► ఏడు మాసాల్లో ఒకే ఇంటిలో ముగ్గురి మృతి
► అనారోగ్యంతో కొడుకు...
► కొడుకు లేడనే బెంగతో తల్లి
► పిడుగు పాటుకు తండ్రి కన్నుమూత
► అనాథలైన కోడలు, పిల్లలు
బొబ్బిలి: నిరుపేద కుటుంబంపై విధి పగ పట్టింది. ఏడు నెలల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందారు. వరుస మృతులతో ఆ కుటుంబంలో ఉండే ఏకైక గృహిణి, ఇద్దరు పిల్లలు అనాథులుగా మారారు. మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలోని తాడుతూరి అప్పన్న కుటుంబ పరిస్థితిది.. అప్పన్న రోడ్డు పక్కన ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా, ఆయన కుమారుడు సింహాచలం తాపీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సరిగ్గా ఏడు మాసాల కిందట సింహాచలం అనారోగ్యంతో కన్నుమూశాడు. చెట్టంత కొడుకు కన్నుమూసేసరికి తల్లి దాడమ్మ మానసికంగా కృంగిపోరుుంది. కుమారుడు కర్మకాండ అవ్వకుముందే ఆమె కూడా మృతి చెందింది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు డీలా పడిపోయూరు. దీంతో అప్పన్న కష్టపడి ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ కోడలు సత్యవతి, మనుమలు యమున, ధనుష్‌లను పెంచుతూ వస్తున్నాడు.
పొట్టన పెట్టుకున్న పిడుగు
పెద్ద వయసులో కూడా కష్టపడుతూ కోడలు, మనుమలను పెంచుతున్న అప్పన్నపై ప్రకృతి కన్నెర్ర చేసింది. బుధవారం స్థానిక మార్కెట్‌లో ఉల్లిపాయలు విక్రరుుస్తుండగా పిడుగు పడడంతో అప్పన్న కూడా మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో ఇద్దరు చిన్నారులతో పాటు సత్యవతి మిగిలిపోరుుంది. భర్త, అత్తమామాలు లేకుండా ఎలాగ బతకాలి.. నా పిల్లలను ఎలా ప్రయోజకుల్ని చేయూలని సత్యవతి రోదిస్తోంది.
పగబట్టిన విధి
Published Fri, Jun 3 2016 11:07 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement