వైద్యులు 8 మంది... విధుల్లో ముగ్గురు
పాలకొండ రూరల్/భామిని: డివిజన్ కేంద్రం పాలకొండలో ఉన్న 100 పడకల ఆస్పత్రి తీరు ‘పేరుగొప్ప ఊరుదిబ్బ’ అన్నచందంగా మారింది. సోమవారం ఉదయం 10 గంటలకు ఓపీ ప్రారంభమైంది. 185 మంది ఓపీ నమోదైంది. ఆస్పత్రిలో 8 మంది వైద్యులు సేవలందించాల్సి ఉండగా ముగ్గురే విధుల్లో ఉన్నారు. సూపరింటిండెంట్ రవీంద్రకుమార్, చిన్నపిల్లల వైద్య నిపుణులు సుధాకర్, డాక్టర్ శ్రీనివాస్ మినహా మిగిలిన వైద్యులు విధులకు హాజరుకాలేదు. దీంతో వైద్యం కోసం రోగులు నిరీక్షించాల్సి వచ్చింది.
ఆస్పత్రికి అనుసంధానంగా ఉన్న మాతాశిశుసంక్షేమ కేంద్రంలో ఇద్దరు స్త్రీ వైద్య నిపుణులకు ఒకరు దీర్ఘకాలిక సెలవుపెట్టగా ఇంకొకరు కూడా సెలవు తీసుకోవడంతో గర్భిణులు, బాలింతలకు డాక్టర్ శ్రీనివాస్ సేవలందించారు. శస్త్ర చికిత్సలకు సంబంధించి మత్తువైద్య నిపుణులు లేకపోవడం ఇక్కడ ప్ర దాన సమస్యగా మారింది. డిప్యుటేషన్‌ై పె వారంలో మూడు రోజులు మత్తు వై ద్యనిపుణులు వచ్చి వెళ్లడంతో అత్యవస ర సమయంలో ఇక్కట్లు తప్పడం లేదు. భామిని పీహెచ్‌సీలో 24 గంటల పాటు వైద్యసేవలు అందడం లేదు. ఇక్కడ ఉన్న ముగ్గురు వైద్యాధికారుల్లో ఒకరిని బత్తిలి పీహెచ్‌సీకి డెప్యుటేషన్ వేశారు. రెండో పూట వైద్యసిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. ఇక్కడి అంబులెన్స్ మరమ్మతులకు గురైంది.