SEVEN MONTHS
-
పగబట్టిన విధి
► ఏడు మాసాల్లో ఒకే ఇంటిలో ముగ్గురి మృతి ► అనారోగ్యంతో కొడుకు... ► కొడుకు లేడనే బెంగతో తల్లి ► పిడుగు పాటుకు తండ్రి కన్నుమూత ► అనాథలైన కోడలు, పిల్లలు బొబ్బిలి: నిరుపేద కుటుంబంపై విధి పగ పట్టింది. ఏడు నెలల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందారు. వరుస మృతులతో ఆ కుటుంబంలో ఉండే ఏకైక గృహిణి, ఇద్దరు పిల్లలు అనాథులుగా మారారు. మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలోని తాడుతూరి అప్పన్న కుటుంబ పరిస్థితిది.. అప్పన్న రోడ్డు పక్కన ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా, ఆయన కుమారుడు సింహాచలం తాపీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సరిగ్గా ఏడు మాసాల కిందట సింహాచలం అనారోగ్యంతో కన్నుమూశాడు. చెట్టంత కొడుకు కన్నుమూసేసరికి తల్లి దాడమ్మ మానసికంగా కృంగిపోరుుంది. కుమారుడు కర్మకాండ అవ్వకుముందే ఆమె కూడా మృతి చెందింది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు డీలా పడిపోయూరు. దీంతో అప్పన్న కష్టపడి ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ కోడలు సత్యవతి, మనుమలు యమున, ధనుష్‌లను పెంచుతూ వస్తున్నాడు. పొట్టన పెట్టుకున్న పిడుగు పెద్ద వయసులో కూడా కష్టపడుతూ కోడలు, మనుమలను పెంచుతున్న అప్పన్నపై ప్రకృతి కన్నెర్ర చేసింది. బుధవారం స్థానిక మార్కెట్లో ఉల్లిపాయలు విక్రరుుస్తుండగా పిడుగు పడడంతో అప్పన్న కూడా మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో ఇద్దరు చిన్నారులతో పాటు సత్యవతి మిగిలిపోరుుంది. భర్త, అత్తమామాలు లేకుండా ఎలాగ బతకాలి.. నా పిల్లలను ఎలా ప్రయోజకుల్ని చేయూలని సత్యవతి రోదిస్తోంది. -
7 నెలల సెలవులతో పాటు జీతం
న్యూఢిల్లీ : గర్భిణీ ఉద్యోగులకు ఆఫీసులకు రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది మహిళలు ఈ సమయంలోనే ఉద్యోగం మానేస్తుంటారు కూడా. మరి కొంతమంది జీవనాధారం కోసం ఎంతకష్టమైనా ఆఫీసులకు వస్తుంటారు. ఇలాంటి ఇబ్బందులకు గర్భిణీ మహిళలు స్వస్తి చెప్పేందుకు, టాటా సన్స్ మహిళల కోసం సరికొత్త పాలసీలను ప్రవేశపెట్టింది. ప్రసూతి సెలవుల కింద ఏడు నెలలను మంజూరు చేస్తూ, ఆ నెలల్లో కూడా పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాక ప్రసవం అనంతరం వారికి మద్దతుగా సగం జీతం-సగం పనిదినం అనే పాలసీని తీసుకొచ్చింది. ప్రసవించిన అనంతరం 18 నెలలు పాటు వారే పని సమయాన్ని నిర్ణయించుకుని, ఉద్యోగం చేసేలా అవకాశం కల్పించనుంది. ఒకవేళ టాటా సన్స్ కంపెనీలో ఐదు సంవత్సరాల ఉద్యోగం పూర్తిచేసుకున్న వారికి అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ పాలసీని ప్రవేశపెట్టింది. కేర్ టేకర్ గా బాధ్యత కలిగిన వారికి సగం జీతంతో ఏడాది పాటు సెలవులు మంజూరు చేసేలా ఈ పాలసీని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం టాటా సన్స్ కలిగి ఉన్న సాల్డ్ నుంచి సాప్ట్ వేర్ సర్వీసులకు వరకూ ఈ పాలసీలు వర్తించనున్నాయి. టాటా గ్రూప్ కు చెందిన మిగిలిన కంపెనీలు భవిష్యత్ లో ఈ పాలసీలను కల్పించనున్నాయి. భారత్ లో మహిళల పని జీవితానికి సంబంధించి టాటా సన్స్ తీసుకున్న ఈ పాలసీలే కొత్త ప్రమాణాలు. ఇప్పటివరకూ భారత్ లో చాలా కంపెనీలు మూడు నెలలు లేదా ఆరు నెలలు సెలవులు ఇస్తుంటాయి. కానీ మహిళలకు వివిధ స్టేజ్ ల్లో సెలవులు, అనుమైన పనిసమయాన్నికల్పిస్తూ ప్రవేశపెట్టిన సంపూర్ణ విధానం ఇదేనని కంపెనీ తెలిపింది. 'మహిళల విషయంలో మా సంస్థ అంకితభావంతో పనిచేస్తూ..వారిని జాగ్రత్తగా చూసుకోవడంలో కృషిచేస్తుంది. మెటర్నిటీ అనేది చాలా క్లిష్టమైన సమయం. వారికి ఆ సమయంలో పూర్తి జీతంతో 7 నెలల ప్రసూతి సెలవులు, 18 నెలలు పోస్ట్ మెటర్నిటీ కింద సగం జీతం-సగం పని, మహిళలు వారికి అనువైన సమయంలోనే ఉద్యోగం చేసేలా అవకాశం ఇవ్వడం, మా బాధ్యతగా గుర్తించాం' అని టాటా సన్స్ చీఫ్ హ్యుమన్ రిసోర్స్ ఆఫీసర్ ఎన్ఎస్. రాజన్ తెలిపారు. చిన్న పిల్లల్ని చూసుకునేటప్పుడు వారంలో రెండు రోజులు ఇంటి దగ్గరే పనిచేసుకునేలా, అనువైన పనిదినాలను వారు ఎంపికచేసుకునేలా పాలసీలను ప్రవేశపెట్టామన్నారు. 48శాతం మహిళలు ఈ సమయంలోనే ఉద్యోగం మానేస్తుంటారని అవతార్ కెరీర్ క్రీయేటర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు సౌందర్య రాజేష్ తెలిపారు. టాటా గ్రూప్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు లక్షా 45 వేల మంది ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో వీరు 24 శాతం మంది. 2020 కల్లా రెండు లక్షల 30 వేల మంది మహిళలను ఉద్యోగులుగా చేర్చుకుంటామని టాటా గ్రూప్ 2014లో ప్రకటించింది. 2014 లో కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు లక్షా 15వేల మంది -
విధేయతకు ఇంతకన్నా నిదర్శనం లేదేమో!
కుక్కలు గురించి మనం అప్పుడప్పుడు చులకనగా మాట్లాడుతాం కానీ.. అవి మనుషులపై అవ్యాజమైన ప్రేమను చూపుతాయి. అంతులేని స్నేహాన్ని పంచుతాయి. మనుషులకు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మసులుకుంటాయి. మరెవరికీ సాటిలేని విధేయతను చూపుతాయి. ఈ విషయాన్ని మరోసారి ఈ బుజ్జీ కుక్క నిరూపించింది. తన యాజమాని తనను వదిలిపెట్టిన ప్రదేశంలోనే కోసం ఏడు నెలలపాటు వేచిచూసి.. ఎట్టకేలకు అతన్ని కలుసుకోగలిగింది. ఈ ఘటన దక్షిణ థాయ్‌లాండ్‌లో గతవారం జరిగింది. ఖువాన్ థాంగ్ గ్రామంలో రోడ్డుపక్కన 'బిగ్ బ్లూ' అనే మాంగ్రెల్ జాతి కుక్క దాదాపు ఏడు నెలలుగా వేచి చూస్తు గడిపింది. 'బిగ్ బ్లూ' యాజమాని ఓ పండ్ల వ్యాపారి. అతడు కారులో పండ్లు సరఫరా చేస్తుంటాడు. ఓసారి ఒకటికి వెళ్లాల్సి వచ్చి అతను ఖువాన్ థాంగ్ గ్రామ సమీపంలో వాహనాన్ని నిలిపాడు. దీంతో కుక్క కూడా కారు నుంచి దూకింది. కుక్క దిగిన విషయాన్ని గుర్తించకుండానే అతను కారును నడిపించుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 'బిగ్ బ్లూ' అక్కడే రోడ్డుపక్కన తన యాజమాని కోసం వేచి చూస్తూ ఉండిపోయింది. అది తోక ఊపుకొంటూ అక్కడే తచ్చాడేది కానీ.. అక్కడి నుంచి కదిలేది కాదు. కొంతకాలంలోనే 'బిగ్ బ్లూ' స్థానికంగా పాపులర్ అయిపోయింది. స్థానికులు ఎప్పుడూ ఏదో ఆహారం తెచ్చి దానికి పెట్టేవారు. మరోవైపు యజమాని కూడా తన కుక్క కోసం ఏడు నెలలుగా వెతుకుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో అతను పండ్ల వాహనంతో గతవారం ఖువాన్ థాంగ్ గ్రామానికి వచ్చాడు. అక్కడ రోడ్డు పక్కన తచ్చాడుతున్న 'బిగ్ బ్లూ' యాజమానిని చూడగానే తోక ఊపుకుంటూ అతని చుట్టూ ఆనందంతో గంతులు వేసింది. బుజ్జీ కుక్క ఏడు నెలల నిరీక్షణకు తెరపడటం స్థానికులకు ఆనందం కలిగించింది.