
తేలిన సంగమేశ్వర ఆలయ గోపురం
దోమలపెంట (అచ్చంపేట): శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో సంగమేశ్వర ఆలయ శిఖరం (గోపురం) తేలింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న సంగమేశ్వరాలయం కృష్ణానదిలో నాలుగు నెలల కిందట మునిగిపోయింది.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 862.8 అడుగులకు చేరుకోవడంతో ఆలయ గోపురం పూర్తిగా తేలింది. దీంతో ఆలయ పూజారి రఘురామశర్మ బోటులో వెళ్లి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శిఖరంపై జెండాను ఎగురవేశారు. జలాశయంలో మరో 24 అడుగుల నీటిమట్టం తగ్గితే సంగమేశ్వర ఆలయం పూర్తిగా బయటపడుతుంది. అందుకోసం ఫిబ్రవరి రెండో వారం వరకు వేచి చూడాలి.