పంజాబ్లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్
మొహాలీ: భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, ఆయుధాలను కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను పంజాబ్లోని మొహాలీలో సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఒక పాకిస్తానీ మొబైల్ సిమ్ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. మొహాలీలో సోదాలు నిర్వహిస్తుండగా ఆ ముగ్గురు అనుమానితులను పోలీసులకు చిక్కారు. వాళ్ల దగ్గర ఉన్న ఆటోమెటిక్ రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సింది.
కాగా పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో మూడో రోజు కూడా ఉగ్రవేట కొనసాగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ అమలులో ఉంది. దాంతో అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలను విస్తృతం చేశారు. కాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో సిబ్బంది క్వార్టర్స్‌లో చొరబడిన ఐదుగురు ఇప్పటికే మట్టుబెట్టామని, మరో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉండొచ్చని, వాళ్లను అంతం చేసేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్ఎస్‌జీ దళాలకు చెందిన సీనియర్ అధికారులు ప్రకటించారు. ఎయిర్‌బేస్‌లో ఉన్న ఆస్తులను ధ్వంసం చేయాలనే కుట్రతో ఉగ్రవాదులు వచ్చారని, అయితే ఇప్పుడు మాత్రం ఆస్తులన్నీ సురక్షితంగానే ఉన్నాయన్నాని తెలిపారు.