Sonusood Purchased New Lavish House In Hyderabad - Sakshi
Sakshi News home page

Sonu Sood : హైదరాబాద్‌లో ఇల్లు కొన్న సోసూసూద్‌!

Published Fri, Jul 16 2021 8:28 AM | Last Updated on Fri, Jul 16 2021 12:53 PM

Sonu Sood Buys A Lavish House In Hyderabad - Sakshi

రియల్‌ హీరో సోనూసూద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా టైం నుంచి ఎంతోమందికి సహాయం చేస్తూ కోట్లాది ప్రజలకు చేరువయ్యాడు. తన దాతృత్వంతో రియల్‌ హీరో అనిపించుకున్న సోనూసూద్‌ హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన చేతిలో వరుసగా తెలుగు సినిమాలున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోనూ సోనూసూద్‌ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. ప్రస్తుతం తెలుగు సినిమాల షూటింగులన్నీ దాదాపు హైదరాబాద్‌లోనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్‌లో ఇటీవలి కాలంలో సోనూసూద్‌ ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను చేస్తున్న సామాజికి సేవల దృష్ట్యా కూడా ఈ ఇళ్లు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆగస్టులోనే సోనూసూద్‌ ఈ కొత్త ఇంటికి మారనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్‌ హీరోయిన్లు ముంబైలో ఇల్లు కొంటున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement