అక్రమంగా రవాణా చేస్తున్న ఏడు కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై: అక్రమంగా రవాణా చేస్తున్న ఏడు కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో రోజు వారి తనిఖీలలో భాగంగా కొచ్చి నుండి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేయగా వారి బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంగారం విలువ సుమారు రూ 2.25 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.