన్ డీఈ ప్రతాప్, డీటీ మధూకర్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు తప్పిపోయారా..?
కౌటాల : నిత్యం రద్దీగా ఉండే కౌటాల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులు కనిపించలేదు. వివిధ పనుల నిమిత్తం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన భాధితులకు చుక్కెదురైంది. అధికారుల రాక కోసం గంటల తరబడి వేచి చూసినా ఫలితం దక్కలేదు. తెలంగాణ రాష్ట్రంలోనైనా అధికారులు మంచి పాలన అందిస్తారనే ప్రజల నమ్మకాన్ని ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది వమ్ము చేస్తున్నారు. ఖాళీగా కుర్చీలు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోతో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు అటెండర్లు, కంప్యూటర్ అపరేటర్ విధులు నిర్వహిస్తారు. కానీ బుధవారం కార్యాలయంలో ఒక్క అటెండర్ తప్ప ఎవరూ కూడా విధులకు హాజరు కాలేదు. అలాగే మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు సైతం కనిపించలేదు. కార్యాలయంలో కనీసం ఒక్క ఉద్యోగి అయినా అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు చెబుతున్నా వారి మాట మండల ఉద్యోగులకు పట్టడం లేదు. సిబ్బంది లేకపోవడంపై ఆరా తీయగా ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నా ఓ ఉద్యోగి ఇంట్లో బుధవారం గహా ప్రవేశ కార్యక్రమం ఉండడంతో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది కొందరు శుభకార్యానికి, కొంత మంది వారి పనుల నిమిత్తం వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై ఎంపీడీవో రాజేశ్వర్‌ను సాక్షి సంప్రదించగా తాను విధుల్లో భాగంగా జిల్లా కేంద్రానికి వెళ్లినట్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆఫీసు సిబ్బంది విషయమై ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదన్నారు. -
బస సరే.. మరి భోజనం ?
స్నానాల పరిస్థితి ఏమిటి ? తలలు పట్టుకుంటున్న అధికారులు తాడేపల్లి (తాడేపల్లి రూరల్) : పుష్కర విధులకు విచ్చేసే అధికారులకు బస ఏర్పాటు చేయడానికి యంత్రాంగం పలు పాఠశాలలు, సత్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పాఠశాలలో సుమారు 300 మంది సిబ్బంది బస చేయనున్నారు. అధికారులు మొక్కుబడిగా పాఠశాలలు అప్పజెప్పారు కానీ, అందులో బస చేసే ఉద్యోగులకు స్నానాలు, టాయ్లెట్లు, ఆహారం వంటి అంశాలలో ఇప్పటికీ ఏర్పాట్లు చేయలేదు. 300 మంది ఉద్యోగులకు స్నానాలకు అవసరమైన నీరు, టాయ్లెట్లు లేని పాఠశాలలు, సత్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలలో 300 మంది ఉంటే మొత్తం విధులు నిర్వర్తించే సుమారు 5 వేల మంది ఉద్యోగులకు నీటి వసతికి తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టం చేయలేదు. భోజన సదుపాయం ఒక చోట, వసతి మరో చోట కావడంతో విధులు నిర్వహించిన అనంతరం వసతి గహంలో ఉంటే భోజనానికి అక్కడకు వెళ్లాలంటే రెండు మూడు కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్లాల్సి ఉంది. పుష్కరఘాట్లలో విధులు నిర్వహించి, మరలా భోజనం కోసం అంతదూరం వెళ్లాలంటే ఎలా అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పురుషులు అయితే ఏదో విధంగా వసతి గహాల్లో కాలకత్యాలు తీర్చుకుని, స్నానం చేయగలరు. మరి మహిళా ఉద్యోగుల పరిస్థితి ఏమిటో అర్థంకాక సతమతమవుతున్నారు. ఒకరోజు రెండు రోజులైతే ఏదో విధంగా సరిపెట్టుకుంటారు. 12 రోజులు ఎలా అని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప వచ్చే భక్తులకు, ఉద్యోగులకు సరైన సదుపాయాలు కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
పాతాళగంగ (మన్ననూర్) : కృష్ణా పుష్కరాల్లో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పుష్కరాల నిర్వహణ ప్రత్యేక అధికారులు మధుసూదన్‌నాయక్, డాక్టర్ వెంకటయ్య ఆదేశించారు. శుక్రవారం పాతాళగంగ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సిబ్బందితో వారు మాట్లాడారు. 12రోజులపాటు నిర్వహించే పుష్కరాల్లో క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కృష్ణవేణి, వనమయూరి, మన్ననూర్లోని వనమాలికలో వీఐపీల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశామన్నారు. మీడియా పాయింట్ వద్ద రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోని, ఉపసర్పంచ్ ప్రసాద్, నాగర్‌కర్నూల్ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, అచ్చంపేట ఆర్టీసీ డీఎం నారాయణ, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ రఘునందన్, సీఐ శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్‌కు రావడం సంతోషంగా ఉంది
జిల్లా న్యాయమూర్తి రేణుక కమాన్‌చౌరస్తా: జిల్లాకు ప్రధాన న్యాయమూర్తిగా రావడం సంతోషంగా ఉందని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రేణుక అన్నారు. సోమవారం కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్ భవనంలో ఉద్యోగ విరమణ పొందిన న్యాయమూర్తి బి.నాగమారుతీశర్మకు కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగమారుతీశర్మ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి మంచిపేరు తెచ్చుకున్నారన్నారు. న్యాయమూర్తి నాగమారుతిశర్మ మాట్లాడుతూ న్యాయవాదుల సహకారంతో కేసులను సత్వరగా పరిష్కరించవచ్చని, అందరూ ఆదరించడం మన్ననలు పొందానని చెప్పారు. జిల్లాలోనే మేజిస్ట్రేట్ ప్రారంభమై ఇక్కడే విరమణ పొందడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రఘునందన్‌రావు, ఉపాధ్యక్షుడు పీవీరాజ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు సత్కరించారు. బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, బార్ అసోయేషన్ మాజీ సంజీవరెడ్డి, జగదీష్‌చందర్‌రావు, కొరివి వేణుగోపాల్, బాససత్యనారాయణరావు, ప్రభుత్వ న్యాయవాది గీతారెడ్డి, సీనియర్ న్యాయవాదులు రాంరెడ్డి, వెంకటనర్సింగారావు, ముస్కుల సత్యనారాయణ, ఎర్రం రాజిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రత్యేక అధికారులు విధులు విస్మరించద్దు
ఆదిలాబాద్ టౌన్ : కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు చేపడుతామని ఆర్వీఎం పీవో రాజేశ్వర్ రాథోడ్ హెచ్చరించారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. సీఆర్టీలు, ప్రత్యేక అధికారులు సమయపాలన పాటించాలన్నారు. వర్షాకాలంలో సీజినల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, వ్యాధులు సోకకుండా ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేజీబీవీల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ఎన్నుకోవాలన్నారు. సమావేశంలో జీసీడీవో పద్మ, అలేస్కో లస్మన్న, ఈఈ శ్రీనివాస్, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు
చేజర్ల : విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మామూడూరు, గొల్లపల్లి, చేజర్ల గ్రామాల్లో జరుగుతున్న స్మార్ట్ పల్స్ సర్వేను ఆయన పరిశీలించారు. సర్వే తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన మామూడూరు వీఆర్వో మాలకొండయ్యకు, పెళ్లేరు వీసీఓ మాతయ్యకు షోకాజ్ నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నారు. ఎన్యూమరేటర్లు ఉదయం 6 గంటల నుంచి 12 గంటలలోగా సర్వే ప్రారంభిస్తే సర్వరు, సిగ్నెల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ఎన్యూమరేటర్లు తప్పనిసరిగా ఉదయం 6 గంటలకు విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ఆయన వెంట yì ప్యూటీ ఎస్ఓ సుధాకర్‌రావు, చేజర్ల ఏఎస్ఓ రఫీహుద్దీన్ అన్సారీ, డీటీ బాలాజీ ఉన్నారు. పలు గ్రామాల్లో పరీశీలన అనుమసముద్రంపేట : మండలంలోని వేల్పులగుంట, హనాపురం, శ్రీకొలను చిరమన తదితర గ్రామాల్లో జరుగుతున్న సర్వేను తహసీల్దారు ఐ.మునిలక్ష్మి పరిశీలించారు. డివిజన్లో మండలాన్ని మొదటిస్థానంలో నిలిపేందుకు అందరూ ఈ సందర్భంగా ఆమె అన్నారు. -
కృష్ణ పుష్కరాల్లో పకడ్బందీగా విధులు నిర్వహించాలి
–మూడు షిప్ట్‌ల్లో విధులు –సమర్థుల పేర్లు ఈ నెల 21లోగా ఇవ్వాలి –అన్ని శాఖలకు కలెక్టర్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణ పుష్కరాల్లో 24 గంటలు విధులు నిర్వహించే విధంగా అన్ని శాఖల అధికారులు సమర్థులును గుర్తించి ఈ నెల 21లోగా నిర్ణీత పార్మట్‌లో వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ..శ్రీశైలం, సంగమేశ్వరంలలో మూడు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని మొదటి షిప్ట్ ఉదయం 7 మద్యాహ్నం 2 గంటల వరకు, రెండవ షిప్ట్ మద్యాహ్నం 2 నుంచి రాత్రి9 గంటల వరకు, మూడవ షిప్ట్ రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటలవరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఆగస్టు 8 నుంచి 24 వరకు పుష్కరాల విధులు నిర్వహించాలని తెలిపారు. పుష్కరాల్లో ప్రకతి విపత్తులకు అవకాశం ఉంటుందని వాటిని ఎదుర్కోగల సామర్థ్యం కలిగిన వారిని గుర్తించాలన్నారు. 21 వ తేదీలోగా అర్హులయిన వారి పేర్లు ఇస్తే వారికి తగిన శిక్షణ కూడ ఇస్తామని వివరించారు. పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మరంగా నిర్వహించతలపెట్టిందని అందువల్ల ప్రతి ఒక్కరు జవాబుదారి తనంతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. పుష్కర విధులు నిర్వహించే వారికి విధులు నిర్వహించే చోటనే వసతి, బోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. విధులను అంకితభావంతో నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ ఆకె రవికష్ణ, జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
స్టీల్ పైప్స్, ట్యూబ్స్ పై యాంటీ డంపింగ్ సుంకం
న్యూఢిల్లీ: చైనా నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న స్టీల్ పైప్స్, సీమ్‌లెస్ ట్యూబ్స్‌పై కేంద్ర ప్రభుత్వం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. చౌక దిగుమతుల బారినుంచి దేశీ స్టీల్ పరిశ్రమను ఆదుకోవాల్సి ఉందని, అందులో భాగంగా ఆయిల్, గ్యాస్ అన్వేషణలో ఉపయోగించే స్టీల్ పైప్స్, ట్యూబ్స్‌పై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డెరైక్టరేట్ జనరల్ ఫర్ యాంటీ డంపింగ్ అండ్ అలీడ్ డ్యూటీస్ (డీజీఏడీ) ఇటీవల రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఒక ప్రతిపాదన చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కొన్ని స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించిందని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) తెలిపింది. ఇది 961.33-1,610.67 డాలర్ల శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. -
సిసలైన ‘చెత్త’శుద్ధి...
సమ్‌థింగ్ స్పెషల్ మన పాలకులు తమ ‘చెత్త’శుద్ధిని చాటుకోవడానికి ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. దీనికోసం పౌరులు పొందే అన్ని సేవలపైనా అదనంగా 0.5 శాతం సుంకం కూడా ఎడాపెడా వసూలు చేస్తున్నారు. సుంకం వసూలు చేయడానికి ఇదొక నెపమే గానీ, పాలకులకు చిత్తశుద్ధి ఎక్కడుందీ? మహా నగరాల నుంచి మారుమూల పల్లెల వరకు ఎక్కడ చూసినా మనకు అడుగడుగునా తారసపడేవి మేరు మంధర పర్వతాలను తలపించే చెత్తకుప్పలే! పాలకుల సంగతి సరే... మన పౌరులేం తక్కువ తిన్నారు గనుక? వాడి పారేసే సంస్కృతిని నరనరానా జీర్ణించుకున్న పౌరులు యథాశక్తి ఇంటా బయట చెత్తను పోగుపెడుతూనే ఉన్నారు. పౌరులు పోగుపెట్టే చెత్తకు సంబంధించి మన దేశంలో ఎలాంటి గణాంకాలు లేవు గానీ, అగ్రరాజ్యమైన అమెరికాలోనైతే అప్ టు డేట్ గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. సగటు అమెరికన్ పౌరుడు ఏటా 1500 పౌండ్ల (680.3 కిలోలు) చెత్తను పోగు చేస్తున్నట్లు అక్కడి అధికారిక అంచనా. ఇక్కడి ఫొటోలో కనిపిస్తున్న గడ్డాల కుర్రాడి పేరు దర్శన్ కార్వత్. ఉన్నత చదువు కోసం మన దేశం నుంచి కొన్నేళ్ల కిందట అమెరికా వెళ్లాడు. మిషిగాన్ వర్సిటీలో పోస్ట్ డాక్టరేట్‌లో చేరాడు. చెత్తను పోగుచేయడంపై విసిగి వేసారిన ఇతగాడు, ఎలాగైనా అతి తక్కువ చెత్తతో బతకాలని డిసైడయ్యాడు. తిరుగులేని ‘చెత్త’శుద్ధితో... సారీ... చిత్తశుద్ధితో ప్రయత్నం ప్రారంభించాడు. మొదటి ఏడాది ఇతగాడు పోగుపెట్టిన చెత్త కేవలం 7.5 పౌండ్లు (3.4 కిలోలు) మాత్రమే. రెండో ఏడాది మరింత గట్టి ప్రయత్నమే చేశాడు. ఈసారి ఏడాది వ్యవధిలో ఇతగాడు పోగుపెట్టిన చెత్త 6 పౌండ్లు (2.7 కిలోలు) మాత్రమే. అతి తక్కువ చెత్తను మాత్రమే పోగుపెట్టేలా బతకడానికి దర్శన్ తన జీవనశైలినే పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇందుకు అతడు కఠిన ప్రయత్నమే చేశాడు. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల కొనుగోలును పూర్తిగా మానేశాడు. టాయిలెట్ పేపర్ వాడకాన్నీ మానేశాడు. బయట రెస్టారెంట్లలో తినేటప్పుడు కూడా పదార్థాలకు చుట్టిన టిష్యూపేపర్, బర్గర్లకు గుచ్చే పుల్లలు లేకుండానే తనకు సర్వ్ చేయమని చెప్పేవాడు. ఏవైనా పార్టీలకు వెళ్లినా, అక్కడ పేపర్ కప్పులు వాడకుండా ఉండేందుకు తన గ్లాసును తానే తీసుకువెళ్లేవాడు. ఇతగాడి గురించి‘వాషింగ్టన్పోస్ట్’ సహా పలు పత్రికలు ఘనంగా కథనాలు రాశాయంటే, ఇతగాడి ‘చెత్త’ శుద్ధి ఎంత ఘనమైనదో అర్థం చేసుకోవాల్సిందే! -
కనపడుటలేదు...!
-
'హైదరాబాద్‌లో భద్రత మా బాధ్యత'
-
మనసు బాగోలేదా...?
ఇటీవల జర్మనీ విమానం కూలిపోయిన సంఘటన గుర్తుందా? దానికి కారణం ఏమిటో జ్ఞాపకం ఉందా? డిప్రెషన్లో ఉన్న కో-పైలట్ ఇందుకు పాల్పడ్డాడని తెలిశాక ప్రపంచం నివ్వెరపోయింది.. ఇంకా ఎందరో తనువు చాలించుకుంటున్నారు. మరికొందరు ఇతరుల ఉసురు తీస్తున్నారు. కారణాలేమైతేనేమి? డిప్రెషన్ (వ్యాకులత)తో ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకోవడంపై ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తలు, వైద్యులు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కౌన్సెలింగ్, థెరపీ వంటి చికిత్సా విధానాలతో డిప్రెషన్ నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. ప్రశాంత జీవితాన్ని కోరుకోని వారుండరు. కానీ ఆ ప్రశాంతతే చాలామందికి కరువవుతోంది. ఒంటరితనం, విషాదం, అపార్థం, నిరాశ, ఆందోళన, అసంతృప్తి వంటివి డిప్రెషన్‌కు దారితీస్తాయి. ఇవి వయసుతో పనిలేకుండా అన్ని వయసుల వారికీ వర్తిస్తాయి. విద్యార్థులకైతే ఇష్టం లేని కోర్సులు, కాలేజీల్లో చేర్చడంతో అక్కడ ఇమడలేక, సర్దుబాటు చేసుకోలేక, సబ్జెక్ట్ అర్థం కాక సతమతమవుతుంటారు. ఇంకా దూరంగా ఉన్న కాలేజీలకు రోజూ వెళ్లిరావడం, పేరెంట్స్‌కు దూ రంగా ఉండడం, లవ్ ఫెయిల్యూర్స్ కూడా డిప్రెషన్‌కు దోహదపడుతున్నాయి. ఇక విద్య పూర్తయ్యాక కూడా వ్యాకులతకు లోనయ్యే వారెందరో ఉంటున్నారు. చదువయ్యాక సరైన ఉద్యోగావకాశాలు, విద్యార్హతకు తగిన ఉద్యోగాలు రాక, జీతాలు చాలక కొందరు, అధిక పని, నిద్రలేమి వంటివి కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. పెళ్లయ్యాక భార్యాభర్తల నేపథ్యం సమస్యలు, ఫైనాన్షియల్ షేరింగ్ లేకపోవడం, జాబ్ రిలేటెడ్ ప్రోబ్లమ్స్, వివాహేతర సంబంధాలు, టీవీ సీరియళ్ల ప్రభావం డిప్రెషన్‌కు కారణమవుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇక వృద్ధాప్యంలోనూ డిప్రెషన్‌కు లోనవుతున్న వారూ ఉన్నారు. వయసు మీరాక వివిధ కారణాల వల్ల పిల్లలు దూరం కావడం, జీవిత భాగస్వామి మరణించడంతో ఒంటరితనాన్ని భరించలేకపోవడం, అనారోగ్యం వంటి వాటితో వ్యాకులతకు గురవుతున్నారు. పలువురు తమ మనోవేదనను ఇతరులతో పంచుకోకుండా లోలోపలే భరించడంకూడా ఇందుకు ప్రేరేపిస్తున్నాయి. ఇవన్నీ వెరసి అం తిమంగా డిప్రెషన్‌కు దారి తీసి ఆత్మహత్యలకు ఆస్కారమిస్తున్నాయి. ఇలా పేద, మధ్య తరగతి వారే కాదు.. మేధావులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, రచయితలు తనువులు చాలించిన వారిలో ఉండడం విశేషం! మన విశాఖ నగరంలోనూ డిప్రెషన్‌కు గురవుతు న్న వారి సంఖ్య అధికంగా ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో 15శాతం యువతలోనే ఉంటోందని అంచనాకొచ్చారు. విధి నిర్వహణలో జాగ్రత్త.. డిప్రెషన్లో ఉంటూ విధి నిర్వహణ చేసే వారితో ఎంతో అప్రమత్తంగా ఉండాలని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. విమాన పెలైట్లు, వాహనాల డ్రైవర్లు, మెదడు, గుండె సంబంధిత వైద్యులు, సైంటిస్టులు, కీలక పరిశ్రమలు, మైనింగ్‌లో పనిచేసేవారిలో అవసరమైన వారు తరచూ డిప్రెషన్ చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో వారితో పాటు ఇతరులకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మొన్నటికి మొన్న జర్మన్ విమానం కో-పైల ట్ ఆండ్రియాస్ లుబిట్జ్ ప్రియురాలు కాదనడంతో డిప్రెషన్‌కు లోనై విమానాన్ని కూల్చివేసి 150 మంది అమాయక ప్రయాణికుల చావుకు కారణమయ్యాడన్న చేదు నిజాన్ని వీరు ఉదహరిస్తున్నారు. అందుకే ఇలాంటి వారి మానసిక స్థితి తెలిసేలా ముందుగా అవసరమైన చెకప్ చేయాలని వీరు పేర్కొంటున్నారు. థెరపీతో నయం.. డిప్రెషన్‌కు గురయిన వారికి థెరపీతో నయం చేయొచ్చు. డిప్రెషన్లో మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటాయి. డిప్రెషన్ స్కేల్‌తో దాని తీవ్రతను గుర్తిస్తారు. ఇందులో మైల్డ్, మోడరేట్లకు కౌన్సెలింగ్, కాగ్నెటివ్ బిహేవియర్ థెర పీతో పూర్తిగా సరి చేస్తాం. ఇందుకు 2-6 నెలల పాటు చికిత్స అవసరం. అవసరమైన వారికి అవగాహన, సోషల్ స్కిల్స్, కెరీర్ ప్లానింగ్, హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాం. సివియర్ కేటగిరీలో ఉన్న వారిని సైక్రి యాట్రిస్ట్ను సంప్రదించాలి. విశాఖ నగరంలో డిప్రెషన్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఇంకా పెరగాలి. మైండ్ అండ్ బాడీతో పనిచేసే వారు తరచూ డిప్రెషన్‌పై చెకప్ చేయించుకోవాలి. అవసరమైన వారు సంప్రదిస్తే కౌన్సెలింగ్, చికిత్స అందిస్తాం. - డాక్టర్ ఎం.వి.ఆర్.రాజు, సైకాలజీ విభాగాధిపతి, ఏయూ (సెల్ 9393101813) -
వైద్యులు 8 మంది... విధుల్లో ముగ్గురు
పాలకొండ రూరల్/భామిని: డివిజన్ కేంద్రం పాలకొండలో ఉన్న 100 పడకల ఆస్పత్రి తీరు ‘పేరుగొప్ప ఊరుదిబ్బ’ అన్నచందంగా మారింది. సోమవారం ఉదయం 10 గంటలకు ఓపీ ప్రారంభమైంది. 185 మంది ఓపీ నమోదైంది. ఆస్పత్రిలో 8 మంది వైద్యులు సేవలందించాల్సి ఉండగా ముగ్గురే విధుల్లో ఉన్నారు. సూపరింటిండెంట్ రవీంద్రకుమార్, చిన్నపిల్లల వైద్య నిపుణులు సుధాకర్, డాక్టర్ శ్రీనివాస్ మినహా మిగిలిన వైద్యులు విధులకు హాజరుకాలేదు. దీంతో వైద్యం కోసం రోగులు నిరీక్షించాల్సి వచ్చింది. ఆస్పత్రికి అనుసంధానంగా ఉన్న మాతాశిశుసంక్షేమ కేంద్రంలో ఇద్దరు స్త్రీ వైద్య నిపుణులకు ఒకరు దీర్ఘకాలిక సెలవుపెట్టగా ఇంకొకరు కూడా సెలవు తీసుకోవడంతో గర్భిణులు, బాలింతలకు డాక్టర్ శ్రీనివాస్ సేవలందించారు. శస్త్ర చికిత్సలకు సంబంధించి మత్తువైద్య నిపుణులు లేకపోవడం ఇక్కడ ప్ర దాన సమస్యగా మారింది. డిప్యుటేషన్‌ై పె వారంలో మూడు రోజులు మత్తు వై ద్యనిపుణులు వచ్చి వెళ్లడంతో అత్యవస ర సమయంలో ఇక్కట్లు తప్పడం లేదు. భామిని పీహెచ్సీలో 24 గంటల పాటు వైద్యసేవలు అందడం లేదు. ఇక్కడ ఉన్న ముగ్గురు వైద్యాధికారుల్లో ఒకరిని బత్తిలి పీహెచ్‌సీకి డెప్యుటేషన్ వేశారు. రెండో పూట వైద్యసిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. ఇక్కడి అంబులెన్స్ మరమ్మతులకు గురైంది. -
మంచిని పెంచడమే విశ్వాసుల కర్తవ్యం
ఇస్లాం వెలుగు స్వీయ సంస్కరణతో పాటు, సమాజ సంస్కరణ బాధ్యత కూడా దైవ విశ్వాసులపై ఉంది. నైతిక, మానవీయ విలువలతో కూడిన సుందర సత్సమాజ నిర్మాణం కోసమే విశ్వాసులను ఉనికిలోకి తీసుకురావడం జరిగింది. సమాజంలో ఏ విధమైన దుష్కార్యాలు, దుర్మార్గాలు జరగకుండా చూడడం; మంచిని, సత్కార్యాలను పెంపొందించడం విశ్వాసుల విధి. ఈ విషయం పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది. ‘‘విశ్వసించిన ప్రజలారా! ఇక నుంచి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ, వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచి పనులు చేయమని ప్రజలను ఆదేశిస్తారు. చెడులనుండి వారిస్తారు’’ (3-110). అంటే సమాజంలో మంచిని వ్యాపింపజేయడం, చెడులను నిరోధించడం దైవ విశ్వాసుల విద్యుక్త ధర్మమన్నమాట. సమాజంలో దుర్మార్గాలు ప్రబలిపోతూ ఉంటే చూస్తూ కూర్చోవడం విశ్వాసుల లక్షణం ఎంతమాత్రం కాదు. చెడులకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా శక్తి మేరకు పోరాడాలి. చెడులు అంతమయ్యే వరకు పోరాటం ఆపరాదు. అందరూ కలసి సంఘటిత ఉద్యమం ద్వారా వీటి నిర్మూలనకు కృషి చేయాలి. అదే సమయంలో మంచి పనుల వైపునకు ప్రజలను ప్రోత్సహించాలి. సత్కార్యాల వల్ల ఒనగూడే ప్రయోజనాలను వారికి వివరించాలి. దుష్కార్యాల పర్యవసానాన్ని ఎరుక పరుచుకోవాలి. ఇహ పర లోకాల్లో ఎదురయ్యే పరాభవాల పట్ల ప్రజలను అప్రమత్తుల్ని చేయాలి. దైవ విశ్వాసం, పరలోకం, మరణానంతర జీవితం పట్ల విశ్వాసం ఎంత పటిష్టంగా ఉంటే, అంతగా విశ్వాసుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. - మహ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
తప్పతాగి వీరంగం సృష్టించిన ట్రాఫిక్ పోలీస్
-
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
ఆదిలాబాద్‌టౌన్, న్యూస్‌లైన్ : వైద్యాధికారులు, ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని వైద్య, ఆరోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్(ఆర్డీ) మాణిక్యరావు అన్నారు. గురువారం ఆయన నర్సాపూర్(జి), మామడ, గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేది పేదలేనని, వారికి మెరుగైన వైద్యసేవలు అందించే బాధ్యత వైద్యులపైనే ఉందని అన్నారు. ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలని, మాత, శిశు మరణాలను తగ్గించాలని సూచించారు. కుటుంబ నియంత్రణ లక్ష్యాలను సాధించాలని, మార్చిలోగా వంద శాతం పూర్తి చేసే విధంగా చూడాలని అన్నారు. వైద్యశాఖ ద్వారా అమలయ్యే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. ఉప కేంద్రాల్లో సేవలు, వైద్యాధికారులు, ఉద్యోగుల పనితీరు పరిశీలించాలని తెలిపారు. ఎన్ఆర్హెచ్ఎం లక్ష్యాలను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో మేకల స్వామి, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. పీహెచ్సీలో ఆర్డీ ఆకస్మిక తనిఖీ నర్సాపూర్(జి)(దిలావర్పూర్) : మండలంలోని నర్సాపూర్(జి) గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య, ఆరోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్(ఆర్డీ) మాణిక్యరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి వైద్యసేవల తీరును తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై దృష్టి సారించి గ్రామాల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రస్తుత ఆస్పత్రి భవనం ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సిద్ధార్థ, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడలతో పోలీసులకు మనోస్థైర్యం: బి.ప్రసాదరావు
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో తీరికలేకుండా ఉండే పోలీసులకు, భద్రతా సిబ్బందికి క్రీడలు మానసిక స్థైర్యాన్ని కలిగిస్తాయని డీజీపీ బి.ప్రసాదరావు అన్నారు. బుధవారమిక్కడి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మైదానంలో బీఎన్ మాలిక్ స్మారక 62వ అఖిలభారత పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్-2013 పోటీలను ఆయన ప్రారంభించారు. పోలీసులు, పారామిలటరీ జవాన్లు సంఘవిద్రోహక శక్తులను ఎదుర్కొంటుంటూ దేశ సమగ్రతకు పాటుపడుతున్నారని, వారికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని డీజీపీ చెప్పారు. ఈ నెల 22న ముగిసే ఈ ఫుట్‌బాల్ పోటీల్లో వివిధ రాష్ట్రాల పోలీసు టీమ్‌లు, పారామిలటరీ బలగాలకు చెందిన వెయ్యిమంది క్రీడాకారులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. పోటీల ప్రారంభ కార్యక్రమానికి గౌరవ అతిథిగా దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అశోక్‌కుమార్ మిట్టల్ హాజరయ్యారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చైర్మన్, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్ పచర్వాల్, హిమాచల్‌ప్రదేశ్ డీజీపీ సంజయ్‌కుమార్, రాష్ర్ట పోలీసు క్రీడా విభాగం అదనపు డీజీ రాజీవ్ త్రివేది తదితరులు పాల్గొన్నారు. -
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
మద్నూర్,న్యూస్‌లైన్: వైద్యులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మండల కేంద్రం లోని కమ్యూనిటీహెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించి, సిబ్బం దిని వివరాలు అడిగారు. రికార్డులో గల ఆస్పత్రి వైద్యులు,సిబ్బంది డ్యూటీలో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వేల రూపాయల జీ తాలు ఇస్తూ, రోగులకు ఎల్లవేళలా సేవలు అందించాలని సూచించినప్పటికీ, నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని మండిపడ్డారు. ఆస్పత్రిలోని కాంట్రాక్ట్ వైద్యులు దేవీసింగ్,అమిత్‌కుమార్‌లు సెలవు పెట్టకుండా విధులకు హాజరుకావడంలేదని దృష్టికి రావడంతో వారిని విధుల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించారు. వారితో పాటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నాల్గో తరగతి సిబ్బంది ఇక్బాల్ అహ్మద్,మన్సూర్‌లను సస్పెండ్ చే యాలని ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నితి న్శెట్టిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా లో ఖాళీగా ఉన్న ఆస్పత్రుల్లో డాక్టర్,నర్సుల పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం మోడల్ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు,సిబ్బంది లేకపోవడం,పుస్తకాలు రాకపోడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాఠశాల ప్రిన్స్‌పాల్ సతీశ్ తెలిపారు. త్వరలో పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను నియమించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.పాఠశాలలో ఎలా బోధిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.