చెన్నై, సాక్షి ప్రతినిధి :చెన్నైలో బహుళ అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలడంతో పెద్ద సంఖ్యలో పేదలు మృతి చెందారు. ఈ ఘటనతో బిల్డర్, భవన యజమానులు, బ్యాంకర్ల భవిష్యత్తుతో చీక ట్లు అలుముకునే ప్రమాదం ఏర్పడింది.కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న 11 అంతస్తుల అపార్టుమెంటులో 44 నివాస గృహాలు ఉన్నట్లు తేలింది. వారంతా బ్యాంకుల ద్వారా రుణం పొంది ముందుగా కొంత మొత్తం చెల్లించినట్టు సమాచారం. బిల్డర్, యజమానితోపాటు ఆరుగురు కటకటాలపాలైన నేపథ్యంలో అక్కడ ఇళ్లు కొనుగోలు చేసిన వారికి డిపాజిట్ల మొత్తం ఇప్పట్లో వాపస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇళ్లు కొనుగోలు చేసేవారు మొత్తం సొమ్ములో బిల్డరుకు 20 శాతం శాతం చెల్లించి అగ్రిమెంటు చేసుకున్న తర్వాత మిగిలిన 80 శాతం మొత్తాన్ని బ్యాం కర్లు మంజూరు చేస్తారు.
అది కూడా బిల్డరుకు 10 దశల్లో చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో పునాదులు వేసినప్పటి నుంచి విడతల వారీగా చెల్లించాలన్న నిబంధనను పాటించకుండా కమీషన్‌కు కక్కుర్తిపడి 80 శాతం ఒకేసారి చెల్లించే అవకాశాలు ఉన్నాయని ఒక సీనియర్ బ్యాంకు అధికారి తెలిపారు. ఇక్కడ కూడా బ్యాంకర్లు ఉదారంగా మొత్తం 80 శాతం మంజూరు చేసి ఉంటే చిక్కుల్లో పడడం ఖాయమని, బ్యాంకు అధికారులు సైతం బాధితుల జాబితాలోకి చేరిపోతారని వెల్లడించారు. దేవుడి పేరు పెట్టుకున్న ఒక బ్యాంక్, మరో బీమా సంస్థ మొత్తం ఐదు సంస్థ లు ఈ బిల్డర్‌కు రుణం మంజూరు చేశాయన్నారు. అలాగే నిర్మాణం ప్రారంభమైన రోజు నుంచి 18 నెలల తర్వాత ఇంటి యజమానులు తమ పేరున మంజూరైన రుణంపై వాయిదాలు చెల్లించాల్సి ఉం టుంది.
కూలిన భవనంలో ఇళ్లు కొనుగోలు చేసిన వారు వాయిదాలు చెల్లించే పరిస్థితి లేదు. కూలిన ప్రమాదంతో తమకు సంబంధం లేదని బ్యాంకులు ఒత్తిడి చేసే అవకాశం ఉందని ఇంటి యజమానుల్లో ఆందోళన నెలకొంది. అపార్టుమెంటు కూలడానికి బిల్డరే బాధ్యత వహించి ఇంటిని బుక్ చేసుకున్న వారికి మొత్తం సొమ్మును చెల్లించాలి. అందరూ జైళ్లలో చిక్కుకుని ఉండగా వాయిదాలు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు పంపితే దిక్కేమిటని భయపడతున్నారు. గత్యంతరం లేక కోర్టును ఆశ్రయించినా ఫలితం వెంటనే దక్కదని ఆందోళన చెందుతున్నా రు. సహజంగా ఒక భారీ నిర్మాణం చేపట్టే సమయం లో బేల్దారి కూలీలకు బీమా చేస్తారని, ఈ బిల్డరు కూడా బీమా చేసి ఉంటే కార్మికులకు బీమా సొమ్ము అందుతుంది.
అవకతవకల నిర్మాణం చేపట్టిన బిల్డ రు ఇలాంటి పద్ధతులు పాటించి ఉంటాడా అని అనుమానిస్తున్నారు. అలాగే రుణం మంజూరు చేసిన బ్యాంకర్లు సైతం ఇంటి యజమానుల పేరున బీమా చేయిస్తారు. బీమా విధానాలను సక్రమంగా పాటిం చి ఉంటే ఇంటి యజమానులు, బిల్డర్లు, బ్యాంకు అధికారులు అందరూ ఆర్థిక భారం నుంచి బయట పడతారు. లేకుంటే వారి భవిష్యత్తు ఆందోళనకరమే.సీఎండీఏలో గుబులు భవన శిథిలాల నుంచి శాంపిల్స్ సేకరించి విచారణ చేపట్టిన పీడబ్ల్యూడీ అధికారులు నిర్మాణ లోపం వల్లే బహుళ అంతస్తుల భవనం కూలిపోయిందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. నాశిరకం సిమెంటు, ఇనుము వాడడం, పునాదులు పటిష్టంగా లేకపోవడం ప్రమాదానికి కారణాలుగా తేల్చినట్లు తెలిసింది.
ఈ నివేదిక వల్ల తమకెలాంటి ముప్పు వస్తుందోనని చెన్నై మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ) అధికారుల్లో గుబులు పట్టుకుంది. అపార్టుమెంట్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామేగాని, నిర్మాణం లోపభూయిష్టంగా ఉంటే తమ తప్పిదం కాదని అధికారులు సమర్థించుకుంటున్నారు. పోరూరు నీటి గుంటలో నిర్మాణం జరగడం, మెత్తని ప్రాంతం కాబట్టే అపార్టుమెంటు కిందకు కూరుపోయిందని తేలడం వల్ల ఇలాంటి చోట ఎలా అనుమతించారని సీఎండీఏ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి పీడబ్ల్యూడీ అధికారులు సమర్పించిన నివేదిక తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని సీఎండీఏ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
చిక్కుల్లో ‘ఆ ముగ్గురు’
Published Thu, Jul 3 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement
Advertisement