krishna pushkaras
-
‘పుష్కర’ స్ఫూర్తితో బ్రహ్మోత్సవ దీప్తి
- కృష్ణా పుష్కరాల తరహాలో శివరాత్రి ఉత్సవాలు - పాదయాత్రికులకు ప్రథమ చికిత్స కేంద్రాలు - అటవీ మార్గంలో అన్నదాన శిబిరాలు - శ్రీశైలానికి తిరగనున్న 150 ప్రత్యేక బస్సులు - అధికారులతో జిల్లా కలెక్టర్ విజయమోహన్ సమీక్ష శ్రీశైలం: కృష్ణా పుష్కరాల తరహాలో విధులు నిర్వహించి శ్రీశైలంలో ఈ నెల 17నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ పిలుపునిచ్చారు. శుక్రవారం.. దేవస్థానం పరిపాలనా భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈఓ నారాయణ భరత్ గుప్త, ఎస్పీ రవికృష్ణ, ఓఎస్డి రవిప్రకాశ్, డీఎఫ్ఓ శర్వణన్, ఆర్డీఓ హుసేన్సాహెబ్లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గత ఏడాది కృష్ణా పుష్కరాల్లో అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేసి.. జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపామన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అదే స్థాయిలో నిర్వహించారనే పేరు తీసుకురావాలని కోరారు. ఆత్మకూరు నుంచి దోర్నాల వరకు ఏర్పాటు చేసిన 25 స్పీడు బ్రేకర్లకు జీబ్రాలైన్స్, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్అండ్బీ అధికారులకు ఆదేశించారు. పాదయాత్రతో వచ్చే భక్తులకు ప్రథమ చికిత్స కేంద్రాలను చేయాలని సూచించారు. అటవీ మార్గంలో నాలుగు అన్నదాత శిబిరాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామన్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఇందుకు డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ సహకరిస్తారన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తాత్కాలిక వసతి కోసం 2 వేల మంది భక్తులు సేదతీరేలా రెండు డార్మెంటరీలను ఏర్పాటు చేశామని ఈఓ భరత్ గుప్త వివరించారు. ఈ నెల 17 నుంచి శివదీక్షా శిబిరాల వద్ద భక్తులకు అన్నదాన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు ఎక్సైజ్ చెక్‌పోస్టులు.. శ్రీశైలానికి వచ్చే రోడ్డుమార్గంలో మూడు ఎక్సైజ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణా నుంచి సున్నిపెంటకు వచ్చే మార్గం, దోర్నాల నుంచి శ్రీశైలం, క్షేత్ర పరిధిలోకి వచ్చే ముందు ఇలా మూడు ఎక్సైజ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో మద్యం దుకాణాలు మూసి వేసేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. భారీ బందోబస్తు.. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల భద్రత కోసం 2వేల మందికిపైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని.. 200 మంది మఫ్టీ పోలీసులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా పుష్కరాల తరహాలో పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తామన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించి వారి వేలిముద్రల ద్వారా నేరచరిత్రను కనుగొని అదుపులోకి తీసుకుంటామని.. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. శివ స్వాములకు ప్రత్యేక క్యూలు.. శివ స్వాములందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించడానికి ఈ ఏడాది చంద్రావతి కల్యాణమండపంలో ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేసినట్లు ఈఓ భరత్ గుప్త తెలిపారు. మంచినీటి సౌకర్యంతోపాటు భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక ప్రసారాలను అందజేస్తామని పేర్కొన్నారు. దేవస్థానం కొత్తగా కొన్న రెండు బస్సులను భక్తుల సౌకర్యార్థం క్షేత్రంలో ఉచితంగా తిప్పుతామని ప్రకటించారు. మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కల్యాణం ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద నిర్వస్తున్నామని, ఇందుకు ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ స్పష్టం చేశారు. -
జిల్లా కలెక్టర్‌కు అభినందనలు
కర్నూలు: కృష్ణా పుష్కరాలకు నేతత్వం వహించి విజయవంతంగా నిర్వహించిన జిలా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను జిల్లా నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నేతలు అభినందించారు. మంగళవారం జిల్లా అధ్యక్షుడు వీసీహె చ్ వెంగళరెడ్డి ఆద్వర్యంలో పలువురు నేతలు కలెక్టర్‌ను ఆయన చాంబరులో కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అ««దl్యక్షుడు మాట్లాడుతూ... భక్తులకు ఎలాంటి ఇబందులు లేకుండా పుష్కరాలు నిర్వహించారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మతి చెందిన పంచాయతీరాజ్ ఏఈ, డైవర్ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, గాయపడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి కార్పోరేట్ అసుపత్రిలో వైద్యం అందించాలని కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...అందరి సహకారంతోనే పుష్కరాలను విజయవంగంగా నిర్వహించామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జవహార్‌లాల్, అసోసియేట్ అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, రాష్ట్ర ఉఫాధ్యక్షుడు జి.రామకష్ణారెడ్డి, జిల్లా కోశాధికారి పి. రామకష్ణారెడ్డి, నగర అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మన్న, హరిశ్చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీకి ఐజీ అభినందన
కర్నూలు: కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసిన జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐజీ శ్రీధర్‌రావు అభినందించారు. శ్రీశైలంలో కృష్ణా పుష్కరాల బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్పీ.. ఈనెల 24వ తేదీన విజయవాడలో జరిగిన జరిగిన పుష్కరాల ముగింపు సమావేశానికి హాజరుకాలేకపోయారు. కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన జ్ఞాపికను ఐజీ శ్రీధర్‌రావు అందుకున్నారు. దీనిని ఐజీ చేతుల మీదుగా శనివారం ఎస్పీ అందుకున్నారు. కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్న చంద్రబాబు
-
ప్రత్యేక బస్సులతో రూ.2.50 కోట్ల ఆదాయం
– ఆర్టీసీ ఈడీ రామారావు కర్నూలు(రాజ్‌విహార్): కృష్ణా పుష్కరాల్లో ఆర్టీసీకి రూ.2.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు రోడ్డు రవాణా సంస్థ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామారావు తెలిపారు. బుధవారం స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని జోనల్ స్టాఫ్ ట్రై నింగ్ కళాశాలలో పుష్కర విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు అందించిన సేవలు అభినందనీయమన్నారు. 12 రోజుల పాటు 5వేల సర్వీసులు నడుపగా సుమారు 4లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారన్నారు. సమష్టి కృషితోనే పుష్కరాలు విజయవంతం అయ్యాయన్నారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ గిడుగు వెంకటేశ్వర రావు, డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాసులు, ట్రై నింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రజియా సుల్తానా, కర్నూలు–1 డిపో మేనేజర్ అజ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
'కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన'
-
ముగింపులో అపశ్రుతి
స్నానం చేస్తూ కాలువలో కొట్టుకుపోయిన మహిళ తోటి భక్తుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం ఆటో బోల్తాపడిన ఘటనలో భక్తుడు దుర్మరణం మరో ఇద్దరికి గాయాలు గుంతకల్లు టౌన్/విడననకల్లు : కృష్ణా పుష్కరాల ముగింపు రోజున జిల్లాలో అపశ్రుతి చోటు చేసుకుంది. పుష్కర స్నానం చేస్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు కాలువలో కొంతదూరం కొట్టుకుపోయింది. తోటి భక్తులు అప్రమత్తమై కాపాడారు. మరోచోట పుష్కరస్నానాలు పూర్తి చేసుకుని తిరుగు పయనమైన భక్తుల ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వజ్రకరూరు మండలం బెస్తగేరికి చెందిన కంబయ్య (56), రామాంజినమ్మ దంపతులు మంగళవారం ఉదయం గుంతకల్లు మండలం కసాపురం వద్దగల కృష్ణా పుష్కరఘాట్‌లో స్నానం చేశారు. అనంతరం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకుని సాయంత్రం స్వగ్రామానికి డీజిల్ ఆటోలో బయల్దేరారు. గుంతకల్లు శివారులోని కొనకొండ్ల రైల్వేగేట్ సమీపంలోని మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్ పక్కనే కూర్చున్న కంబయ్య మీద ఆటో పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన ఆటోడ్రైవర్ చంద్రశేఖర్, రామాంజినమ్మలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ఎస్ఐ నగేష్‌బాబు పరిశీలించారు. ఉరవకొండకు చెందిన లక్ష్మిదేవి మంగళవారం లత్తవరం సమీపంలోని హంద్రీనీవా కాలువలో పుష్కరస్నానానికి వెళ్లింది. లోతు తక్కువున్న చోట స్నానమాచారిస్తుండగా కాలుజారి నీటమునగి 15 అడుగుల మేర కొట్టుకుపోయింది. గమనించిన తోటి యువకులు కాలువలోకి దూకి ఆమెను బయటకు తీశారు. అప్పటికే అస్వస్థతకు గురైన లక్ష్మిదేవిని ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపించారు. స్నానం చేస్తూ స్పృహ తప్పిన భక్తుడు కళ్యాణదుర్గం రూరల్ : గోరంట్లకు చెందిన అంజినప్ప పుష్కర స్నానం చేసేందుకు బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ వద్దకు వచ్చాడు. పధాన ఘాట్ వద్ద స్నానం చేస్తున్న సమయంలో శ్వాస తీసుకోలేక స్పృహ తప్పాడు. స్థానికులు గమనించి అంజినప్పను బయటకు తీసుకొచ్చి 108 ద్వారా కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. -
కృష్ణం వందే.. జగద్గురుం
– ఘనంగా ముగిసిన కృష్ణా పుష్కరాలు – ప్రత్యేకSపూజలు, హారతితో పుష్కరుడికి వీడ్కోలు పలికిన ఇన్చార్జ్ కలెక్టర్, ఎస్పీ దంపతులు – చివరిరోజూ పోటెత్తిన జీడిపల్లి – 12 రోజుల్లో దాదాపు 10 లక్షల మంది పుష్కర స్నానం – ‘అనంత’ను సస్యశ్యామలం చేయాలని కృష్ణమ్మను వేడుకున్న భక్తులు – నేటి నుంచి ఏడాది పాటు అంత్యపుష్కరాలు – పుష్కరాల విజయవంతంలో పోలీస్, రెవెన్యూ అధికారుల కీలకపాత్ర పన్నెండు రోజుల పుష్కర ఘట్టం మంగళవారం అద్వితీయంగా ముగిసింది. ఇన్నాళ్లూ కృష్ణమ్మ ఒడిలో సేదతీరిన లక్షలాది మంది భక్తులు.. చివరిరోజు పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. నీ స్పర్శతో పునీతులయ్యామని, వచ్చే పుష్కరాల వరకు ఈ ఆనందానుభూతులను గుర్తుంచుకుంటామంటూ కృష్ణవేణికి వందనం సమర్పించారు. వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి.. అఖండజ్యోతితో హారతిపట్టి పుష్కరుడికి వీడ్కోలు పలికారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎస్పీ రాజశేఖరబాబు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు దీపాలను రిజర్వాయర్‌లో వదిలి పుష్కరఘట్టానికి ముగింపు పలికారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. కరువుతో నిత్యం అల్లాడుతున్న ‘అనంత’ను వచ్చే పుష్కర కాలానికి పూర్తి కరువు రహితంగా మార్చాలని కృష్ణమ్మను వేడుకున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలో తొలిసారి నిర్వహించిన కృష్ణ పుష్కరాలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలను బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌లో కళ్యాణదుర్గం ఆర్డీవో రామారావు పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు రిజర్వాయర్‌లో స్నానం ఆచరిస్తున్న భక్తులందరినీ ఆపేసి పూజలు మొదలెట్టారు. పూజలకు ఇన్చార్జ్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎస్పీ రాజశేఖరబాబు దంపతులు హాజరయ్యారు. బంకమట్టితో తయారుచేసిన పార్థివలింగానికి జల, భస్మ, క్షీరాభిషేకాలు చేశారు. ఐదు వేల కడవలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. తర్వాత కృష్ణమ్మకు పంచ హారతులు పట్టారు. చివరగా సంధ్యాహారతి ఇచ్చి.. దీపాలను రిజర్వాయర్‌లో వదిలిపెట్టి పుష్కరుడికి వీడ్కోలు పలికారు. ముగింపు కార్యక్రమంలో పూజలతో పాటు కృష్ణమ్మపై ప్రత్యేకంగా పాటలు, భజనలు ఆలపించారు. వేలాదిమంది భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. పదిలక్షల మంది పుష్కరస్నానం జీడిపల్లిలో కృష్ణాపుష్కరాలు ఈ నెల 12న మొదలయ్యాయి. జేసీ దంపతులు స్నానం ఆచరించి పుష్కరాలు ప్రారంభించారు. ఆ రోజు కేవలం 1500 మంది భక్తులు హాజరయ్యారు. ఆ తర్వాత భక్తుల సంఖ్య అమాంతం పెరిగింది. రోజుకు 50–70మంది దాకా స్నానం చేశారు. చివరి మూడురోజులు రెండులక్షలమంది చొప్పున తరలివచ్చారు. చివరిరోజు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, ఆర్డీవో మలోలతో పాటు పలువురు న్యాయమూర్తులు స్నానం ఆచరించారు. చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే స్నానాలు మొదలయ్యాయి. ఏడు గంటలకు ఘాట్లన్నీ కిక్కిరిశాయి. కర్ణాటకతో పాటు చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ ముగ్గురు కీలకపాత్ర పుష్కరాలను జీడిపల్లిలో నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏర్పాట్లకు ఒక్కరూపాయి కేటాయించలేదు. ఈ నెల 11న కృష్ణమ్మ జీడిపల్లిలోకి చేరగానే ఆర్డీవో రామారావు వేదపండితులు రాఘవేంద్రజోషి, వేణుగోపాల్‌తో పాటు బెళుగుప్ప మండలంలోని ప్రజల సహకారంతో పుష్కరాలకు ఏర్పాట్లను చేశారు. భక్తుల రద్దీ పెరిగిన తర్వాత ఎస్పీ రాజశేఖరబాబు రోజూ 7–10మంది డీఎస్పీలతో పాటు వందలాదిమంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. పుష్కరాలు ఈ స్థాయిలో జరుగుతాయనే ఊహ లేకపోవడంతో 2,400 మంది పోలీసులను విజయవాడ బందోబస్తుకు పంపారు. అయినప్పటికీ ఉన్న పోలీసులతోనే ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూశారు. చివరి నాలుగురోజులు స్వయంగా బందోబస్తును పర్వవేక్షించారు. వీరితో పాటు రాఘవేంద్ర తోటి మిత్రుల సహకారంతో సొంతంగా ఏర్పాట్లు చేయడంతో పాటు దాదాపు 50 మంది వేదపండితులను అక్కడ ఉంచి భక్తులతో పిండప్రదానాలు చేయించారు. నేటి నుంచి అంత్య పుష్కరాలు పుష్కరఘట్టం ముగిసినప్పటికీ మరో ఏడాది పాటు అంత్యపుష్కరాలు కొనసాగుతాయి. నేటి నుంచి రోజూ గంటపాటు పుష్కరుడు ఉంటారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకూ గంటపాటు స్నానాలు చేయొచ్చు. తర్వాత సరిగ్గా ఏడాదికి 12రోజుల ముందు అంత్యపుష్కర ‡వేడుకలో మళ్లీ 12 రోజుల పాటు జరుగుతాయి. ఇప్పుడు పుష్కరస్నానం చేసిన భక్తులు ఏడాది తర్వాత అంత్యపుష్కరాల్లో కూడా స్నానం ఆచరిస్తే మంచిదని వేదపండితులు చెబుతున్నారు. వైఎస్‌ను స్మరించుకున్న లక్షలాదిమంది భక్తులు జీడిపల్లి అనేది పదేళ్ల కిందట అడవిలా ఉండేది. ఇలాంటి ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మించి, కృష్ణాజలాలు జిల్లాకు వచ్చేలా చేశారు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. జిల్లా వాసులు నేడు పుష్కరస్నానం ఆచరించేందుకు కారణం వైఎస్సేనని భక్తులంతా స్మరించుకున్నారు. ‘కరువుజిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఎక్కడో శ్రీశైలంలోని నిన్ను ఇంతదూరం తీసుకొచ్చారు. లక్షలాదిమంది పూజలు ఫలించేలా వచ్చే పుష్కరకాలానికి అనంతపురంలో కరువు అనేది కన్పించకుండా జిల్లాను సస్యశ్యామలం చేయాల’ని భక్తులు కృష్ణమ్మను వేడుకున్నారు. -
పున్నమిఘాట్లో ప్రముఖుల పుష్కర స్నానం
విజయవాడ: కృష్ణా పుష్కరాలు మంగళవారం ముగుస్తుండటంతో పుష్కరఘాట్ల వద్ద భక్తుల తాకిడి ఎక్కువైంది. మంగళవారం చివరి రోజున ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దంపతులు, మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి, నటుడు సాయికుమార్, సినీ నిర్మాత అశోక్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పున్నమిఘాట్లో పుణ్యస్నానమాచరించారు. -
జన జాతర
-
జల పర్వం.. జనసంద్రం
జిల్లాలోని 11 రోజుల్లో 13,24,743 మంది భక్తులు – రోజుకు సగటున 1,20,431 పుణ్య స్నానాలు – ఐదు ఘాట్లలోనూ భక్తిపారవశ్యం – సీఎం పర్యటన నేపథ్యంలో స్తంభించిన ట్రాఫిక్ – రెండున్నర గంటల పాటు భక్తులు అవస్థలు – సీఐ ఘటనతో అప్రమత్తమైన పోలీసు శాఖ – ఆది పుష్కర ముగింపునకు భారీ ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, కర్నూలు: పుష్కర స్నానానికి భక్తులు పోటెత్తారు. జిల్లాలో ఐదు ఘాట్లు ఉండగా.. మొత్తం 11 రోజుల్లో 13,24,743 మందికి పైగా పుష్కరస్నానం ఆచరించారు. ఈ లెక్కన సగటున రోజుకు 1,20,431 మంది భక్తులు కృష్ణమ్మ దీవెనలందుకున్నారు. భక్తులకు తగిన సంఖ్యలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు లేకుండానే పుష్కర సందడి కొనసాగింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం లింగాలగట్టులోని దిగువఘాటుకు రావడంతో అటు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం వస్తున్న సందర్భంగా గంటన్నర పాటు.. వెళ్లే సమయంలో ఒక గంట పాటు మొత్తం రెండున్నర గంటలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఫలితంగా పుష్కరభక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కార్డ్అండ్ సెర్చ్‌లో ఒక మహిళతో సీఐ పట్టుబడిన ఘటన నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమయింది. ఐజీ శ్రీధర్‌రావు.. జాగ్రత్తగా ఉండాలని పోలీసు సిబ్బందిని హెచ్చరించారు. ఈ ఒక్క ఘటన మినహా పుష్కర సందడి ఇప్పటి వరకు సాఫీగానే సాగింది. ఇకపోతే చివరిరోజు పుష్కరాలకు ఘనంగా ముగింపు పలికేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధమయింది.. చివర్లో తెలుగు తమ్ముళ్ల సందడి పుష్కర సందడి మొదలై 10 రోజులు గడిచినప్పటికీ అటువైపు కొద్ది మంది మినహా తెలుగు తమ్ముళ్లు పెద్దగా ఎవ్వరూ సహాయ కార్యక్రమాలు చేపట్టలేదు. అయితే, సోమవారం సీఎం వస్తున్న సందర్భంగా ఎవరికి వారు భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక ఎమ్మెల్యే మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లను పంచిపెట్టగా.. మరో నేత కుంకుమ, పసుపు, రవికెలను పంపిణీ చేశారు. అప్పటికప్పుడు ఫ్లెక్సీలను పెట్టి హంగామా చేసే ప్రయత్నం కనిపించింది. కష్టపడ్డ జిల్లా యంత్రాంగం పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడంలో జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేసింది. ప్రధానంగా పోలీసు యంత్రాంగం సేవా కార్యక్రమాల్లో ముందుండగా.. రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు భారీగా చేసింది. మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది ఎక్కడా చెత్త కనపడకుండా రేయింబవళ్లు కష్టపడ్డారు. ఏకంగా రాత్రి సమయాల్లోనూ కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఘాట్ల వద్దకు వెళ్లి శుభ్రపరిచే ఏర్పాట్లను చేశారు. గత నాలుగు రోజులుగా కలెక్టర్, ఎస్పీ కలియతిరుగుతూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మొత్తం మీద జిల్లా యంత్రాంగం కష్టానికి తగిన గుర్తింపు లభించింది. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు వరించింది. -
జన నర్తనం.. జల కీర్తనం
-
కర్నూలే నెంబర్ వన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కృష్ణా పుష్కరాల్లో కర్నూలు జిల్లాకు మొదటి స్థానం దక్కింది. ఏకంగా 93 శాతం మార్కులతో రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచింది. పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు, పరిశుభ్రత, భక్తుల అభిప్రాయాలు, మొదలైన 22 అంశాలపై నిర్వహించిన సర్వేలో కర్నూలు జిల్లాకు మొదటిస్థానం దక్కిందని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. అదేవిధంగా 20 అంశాల్లో కృష్ణా, గుంటూరుతో పోలిస్తే కర్నూలుకు మొదటి స్థానం దక్కిందన్నారు. కేవలం రెండు అంశాల్లో మాత్రమే కర్నూలు జిల్లాకు ద్వితీయ స్థానం వచ్చిందని పేర్కొన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ పుష్కరాలకు వచ్చే భక్తుల నుంచి ప్రతిరోజూ అభిప్రాయాలను సేకరించారు. నేరుగా కొంతమంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాలు పంచుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు వాయిస్ ఓవర్ సిస్టమ్ ద్వారా నేరుగా పుష్కర భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు కలెక్టర్ వివరించారు. ఇందుకు అనుగుణంగా ర్యాంకులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. కర్నూలు తర్వాత 88 శాతం మార్కులతో కృష్ణా జిల్లా ద్వితీయ స్థానంలో నిలవగా, 86 శాతంతో గుంటూరు జిల్లా తృతీయ స్థానం దక్కించుకుంది. ఇది జిల్లా యంత్రాంగం సమష్టి కృషి కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణలో జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేసిందని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అభిప్రాయపడ్డారు. అందువల్లే రాష్ట్రస్థాయిలో కర్నూలు జిల్లా అగ్రభాగాన నిలిచిందన్నారు. ఇది జిల్లా యంత్రాంగం సమష్టి కషికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. 22న సీఎం రాక శ్రీశైలానికి ఈనెల 22న(సోమవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన లింగాల ఘాట్‌ను సందర్శించనున్నారు. అయితే రాష్ట్రస్థాయిలోనే ప్రథమ ఘాట్‌గా నిలిచిన సంగమేశ్వరానికి వస్తారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. -
పెన్నాకు పుష్కర శోభ
వల్లూరు: పెన్నా నదికి పుష్కర శోభ వచ్చింది. శ్రీ శైలం నుండి వచ్చిన కృష్ణా నది నీరే మన జిల్లాలోని కుందూ, పెన్నా నదుల్లో ప్రవహిస్తున్న వైనంపై సాక్షిలో వచ్చిన కథనంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. అంతదూరం వ్యయ ప్రయాసలకోర్చి ఇబ్బందులు పడడం కంటే మనకు అందుబాటులో పావన పినాకినీ తీరంలో వున్న పుష్పగిరిని సందర్శించి పెన్నమ్మలో స్నానం చేస్తే ఫలితం వుంటుందని గుర్తించారు. శుక్రవారం ఒక మోస్తారుగా వచ్చిన భక్తులు శనివారం భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది పుష్పగిరి వద్ద నదిలో స్నానాలు ఆచరించారు. జిల్లాలోని నలుమూలల నుండే కాక అనంతపురం జిల్లా నుండి కూడా తరలి వచ్చారు. కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి, శ్రీ సంతాన మల్లేశ్వర స్వామి ఆలయాల్లో, గ్రామంలోని శ్రీ వైద్యనాథ స్వామి, శ్రీ చక్ర సహిత కామాక్షీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు నది ఒడ్డున ఇసుకతో ∙సైకత లింగాలను చేసి దీపాలను వెలిగించి నదీమ తల్లికి పూజలు నిర్వహించారు. కొందరు తమ పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆనందంలో భక్తులు: పంచ నదీ సంగమమైన పుష్పగిరి వద్ద గల పినాకినీ నదిలో కృష్ణానది నీరు రావడం భక్తులకు ఆనందదాయకంగా వుంది. కార్తీక, శ్రావణ, మాఘ మాసాలలో, బ్రహ్మోత్సవాల్లో ∙ఇక్కడి నదిలో స్నానాలు ఆచరించి శివ కేశవులను దర్శించుకోవడం వలన సకల పాపాలు నశిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. కృష్ణా పుష్కర నేపథ్యంలో కృష్ణా నది నీరు ఇక్కడ ప్రవహించడం వలన ఈ నీటిలో స్నానాలు మరింత పుణ్య ఫలితాన్ని చేకూరుస్తాయి. –అఖిల్ దీక్షితులు , పుష్పగిరి ఆలయ ప్రధాన పూజారి చాలా సంతోషంగా వుంది: పుష్కర వేళ దక్షిణ కాశీగా పేరు పొందిన పుష్పగిరి వద్ద పెన్నా నదిలో కృష్ణమ్మ నీటిలో స్నానాలు ఆచరించడం చాలా సంతోషంగా వుంది. కుంటుంబంతో కలిసి వచ్చాను. –జయలక్ష్మి, ధర్మవరం, అనంతపురం జిల్లా పుణ్య క్షేత్రాల్లో పుష్కర స్నానం మంచిది: పుణ్య క్షేత్రాల్లో ఆధ్యాత్మిక భావనతో పుష్కర స్నానం చేయడం చాలా మంచిది. మన సాంప్రదాయాలను పాటిస్తూ వాటిని సంరక్షించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం వుంది. అంత దూరం వెళ్లలేని వారికి పెన్నా నదిలో కృష్ణా జలాల్లో పుష్కర స్నాన అవకాశం లభించడం ఎంతో సంతోషాన్నిస్తోంది. –రవి శంకర్, డీఎఫ్‌వో , ప్రొద్దుటూరు. -
పులకిస్తున్న పుష్కర ఘాట్లు
-
మది కేరింత.. మనస్సు పులకరింత
– ఆరవ రోజు కొనసాగిన భక్తుల రద్దీ – సంగమేశ్వరానికి పెరిగిన తాకిడి – శ్రీశైలంలో లింగాలగట్టు వద్ద భక్తిపారవశ్యం – వలంటీర్లు, పోలీసుల సేవలకు ప్రశంసలు – ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ సాక్షి, కర్నూలు: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటోంది. శ్రీశైలంతో పోలిస్తే.. సంగమేశ్వరంలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఇక లింగాలగట్టు లోలెవల్ ఘాట్ భక్తజన సంద్రంగా మారింది. పిండ ప్రదానాల అనంతరం భక్తులు పుణ్య స్నానాలతో తరించిపోయారు. ఉదయం 9 గంటల వరకు ఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆ తర్వాత కొంత పలుచపడినా.. సాయంత్రం రద్దీ కాస్త పెరిగింది. జిల్లాలోని ప్రధాన ఘాట్ల వద్ద స్నానమాచరించిన భక్తులు.. సమీప ఆలయాలను దర్శించుకుంటూ భక్తిపారవశ్యంలో మునుగుతున్నారు. శ్రీశైలానికి అధికంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ప్రకాశం జిల్లా మార్కాపురం వాసులు వస్తున్నారు. సంగమేశ్వరంలో జిల్లా భక్తులతో పాటు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. కాస్త తగ్గిన నీళ్లు శ్రీశైలంలో పాతాళాగంగ పుష్కర ఘాట్‌కు వెళ్లాలంటే రోప్‌వే వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి. మెట్లమార్గంలో అయితే 600 మెట్లు ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీరంతా లింగాలగట్టు వైపు చూస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని నుంచి వచ్చే భక్తులు నేరుగా లింగాలగట్టులోని లోలెవల్ ఘాట్ వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నారు. నాలుగు, ఐదవ రోజు ఈ ఘాట్‌లో నీరు వెనక్కు వెళ్లడంతో.. అధికారులు స్పందించి జనరేటర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయించి ఆ నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఫలితం పుష్కర స్నానం సాఫీగా జరిగిపోతోంది. పటిష్ట భద్రతా చర్యలు గుంటూరు జిల్లాలో కృష్ణా నదిలో పుష్కర స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీట మునిగి మృత్యువాతపడిన ఘటనతో జిల్లాలోనూ ఘాట్ల భక్తుల భద్రతకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అనధికార ఘాట్ల వద్ద ఎవ్వరినీ స్నానాలు చేయించకుండా పోలీసుల బందోబస్తు ముమ్మరం చేశారు. శ్రీశైలం, సంగమేశ్వరంతో పాటు నెహ్రూనగర్, ముచ్చుమర్రి ఘాట్ల వద్ద కూడా పోలీసు బలగాలను మోహరించారు. అదేవిధంగా ఘాట్ల వద్ద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన 49 మంది సిబ్బందిని నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణలు శ్రీశైలంలోని ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తుండగా.. సంగమేశ్వరంలో జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్, అదనపు ఎస్పీ చంద్రశేఖర్రెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు. సేవలు భేష్ పుష్కర ఘాట్ల వద్ద వలంటీర్లు అందిస్తున్న సేవలను భక్తులు కీర్తిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు వలంటీర్లతో పాటు పోలీసులు దగ్గరుండి సేవలందిస్తున్నారు. అదేవిధంగా ఉచిత అన్నదానాలతో నీళ్ల ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేస్తుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
ఓరి దేవుడా!
– భక్తులు లేక వెలవెలబోతున్న నమూనా ఆలయాలు శ్రీశైలం నుంచి సాక్షి బృందం: కృష్ణ పుష్కరాలకు శ్రీశైలంకు వచ్చే భక్తులకు కాణిపాకం వినాయకుడు, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి, బిక్కవోలు సుబ్రమణ్యస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి, ఒంటిమిట్ట కొదండరామస్వామిల దర్శనం ఒకే చోట కల్పించడం కోసం నమూనా ఆలయాలు నిర్మించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలోని పుష్కర నగర్–2లో దేవదాయ శాఖ రూ. 40 లక్షలు ఖర్చూ పెట్టి నిష్ణాతులైన కళాకారులతో ఈ నమూనా ఆలయాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి భక్తులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. నమూనా ఆలయాలపై ప్రచారం చేయకపోవడం, భక్తులు వచ్చేందుకు దారులు తెలియకపోవడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్టీసీ బస్టాండ్‌కు దగ్గరలో, పాతాళగంగాకు వెళ్లేదారిలో, కళ్యాణ కట్ట సమీపంలోకానీ ఏర్పాటు చేసి ఉంటే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని పుష్కర భక్తులు చెబుతున్నారు. దీనికి తోడు ఈ నమూనా ఆలయాలు నిర్మించడంలో ఉన్న చిత్తశుద్థి...భక్తులకు తెలిసేలా ప్రచారం చేయకపోవడంలో లేదనే విమర్శలు ఉన్నాయి. ముందుచూపు లేకుండా లేకపోవడంతో రూ. 40 లక్షల ప్రజా ధనం దుర్వినియోగమైనట్లే. -
జీడిపల్లికి జనతాకిడి
బెళుగుప్ప : మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌లో కృష్ణా పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన ఘాట్‌లో వేల సంఖ్యలో పుష్కర స్నానాలను ఆచరిస్తున్నారు. మంగళవారం కూడా వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులకు ఏర్పాట్లను కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) కేఎస్ రామారావు పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు ఘాట్‌ను పరిశీలించారు. ఇక్కడ హిందూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రఘుస్వామి ఆధ్వర్యంలో వేదపండితులు తెల్లవారుజామున, సాయంత్రం గంగాహారతి ఇస్తున్నారు. -
ప్రయాణికుల పడిగాపులు
- పుష్కరాలను తరలిన ఆర్టీసీ బస్సులు హిందూపురం అర్బన్ : స్థానిక ఆర్టీసీ డిపో నుంచి బస్సులు కృష్ణా పుష్కరాలకు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీకెండ్, పంద్రాగస్టు సెలవులు ముగించుకుని మంగళవారం హిందూపురం నుంచి బెంగళూరు తదితర ప్రాంతాలకు ప్రజలు బయలుదేరారు. అయితే బస్టాండులో సక్రమంగా బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. జిల్లా నుంచి సుమారు 90 బస్సులు పైగా కృష్ణా పుష్కరాలకు తరలించారు. అందులో హిందూపురం డిపో నుంచి 16 బస్సులు పంపించారు. అదేవిధంగా ప్రతి డిపో నుంచి వందల మందిగా ఆఫీస్, మెకానిక్, డ్రైవర్, కండక్టర్లను తీసుకెళ్లారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. -
పవిత్ర సంగమం వద్ద విషాదం
-
పోటెత్తిన జనవాహిని
-
పుష్కర నీరాజనం
కృష్ణా తీరం.. దీప హారతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ భక్తి పారవశ్యం పరవళ్లు తొక్కుతోంది. పుణ్య స్నానాలతో భక్తజనం పునీతమవుతున్నారు. వందలాది కిలోమీటర్ల దూరం.. జిల్లాలు, రాష్ట్రాలు దాటి వస్తున్న వేలాది ప్రజలు కష్ణమ్మ ఒడిలో తమను తాము మైమరిచిపోతున్నారు. సాక్షి, కర్నూలు: కృష్ణా పుష్కరాలు నాలుగో రోజున స్నానఘాట్లు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. సోమవారం స్వాతంత్య్ర దినోత్సం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాల హడావుడి మొదలైంది. పాతాళాగంగ, లింగాలగట్టు, సంగమేశ్వరం ఘాట్లకు పోటెత్తారు. కర్నూలు జిల్లాతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి బస్సులు, వాహనాల్లో వచ్చిన భక్తులు శ్రీశైలానికి చేరుకున్నారు. ఆర్టీసీ, పోలీసులు, రవాణశాఖ సమన్వయంతో ఎక్కడా అసౌకర్యం కలగకుండా వారిని ఉచిత బస్సుల్లో ఘాట్ల చెంతకు తరలించడంతో యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించారు. వలంటీర్లు, ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఘాట్ల వద్ద వద్ధులు, పిల్లలు, వికలాంగులకు సేవలు అందించారు. లక్షమందికి పైగా భక్తులు తరలివచ్చినా ఎక్కడా ఎలాంటి సంఘటనలు నమోదుకాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. లక్ష మంది స్నానం ముక్కంటికి ప్రీతికరమైన రోజు కావడంతో శ్రీశైలానికి సోమవారం భక్తుల తాకిడి పెరిగింది. శ్రీశైలంలోని పాతాళాగంగలో రెండు ఘాట్లలోనూ భక్తులు పోటెత్తారు. లింగాలగట్టు లోలెవల్ ఘాట్లోనూ, సంగమేశ్వరంలోని ఘాట్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. జిల్లాలోని ఆరు ఘాట్లలోనూ దాదాపు లక్ష మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. శ్రీశైలానికి ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి అధికంగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళాగంగ ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించి.. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి క్యూలైన్లలో నిలబడ్డారు. గంటగంటకు భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ సతీసమేతంగా పాతాళాగంగ ఘాట్‌లో పుణ్యసాన్నాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు. పుష్కరాల ప్రత్యేక అధికారి అనంతరాములు, డీఐజీ రమణకుమార్ ఘాట్లను పరిశీలించి యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. లింగాలగట్టులో భక్తులకు ఇబ్బందులు లింగాలగట్టులోని లోలెవల్ ఘాట్‌లో నీటిమట్టం తగ్గడంతో వివిధ ప్రాంతాల నుంచి వేకువజామునే అక్కడికి తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11 గంటల వరకు పరిస్థితిలో మార్పులు రాలేదు. దీంతో భక్తులు తమ వెంట తెచ్చుకున్న చెంబులతోనే పుణ్యస్నానమాచరించడం కనిపించింది. కొందరు వద్ధులు నీట మునిగితేనే పుణ్యస్నానమాచరించినట్లని భావించి మోకాటిలోతున్న నీళ్లలో ఇబ్బందిగా మునకలు వేయడం గమనార్హం. దీంతో ఇరిగేషన్ అధికారులు స్పందించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జలవిద్యుత్తు కేంద్రాల నుంచి నాలుగు జనరేటర్ల ద్వారా దిగువకు 18,242 క్యూసెక్కుల నీటిని కిందికి వదలడంతో నెమ్మదిగా నీటిమట్టం పెరిగింది. ఆ తర్వాత భక్తులు అక్కడ కేరింతలు కొట్టుతూ పుణ్యస్నానాలు ఆచరించారు. -
జల‘తరింపు’
-
నమోః కృష్ణమ్మా
→ జీడిపల్లి జలాశయానికి పుష్కర శోభ → పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు → సతీసమేతంగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అనంతపురం అర్బన్/అగ్రికల్చర్/బెళుగుప్ప : నమోః కృష్ణమ్మా.. అంటూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడంతో జీడిపల్లి జలాశయం పుష్కర శోభ సంతరించుకుంది. శుక్రవారం ఉదయం జీడిపల్లి జలాశయం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ప్రారంభ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం సతీసమేతంగా హాజరయ్యారు. కృష్ణమ్మ విగ్రహ ప్రతిష్టకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అన ంతరం వారు పుణ్య స్నానం ఆచరించారు. దాదాపు 500 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గ్రామపెద్దలతో కలిసి తహసీల్దారు జి.ఎం.వెంకటాచలపతి, ప్రత్యేక అధికారి మేఘనాథ్ భక్తుల కోసం అధికారులు సౌకర్యాలు కల్పించారు. భక్తులు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా గజ ఈతగాళ్లను, వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. జలాశయంలో ప్రమాద హెచ్చరికలను తెలిపేందుకు గుర్తులను ఏర్పాటు చేశారు. పురోహితులను అందుబాటులో ఉంచారు. కాలువపల్లి నుంచి జలాశయం వద్ద ఏర్పాటు చేసిన ఘాట్ వరకు రాకపోకలకు రెండు బస్సు సర్వీసులను 23వ తేదీ వరకు నిర్వహించాలని గ్రామపెద్దలు కోరుతున్నారు. –––––––––––––––––––––––––––––––––––– చాలా ఆనందంగా ఉంది: ఎలాంటి ఇబ్బంది లేకుండా కృష్ణాజలాల్లో పుష్కర స్నానం చేయడం చాలా ఆనందంగా ఉంది. వ్యయ ప్రయాసాలకోర్చి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లలేని భక్తులకు ఇది చాలా అనుకూలం. భక్తులు రావడానికి ప్రయాణ సదుపాయం, తాగునీరు, పుష్కరఘాట్, ఇతరత్రా వివరాలు తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రవి, సుకన్య (జేఎన్టీయూ, అనంతపురం) –––––––––––––––– జిల్లా వాసులకు గొప్ప అవకాశం కృష్ణా పుష్కరాలకు వెళ్లిరావడం ఎంతోఖర్చుతో కూడుకున్నది. కృష్ణాజలాలు ప్రవహించే చోట కూడా పుష్కరుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెప్పారు. అందుకు అనుగుణంగా జీడిపల్లి జలాశయం వద్ద ఏర్పాట్లు చేయడం జిల్లా వాసులకు గొప్ప అవకాశం. మరికొన్ని సదుపాయాలు కల్పిస్తే ఇంతకన్నా మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు. –విజయలక్ష్మి, ఉపాధ్యాయురాలు, పెద్దవడుగూరు –––––– –––––– -
పన్నెండేళ్ల పండగ
నేటి నుంచి కృష్ణా పుష్కరాలు – తెల్లవారుజామున 5.54 గంటలకు నదీ హారతి – సంగమేశ్వరంలో డిప్యూటీ సీఎం, శ్రీశైలంలో కలెక్టర్ – ముస్తాబవుతున్న శ్రీశైల మహాక్షేత్రం – అందంగా రూపుదిద్దుకుంటున్న పురవీధులు – సిద్ధమవుతున్న పుష్కరఘాట్లు – ఇంకా అసంపూర్తిగానే పుష్కరనగర్లు శ్రీశైలం నుంచి సాక్షి ప్రతినిధి: కృష్ణా పుష్కరాలకు సర్వం సిద్ధమయింది. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంతో పాటు సప్తనదుల సంగమంలోని సంగమేశ్వరం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున 5.54 గంటలకు హారతితో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సంగమేశ్వరంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, శ్రీశైలంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హారతినిచ్చి పుష్కర స్నానం చేసి పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఇక శ్రీశైల పురవీధుల్లో శివరూపం ఉట్టిపడుతుండగా.. ఆలయం విద్యుద్దీపకాంతులతో వెలిగిపోతోంది. లింగాల గట్టు వద్ద ఎగువ, దిగువ ఘాట్లు.. పాతాళగంగ వద్ద ఎగువ, దిగువ ఘాట్లు భక్తులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. చివరి రెండు రోజుల్లో ఆగమేఘాలపై ఘాట్లను సిద్ధం చేశారు. సంగమేశ్వరం వద్ద కూడా పనులు పూర్తయ్యాయి. మొదటి రోజు వేలల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరుసగా సెలవులు కావడంతో సోమవారం వరకు భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే భక్తుల రద్దీకి తగ్గట్లు సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా దూర ప్రయాణంతో శ్రీశైలం చేరుకునే భక్తులు సేదతీరేందుకు నిర్మిస్తున్న పుష్కర నగర్లు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా ఘాట్ల వద్ద మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులు రద్దీకి అనుగుణంగా లేకపోవడం కూడా ఇబ్బంది కలిగించే విషయమే. మొత్తం మీద ఈనెల 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న కష్ణా పుష్కరాల విజయవంతానికి జిల్లా అధికార యంత్రాంగం కంటి మీద కునుకు లేకుండా కృషి చేస్తోంది. శ్రీశైలం.. శివమయం శ్రీశైలంలోని పురవీధులకు కొత్త కళ వచ్చింది. వీధులన్నీ శివుని రూపాలతో పూర్తిస్థాయిలో భక్తిపారవశ్యం నింపుతున్నాయి. శివనామంతో వీధులన్నీ మార్మోగుతున్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏ దారి ఎటు వెళుతుందో దూరం నుంచి చూసినా కనిపించేలా సూచికలను కూడా ఏర్పాటు చేశారు. ఆలయం మొత్తం లైటింగ్‌తో అలంకరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను నిర్మించారు. ఇక ఘాట్లలో ప్రమాదాలు వాటిల్లకుండా ముందస్తుగా ఈతగాళ్లను ఘాట్ల వద్ద చిన్న చిన్న బోట్లతో సిద్ధం చేశారు. పాతాళగంగ వద్దకు చేరుకునేందుకు వద్ధులు, వికలాంగులను రోప్‌వే ద్వారా అనుమతిస్తారా? లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు వీఐపీల తాకిడి కూడా మొదలయింది. పుష్కరాల మొదటి రోజు శుక్రవారం శ్రీశైలానికి మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి రానున్నారు. భయపెడుతున్న కొండ చరియలు గతంలో విరిగిపడిన కొండ చరియల ప్రాంతంలో ఇంకా పూర్తిస్థాయిలో రక్షణ పనులు పూర్తి కాలేదు. మొత్తం రోడ్డుమార్గం అంతా ఐరన్‌మెష్ ఏర్పాటు చేయాలని స్వయంగా జియోలాజికల్ సర్వేఆఫ్ ఇండియా(జీఎస్ఐ) సూచనలు చేసినప్పటికీ కేవలం సగం వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ప్రాంతంలో పనులు పూర్తికాకపోవడంతో కొండ చరియలు భక్తులను భయపెడుతున్నాయి. దీంతో దిగువఘాట్‌కు మెట్ల మార్గం ద్వారా మాత్రమే భక్తులను అనుమతివ్వాలని.. ఘాట్ రోడ్డులో ఎక్కువ సంఖ్యలో అనుమతి ఇవ్వకూడదని అధికారులు భావిస్తున్నారు. ఇవీ సమస్యలు... – పాతాళగంగ దిగువఘాట్ వద్ద పుణ్యస్నానం చేసే భక్తులకు సరిపడా దుస్తులు మార్చుకునే షెడ్లు ఏర్పాటు చేశారు. అయితే, ఎగువఘాట్ వద్ద రెండు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇక లింగాలఘాట్ వద్ద కూడా కేవలం రెండే నిర్మించారు. దీంతో ప్రధానంగా స్త్రీలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. – పాతాళగంగ వద్ద మరుగుదొడ్లు గతంలో శాశ్వతంగా నిర్మించినవి మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. కొత్తగా తాత్కాలికంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నప్పటికీ అవి కాస్తా ఏర్పాటు కాలేదు. ఫలితంగా భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. – పుష్కరనగర్‌లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. ఇంకా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. – ఇక శ్రీశైలం పురవీధుల్లోనూ ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేయడంతో వర్షం వస్తే బాగా చిత్తడి అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా వర్షం రాకపోయినప్పటికీ దుమ్మురేగి ఇబ్బంది పెడుతున్నాయి. -
కృష్ణా పుష్కరాలకు 31 బస్సులు
మెదక్ డిపో డీఎం శ్రీనివాస్ మెదక్: ఈనెల 12నుంచి జరగబోయే కృష్ణా పుష్కరాలకు మెదక్ డిపో నుంచి 31 బస్సులను ప్రత్యేకంగా నడిపించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్లో పుష్కరాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పుష్కరాలకోసం ఎంత ప్రతిష్టాత్మకమైన చర్యలు చేపడుతుందో ఆర్టీసీ కూడా అదేస్థాయిలో చర్యలు తీసుకుంటోందన్నారు. పుష్కరాలకోసం 30మంది ఉంటే ఆ గ్రామానికి వెళ్లి ప్రయాణికులను పుష్కరాలకు తరలిస్తామన్నారు. పుష్కరాలకోసం మహబూబ్‌నగర్ జిల్లాలోని బీచుపల్లి, శ్రీశైలం, నల్లగొండ జిల్లాలోని వాడపల్లి, నాగార్జునసాగర్, మట్టపల్లిలో స్నానాల ఘాట్లు ఏర్పాటు చేశారన్నారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి రూ.370 నుంచి 470ల చార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో టీఎంయూ నాయకులు ఎంఆర్‌కేరావు, బోస్, మొగులయ్య, సంగమేశ్వర్ తదితరులు ఉన్నారు. -
రిజర్వేషన్ లేకుండానే.. రైట్‌రైట్
11 నుంచి పుష్కరాలకు ఆర్టీసీ బస్సులు రీజియన్ వ్యాప్తంగా 175 సర్వీసులు అనంతపురం న్యూసిటీ : ఆర్టీసీ బస్సుల్లో విజయవాడకు చేరాలంటే గగనమవుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు నడుపుతామని ప్రభుత్వం గొప్పలు చెప్తున్నా.. ఆచరణ లో కార్యరూపం దాల్చలేదు. అనంతపురం నుంచి విజయవాడకు నెల రోజులుగా రిజర్వేషన్ సౌకర్యం లేకుండానే బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికులు విజయవాడకు వెళ్లాలంటే బస్టాండ్‌లో సీటు వేసేందుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి. పుష్కరాల నేపథ్యంలో రిజర్వేషన్‌ను బ్లాక్ చేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదనే విజయవాడకు వెళ్లే బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం రద్దు చేశామని చెప్తున్నారు. అనంతపురం రీజియన్‌లో అనంతపురం, హిందూపురం, పుట్టపర్తి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి డిపోల నుంచి రోజూ 8 బస్సులు విజయవాడకు వెళ్తాయి. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు అమరావతి రాజధాని అయినప్పటి నుంచి విజయవాడకు రాకపోకలు పెరిగాయి. ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు దీన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నా..ఆర్టీసీ పెద్దగా పట్టించుకోలేదు. పేరుకు మాత్రం బస్‌భవన్ నిబంధనలు అని చెప్తున్నారు. దీంతో ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు. పుష్కరాల నేపథ్యంలో ఇప్పట్లో విజయవాడకు రిజర్వేషన్ సౌకర్యంతో బస్సులు నడిపే పరిస్థితి కనిపించలేదు. రిజర్వేషన్ లేకుండానే.. అనంతపురం ఆర్టీసీ రీజియన్ పుష్కరాలకు 175 ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులు తిప్పనుంది. రిజర్వేషన్ సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు బస్టాండ్‌లోకి బస్సులు వచ్చిన వెంటనే పరుగులు తీయాల్సి వస్తోంది. 11 నుంచి నడవనున్న బస్సులు ఈ నెల 12 నుంచి 23 వరకు పుష్కరాలు ఉండడంతో ఆర్టీసీ ఈ నెల 11 నుంచి బస్సులు తిప్పనుంది. విజయవాడతో పాటు శ్రీశైలం, కర్నూలు బీచ్‌పల్లికి బస్సులు నడుస్తాయి. విజయవాడ సిటీలోకి బస్సులు వెళ్లవు. గోరంట్ల మహా పుష్కరఘాట్ వరకు మాత్రమే వెళ్తాయి. అక్కడి నుంచి ఫ్రీ సిటీ సర్వీసులు ఉంటాయి. పోస్టర్ విడుదల పుష్కరాల నేపథ్యంలో ఆర్టీసీ కల్పిస్తున్న ప్రత్యేక బస్సులకు సంబంధించిన పోస్టర్లను డీఎం బాలచంద్రప్ప సోమవారం ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రత్యేక బస్సుల కోసం సంప్రదించాలన్నారు. రెగ్యులర్ బస్సులు తిరుగుతాయన్నారు. అసిస్టెంట్ మేనేజర్ గౌడ్, కంట్రోలర్లు శివలింగప్ప, పీసీకే స్వామి తదితరులు పాల్గొన్నారు. రద్దీకనుగుణంగా బస్సులు పుష్కరాలకు రద్దీకనుగుణంగా బస్సులు నడుపుతాం. రీజియన్ వ్యాప్తంగా సుమారు 175 బస్సులు నడపనున్నాం. ప్రయాణికుల అవసరాన్ని బట్టి వారు కోరితే మరిన్ని బస్సులు నడిపేందుకు అందుబాటులో ఉంచుతాం. – శశికుమార్, డిప్యూటీ సీటీఎం -
రోజూ 50వేల మందికి అన్నదానం
కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని సంగమేశ్వరం వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రతి రోజు కనీసం 50వేల మందికి అన్నదానం చేయడానికి అయా సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. సంగమేశ్వరంలో పుష్కర బాధ్యతలు నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ సీహెచ్ హరికిరణ్...అన్నదానం చేయడానికి వచ్చిన ఏడు సంస్థలకు అవసరమైన స్థలాలను కూడా చూపించారు. అన్నదాన కార్యక్రమాలు 12వ తేదీ నుంచి మొదలై పుష్కరాలు ముగిసే వరకు ఉంటాయి. వీరికి గ్యాస్, పాలు సరఫరా చేసేందుకు పౌరసరఫరాల సంస్థకు, విజయ పాల డెయిరీకి ఆదేశాలు ఇచ్చారు. అన్నదానానికి ముందుకు వచ్చిన సంస్థలు ఇవే... –సంగమేశ్వరం గ్రామానికి చెందిన శేషన్న, గ్రామస్తులు, కర్నూలుకు చెందిన గురుదత్త కపాలయం, ఉమామహేశ్వర నిత్య అన్నదాన సంస్థ, యాగంటిస్వామి రూరల్ డెవలప్మెంటు సొసైటీ (బనగానపల్లి), కర్నూలుకు చెందిన భారత్ వికాస్ పరిషత్, ఓర్వకల్లు మండల ఐక్య పొదుపు సంఘం, అహోబిలSబ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం. – ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కొలనుభారతిలో ప్రతిరోజు 6000 మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. -
భక్తుల చేత శభాష్ అనిపించుకుందాం
– మెరుగైన సౌకర్యాలు కల్పించండి – 24గంటలు కలెక్టర్, ఎస్పీలు అందుబాటులో.... – పుష్కర విధులు నిర్వహించడం మహాపుణ్యకార్యం – డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి శ్రీశైలం: భక్తుల చేత శభాష్ అనిపించుకునేలా శ్రీశైల మహాక్షేత్రంలో కృష్ణా పుష్కరాలను అధికారులు విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం రాత్రి శ్రీశైలం చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం పుష్కరఘాట్లను సందర్శించారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్, డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, ఈఓ భరత్‌గుప్త, జెఈఓ హరినాథ్‌రెడ్డి తదితరులతో కలిసి పాతాళగంగ ఘాట్లను పరిశీలించారు. అనంతరం చంద్రావతి కల్యాణ మండపంలో పుష్కర విధులపై వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుని పుష్కరాల ఆరంభానికి శుభసూచకంగా కృష్ణమ్మ సంకేతాన్ని పంపిందని అన్నారు. ప్రత్యేక విధులపై హాజరైన ప్రతి ఒక్కఅధికారి తమకు కేటాయించిన విధులను సక్రమంగా అమలు పరిచి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. గత కొన్ని వారాలుగా జిల్లా కలెక్టర్ పుష్కరాల విధుల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా పని చేయాలి, అనే విషయాలను విశదీకరించి ఉంటారని అన్నారు. అలాగే డీఐజీ, ఎస్పీలు భద్రతాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజెప్పి ఉంటారని ఈవిధి నిర్వహణలో ఉన్న వారంతా తప్పనిసరిగా ఆ నిబంధనలు పాటించి పుష్కరాలను విజయవంతం చేయాలన్నారు. ఆదివారం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలు శ్రీశైలాన్ని కేంద్ర కార్యాలయంగా చేసుకుని విధులు నిర్వహిస్తారని చెప్పారు. కృష్ణా జలాలు రావడంతో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఎస్‌ఆర్‌బీసీలకు నీటిని వదిలే అవకాశం కలిగిందని ఇది కూడా శుభపరిణామంగా పేర్కొన్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా నదీ పుష్కరాలలో ఈ ఏడాది శ్రీశైలం, సంగమేశ్వరంలలో విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బంది భక్తులకు తమ సేవలను అందించడం ద్వారా ఎంతో పుణ్యం చేసుకున్నారని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. -
పుష్కరాలకు తరలిన పోలీసులు
హిందూపురం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు జిల్లా వ్యాప్తంగా ఆదివారం అన్ని పోలీస్స్టేషన్ల నుంచి అధికారులు, సిబ్బంది పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. జిల్లావ్యాప్తంగా ఐదుగురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 51 మంది ఎస్ఐలు, 192 మంది ఏఎస్ఐలు, హెచ్‌సీలు, 552 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు, 17 మంది మహిళా హోంగార్డులను విజయవాడ, శ్రీశైలం తదితర ప్రాంతాలకు విధులకు పంపిస్తున్నారు. వీరందరు 17 రోజుల పాటు పుష్కరాల ఘాట్ల వద్ద బందోబస్తు నిర్వహిస్తారు. కాగా ఇందులో పెనుకొండ సబ్ డివిజన్‌కు సంబంధించి ఇద్దరు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 60 మంది ఏఎస్ఐలు, హెచ్‌సీలు, 160 మంది కానిస్టేబుళ్లు, 12 మంది మహిళా పోలీసులు, 64 మంది హోంగార్డులు విధులకు తరలివెళ్లారు. ప్రతి పోలీస్‌స్టేషన్ నుంచి పుష్కరాల విధులకు సిబ్బంది తరలివెళ్లడంతో స్టేషన్లన్నీ ఖాళీ అయ్యాయి. హిందూపురంలోని ప్రతి స్టేషన్లో ఇద్దరు హెచ్‌సీలు, ఇద్దరు పీసీలు, సీఐ మాత్రమే స్థానికంగా ఉన్నారు. అలాగే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఒక పోలీస్ తప్ప అందరూ పుష్కర విధులకు వెళ్లారు. హిందూపురం, పెనుకొండ స్టేషన్ల నుంచి పోలీస్ సిబ్బంది తరలివచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో తరలివెళ్లారు. -
పుష్కరాలకు అనంత పోలీసులు
అనంతపురం సెంట్రల్ : ఈ నెల 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు జిల్లా నుంచి ఏకంగా 2,200 మంది పోలీసులను బందోబస్తు నిమిత్తం తరలిస్తున్నారు. ఇప్పటికే కొందరు సిబ్బంది పుష్కర ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు. ఈ వారంలో తక్కిన వారు వెళ్లనున్నారు. వారిలో 10 మంది డీఎస్పీలు, 23 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలు, మిగిలిన వారు హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, ఇతర క్యాడర్లలోని సిబ్బంది ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పొరపాట్లకు ఆస్కారం లేకుండా బందోబస్తు కట్టుదిట్టం చేస్తున్నట్లు సమాచారం. సీనియర్లలో ఆందోళన : కృష్ణా పుష్కరాలకు దాదాపు 15 రోజులు బందోబస్తు వేస్తుండడంతో కొంతమంది పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రెండేళ్లు పదవీకాలం పొడిగింపుతో పని చేస్తున్న తమకు మినహాయింపు ఇవ్వాలని సీనియర్ కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు కోరారు. ఎక్కువ శాతం మంది అనారోగ్యాలతో బాధపడుతున్నామని వాపోతున్నారు. -
చంద్రబాబు ఎప్పుడు దిగిపోతారో?
విజయవాడ : ప్రజల్లో స్పందన చూస్తే చంద్రబాబు ఎప్పుడు వెళ్లిపోతారా? ఆయన ముఖ్యమంత్రి పదవినుంచి ఎప్పుడు దిగిపోతారా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని జిల్లా పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్కాంగ్రెస్పార్టీ చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమం పార్టీ విజయానికి పెద్ద ఎత్తున దోహద పడుతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్‌కు తొలిమెట్టు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన చెప్పిన మాటలేవీ కాపాడుకోలేకపోయారని, రైతులు, డ్వాక్రాసంఘాల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పక్కా గృహాలు ఇలా ఏ ఒక్క హామీ అమలు జరగలేదన్నారు. దివంతగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలకు అతీతంగా ఇళ్లు, పెన్షన్, రాజీవ్ ఆరోగ్యశ్రీవంటి ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పకుండానే చేశారన్నారు. ఆ విధంగానే చంద్రబాబు చేస్తారని ఆలోచన చేసి ఓట్లు వేసిన వాళ్లంతా ఇవాళ చింతిస్తున్నారన్నారు. గృహనిర్మాణం తీసుకుంటే ఎక్కడా కూడా ఇక్క ఇళ్లు నిర్మించలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 3 సెంట్ల స్థలం, 1.50 లక్షలతో ఇళ్లు నిర్మిస్తామని చెప్పారని గుర్తు చేశారు. రెండున్నరేళ్ల పాలనపూర్తయిందని, మిగిలిన రెండున్నరేళ్లలో ఆయన ఇచ్చిన హామీలు పూర్తిచేస్తారన్న నమ్మకం ప్రజల్లో లేదన్నారు. చంద్రబాబు మాత్రం తాను మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి అన్నీ చేసేశానని ప్రకటించుకుంటున్నారన్నారు. తాము చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్న ఆలోచన ప్రజల్లో ఉందన్నారు. 100 ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి చంద్రబాబుపై పాజిటివ్‌గా ఎవరూ జవాబు ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబుకు తెలిసే అవినీతి జరుగుతోంది... కృష్ణా పుష్కరాల్లో ఘాట్లనిర్మాణానికి రూ. 1200 కోట్లు ఖర్చుచేస్తున్నారని, పనుల్లో అవినీతి జరుగుతోందని, నాణ్యతా లోపం ఉందన్న విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత ఆగస్టు నుంచే పుష్కరాల పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కాలయాపన చేసి మేనెలలో పనులు ప్రారంభించారని ఆయన ఆరోపించారు. టెండర్లు పిలిచేందుకు సమయం లేదన్న సాకుచూపి నామినేషన్ పద్ధతిలో కోట్ల రూపాయలు టీడీపీ కార్యకర్తలు, నాయకులకు అప్పగిస్తున్నారన్నారు. రూ.1200 కోట్లలో వంద, రెండొందల ఖర్చు చేసి మిగిలిన మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు జేబుల్లో నింపుతున్నారన్నారు. పనుల్లో నాణ్యతాలోపం, సక్రమంగా జరగడం లేదని చెప్పడం ప్రజల్ని మోసగించేందుకేనన్నారు. నాణ్యతా లోపం ఉంటే ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మంత్రిని తొలగించారా? లేక సంబంధిత అధికారిని సస్పైండ్ చేశారా? అని చంద్రబాబును నిలదీశారు. కృష్ణా పుష్కరాల పేరుతో నదీపరివాహక ప్రాంతంలోని దేవాలయాలను కూల్చివేస్తున్నారన్నాని, పురాతన దేవాలయాలు, పేదల ఇళ్లు కూల్చడం తప్పని చంద్రబాబు ఆలోచించడం లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి, నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, జిల్లా పరిషత్ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ బండి పుణ్యశీల, తూర్పు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తలు బొప్పన భవకుమార్, ఆసిఫ్, నగర అధికార ప్రతినిధి జానారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కృష్ణ పుష్కరాల్లో పకడ్బందీగా విధులు నిర్వహించాలి
–మూడు షిప్ట్‌ల్లో విధులు –సమర్థుల పేర్లు ఈ నెల 21లోగా ఇవ్వాలి –అన్ని శాఖలకు కలెక్టర్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణ పుష్కరాల్లో 24 గంటలు విధులు నిర్వహించే విధంగా అన్ని శాఖల అధికారులు సమర్థులును గుర్తించి ఈ నెల 21లోగా నిర్ణీత పార్మట్‌లో వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ..శ్రీశైలం, సంగమేశ్వరంలలో మూడు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని మొదటి షిప్ట్ ఉదయం 7 మద్యాహ్నం 2 గంటల వరకు, రెండవ షిప్ట్ మద్యాహ్నం 2 నుంచి రాత్రి9 గంటల వరకు, మూడవ షిప్ట్ రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటలవరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఆగస్టు 8 నుంచి 24 వరకు పుష్కరాల విధులు నిర్వహించాలని తెలిపారు. పుష్కరాల్లో ప్రకతి విపత్తులకు అవకాశం ఉంటుందని వాటిని ఎదుర్కోగల సామర్థ్యం కలిగిన వారిని గుర్తించాలన్నారు. 21 వ తేదీలోగా అర్హులయిన వారి పేర్లు ఇస్తే వారికి తగిన శిక్షణ కూడ ఇస్తామని వివరించారు. పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మరంగా నిర్వహించతలపెట్టిందని అందువల్ల ప్రతి ఒక్కరు జవాబుదారి తనంతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. పుష్కర విధులు నిర్వహించే వారికి విధులు నిర్వహించే చోటనే వసతి, బోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. విధులను అంకితభావంతో నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ ఆకె రవికష్ణ, జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాల సమయంలో దేవుళ్ల విగ్రహాల కూల్చివేతా
అభివృద్ధి పేరుతో జరుగుతున్న దేవాలయాల విధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథి తెలిపారు. పుష్కరాల సమయం ఎప్పుడో చాలా ముందుగానే నిర్ణయం అవుతుందని, ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా.. అప్పటినుంచి పట్టించుకోకుండా ఇప్పటికిప్పుడు.. హిందువులు పరమ పవిత్రంగా భావించే పుష్కరాలు వస్తున్న సమయంలో హిందూ ఆలయాలను ఇష్టారాజ్యంగా కూల్చివేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. రోడ్ల విస్తరణ కోసం ఇష్టారాజ్యంగా గుళ్లు, మసీదులు పగలగొట్టేస్తామంటుంటే.. అసలు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో అర్థం కావట్లేదని చెప్పారు. దేవాలయాలను ధ్వంసం చేసిన దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని, ఈ విషయంలో ఏ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని తెలిపారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న కూల్చివేతలను వైఎస్ఆర్సీపీ ఖండిస్తోందని ఆయన అన్నారు. -
గడువులోగా పనులు పూర్తిచేయకపోతే చర్యలు
విజయవాడ: కృష్ణా పుష్కరాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కృష్ణా పుష్కరాల పనులపై శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు పూర్తి చేయడానికి ఇంకా నెల రోజులే గడువుందని, ఈలోగా పూర్తిచేయకపోతే అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రోడ్డుకు ఒకవైపు బారికేడ్లు నిర్మించి, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని చెప్పారు. నాణ్యత దెబ్బతినకుండా రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు.