కృష్ణ పుష్కరాల్లో పకడ్బందీగా విధులు నిర్వహించాలి
కృష్ణ పుష్కరాల్లో పకడ్బందీగా విధులు నిర్వహించాలి
Published Tue, Jul 19 2016 9:30 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
–మూడు షిప్ట్‌ల్లో విధులు
–సమర్థుల పేర్లు ఈ నెల 21లోగా ఇవ్వాలి
–అన్ని శాఖలకు కలెక్టర్ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణ పుష్కరాల్లో 24 గంటలు విధులు నిర్వహించే విధంగా అన్ని శాఖల అధికారులు సమర్థులును గుర్తించి ఈ నెల 21లోగా నిర్ణీత పార్మట్‌లో వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ..శ్రీశైలం, సంగమేశ్వరంలలో మూడు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని మొదటి షిప్ట్ ఉదయం 7 మద్యాహ్నం 2 గంటల వరకు, రెండవ షిప్ట్ మద్యాహ్నం 2 నుంచి రాత్రి9 గంటల వరకు, మూడవ షిప్ట్ రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటలవరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఆగస్టు 8 నుంచి 24 వరకు పుష్కరాల విధులు నిర్వహించాలని తెలిపారు. పుష్కరాల్లో ప్రకతి విపత్తులకు అవకాశం ఉంటుందని వాటిని ఎదుర్కోగల సామర్థ్యం కలిగిన వారిని గుర్తించాలన్నారు. 21 వ తేదీలోగా అర్హులయిన వారి పేర్లు ఇస్తే వారికి తగిన శిక్షణ కూడ ఇస్తామని వివరించారు. పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మరంగా నిర్వహించతలపెట్టిందని అందువల్ల ప్రతి ఒక్కరు జవాబుదారి తనంతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. పుష్కర విధులు నిర్వహించే వారికి విధులు నిర్వహించే చోటనే వసతి, బోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. విధులను అంకితభావంతో నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ ఆకె రవికష్ణ, జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement