shifts
-
ఫస్ట్‌టైమ్.. 100 టన్నుల బంగారం తరలింపు
యూకే నుంచి టన్నులకొద్దీ బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారత్‌కు తీసుకొచ్చింది. 1991 తరువాత మొదటిసారిగా యూకే నుంచి 100 టన్నుల బంగారాన్ని దేశంలోని తన వాల్ట్‌లకు తరలించింది.ఆర్బీఐ బంగారు నిల్వలలో సగానికి పైగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద సురక్షితమైన కస్టడీలో ఉన్నాయి. మూడింట ఒక వంతు బంగారాన్ని మాత్రం దేశీయంగా నిల్వ చేస్తారు. బంగారం తరలింపునకు ఆర్బీఐ తీసుకున్న ఈ చర్యతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెల్లించే నిల్వ ఖర్చులు ఆదా కానున్నాయి.ఆర్బీఐ వార్షిక గణాంకాల ప్రకారం.. 2024 మార్చి 31 నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా 822.10 టన్నుల బంగారం కేంద్ర బ్యాంక్ వద్ద ఉంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన 794.63 టన్నులతో పోలిస్తే ఇది అధికం.బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి 1991 జూలైలో ఆర్బీఐ 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ వద్ద తాకట్టు పెట్టి 400 మిలియన్ డాలర్లను సమీకరించింది. 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆర్బీఐ 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.2009లో ప్రభుత్వం తన ఆస్తులను వైవిధ్యపరచడానికి 6.7 బిలియన్ డాలర్ల విలువైన 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా, ఆర్బీఐ కొనుగోళ్ల ద్వారా బంగారం నిల్వలను స్థిరంగా పెంచుకుంటూ వస్తోంది.దేశ మొత్తం విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా 2023 డిసెంబర్ చివరి నాటికి 7.75 శాతం నుంచి 2024 ఏప్రిల్ చివరి నాటికి 8.7 శాతానికి పెరిగింది. ముంబైలోని మింట్ రోడ్, నాగపూర్‌లోని ఆర్బీఐ భవనం వాల్ట్‌లలో బంగారం నిల్వలు ఉన్నాయి. -
త్వరలోనే హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్న సోనూసూద్!
రియల్ హీరో సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా టైం నుంచి ఎంతోమందికి సహాయం చేస్తూ కోట్లాది ప్రజలకు చేరువయ్యాడు. తన దాతృత్వంతో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన చేతిలో వరుసగా తెలుగు సినిమాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోనూ సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం తెలుగు సినిమాల షూటింగులన్నీ దాదాపు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్‌లో ఇటీవలి కాలంలో సోనూసూద్ ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను చేస్తున్న సామాజికి సేవల దృష్ట్యా కూడా ఈ ఇళ్లు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆగస్టులోనే సోనూసూద్ ఈ కొత్త ఇంటికి మారనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోయిన్లు ముంబైలో ఇల్లు కొంటున్న సంగతి తెలిసిందే. -
షిఫ్ట్‌కు బైబై?
సాక్షి, సిటీబ్యూరో: రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం అమలు చేసిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల షిఫ్ట్ పద్ధతి రద్దయ్యే అవకాశం ఉంది. మళ్లీ సాధారణ వేళల్లో కార్యాలయాలు పనిచేసే విధానం అమల్లోకి రానుంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం అమలు చేసిన సమయంలో రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా నగరంలోని రెండు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఎంపిక చేసి షిఫ్ట్ పద్ధతికి శ్రీకారం చుట్టింది. మొదటి షిఫ్ట్‌లో బోయిన్పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2:30గంటల వరకు, రెండో షిఫ్ట్‌లో మారేడ్‌పల్లి కార్యాలయం మధ్యాహ్నం 2:30గంటల నుంచి రాత్రి 9గంటల వరకు పని చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా షిఫ్ట్ విధానం విస్తరించాలని భావించినప్పటికీ అమలుకు నోచుకోలేదు. అంతలోనే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం రద్దు కావడంతో షిఫ్ట్ విధానానికి స్పందన కరువైంది. దస్తావేజుల నమోదు కూడా నామమాత్రంగా మారడంతో షిఫ్ట్ విధానాన్ని రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్‌ల శాఖ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే షిఫ్ట్ విధానాన్ని రద్దు చేసి, సాధారణ వేళల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. కలిసొచ్చిన సమయం... షిఫ్ట్ విధానంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరగకపోయినప్పటికీ దస్తావేజుదారులకు మాత్రం కలిసొచ్చింది. రెండు షిఫ్టుల్లో సాధారణ పనివేళల మాదిరిగానే దస్తావేజుల నమోదు కొనసాగుతోంది. ముఖ్యంగా రెండో షిఫ్ట్ ఉద్యోగులకు కొంత ఊరటను ఇచ్చింది. ఉదయం షిఫ్ట్‌లో కేవలం ముహుర్తాల రోజుల్లో తప్పితే సాధారణ రోజుల్లో దస్తావేజుదారులు నమోదుకు పెద్దగా ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సిబ్బంది తొలి రెండు గంటలు ఖాళీగా ఉంటున్నారు. వాస్తవంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల షిఫ్ట్ పద్ధతితో క్రయవిక్రయదారులకు సమయం కలిసొచ్చింది. వాస్తవంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగమైన స్లాట్ బుకింగ్ అనంతరం డాక్యుమెంటేషన్, బ్యాంక్ చలానా, డీడీలు ఇతరత్రా పనులు పూర్తి చేసుకునేందుకు కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుంది. ఇవన్నీ పూర్తయ్యాక మాత్రమే అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 10గంటలకు ఇంటి నుంచి బయలుదేరినా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకొని డాక్యుమెంటేషన్ పూర్తి చేసే సరికి ఆలస్యమవుతోంది. దీంతో రిజిస్ట్రేషన్‌ను మరో రోజుకు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు రెండు రోజులు సెలవు పెట్టాల్సి వస్తోంది. అయితే ఎనీవేర్ రిజిస్ట్రేషన్లతో షిఫ్ట్ పద్ధతి అమలు కావడంతో దరఖాస్తుదారులకు మరింత కలిసొచ్చింది. ఒకే రోజు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునే వెసులుబాటు ఉండేది. ఉదయం వేళలో పనిచేసే బోయిన్పల్లి కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కొంత తగ్గినా మధ్యాహ్నం వేళలో పనిచేసే మారేడ్‌పల్లిలో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. మొత్తమ్మీద ఉద్యోగులు సెలవు పెట్టకుండానే ఉదయం/రాత్రి వేళల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు ఉంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేని కారణంగా కొన్ని రోజులుగా షిఫ్ట్ విధానంలో దస్తావేజుల నమోదు తగ్గుముఖం పట్టింది. దీంతో షిఫ్ట్ విధానాన్ని రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. -
కృష్ణ పుష్కరాల్లో పకడ్బందీగా విధులు నిర్వహించాలి
–మూడు షిప్ట్‌ల్లో విధులు –సమర్థుల పేర్లు ఈ నెల 21లోగా ఇవ్వాలి –అన్ని శాఖలకు కలెక్టర్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణ పుష్కరాల్లో 24 గంటలు విధులు నిర్వహించే విధంగా అన్ని శాఖల అధికారులు సమర్థులును గుర్తించి ఈ నెల 21లోగా నిర్ణీత పార్మట్‌లో వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ..శ్రీశైలం, సంగమేశ్వరంలలో మూడు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని మొదటి షిప్ట్ ఉదయం 7 మద్యాహ్నం 2 గంటల వరకు, రెండవ షిప్ట్ మద్యాహ్నం 2 నుంచి రాత్రి9 గంటల వరకు, మూడవ షిప్ట్ రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటలవరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఆగస్టు 8 నుంచి 24 వరకు పుష్కరాల విధులు నిర్వహించాలని తెలిపారు. పుష్కరాల్లో ప్రకతి విపత్తులకు అవకాశం ఉంటుందని వాటిని ఎదుర్కోగల సామర్థ్యం కలిగిన వారిని గుర్తించాలన్నారు. 21 వ తేదీలోగా అర్హులయిన వారి పేర్లు ఇస్తే వారికి తగిన శిక్షణ కూడ ఇస్తామని వివరించారు. పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మరంగా నిర్వహించతలపెట్టిందని అందువల్ల ప్రతి ఒక్కరు జవాబుదారి తనంతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. పుష్కర విధులు నిర్వహించే వారికి విధులు నిర్వహించే చోటనే వసతి, బోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. విధులను అంకితభావంతో నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ ఆకె రవికష్ణ, జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.