రోజూ 50వేల మందికి అన్నదానం
Published Mon, Aug 8 2016 7:30 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని సంగమేశ్వరం వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రతి రోజు కనీసం 50వేల మందికి అన్నదానం చేయడానికి అయా సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. సంగమేశ్వరంలో పుష్కర బాధ్యతలు నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ సీహెచ్ హరికిరణ్...అన్నదానం చేయడానికి వచ్చిన ఏడు సంస్థలకు అవసరమైన స్థలాలను కూడా చూపించారు. అన్నదాన కార్యక్రమాలు 12వ తేదీ నుంచి మొదలై పుష్కరాలు ముగిసే వరకు ఉంటాయి. వీరికి గ్యాస్, పాలు సరఫరా చేసేందుకు పౌరసరఫరాల సంస్థకు, విజయ పాల డెయిరీకి ఆదేశాలు ఇచ్చారు.
అన్నదానానికి ముందుకు వచ్చిన సంస్థలు ఇవే...
–సంగమేశ్వరం గ్రామానికి చెందిన శేషన్న, గ్రామస్తులు, కర్నూలుకు చెందిన గురుదత్త కపాలయం, ఉమామహేశ్వర నిత్య అన్నదాన సంస్థ, యాగంటిస్వామి రూరల్ డెవలప్‌మెంటు సొసైటీ (బనగానపల్లి), కర్నూలుకు చెందిన భారత్ వికాస్ పరిషత్, ఓర్వకల్లు మండల ఐక్య పొదుపు సంఘం, అహోబిలSబ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం.
– ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కొలనుభారతిలో ప్రతిరోజు 6000 మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు.
Advertisement