gopuram
-
ఈ వాస్తు చిత్రలేఖనం.. ఇప్పుడొక ట్రెండ్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రాచీన ఆలయాలు, గోపురాలు, గృహాలు వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించారని భారతీయ వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు అంటే బలం, విశ్వాసం! అందుకే ఇల్లు కొంటున్నామంటే చాలు వాస్తు చూడనిదే నిర్ణయం తీసుకోరు. ఈ వాస్తుకు శిల్ప శా్రస్తాన్ని, చిత్రలేఖనాన్ని జోడించిన వాస్తు చిత్రలేఖనానికి కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. గృహాలు, కార్యాలయాలు, హోటళ్లు వంటి అన్ని రకాల భవన నిర్మాణాల్లో వాస్తు పెయింటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.చూపరులను ఆకట్టుకునే ఈ వాస్తు చిత్రలేఖనం ఇప్పుడొక ట్రెండ్! దేవాలయానికి, శిల్పకళకు అవినాభావ సంబంధం ఉంది. విశ్వఖ్యాతిగాంచిన భారతీయ శిల్ప కళకు రెండువేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్షా్వకులు మొదలుకొని విజయనగర చక్రవర్తుల వరకూ వేర్వేరు కాలాల్లో శిల్ప–చిత్రకళాభివృద్ధికి దోహదం చేశారు. వాస్తు, శిల్పశాస్త్రం, చిత్రలేఖనం మూడు వేర్వేరు కళలను మిళితం చేసి.. నేటి తరానికి, అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి వచి్చందే వాస్తు పెయింటింగ్.బ్రహ్మ ముహూర్తంలోనే.. ఒక కుటుంబంలోని అందరి వ్యక్తుల జాతకం, నక్షత్రం ప్రకారం ఆ ఇంటిలో ఎవరి నక్షత్రం బలంగా ఉంటుందో వారు పూజించాల్సిన దేవుడిని నిర్ణయిస్తారు. ఆ ఇంటి వాస్తు, నక్షత్రం తిథి ప్రకారం బ్రహ్మ ముహూర్తం నిర్ణయిస్తారు. దేవుడిని స్మరిస్తూ, ధాన్యంతో వస్త్రం మీద ఈ పెయింటింగ్‌ను వేస్తారు. ఈ చిత్రలేఖనం జరిగినన్ని రోజులు ఆ నక్షత్రానికి బలం చేకూర్చేందుకు జరగాల్సిన అన్ని రకాల హోమాలు, యోగాలు, క్రతువులు ఆగమ శాస్త్రం ప్రకారం చిత్రకారుడే పూర్తి చేస్తాడు. నరఘోష నివారణకూ పెయింటింగ్ వేస్తుంటారు.ఎన్ని రోజులు పడుతుందంటే.. ఒక పెయింటింగ్ పూర్తవడానికి నక్షత్రాన్ని బట్టి 41 నుంచి 108 రోజుల సమయం పడుతుంది. వీటి ధర నక్షత్రాన్ని బట్టి రూ.10 వేల నుంచి ప్రారంభమవుతుంది. యాక్రాలిక్, మిక్స్డ్ కలర్లను వినియోగిస్తారు. నక్షత్ర బలాన్ని బట్టి వీటిని పూజ గదిలో, హాల్లో ఇంటిలోపల పెట్టే చోటును నిర్ణయిస్తారు.ఇళ్లు, ఆఫీసుల్లో.. రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీల గృహాలు, విల్లాలు, ఫామ్ హౌస్‌లలో ఈ వాస్తు పెయింటింగ్‌లను వేయిస్తున్నారు. ఆఫీసులు, హోటళ్ల, కార్పొరేట్ కార్యాలయాల్లో కూడా చూపరులను ఆకట్టుకునే ఈ చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. దక్షిణామూర్తి, అభయ హనుమాన్, యంత్రోద్ధారక హనుమాన్, నందీశ్వర, కలియుగ వేంకటేశ్వర్లు, ఇష్టకామేశ్వరి దేవి, ఆగమనం (పుణ్యపురుషులు), నరదృష్టి నారాయణ యంత్రం, తాండవ గణపతి, నయన దర్శనం, శృంగార దేవి, కొలువు శ్రీనివాసమూర్తి, నర్తకి, అభయ సూర్యనారాయణమూర్తి వంటి దేవుళ్ల పెయింటింగ్స్ వేస్తుంటారు.వాస్తు పెయింటింగ్‌తో మనశ్శాంతి వాస్తు పెయింటింగ్ ఉన్న ఇళ్లలో సానుకూల భావాలను కలిగిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వివేకం కలుగుతుంది. – కంభంపాటి, ప్రముఖ వాస్తు చిత్రకారుడుఇవి చదవండి: వయనాడ్ విలయం : ఆమె సీత కాదు...సివంగి -
ఊడిపోయిన యాదాద్రి గోపుర కలశం.. ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన సమయంలో దక్షిణ రాజగోపురంపై ప్రతిష్టించిన బంగారు కలశాల్లో ఒకటి ఊడిపోయి కింద పడిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై స్థానిక భక్తులు, పలువురు అధికారులు తెలిపిన వివరాలివి. యాదాద్రి ఆలయ దక్షిణ రాజగోపురంపై బిగించిన బంగారు కలశాల్లో ఒకటి మంగళవారం సాయంత్రం సమయంలో కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన ఆలయాధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. దక్షిణ రాజగోపురంపై బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం శిల్పులు తిరిగి బిగించారు. దీనిపై ఆలయ డీఈవో దోర్భల భాస్కర్‌శర్మను ప్రస్తావించగా.. గోపురంపై కలశాలు బిగించేటప్పుడు కింద పడకుండా చెక్కలను ఏర్పాటు చేశారని తెలిపారు. అవి వదులైపోవడంతో పాటు కోతులు వాటిపైకి ఎక్కి ఆడటంతో ఊడిపోయాయని పేర్కొన్నారు. వెంటనే గోపురం వద్ద పూజలు జరిపించి, శిల్పులతో బిగించామని వెల్లడించారు. -
తేలిన సంగమేశ్వర గోపురం
దోమలపెంట (అచ్చంపేట): శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో సంగమేశ్వర ఆలయ శిఖరం (గోపురం) తేలింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న సంగమేశ్వరాలయం కృష్ణానదిలో నాలుగు నెలల కిందట మునిగిపోయింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 862.8 అడుగులకు చేరుకోవడంతో ఆలయ గోపురం పూర్తిగా తేలింది. దీంతో ఆలయ పూజారి రఘురామశర్మ బోటులో వెళ్లి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శిఖరంపై జెండాను ఎగురవేశారు. జలాశయంలో మరో 24 అడుగుల నీటిమట్టం తగ్గితే సంగమేశ్వర ఆలయం పూర్తిగా బయటపడుతుంది. అందుకోసం ఫిబ్రవరి రెండో వారం వరకు వేచి చూడాలి. -
Tirumala: ఆనంద నిలయ విమాన విశిష్టత
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువుండే నెలవు ఆనంద నిలయం. తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలసి ఉన్న ప్రదేశమే ఆనంద నిలయం. గర్భాలయమైన ఆనంద నిలయంపై నిర్మించిన బంగారు శిఖరమే ఆనంద నిలయ విమానంగా పేరుపొందింది. ఈ విమాన నిర్మాణానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీవారి బంగారు గోపురం మూడంతస్తులుగా ఉంటుంది. మొదటి రెండు అంతస్తులు దీర్ఘచతురస్రాకారంలోను, మూడోది వర్తులాకారంలోను ఉంటాయి. ఏకశిలపై నిర్మితమైన ఆనంద నిలయ గోపురం ఎత్తు ముప్పయ్యేడు అడుగుల ఎనిమిది అంగుళాలు. గోపురం కింద ఉండే ప్రాకారం ఎత్తు ఇరవయ్యేడు అడుగుల నాలుగు అంగుళాలు. నేలపై నుంచి బంగారు కలశం వరకు ఆనంద నిలయ విమానం ఎత్తు అరవై ఐదు అడుగుల రెండంగుళాలు. మొదటి అంతస్తు పదిన్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ భాగంలో ఎలాంటి బొమ్మలూ ఉండవు. ఇందులో లతలు, మకర తోరణాలు, చిన్న శిఖరాలు మాత్రమే ఉంటాయి. రెండో అంతస్తు ఎత్తు పదడుగుల తొమ్మిది అంగుళాలు. ఇందులో నలభై బొమ్మలు ఉంటాయి. మకర తోరణంతో పాటు వరాహస్వామి, నరసింహస్వామి, వైకుంఠనాథుడు తదితర విష్ణు రూపాలు, జయవిజయులు, గరుడ, విష్వక్సేన, అనంత, ఆంజనేయ, మహర్షుల రూపాలు కూడా ఉంటాయి. ఇందులో ఉత్తరంవైపు శ్రీవేంకటేశ్వరుడు విమాన వేంకటేశ్వరుడిగా కొలువుదీరి ఉంటాడు. గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకుంటే కలిగే పుణ్యఫలం విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా లభిస్తుందని భక్తుల విశ్వాసం. (క్లిక్ చేయండి: అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!) గోపురం చివర వర్తులాకారంలో ఉండే అంతస్తు పదహారడుగుల మూడంగుళాల ఎత్తులో ఉంటుంది. ఇందులో మహాపద్మంతో పాటు ఇరవై బొమ్మలు ఉంటాయి. నాలుగు దిక్కుల్లోను, నాలుగు మూలల్లోను ఎనిమిది సింహాలు ఉంటాయి. గోపుర కలశానికి ఆనుకుని ఉండే మహాపద్మంలో చిలుకలు, లతలు, హంసలు వంటి చిత్రాలు కనువిందు చేస్తాయి. శ్రీవారి గర్భగుడి నుంచి మలయప్పస్వామి ఊరేగింపుగా వెళ్లేటప్పుడు విమాన ప్రదక్షిణ చేస్తూ బయటకు వెళతారు. అంతేకాదు, స్వామివారికి సమర్పించే ఏ పూజాద్రవ్యమైనా, తోమాలసేవలో సమర్పించే పుష్పాలనైనా, అభిషేకానికి సమర్పించే ఆకాశగంగ తీర్థాన్నైనా విమాన ప్రదక్షిణం పూర్తి చేసిన తర్వాతే గర్భాలయంలోకి తీసుకువెళతారు. (క్లిక్ చేయండి: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...) -
బయటపడిన సంగమేశ్వర ఆలయ గోపురం
సాక్షి, నందికొట్కూరు: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర ఆలయ గోపురం ఆదివారం కృష్ణమ్మ ఒడి నుంచి బయటపడింది. సంగమేశ్వర ఆలయం 2019 జూలై రెండో వారంలో కృష్ణమ్మ ఒడిలోకి వెళ్లింది. శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ ఆదివారం 866 అడుగులకు చేరడంతో ఆలయ శిఖరం బయటపడింది. సంగమేశ్వరుడు పూర్తిగా బయటపడాలంటే బ్యాక్ వాటర్ 837 అడుగులకు రావాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు 29 రోజులు పడుతుందని ఆలయ పురోహితుడు తెల్లకపల్లి రఘురామశర్మ చెప్పారు. (హంస వాహనాధీశా.. హరోం హర) -
గోపురం భగవంతుని పాద నూపురం!
ఆలయం అంటేనే సకలదేవతలు అక్కడ కొలువుంటారని భక్తుల నమ్మకం. ఆలయంలోని ప్రతి భాగంలోనూ అనేక విశేషాలు ఉన్నాయి. వాటి అధిదేవతలు కొందరు ఉన్నారు. ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికి వీటిపై కనీస అవగాహన అవసరం. ఆలయాన్ని, ఆలయ భాగాలనూ సాకల్యంగా తెలుసుకోవడం వలన మనకు మరింత ఆధ్యాత్మికత అలవడి భగవదనుగ్రహాన్ని పొందగలుగుతాం.ఉదాహరణకు గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, వాహన మండపం, రంగమండపం, పరివారదేవతలు, కోష్ఠదేవతలు, శిఖరం, విమానం ఇలా అనేక భాగాలున్నాయి. వీటి గురించి ప్రతి భక్తుడూ తెలుసుకోవాలన్న సత్సంకల్పంతో ఇకపై సాక్షి వారం వారం ఆలయంలోని అనేక భాగాలను గురించిన సమగ్ర సమాచారాన్ని అందించనుంది. వాటిలో ముందుగా ఆలయ గోపురం గురించి తెలుసుకుందాం. ఆలయం లేని ఊరిలో క్షణం కూడా ఉండరాదంటున్నాయి మన ఆగమాలు. భగవంతుడు సదా నివాసముండే చోటే ఆలయం. అనంత విశ్వమంతా నిండిన భగవంతుని ఉనికిని ఒకచోట చేర్చి, ఆలయం నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించి, సదా అందులో సాన్నిధ్యం కల్పించి భక్తుల్ని బ్రోవమని కోరుతారు అర్చకులు. ఈ సమాజంలో మనిషిని సన్మార్గంలో నిలిపేవి రెండు ఒకటి గుడి, రెండు బడి. నిజానికి పూర్వం బడులు కూడా గుడిలోనే ఉండేవి. ఆలయం కేవలం అర్చనాదులకే పరిమితం కాలేదు. విద్యను నేర్పే పాఠశాలగా, ఆకలి తీర్చే అన్నశాలగా, సంస్కృతిని నిలిపే కళాకేంద్రంగా, ప్రజలసమస్యలను తీర్చే న్యాయస్థానంగా, వసతిని కల్పించే వాసస్థానంగా, ప్రకృతి ఒడిదుడుకులు సమయంలో రక్షణాకేంద్రంగా, సకల వృత్తులవారికీ పని కల్పించే ఉద్యోగ కేంద్రంగా నిలిచింది. ఇలా ఆలయం మానవుని జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. కాలిగోపురమే గాలి గోపురంగా ఆలయంలోని అణువణువునా భగవంతుని ఉనికిని గుర్తించాలి. అయితే, ఆలయం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది గోపురం. చాలా ఎత్తుగా, అనేక అంతస్తులతో, అనేక శిల్పాలతో, చూడగానే భక్తుడికి ఒక పవిత్ర భావాన్ని కల్పించి, మరికాసేపట్లో దేవుడిని దర్శనం చేసుకుంటామనే ఆనందాన్ని కలిగిస్తుంది గోపురం. గోపురాన్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి.ఆలయానికి తొలివాకిలి గోపురం. దీనికే ద్వారశాల అనే పేరు కూడా ఉంది. ద్వారం పైన నిర్మించే నిర్మాణం కనుక ఇది ద్వారశాల. మరికొందరు గాలిగోపురం అని చెబుతుంటారు. గోపురం లోపలికి రాగానే వాతావరణం ఎంత వేడిగా ఉన్నా చల్లటిగాలి వీస్తుంది. బహుశా అందువలన అందరూ ఇలా అంటారని భావించవచ్చు. కానీ నిజానికి ఆలయంలోని ప్రతిభాగం భగవంతుని శరీరభాగంగా కీర్తిస్తున్నాయి ఆగమాలు. అలా గోపురం భగవంతుని పాదాలుగా కీర్తించబడుతున్నాయి. కాలిగోపురం కాలక్రమేణా గాలిగోపురం అయిపోయింది. మనం ప్రయాణాలలో ఉన్నప్పుడు దూరంగా ఆలయం ఉనికిని తెలిపేది ఆలయగోపురమే. అలా గోపురం కనిపించిన వెంటనే చాలా మంది నమస్కారం చేస్తారు. ఆ నమస్కారం భగవంతునికి తప్పక చేరుతుందని పెద్దలు చెబుతారు. ఎందుకంటే, గోపురానికి నమస్కరిస్తే భగవంతుని పాదాలకు నమస్కరించినట్లే.గోపురం ఒక నిర్మాణం మాత్రమే కాదు. అది పౌరాణిక విజ్ఞానాన్ని తెలిపే పాఠశాల. గోపురంపై అనేక పురాణ ఘట్టాలు శిల్పాలుగా నయనానందకరంగా చెక్కబడి ఉంటాయి. గోపురాలకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి అతి పెద్ద గోపురాలను నిర్మించింది మాత్రం పాండ్యురాజులే. మధురైలోని మీనాక్షీ ఆలయ గోపురాలే అందుకు నిదర్శనం.హంపీ విరూపాక్ష దేవాలయంలో గోపురానికి సంబంధించిన ఒక విశేషం ఉంది. ఆలయంలోని ఒకచోట తూర్పు రాజగోపురం నీడ తల్లకిందులుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో గల నరసింహ స్వామి ఆలయ గాలిగోపురం కూడా ఎత్తయిన గాలిగోపురాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది. కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య, ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
కనవయ్యా.. మహానందీశా!
- ఒరిగిపోయిన గర్భాలయ గోపుర కలశం - అపచారం జరగకముందే అధికారులు మేల్కోవాలి మహానంది: ‘‘గోపుర కలశాన్ని దర్శించుకుంటే కోటిరెట్ల పుణ్యం లభిస్తుందని భావిస్తారు. ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోలేని వారు గోపుర కలశాన్ని దర్శించుకుంటే చాలని చెబుతారు. అంతటి ప్రాధాన్యం ఉన్న గర్భాలయ గోపుర కలశం పరిరక్షణపై మహానంది పుణ్యక్షేత్రంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. స్వామివారి గర్భాలయ గోపురానికి ఎంతో విశిష్టత ఉంది. చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు కళింగ ఆర్కిటెక్చర్ నిర్మాణశైలిని పోలి ఉన్నట్లు చరిత్రకారులు, పురావస్తుశాఖవారు చెబుతున్నారు. అలాంటి గోపురం పైభాగంలోని కలశం ఓ వైపునకు ఒరిగి పడిపోయేందుకు సిద్ధంగా ఉంది. అపచారం జరగకముందే కొత్త కలశాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆలయ యాజమాన్యం పాతదానికే కడ్డీలు కట్టి మరీ బిగించి ఉంచడం గమనార్హం. ఇటీవలే మహానంది దేవస్థానానికి వచ్చిన కమిషనర్ అనురాధ, అధికారులు త్వరలో కలశ ప్రతిష్టాపన ఉంటుందని ప్రకటించినా ముహూర్తం నిర్ణయించకపోవడం గమనార్హం. నూతన కలశం సిద్ధంగా ఉంది : రవిశంకర అవధాని, వేదపండితులు ప్రస్తుతం ఉన్న కలశం స్థానంలో నూతనంగా ప్రతిష్టించేందుకు కొత్త కలశాన్ని తీసుకువచ్చాం. కంచికామకోటి పీఠాధిపతి చేత ప్రతిష్టకు చర్యలు తీసుకుంటున్నాం. మాఘ మాసం లేదా శివరాత్రి పర్వదినాల్లో కార్యక్రమం పూర్తి చేస్తాం.