Three people
-
ఫంక్షన్‌కు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
పూడూరు: ఓ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న ఒకే కుటుంబంలోని ముగ్గురిని క్వాలిస్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్‌కు చెందిన సంతోష్‌రెడ్డి(36), స్వాతి దంపతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఉద్యోగరీత్యా స్వాతి యూఎస్‌లో ఉంటోంది. సంతోష్‌రెడ్డి తన తల్లిదండ్రులు మల్లికార్జున్‌రెడ్డి (60) రాజ్యలక్ష్మి(56), కుమారుడు దేవాన్ రెడ్డి(6)తో కలసి హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో ఉంటున్నారు. వికారాబాద్‌లోని తమ బంధువుల ఇంట్లో ఆదివారం జరిగిన దావత్‌కు సంతోష్‌రెడ్డి తన తల్లిదండ్రు లు, కుమారుడితో కలిసి వచ్చారు. మరుసటిరోజు ఉద యం కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యా రు. పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి సమీపంలో రాంగ్రూట్లో వేగంగా దూసుకొచ్చిన క్వాలిస్ వాహనం వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్‌రెడ్డి, దేవాన్ రెడ్డి, రాజ్యలక్ష్మి మృతిచెందారు. సంతోష్‌రెడ్డి, క్వాలిస్ డ్రైవర్ మహ్మద్‌గౌస్, మరోవ్యక్తి గాయపడ్డారు. -
మానేరు వాగులో ఆరు గంటలు..
మానేరు వాగులో చేపల వేట కు వెళ్లిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా వచ్చిన వరదకు అందులోనే చిక్కుకుపోయారు. చెట్టును పట్టుకుని ఇద్దరు, పైపును పట్టుకుని మరొకరు సుమారు ఆరు గంటలు నరకయాతన పడ్డారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు రెస్క్యూటీం సహకారంతో ముగ్గురినీ ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటన వీణవంక మండలం చల్లూరు వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. సాక్షి, వీణవంక(హుజూరాబాద్): చల్లూరు గ్రామానికి చెందిన నేదురు రవి, నేదురు శ్రీనివాస్, మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన తిరుపతి ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో మానేరు వాగులో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో వాగులో ఉధృతి ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ కొట్టుకుపోయారు. వాగు ఒడ్డు నుంచి 600 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టును నేదురు శ్రీనివాస్, తిరుపతి పట్టుకున్నారు. నేదురు రవి వాగు ఒడ్డు నుంచి కిలోమీటర్ దూరం కొట్టుకుపోయి అక్కడ ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావి పైపు కనిపించడంతో దానిని పట్టుకున్నాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తుండగా వాగు ఒడ్డు నుంచి వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కిరణ్‌రెడ్డి, సర్పంచ్ పొదిల జ్యోతిరమేశ్, ట్రస్మా అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి వెంటనే వాగు వద్దకు చేరుకుని స్థానికుల సహాయంతో రక్షించేందుకు ప్రయణ్నించారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. ట్రస్మా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కలెక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో రెస్క్యూటీం రంగంలోకి దిగింది. చదవండి: (ఒక్కసారిగా పెరిగిన వరద, ముగ్గురూ వాగులోనే..) వాగులో ఆరుగంటలు... సాయంత్రం 4 గంటలకు గల్లంతైన యువకులు రాత్రి 10 గంటల వరకు సుమారు ఆరు గంటలు వాగులేనే బిక్కుబిక్కు మంటు గడిపారు. కాపాడాలంటూ నేదురు శ్రీనివాస్, తిరుపతి రోదిస్తూ వేడుకున్నారు. నేదురు రవి అచూకీ కనుక్కోవడం కొంత ఆలస్యమైంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాయంత్రం 7 గంటలకు కరీంనగర్‌కు చెందిన రెస్క్యూటీం సభ్యులు వాగు వద్దకు చేరుకుని మొదటగా రవిని రక్షించేందుకు ప్రయణ్నించారు. మూడుసార్లు రవి వద్దకు వెళ్లి వెనక్కు వచ్చిన సిబ్బంది చివరకు తాడు సహాయంతో రాత్రి 9.40 గంటలకు రక్షించగలిగారు. మిగిలిన ఇద్దరినీ 10 గంటల సమయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో చచ్చి బతికామంటు వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఎల్ఎండీ గేట్లు మూయడంతో... కరీంనగర్ ఎల్ఎండీకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరుగడంతో అధికారులు సాయంత్రం నీటి విడుదలను పెంచారు. సుమారు లక్ష క్యూసెక్కులు దిగువకు వదలడంతో మానేరు వాగు ఉప్పొంగి ప్రవహించింది. వరదను అంచనా వేయకుండా యువకులు చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. యువకుల గల్లంతు విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ ఎల్ఎండీ గేట్లు మేసివేయాలని ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించారు. దీంతో హుటాహుటిన గేట్లు మూసివేయడంతో వాగులో వరద ఉధృతి తగ్గుముఖంపట్టింది. దీంతో యువకులను కాపాడడం రెస్క్యూ సిబ్బందికి సులువైంది. హెలిక్యాప్టర్ తెప్పిస్తే బాగుండేది... ముగ్గురు యువకులు ఆరు గంటలపాటు ప్రాణాపాయ స్థితిలో వాగులో కొట్టుమిట్టాడారు. హెలిక్యాప్టర్ సకాలంలో తెప్పిస్తే యువకులను త్వరగా కాపాడేవారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆరు గంటల జాప్యంలో యువకులు పట్టు కోల్పోతే ప్రాణాలు కోల్పోయేవారని పేర్కొంటున్నారు. వరదలో ఆరు గంటలు చుక్కలు చూశామని, అసలు ప్రాణాలతో బయటపడుతామని అనుకోలేదని బాధితులు తెలిపారు. తహసీల్దార్ కనకయ్య, ఎస్సై కిరణ్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచ్ పొదిల్ల జ్యోతిరమేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నాకాతండా శివారులో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న టిప్పర్‌ను వెనక నుంచి వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లా కొయెన్‌చెరి గ్రామానికి చెందిన అనీశ్ థామస్ (33), తన ఇద్దరు సోదరులతో కలసి బిహార్‌లోని నెవడా జిల్లా సిర్‌దల్లాలో స్కూల్ నడుపుతున్నాడు. కరోనా కారణంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో వారి స్కూల్‌ను మూసివేశారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో అక్కడి అధికారుల అనుమతి తీసుకుని మూడు వాహనాల్లో ముగ్గురు సోదరులు తమ భార్యా పిల్లలతో ఈ నెల 13న బిహార్ నుంచి కేరళకు బయలు దేరారు. అనీశ్ థామస్‌తో పాటు భార్య దివ్య, కూతుళ్లు అనాలియా (14 నెలలు), అజాలియా ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం డిచ్పల్లి మండలం నాకాతండా వద్దకు రాగానే ఆగి ఉన్న టిప్పర్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన థామస్ కుటుంబాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనీశ్ థామస్, కూతురు అనాలియా, డ్రైవర్ స్టేనీ జోస్ (24) మృతి చెందారు. దివ్యతో పాటు అజాలియాను మెరుౖ గెన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణాలు తీసిన ‘బంగారు’ కలలు
కుప్పం (చిత్తూరు జిల్లా)/కేజీఎఫ్: చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం, కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో బుధవారం రాత్రి ఆరుగురు చోరీకి ప్రయత్నించగా వారిలో ముగ్గురు మృతి చెందారు. కేజీఎఫ్ పదేళ్ల క్రితం మూతపడింది. అప్పటి నుంచి బంగారు గనుల్లో పనులు జరగకపోవడంతో భద్రతా సిబ్బందిని నియమించారు. గనుల్లో బుధవారం రాత్రి ఐదుగురు వ్యక్తులు చోరీ యత్నానికి పాల్పడ్డారు. రాత్రి వేళల్లో బంగారు ఖనిజాలు కనిపిస్తాయని అపోహతో కేజీఎఫ్‌కు చెందిన జోసెఫ్ డిసౌజా (35), పడియప్ప (22), కంద (50), విక్టర్, కార్తీక్, రిచర్డ్‌లు గనుల్లోపలికి ప్రవేశించారు. వీరిలో ఊపిరాడక జోసెఫ్ డిసోజా, పడియప్ప, కంద మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. 20 మందికి పైగా ఫైర్, పోలీసులు బుధవారం రాత్రంతా గాలించి 400 అడుగుల లోతున ఉన్న కంద, జోసెఫ్ డిసౌజా మృతదేహాలను వెలికితీశారు. పడియప్ప మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు కార్తీక్, విక్టర్లను అరెస్టు చేశారు. మరో నిందితుడు రిచర్డ్ పరారీలో ఉన్నాడు. మృతులు జోసెఫ్, పడియప్ప, కంద -
మరో ముగ్గురికీ కరోనా
హాలీవుడ్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఐదు రోజుల క్రితం స్టార్ కపుల్ టామ్ హ్యాంక్స్, రీటా విల్సన్ తమ కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. మరో తార ఓల్గా కురిలెంకో కూడా కరోనా బారిన పడ్డారు. సోమవారం ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. మంగళవారం నటుడు క్రిస్టోఫర్ హివ్జు కూడా తన బ్లడ్ శాంపిల్‌లో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ‘ది వెండీ ఎఫెక్ట్’, ‘ది లాస్ట్ కింగ్’, ‘ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్’, ‘డౌన్‌హిల్’ తదితర చిత్రాల్లో నటించారు క్రిస్టోఫర్. టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో చేసిన టోర్ముండ్ పాత్ర ద్వారా క్రిస్టోఫర్ చాలా పాపులర్. ‘‘నేను, నా కుటుంబ సభ్యులు ప్రస్తుతం మా అంతట మేం గృహనిర్భందంలో ఉన్నాం. అందరం ఆరోగ్యంగా ఉన్నాం. నాకు కొంచెం జులుబు ఉంది. కరోనా లక్షణాలు కనిపించాయి. కోవిడ్–19 ప్రమాదకరమైన వైరస్. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి’’ అన్నారు క్రిస్టోఫర్ హివ్జు. నటుడు ఇద్రిస్ ఎల్బా కూడా కోవిడ్ 19 వైరస్ సోకినట్లు తెలిపారు. ‘లూథర్’, ‘ది వైర్’ తదితర చిత్రాల్లో నటించారు ఎల్బా. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇంటి నుంచి బయటకు రావడంలేదని పేర్కొన్నారు. వైరస్ ఉన్న వ్యక్తికి సమీపంగా ఉండటం వల్ల తనకు కూడా సోకిందేమోననే అనుమానంతో టెస్ట్ చేయించారట ఎల్బా. పాజిటివ్ రావడంతో ఇంటికి పరిమితం అయ్యారు. ‘‘ఇది మనిషికీ మనిషికీ దూరం పాటించాల్సిన సమయం’’ అని పేర్కొన్నారు ఇద్రిస్ ఎల్బా. ‘ఫ్రోజెన్ 2’, ‘హ్యాపీ డెత్’ వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ తార రేచెల్ మాథ్యూస్ తనకు కోవిడ్ 19 టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘వైరస్ సోకిందని తెలియగానే వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాను. ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే డాక్టర్లు చెప్పేవరకూ ఇంటి నుంచి బయటకు రాకూడదనుకుంటున్నాను. ఈ వ్యాధి గురించి ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను అడగండి. ఎందుకంటే కరోనా బారిన పడ్డాను కాబట్టి ఈ స్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు’’ అన్నారు రేచెల్. -
దొరికిపోతామనే భయంతో ఢీ కొట్టారు
వికారాబాద్: కారులో గంజాయి..ఎదురుగా పోలీసుల తనిఖీలు..తప్పించుకునేందుకు లైట్లు ఆపి కారు ముందుకు పోనిచ్చారు అందులోని యువకులు. గంజాయితో పట్టుబడిపోతామన్న భయంతో కారును ముందుకు పోనిచ్చి ఆ ముగ్గురు యువకులు ఎస్ఐని ఢీకొట్టేశారు. దీంతో ఆయన కాలు విరిగిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో సన్నివేశాన్ని తలపించేలా ఉన్న ఈ ఘటన వికారాబాద్ జిల్లాల్దో బుధవారం అర్థరాత్రి దాటాక జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ సబ్ డివిజన్లోని నవాబ్ పేట ఎస్ఐగా పనిచేస్తున్న కృష్ణ బుధవారం రాత్రి అనంతగిరి గుట్ట ఘాట్‌రోడ్‌లోని నంది విగ్రహం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. టోలిచౌకీ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్‌లు నగరంలోని ఓ పెడ్లర్ వద్ద గంజాయిని కొన్నారు. అనంతరం అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వద్ద కారును అద్దెకు తీసుకుని కోట్‌పల్లి ప్రాజెక్టుకు బయల్దేరారు. ఈ క్రమంలో అనంతగిరి గుట్ట పైకి చేరుకున్నారు. అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి తనిఖీల్లో గంజాయితో పట్టుబడిపోతామని భయపడి వెంటనే లైట్లు ఆపి నందిగుట్ట పక్కనే కారుని నిలిపివేశారు. దీన్ని గమనించిన కృష్ణ వారి కారువద్దకు వెళ్తుండగా తప్పించుకునే ప్రయత్నంలో యువకులు లైట్లు ఆన్ చేయకుండానే కారును స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో వారు ఎస్ఐ కృష్ణను ఢీ కొట్టారు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఫెన్సింగ్‌కు ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో ఎస్ఐ కాలు విరిగిపోవడంతోపాటు కంటినొసలకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురు యువకుల్ని అరెస్టు చేశారు. వారివద్దనుంచి సుమారు 150–200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ ఎస్ఐను వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మరింత మెరుగైన చికిత్స కోసం నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు జిల్లా ఎస్పీ నారాయణ గురువారం మీడియాకు తెలిపారు. ఎస్ఐను ప్రశంసిస్తూ డీజీపీ ట్వీట్ ఈ ఘటనలో గాయపడ్డ ఎస్ఐ కృష్ణ ఆరోగ్యం గురించి డీజీపీ మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. ‘కొత్త సంవత్సర వేడుకల్లో బందోబస్తులో ప్రమాదానికి గురైన ఎస్ఐ కృష్ణ త్వరగా కోలుకోవాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా, వ్యక్తిగతంగా నష్టపోయినా మొక్కవోని ధైర్య ం , విశ్వాసంతో మీరు ప్రజలకు అందిస్తున్న సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’అని డీజీపీ ట్వీట్ చేశారు. కాగా, చికిత్స పొందుతున్న కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కాలు విరగడంతో పాటు,కంటి నొసలు వద్ద గాయమైందని కిమ్స్‌కు చెందిన డాక్టర్ ఐవీ రెడ్డి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. శుక్రవారం సర్జరీ కి ఏర్పాట్లు చేశామని, 3 నెలల పాటు విశ్రాంతి అవసరమని అందులో పేర్కొన్నారు. -
విద్యుత్ విషాదం
సాక్షి, వెల్దుర్తి: చాలా రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పోలేరమ్మ కనికరించిందని కుంకుమ బండి కట్టారు. ప్రభలను రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలకరించారు. ఒకరిపై ఒకరు కుంకుమ చల్లుకుంటూ ఆనందంగా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. వీరి సంతోషాన్ని విద్యుత్ కాటు విషాదంగా మార్చింది. ముగ్గురిని బలి తీసుకుని గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది. మండలంలోని ఉప్పలపాడులో ఆదివారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామంలో పోలేరమ్మ జాతర నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కుంకుమ బండిపై విద్యుత్ ప్రభను ఊరేగిస్తున్నారు. అర్ధరాత్రి కుంకుమ బండికి 11 కేవీ విద్యుత్ వైర్లు తాకటంతో ఒక్కసారిగా ప్రభకు సరఫరా జరిగింది. దీంతో ఇనప బండిని పట్టుకున్న చరకా గాలయ్య (50), కామినేని వెంకటేశ్వర్లు (52), కాకునూరి సత్యనారాయణ (24) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. బండిని పట్టుకున్న మాజీ సర్పంచ్ పోలగాని సైదులు, పోతునూరి గోవిందు, బాలబోయిన వీరాంజనేయులు, పలస బ్రహ్మయ్య తీవ్రంగా గాయపడ్డారు. బండి చుట్టూ ఉన్న మరో 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. పోలేరమ్మ బండిని పక్కకు జరిపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక వైపు ఒరిగి 11 కేవీ విద్యుత్ తీగకు తగిలింది. అప్పటి వరకు జనరేటర్‌పై విద్యుత్ దీపాలు వెలుగుతుండటం, అకస్మాత్తుగా ప్రభ విద్యుత్ తీగలపై ఒరగటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జనరేటర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. విద్యుత్ ప్రభపై ఉన్న ఐదుగురు కార్మికులు కిందకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. చాలా మంది ఊరేగింపునకు చెప్పులు లేకుండానే వచ్చారు. రోడ్డుపై తడి ఉండటంతో ఎక్కువ మంది కరెంట్ షాక్‌కు గురయ్యారు. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కలగయ్య సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు, మాచర్ల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామమంతా రోదనలే.. మృతి చెందిన కామినేని వెంకటేశ్వర్లు భార్య నారమ్మ, వారి బంధువులు, చరకా గాలయ్య భార్య గురవమ్మ, కాకునూరి సత్యనారాయణ తల్లి అరుణ, తీవ్రంగా గాయపడిన వారి బంధువులు ప్రభుత్వ వైద్యశాలలో కన్నీరుమున్నీరుగా విలపించారు. నాయకుల పరామర్శ మాచర్ల: స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న మృతదేహాలకు శుక్రవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. -
మంచి పనులు
ముగ్గురు వ్యక్తులు కాలినడకన సుదూర ప్రయాణంలో ఉన్నారు. అంతలోనే గాలి, వాన మొదలైంది. ముగ్గురూ ఒక గుహలో తలదాచుకున్నారు. భీకరమైన గాలికి ఒక్కసారిగా ఒక పెద్ద బండరాయి వచ్చిపడటంతో గుహద్వారం మూసుకుపోయింది. గుహంతా చీకటిగా మారిపోయింది. ద్వారం మూసుకుపోవడంతో ముగ్గురిలో ఆందోళన మొదలయ్యింది. బండరాయిని తొలగించాలని ఎంతగా ప్రయత్నించినా రాయి అంగుళం కూడా కదలడం లేదు. అందులోని ఒకరు ‘‘ఈ భయంకరమైన అడవిలో మనల్ని రక్షించేదిక్కెవరూ లేరు. ఇక మనకు అల్లాహ్ యే దిక్కు. మనం చేసిన సత్కార్యాలను సాక్ష్యంగా పెట్టి అల్లాహ్ ను వేడుకుందాం’’ అని చెప్పాడు. ఒక్కొక్కరూ వరుసగా తాము చేసిన ఒక్కో మంచి పనిని అల్లాహ్ ముందు ఏకరువు పెడుతూ దైవ సహాయాన్ని అర్ధించడం మెదలెట్టారు. అందులో మొదటి వ్యక్తి ‘‘ఓ అల్లాహ్.. నా తల్లిదండ్రులిద్దరూ వృద్ధులు. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. రోజూ మేకల పాలు పితికి ముందుగా మా అమ్మానాన్నలకు తాగించిన తరువాతే నా పెళ్లాం పిల్లలకు తాగిస్తాను. ఒకరోజు పొలం పనులు చూసుకుని ఇంటికి వచ్చి పాలుపితికి అమ్మానాన్నలకు అందించే సరికి రాత్రి బాగా పొద్దుపోయింది. ఈలోగా మా అమ్మానాన్నలిద్దరూ నిద్రలోకి జారుకున్నారు అమ్మానాన్నల్ని నిద్రనుంచి లేపితే వాళ్ల నిద్ర భంగమవుతుందని వాళ్లు నిద్రలేచే వరకూ పాలగిన్నెను తీసుకుని అలానే నిద్రకాచాను. ఆ రాత్రి నాతో సహా భార్యా పిల్లలు ఆకలితోనే నిద్రపోయారు. కనుక ఓ కరుణామయా నన్ను ఈ చీకటి గుహనుంచి బయటపడే మార్గం చూపించు’’ అని వేడుకోసాగాడు. మరుక్షణమే గుహ ముఖద్వారానికి అడ్డంగా ఉన్న బండరాయి కాస్తంత జరగడంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక రెండో వ్యక్తి ‘‘ఓ అల్లాహ్ మా బంధువుల అమ్మాయి మీద నేనొకసారి మనసు పడ్డాను. ఆమెకు ఒకసారి ఏదో కష్టం వచ్చింది. నా దగ్గరకు వచ్చి కొంత డబ్బు సహాయం చేయమని అర్థించింది. ఆమెకు నేను షరతుతో డబ్బు అందించాను. ఒకరోజు సాయంత్రం షరతు ప్రకారం ఆమె దగ్గరకెళ్లాను. ‘‘అల్లాహ్ కు భయపడు. ఎవ్వరూ చూడకపోయినా అల్లాహ్ చూస్తున్నాడని గుర్తుంచుకో’‘ అని చెప్పిన ఆమె మాటలకు నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఆ మరుక్షణమే ఆమెకు ఇచ్చిన డబ్బును మాఫీ చేశాను. ఓ అల్లాహ్ ఈ పనిని కేవలం నీ మెప్పుకోసమే చేశాను’’ అని అల్లాహ్ ను వేడుకోగానే ఆ బండరాయి ఇంకాస్త జరిగింది. దీంతో బయటికి వెళ్లే మార్గం ఇంకాస్త సుగమమైంది. ఇక మూడో వ్యక్తి వంతురానే వచ్చింది. ‘‘ఓ అల్లాహ్ నాదో చిన్న వ్యాపారం. ఒకసారి ఒక కూలీ వాడు రోజంతా నా దగ్గర పనిచేసి ఇంటికెళ్లేటప్పుడు మా ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు రావడంతో అలిగి తన కూలీ తీసుకెళ్లలేదు. నేను ఆ కూలీ డబ్బుతో సాగుబడి చేశాను. చాలా లాభాలు గడించాను. లాభంగా వచ్చిన అతని వాటాలోనుంచి చిల్లిగవ్వకూడా ఖర్చుపెట్టకుండా భద్రపరిచాను. కొన్నేళ్లకు కూలివాడు ఆర్థిక ఇబ్బందులతో తన కూలి డబ్బుల కోసం మళ్లీ నా దగ్గరకొచ్చాడు. అప్పుడు నేను అతనికి ‘‘ఈ మేకలు, ఈ ఆవులన్నీ నీవే. వాటిని మీ ఇంటికి తోలుకుని వెళ్లు, ఆ పంటపొలం, ఈ తోట నీదే’’ అని చెప్పగానే ఆ కూలివాడు నేను ఎగతాళి చేస్తున్నానననుకున్నాడు. అదంతా నిజమేనని, ఆ రోజు అతని కూలి డబ్బులతో చేసిన వ్యాపారంతోనే ఇదంతా సంపాదించానని ఇదంతా తనదేనని చెప్పి అతనికి అందించాను. ఓ అల్లాహ్ ఇదంతా నీ మీద భయభక్తులతోనే చేశాను. కనుక నీవు ఈ రోజు మమ్మల్ని ఈ చీకటి గుహనుంచి ఎలాగైనా బయటపడేయి’’ అని మూడో వ్యక్తి కూడా వేడుకోగానే బండరాయి పూర్తిగా తొలగిపోయింది. ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారు. తల్లిదండ్రుల సేవ, పాపకార్యాలకు ఆమడ దూరంలో ఉండటం, ఒకరి కష్టార్జితాన్ని కాజేయకుండా ఉండటం కూడా దైవారాధనతో సమానం. మంచి పనులే మనకు కష్టకాలంలో ఆదుకుంటాయన్నది ఈ కథలోని నీతి. – ముహమ్మద్ ముజాహిద్ -
పగబట్టిన విధి
► ఏడు మాసాల్లో ఒకే ఇంటిలో ముగ్గురి మృతి ► అనారోగ్యంతో కొడుకు... ► కొడుకు లేడనే బెంగతో తల్లి ► పిడుగు పాటుకు తండ్రి కన్నుమూత ► అనాథలైన కోడలు, పిల్లలు బొబ్బిలి: నిరుపేద కుటుంబంపై విధి పగ పట్టింది. ఏడు నెలల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందారు. వరుస మృతులతో ఆ కుటుంబంలో ఉండే ఏకైక గృహిణి, ఇద్దరు పిల్లలు అనాథులుగా మారారు. మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలోని తాడుతూరి అప్పన్న కుటుంబ పరిస్థితిది.. అప్పన్న రోడ్డు పక్కన ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా, ఆయన కుమారుడు సింహాచలం తాపీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సరిగ్గా ఏడు మాసాల కిందట సింహాచలం అనారోగ్యంతో కన్నుమూశాడు. చెట్టంత కొడుకు కన్నుమూసేసరికి తల్లి దాడమ్మ మానసికంగా కృంగిపోరుుంది. కుమారుడు కర్మకాండ అవ్వకుముందే ఆమె కూడా మృతి చెందింది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు డీలా పడిపోయూరు. దీంతో అప్పన్న కష్టపడి ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ కోడలు సత్యవతి, మనుమలు యమున, ధనుష్‌లను పెంచుతూ వస్తున్నాడు. పొట్టన పెట్టుకున్న పిడుగు పెద్ద వయసులో కూడా కష్టపడుతూ కోడలు, మనుమలను పెంచుతున్న అప్పన్నపై ప్రకృతి కన్నెర్ర చేసింది. బుధవారం స్థానిక మార్కెట్లో ఉల్లిపాయలు విక్రరుుస్తుండగా పిడుగు పడడంతో అప్పన్న కూడా మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో ఇద్దరు చిన్నారులతో పాటు సత్యవతి మిగిలిపోరుుంది. భర్త, అత్తమామాలు లేకుండా ఎలాగ బతకాలి.. నా పిల్లలను ఎలా ప్రయోజకుల్ని చేయూలని సత్యవతి రోదిస్తోంది. -
కారును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి
శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మీర్జాగూడ వద్ద గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ఓలారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతులను జహీరాబాద్ మండలం చెరకుపల్లి వాసులుగా గుర్తించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదమర్రి మండలం ముత్తురపల్లి దగ్గర సోమవారం వేకువజామున బొలేరో, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను మునిరెడ్డి, బాలకృష్ణ, సురేష్‌లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సింగబల్ల గ్రామ సర్పంచి పరిస్థితి విషమంగా మారింది. అతడిని తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొన విచారణ జరుపుతున్నారు. -
మేకప్ చేయాలని బ్యూటీషియన్‌ను పిలిచి...
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన ఓ యువతి (22)పై దారుణం జరిగింది. మేకప్ వేయాలని పిలిపించి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. బాధితురాలు ఈ ఏడాది జనవరిలో బెంగళూరుకు వచ్చి ఓ బ్యూటీపార్లల్‌లో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈనెల 2న తమ ఇంట్లో ఓ యువతికి మేకప్ చేయాలంటూ ఆమె పనిచేస్తున్న బ్యూటీపార్లల్‌కు ఫోన్ వచ్చింది. దీంతో బ్యూటీపార్లల్ యజమాని ఆమెకు విషయాన్ని తెలిపి అడ్రస్ చెప్పారు. యజమాని చెప్పిన చోటికి ఆమె కాలినడకన వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన నితిన్‌శెట్టి, ధనుంజయ్, రజత్ అడ్డుకున్నారు. తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని బెదిరించారు. 'నువ్వు వేశ్య వృత్తిలో ఉన్నావని' బెదిరిస్తూ విచారణ కోసమంటూ ఆ యువతిని కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. అనంతరం దగ్గర్లోని నిర్జన ప్రదేశంలోని గోదాములోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఉడాయించారు. మరుసటి రోజు ఉదయం యజమాని సాయంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నగరంలోనే వేర్వేరుచోట్ల తలదాచుకున్న ముగ్గురు యువకులను గురువారం అరెస్టు చేశారు. -
పంజాబ్‌లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్
మొహాలీ: భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, ఆయుధాలను కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను పంజాబ్‌లోని మొహాలీలో సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఒక పాకిస్తానీ మొబైల్ సిమ్ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. మొహాలీలో సోదాలు నిర్వహిస్తుండగా ఆ ముగ్గురు అనుమానితులను పోలీసులకు చిక్కారు. వాళ్ల దగ్గర ఉన్న ఆటోమెటిక్ రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సింది. కాగా పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో మూడో రోజు కూడా ఉగ్రవేట కొనసాగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ అమలులో ఉంది. దాంతో అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలను విస్తృతం చేశారు. కాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో సిబ్బంది క్వార్టర్స్‌లో చొరబడిన ఐదుగురు ఇప్పటికే మట్టుబెట్టామని, మరో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉండొచ్చని, వాళ్లను అంతం చేసేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్ఎస్జీ దళాలకు చెందిన సీనియర్ అధికారులు ప్రకటించారు. ఎయిర్‌బేస్‌లో ఉన్న ఆస్తులను ధ్వంసం చేయాలనే కుట్రతో ఉగ్రవాదులు వచ్చారని, అయితే ఇప్పుడు మాత్రం ఆస్తులన్నీ సురక్షితంగానే ఉన్నాయన్నాని తెలిపారు. -
7 కిలోల బంగారం పట్టివేత
చెన్నై: అక్రమంగా రవాణా చేస్తున్న ఏడు కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో రోజు వారి తనిఖీలలో భాగంగా కొచ్చి నుండి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేయగా వారి బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంగారం విలువ సుమారు రూ 2.25 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. -
వైద్యులు 8 మంది... విధుల్లో ముగ్గురు
పాలకొండ రూరల్/భామిని: డివిజన్ కేంద్రం పాలకొండలో ఉన్న 100 పడకల ఆస్పత్రి తీరు ‘పేరుగొప్ప ఊరుదిబ్బ’ అన్నచందంగా మారింది. సోమవారం ఉదయం 10 గంటలకు ఓపీ ప్రారంభమైంది. 185 మంది ఓపీ నమోదైంది. ఆస్పత్రిలో 8 మంది వైద్యులు సేవలందించాల్సి ఉండగా ముగ్గురే విధుల్లో ఉన్నారు. సూపరింటిండెంట్ రవీంద్రకుమార్, చిన్నపిల్లల వైద్య నిపుణులు సుధాకర్, డాక్టర్ శ్రీనివాస్ మినహా మిగిలిన వైద్యులు విధులకు హాజరుకాలేదు. దీంతో వైద్యం కోసం రోగులు నిరీక్షించాల్సి వచ్చింది. ఆస్పత్రికి అనుసంధానంగా ఉన్న మాతాశిశుసంక్షేమ కేంద్రంలో ఇద్దరు స్త్రీ వైద్య నిపుణులకు ఒకరు దీర్ఘకాలిక సెలవుపెట్టగా ఇంకొకరు కూడా సెలవు తీసుకోవడంతో గర్భిణులు, బాలింతలకు డాక్టర్ శ్రీనివాస్ సేవలందించారు. శస్త్ర చికిత్సలకు సంబంధించి మత్తువైద్య నిపుణులు లేకపోవడం ఇక్కడ ప్ర దాన సమస్యగా మారింది. డిప్యుటేషన్‌ై పె వారంలో మూడు రోజులు మత్తు వై ద్యనిపుణులు వచ్చి వెళ్లడంతో అత్యవస ర సమయంలో ఇక్కట్లు తప్పడం లేదు. భామిని పీహెచ్సీలో 24 గంటల పాటు వైద్యసేవలు అందడం లేదు. ఇక్కడ ఉన్న ముగ్గురు వైద్యాధికారుల్లో ఒకరిని బత్తిలి పీహెచ్‌సీకి డెప్యుటేషన్ వేశారు. రెండో పూట వైద్యసిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. ఇక్కడి అంబులెన్స్ మరమ్మతులకు గురైంది. -
చిక్కుల్లో ‘ఆ ముగ్గురు’
చెన్నై, సాక్షి ప్రతినిధి :చెన్నైలో బహుళ అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలడంతో పెద్ద సంఖ్యలో పేదలు మృతి చెందారు. ఈ ఘటనతో బిల్డర్, భవన యజమానులు, బ్యాంకర్ల భవిష్యత్తుతో చీక ట్లు అలుముకునే ప్రమాదం ఏర్పడింది.కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న 11 అంతస్తుల అపార్టుమెంటులో 44 నివాస గృహాలు ఉన్నట్లు తేలింది. వారంతా బ్యాంకుల ద్వారా రుణం పొంది ముందుగా కొంత మొత్తం చెల్లించినట్టు సమాచారం. బిల్డర్, యజమానితోపాటు ఆరుగురు కటకటాలపాలైన నేపథ్యంలో అక్కడ ఇళ్లు కొనుగోలు చేసిన వారికి డిపాజిట్ల మొత్తం ఇప్పట్లో వాపస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇళ్లు కొనుగోలు చేసేవారు మొత్తం సొమ్ములో బిల్డరుకు 20 శాతం శాతం చెల్లించి అగ్రిమెంటు చేసుకున్న తర్వాత మిగిలిన 80 శాతం మొత్తాన్ని బ్యాం కర్లు మంజూరు చేస్తారు. అది కూడా బిల్డరుకు 10 దశల్లో చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో పునాదులు వేసినప్పటి నుంచి విడతల వారీగా చెల్లించాలన్న నిబంధనను పాటించకుండా కమీషన్‌కు కక్కుర్తిపడి 80 శాతం ఒకేసారి చెల్లించే అవకాశాలు ఉన్నాయని ఒక సీనియర్ బ్యాంకు అధికారి తెలిపారు. ఇక్కడ కూడా బ్యాంకర్లు ఉదారంగా మొత్తం 80 శాతం మంజూరు చేసి ఉంటే చిక్కుల్లో పడడం ఖాయమని, బ్యాంకు అధికారులు సైతం బాధితుల జాబితాలోకి చేరిపోతారని వెల్లడించారు. దేవుడి పేరు పెట్టుకున్న ఒక బ్యాంక్, మరో బీమా సంస్థ మొత్తం ఐదు సంస్థ లు ఈ బిల్డర్‌కు రుణం మంజూరు చేశాయన్నారు. అలాగే నిర్మాణం ప్రారంభమైన రోజు నుంచి 18 నెలల తర్వాత ఇంటి యజమానులు తమ పేరున మంజూరైన రుణంపై వాయిదాలు చెల్లించాల్సి ఉం టుంది. కూలిన భవనంలో ఇళ్లు కొనుగోలు చేసిన వారు వాయిదాలు చెల్లించే పరిస్థితి లేదు. కూలిన ప్రమాదంతో తమకు సంబంధం లేదని బ్యాంకులు ఒత్తిడి చేసే అవకాశం ఉందని ఇంటి యజమానుల్లో ఆందోళన నెలకొంది. అపార్టుమెంటు కూలడానికి బిల్డరే బాధ్యత వహించి ఇంటిని బుక్ చేసుకున్న వారికి మొత్తం సొమ్మును చెల్లించాలి. అందరూ జైళ్లలో చిక్కుకుని ఉండగా వాయిదాలు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు పంపితే దిక్కేమిటని భయపడతున్నారు. గత్యంతరం లేక కోర్టును ఆశ్రయించినా ఫలితం వెంటనే దక్కదని ఆందోళన చెందుతున్నా రు. సహజంగా ఒక భారీ నిర్మాణం చేపట్టే సమయం లో బేల్దారి కూలీలకు బీమా చేస్తారని, ఈ బిల్డరు కూడా బీమా చేసి ఉంటే కార్మికులకు బీమా సొమ్ము అందుతుంది. అవకతవకల నిర్మాణం చేపట్టిన బిల్డ రు ఇలాంటి పద్ధతులు పాటించి ఉంటాడా అని అనుమానిస్తున్నారు. అలాగే రుణం మంజూరు చేసిన బ్యాంకర్లు సైతం ఇంటి యజమానుల పేరున బీమా చేయిస్తారు. బీమా విధానాలను సక్రమంగా పాటిం చి ఉంటే ఇంటి యజమానులు, బిల్డర్లు, బ్యాంకు అధికారులు అందరూ ఆర్థిక భారం నుంచి బయట పడతారు. లేకుంటే వారి భవిష్యత్తు ఆందోళనకరమే.సీఎండీఏలో గుబులు భవన శిథిలాల నుంచి శాంపిల్స్ సేకరించి విచారణ చేపట్టిన పీడబ్ల్యూడీ అధికారులు నిర్మాణ లోపం వల్లే బహుళ అంతస్తుల భవనం కూలిపోయిందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. నాశిరకం సిమెంటు, ఇనుము వాడడం, పునాదులు పటిష్టంగా లేకపోవడం ప్రమాదానికి కారణాలుగా తేల్చినట్లు తెలిసింది. ఈ నివేదిక వల్ల తమకెలాంటి ముప్పు వస్తుందోనని చెన్నై మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ) అధికారుల్లో గుబులు పట్టుకుంది. అపార్టుమెంట్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామేగాని, నిర్మాణం లోపభూయిష్టంగా ఉంటే తమ తప్పిదం కాదని అధికారులు సమర్థించుకుంటున్నారు. పోరూరు నీటి గుంటలో నిర్మాణం జరగడం, మెత్తని ప్రాంతం కాబట్టే అపార్టుమెంటు కిందకు కూరుపోయిందని తేలడం వల్ల ఇలాంటి చోట ఎలా అనుమతించారని సీఎండీఏ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి పీడబ్ల్యూడీ అధికారులు సమర్పించిన నివేదిక తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని సీఎండీఏ అధికారులు ఆందోళన చెందుతున్నారు.