annadanam
-
ఇలాంటి అన్నదానం చూసుండరు..
-
రామ్‌చరణ్ బర్త్‌డే.. 500 మందికి సురేఖ అన్నదానం (ఫోటోలు)
-
భగవంతుడుకి పూజలు, వ్రతాలు కంటే అదే అత్యంత ముఖ్యం!
బ్రహ్మచారులు, సాధువుల కన్నా సంసార జీవితాన్ని గడిపే వారికే కొన్ని దాన ధర్మాలు నిర్వర్తించే అవకాశ ముంది. వాళ్లను సాయం అడిగే వారుంటారు. అలాంటి వారికి సాయం చేసి పుణ్యం గడించే వీలు వీరికే ఎక్కువ. సంసారి తన దగ్గర ఉన్నవాటిని ఎవరెవరికి ఏది అవసరమో వాటిని నిండు మనసుతో ఇవ్వాలి. ఏ మేరకు ఇవ్వగలరో ఆ మేరకు ఇస్తే చాలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వాటిలో ముఖ్యమైనది. కడుపునిండా అన్నం పెట్టిన మనిషి ముఖాన్ని చూడండి. అతని ముఖంలో ఓ తృప్తీ, ఓ ఆనందం కనిపిస్తాయి. కానీ మిగిలిన దానాల విషయంలో ఈ తృప్తి అంతగా కనిపించదు. ఎవరైనా తినడానికి వస్తున్నారేమోనని చూసిన తర్వాత తినాలనేది భారతీయ సంప్రదాయం. తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పెట్టక తానే తినడం, ఇతరు లకు తెలీకుండా దాచిపెట్టి తినడాన్ని పాపమనే భావనా ఉంది. అందుకే అంటారు, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా దానం చేయడం ముఖ్యం. అందులోనూ ‘అన్నదానా’న్ని మించింది మరొకటి లేదు. ఓ ధనవంతుడు ఎన్నో పూజలు చేసి, భగవంతుడిని ఆరాధించి ఇక తానెవరికీ ఏదీ చెయ్యవలసిన అవసరం లేదని నిర్ణయించుకుని తన దగ్గరున్నది ఎవరికీ ఇవ్వక, ఎవరికీ పిడికెడు అన్నం కూడా పెట్టక ‘తానూ, తన కుటుంబం’ అనుకొని బతికాడు. తీరా ఆయన మరణిం చాక రాక్షసుడిగా మారి నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే శవాలను పీక్కుతింటూ తన తప్పు తాను తెలుసుకుని తనను క్షమించమని దేవుడిని వేడుకున్నాడు. దీంతో రాక్షస రూపం పోయి సద్గతి పొందినట్లు ఓ కథ ఉంది. ఇటువంటి కథల నుంచి గ్రహించాల్సిన నీతి ఒక్కటే: తాను తినడమే కాదు ఇతరులకూ పెట్టాలి. – యామిజాల జగదీశ్ (చదవండి: గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?) -
గుళ్లలో అరిటాకులు లేదా విస్తళ్లలోనే అన్నదానం
సాక్షి, అమరావతి: ఆలయాల్లో నిర్వహించే అన్నదానంలో భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే వడ్డించాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్రంలోని ఆలయాల ఈవోలకు దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని దేవదాయశాఖ పరిధిలోని అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలోని పది ప్రధాన ఆలయాల్లోనే కేవలం మధ్యాహ్నం వేళ 2,24,727 మంది భక్తులకు అన్నదానం జరిగింది. కొన్ని ఆలయాల్లో స్టీల్‌ప్లేట్లలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. ఆలయాల్లో అన్నదానం పేరుతో అందజేసే ఆహారానికి మరింత పవిత్రతను కల్పించేందుకు భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే భోజనం వడ్డించాలని నిర్ణయించినట్టు దేవదాయశాఖ కమిషనర్ ఈవోలకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒకవేళ స్టీల్ప్లేట్లోనే వడ్డించాల్సి వస్తే.. ప్లేట్లో ఆకువేసి వడ్డించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇటీవల ప్రధాన ఆలయాల ఈవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోను సూచించిన విషయాన్ని కమిషనర్ తన ఆదేశాల్లో ఉదహరించారు. -
యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి భారీగా విరాళం
యశవంతపుర(కర్ణాటక): కట్టుకున్న భర్త, కన్న కొడుకులు కాలం చేశారు. కడుపు నింపుకోవడానికి భిక్షాటనపై ఆధారపడింది. గుడులు, కూడళ్లలో భిక్షగా వచ్చిన నగదు కూడబెట్టింది. మంగళూరులోని ముల్కి దుర్గా పరమేశ్వరి ఆలయంలో అన్నదానానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చింది. తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆమె మరెవరో కాదు కర్ణాటక రాష్ట్రం ఉడుపికి చెందిన వృద్ధురాలు అశ్వర్థమ్మ (80). ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాచన ద్వారా రోజు వచ్చే డబ్బులను పిగ్మీ పొదుపు ఖాతాలో కడతానని, లక్ష రూపాయలు కాగానే ఏదో ఒక ఆలయానికి ఇస్తానని చెప్పింది. కరోనా సమయంలో అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి రూ.1.5 లక్షలు అందజేశానని తెలిపింది. ( లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ..) -
అనుకుంది.. సాధించింది
తమిళనాడు రాష్ట్రం, మామల్లపురం గ్రామంలో శుక్రవారం నాడు సామాజికహితమైన ఓ అద్భుతం ఆవిష్కారమైంది. ఆ ఊరి ఆలయంలో భోజన కార్యక్రమంలో ఆ రాష్ట్ర హెచ్ఆర్ అండ్ సీఈ (హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్) మంత్రి పీకే శేఖర్‌బాబు అత్యంత సామాన్యమైన మహిళ అశ్వినితో కలిసి భోజనం చేశారు. ఆమెతో కలిసి భోజనం చేయడానికి మంత్రి ఆ ఊరు వచ్చాడు. ఆ భోజన కార్యక్రమంలో అశ్విని ఒడిలో ఆమె కొడుకు కూడా ఉన్నాడు. ఈ అద్భుతమైన సంఘటనకు దారి తీసిన మరో విషాద సంఘటన కూడా ఇదే నెలలో ఓ రోజు జరిగింది. ఆ రోజు ఏం జరిగిందంటే... ‘‘మధ్యాహ్నమైంది. ఆలయంలో అన్నదాన కార్యక్రమం మొదలైంది. మేము క్యూలో నిలబడి ఉన్నాం. టేబుల్ మీద అరిటాకులు పరిచారు. మా వంతు వచ్చే లోపు కుర్చీలు నిండిపోయాయి. ఒక పంక్తి పూర్తయిన తర్వాత రెండో విడత ఆకులు పరిచారు. ఆ పంక్తిలో మేము కూర్చున్నాం. అప్పుడు ఆలయానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని లేవమని చెప్పాడు. ‘అందరి భోజనాలు పూర్తయిన తర్వాత మిగిలిన అన్నాన్ని ఆలయం వెలుపల ఇస్తాం, బయట నిలబడండి’ అని చెప్పాడు’’ అని నాటి సంగతులను గుర్తు చేసుకుంది అశ్విని. మీ ఇంటి పెళ్లి కాదు! ‘‘ఇది కనుక మీ ఇంట్లో పెళ్లి అయితే... మీ అందరి భోజనాలు పూర్తయిన తర్వాత మిగిలినవి ఇస్తారు. అప్పటి వరకు మేము దూరంగా నిలబడి ఎదురు చూస్తుంటాం. కానీ ఇది ప్రభుత్వం పేదవాళ్ల కోసం రూపొందించిన పథకం. మాకు స్థానం కల్పించడానికి అయిష్టత చూపిస్తున్న మీరంతా చదువుకున్న వాళ్లు. మేము చదువుకోని వాళ్లం. ఈ రోజు మేము నిరక్షరాస్యులమే. నా కొడుకును బాగా చదివిస్తాను. ఈ దారుణం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చూస్తాను’’ అన్నదామె ఆవేదనతో కూడిన ఆవేశంతో. ఆమె అలా మాట్లాడినప్పుడు ఆమె సామాజిక వర్గం మొత్తం ఆమె వెనుక ఉంది. ఆమె ధర్మాగ్రహానికి సమాజ ఆమోదం లభించింది. పలువురిని ఆలోచనలో పడేసింది. మరికొందరు ఆమెను బలపరిచారు. నిశ్శబ్దంగా తగిలింది! ఆ రోజు ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ఓ సంచలనం అయింది. వేగంగా చేరాల్సిన చోటుకి చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖ మంత్రితోపాటు కాంచీపూరం హెచ్ఆర్ అండ్ సీసీ జాయింట్ కమిషనర్ రంగంలో దిగారు. అశ్విని గురించి వాకబు చేసి ఆమె వివరాలు సేకరించి ఆమెను సంప్రదించారు. ఆ తర్వాత ‘ఇది ముఖ్యమంత్రి ఆదేశం’ అంటూ ఈ నెల 29వ తేదీ, శుక్రవారం నాడు అదే ఆలయంలో నరి కురువ సామాజిక వర్గానికి చెందిన వాళ్లతో కలిసి మంత్రి శేఖర్‌బాబు, తిరుపోరూర్ ఎమ్ఎల్ఏ ఎస్ఎస్ బాలాజీ, ఉన్నతాధికారి భోజనం చేశారు. అశ్విని తెగువను ప్రశంసిస్తూ ఆమెను ప్రభుత్వం తరఫున చీర సారెతో సత్కరించారు. ఆ సహపంక్తిలో పాల్గొన్న నరి కురువ సామాజిక వర్గంలోని అందరికీ చీర, ధోవతి పంచారు. పేదవాళ్లకు ఆహార భద్రత కోసం తమిళనాడు ప్రభుత్వం 754 కోట్లతో అన్నదానం పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా రోజూ ఆలయ ప్రాంగణంలో అన్నం వండి పేదవారికి భోజనం పెడుతోంది. ఓ రోజు మామల్లపురంలోని స్థలశయన పెరుమాళ్ ఆలయంలో ఈ అవాంఛిత సంఘటన చోటుచేసుకుంది. నాటి సంఘటనకు ప్రతిస్పందన ఇది. -
అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న: ఏసీపీ గిరి కుమార్
వరంగల్: అన్ని దానాల్లో కంటే అన్న దానం మిన్న అని వరంగల్ ఏసీపీ శ్రీ గిరి కుమార్ అన్నారు. ఆకలితో అలమటిస్తున్న బడుగు బలహీన వర్గాలకు పాదచారులకు విద్యార్థులకు వైద్య సిబ్బందికి పలని సేవాదళ్ వారు గత మూడు సంవత్సరాల నుంచి అమావాస్య రోజు అన్నదానం నిర్వహించడం హర్షణీయమన్నారు. ఆదివారం రోజు మధ్యాహ్నం శ్రీ భద్రకాళి దేవాలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి శ్రీ గిరి కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమంలో కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి, పలణి సేవాదళ్ నిర్వాహకులు బొడ్ల రవీంద్రనాథ్, గుండా అమర్నాథ్, నూతన్ కుమార్, లహరి సంతోష్ నరేష్, బొడ్ల సద్గున్, తాటిపల్లి కార్తీక్, పబ్బతి అవినాష్,ఛార్టర్డ్ అకౌంటెంట్ పబ్బతి కవి భరత్, మోదే నాగేందర్, వాకర్స్ అసోసియేషన్ చింతం సారంగపాణి, శ్రీమతి పడిశాల సుజాత తదితరులు పాల్గొన్నారు. సుమారు 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. -
కరోనా సాయానికి సల్మాన్ కొత్త చాలెంజ్
లాక్డౌన్ వల్ల నిరుపేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పనలవి కాదు. ఒక రకంగా చెప్పాలంటే కరోనా పేదలకు క్షామాన్ని తెచ్చిపెట్టింది. దీంతో కడుపు నిండా తిండి లేక రోజుల తరబడి పస్తులుంటున్నవారు కోకొల్లలు. మన చుట్టూనే ఎంతోమంది అన్నం దొరక్క అల్లాడిపోతున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అన్నదాన్ (అన్నదానం) చాలెంజ్ తీసుకువచ్చాడు. అందులో భాగంగా మంగళవారం ట్విటర్లో ఓ ఫొటోను పంచుకున్నాడు. అందులో మన హీరో, తన ఇద్దరు స్నేహితులు బాబా సిద్ధిఖీ, జీశాన్ సిద్ధిఖీలతో కలిసి ఆహార పొట్లాలను సిద్ధం చేస్తున్నాడు. (ప్యార్ కరోనా) వీటిని ఆహార కొరతతో బాధపడుతోన్న లక్షా 25వేల మందికి పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. అంతేకాక కోవిడ్-19తో ఆర్థికంగా అతలాకుతలం అయిన పేదలకు నిత్యావసర సరుకులను అందించి ఆదుకోవాలని అభిమానులను కోరాడు. కాగా సల్మాన్.. 25 వేల మంది సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పలు విడతల్లో డబ్బును జమ చేస్తున్నాడు. మరోవైపు టాలీవుడ్లో "బి ద రియల్ మెన్" చాలెంజ్ వైరలవుతున్న విషయం తెలిసిందే. (క్లైమాక్స్ గురించి సల్మాన్ భయపడ్డాడు) Baba and baba's baba zeeshan ne aan baan aur shaan se 1,25,000 families ko ration bataa hai. Now this is a challenge that one should be a part of.. Challenge 'Anna Daan' Karo to khud ya kissi bharosemand ke through...@BabaSiddique @zeeshan_iyc pic.twitter.com/317KPrxWyp — Salman Khan (@BeingSalmanKhan) April 28, 2020 -
అన్నం పెట్టే సాయికుమారి ఇకలేరు
అమరావతి, వినుకొండ(నూజెండ్ల): ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆదరించే మహిళగా డొక్కా సీతమ్మ పేరు అందరికీ సుపరిచయమే. ఈ కోవాకి చెందిన వినుకొండ పట్టణంలోని భవనాశి సాయికుమారి (66) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. పట్టణంలోని వివేకానంద పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న భవనాశి సాంబశివరావు భర్య సాయి కుమారి గత 20 ఏళ్ల నుంచి ఆకలితో ఉన్నవారిని ఇంటికి పిలిచి అన్నం పెడుతుంది. ఆకలితో ఉన్నవారు ఈమె ఇంటిని వెతుక్కుంటూ వచ్చేవారు. ఏ సమయంలో ఆకలితో వెళ్లినా లేదు అనకుండా భోజనం పెడుతూ యాచకులు, నిరుపేదల ఆకలి తీర్చే మహిళగా మంచి పేరు సంపాదించుకున్న సాయి కుమారి మృతితో వారు ఆందోళన చెందుతున్నారు. నువ్వు లేకపోతే మాకు అన్నం పెట్టే దిక్కెవరమ్మా అని అన్నార్తులు రోదిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. ఆమె చేతి అన్నం తిన్న వారు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆమె మృతికి పట్టణంలోని ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
అమావాస్య .. అన్నదానం
సాక్షి, మహబూబాబాద్ : మానవులుగా మనకు ఎవరు ఏమి ఇచ్చినా సరే మళ్లీ కావాలంటాం.. కానీ కడుపునిండా అన్నం పెడితే మాత్రం ఏమి కావాలని అడగరని నిరూపిస్తున్నారు ‘వికాస తరంగిణి’ నిర్వాహకులు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి వారి తిరునక్షత్రోత్సవం(జన్మదినోత్సవం)ను పురస్కరించుకుని 1995 అక్టోబర్ 31వ తేదీ దీపావళి అమావాస్య నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. వికాస తరంగిణి మహబూబాబాద్ శాఖ ఆధ్వర్యంలో పేదలకు ప్రతినెలా అమావాస్య రోజున కడుపునిండా అన్నం పెడుతున్నారు. ఇప్పటి వరకు 22 ఏళ్లుగా, 270 నెలల నుంచి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ధార్మికంలో అమావాస్య రోజున అన్నదానం చేస్తే ఎంతో పుణ్యఫలమని, జీయర్‌స్వామి వారి తిరునక్షత్రోత్సవం మంచిరోజని అన్నదానం చేస్తూ వస్తున్నారు. అన్నదానం రోజున 300 నుంచి 350 మంది వరకు భక్తులకు తృప్తికరంగా జిల్లా కేంద్రంలోని శ్రీరామ మందిరంలో అన్నదానం చేస్తున్నారు. కొంత కాలంగా ఈ కార్యక్రమాన్ని శ్రీరామ మందిరం నుంచి మార్వాడీ సత్రానికి మార్చారు. కాగా, శ్రీభక్తమార్కండేయ శివాలయం, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో కూడా ప్రతినెల అన్నదానం చేస్తున్నారు. అన్నదానం అంటే ఏదో ఓ రకం కాకుండా అన్నం, పప్పుకూర, స్వీట్ రైస్, పులిహోర, సాంబారుతో అన్నం పెడుతుండడం విశేషం. -
చిన్నారుల ఆరోగ్యంతోనే నవభారతం
బృందావన్: చిన్నారులు ఆరోగ్యంగా లేకుంటే శక్తివంతమైన నవ భారత నిర్మాణం సాధ్యం కాదని ప్రధాని మోదీ అన్నారు. అందుకే పోషకాహారం, టీకాలు, పారిశుధ్యం వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందని వివరించారు. ‘అక్షయపాత్ర’ 300 కోట్ల మందికి అన్నదానం చేసిన సందర్భంగా సోమవారం బృందావన్‌లోని చంద్రోదయ మందిర్ ఆవరణలో ఏర్పాటైన కార్యక్రమానికి ప్రధాని హాజరై చిన్నారులకు భోజనం వడ్డించారు. స్వర్గీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా మొదటి అన్నదానం ప్రారంభించగా 300 కోట్లవ అన్నదానం తాను చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దాదాపు అరగంటపాటు ప్రసంగించిన ఆయన.. అర్హులైన వారికి ఆలోచించకుండా ఇచ్చేదే నిజమైన దానమనీ, అక్షయపాత్ర అటువంటి దానమే చేస్తోందని కొనియాడారు. దేశవాసుల ఆకలిని తీర్చేందుకు అక్షయపాత్ర చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం 20 మంది చిన్నారులకు స్వయంగా భోజనం వడ్డించారు. కొందరు చిన్నారులకు స్పూన్‌తో తినిపించి, ఆశీర్వదించారు. అంతర్జాతీయ కృష్ణ భక్తుల సంఘం(ఇస్కాన్) నిధులతో నడుస్తున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 14,702 పాఠశాలల్లో బాలలకు మధ్యాహ్నం భోజనం అందజేస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు బృందావన్‌లో అత్యంత ఆధునిక వంటశాల ఉంది. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మథుర ఎంపీ హేమమాలిని పాల్గొన్నారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో 2004లో ఆ రాష్ట్రంలో తమ సంస్థ మొదటి వంటశాలను ప్రారంభించారని అక్షయపాత్ర ప్రతినిధి తెలిపారు. -
నిత్యాన్న ప్రసాదాలు
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాటను నిజం చేసి చూపిస్తోంది టీటీడీ. శ్రీవారి దర్శనార్థం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందచేస్తూ ఆకలి తీరుస్తోంది. ముప్పైమూడేళ్ల కిందట ప్రతి నిత్యం కొద్ది మంది భక్తులకు కడుపునింపే ఆశయంతో రూ. 5 లక్షల మూలధనంతో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేడు వెయ్యి కోట్ల రూపాయలకు చేరుకుని ప్రతిరోజూ లక్షల మందికి కడుపు నింపుతోంది. నిత్యం భక్తులు హుండీలో వేసే కానుకలే కాకుండా టీటీడీ చేపట్టిన వివిధ ట్రస్టులకు దాతలు విరాళాలు అందచేస్తుంటారు. ఇలా అన్నప్రసాద çపథకం, ఆరోగ్య వరప్రసాదం, ప్రాణదాన పథకం, గో సంరక్షణ పథకం, వేద పరిరక్షణ పథకం, బాలమందిరం ట్రస్టు, స్విమ్స్ వంటి పలు పథకాలను అంచెలంచెలుగా ప్రారంభించింది టీటీడీ. వీటిలో అన్నప్రసాదం ట్రస్టుకు అత్యంత ప్రా«ధాన్యత ఉంది. మొదట్లో తిరుమలలోని స్ధానిక మఠాలు భక్తుల ఆకలిని తీరుస్తూ ఉండేవి. అయితే క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య కారణంగా ఎక్కువ మంది ఆహారాన్ని కొని తినాల్సి వచ్చేది. దీంతో సామాన్య భక్తుల ఇబ్బందిని పరిగణనలోకి తీసుకున్న టీడీడీ నిర్ణయం ప్రకారం 1985 ఏప్రిల్ 6న నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నప్రసాద పథకాన్ని ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఎల్వీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన రూ. 5 లక్షల విరాళంతో ప్రారంభమైన ఈ పథకానికి మొదటి ఏడాదే రూ. 60 లక్షలకు పైగా విరాళాలు అందాయి. ఆ తర్వాత అన్నదాన పథకానికి భక్తుల నుంచి విరాళాలు మరింతగా ఊపందుకున్నాయి. ఏడాదికేడాదీ ప్రవాహంలా అన్నదాన ట్రస్టుకు భక్తులు విరాళాలు అందిస్తూండటంతో ప్రస్తుతం అన్నదానం ట్రస్టు డిపాజిట్లు వెయ్యి కోట్ల మార్కును దాటాయి. బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉన్న ఈ నగదు నుంచి వచ్చే వడ్డీతో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. గతంలో అన్నదాన ట్రస్టు పేరులో దానం అనే పదాన్ని అన్నప్రసాద పథకంగా మార్చింది టీటీడీ. భక్తులు ఇస్తున్న కానుకలు ఏటా పెరుగుతూ ఉండటంతో ఈ ఏడాది సెప్టెంబరు నెలలో అన్నప్రసాద ట్రస్టుకు భక్తులు ఇచ్చిన విరాళాల మొత్తం రూ. 1,000 కోట్ల మార్కును దాటింది. మొదట్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయంలోనే టోకెన్లు అందజేసి అన్నప్రసాద సౌకర్యం కల్పించిన టీటీడీ 2007 సంవత్సరం నుంచి టోకెన్లతో నిమిత్తం లేకుండా ఎవరికైనా భోజన సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం తిరుమలలోని ప్రధాన అన్నదాన కేంద్రంలో ప్రతిరోజూ దాదాపు లక్షమందికి, ఇతర చోట్ల పది నుంచి పదిహేను వేలమంది వరకు భక్తులకు అన్నప్రసాదం లభిస్తోంది.నానాటికీ పెరుగుతున్న భక్తులకు గతంలో ఉన్న పాత అన్నదాన భవనం చాలక పోవడంతో టీటీడీ ఆసియాలోనే అతి పెద్ద అన్నప్రసాద ప్రాంగణాన్ని రూ.25 కోట్ల ఖర్చుతో నిర్మించింది. నాలుగువేల మంది భక్తులు ఏకకాలంలో భోజనం చేసేలా, నిత్యం లక్ష మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించేలా నిర్మించిన ఈ నూతన భవనాన్ని 2011లో ప్రారంభించారు. ఇందులో అత్యాధునిక భారీ ఆవిరి యంత్రాల ద్వారా ఆహారాన్ని తయారు చేసి వేలాది మందికి సకాలంలో ఆహారాన్ని సిద్ధం చేస్తుంటారు. టీటీడీ సిబ్బందితో పాటూ శ్రీవారి సేవకులూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మానవసేవే మాధవ సేవ అని చాటుతున్నారు. ప్రధాన అన్నప్రసాద కేంద్రంలోనే కాకుండా తిరుమలలోని పలు ప్రదేశాల్లోనూ టీటీడీ భక్తులకు ఆహారాన్ని అందచేస్తోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్, యాత్రికుల వసతి సముదాయాలలో కూడా అన్నప్రసాదాన్ని అందచేస్తోంది. మూడేళ్ల కిందట తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో కూడా అన్నప్రసాదం పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తిరుపతిలోని వసతిగృహ సముదాయాలకు అన్నప్రసాదం పథకాన్ని విస్తరించింది. తిరుమలతో పాటు పలుచోట్ల మొబైల్ çఫుడ్ కౌంటర్ల ద్వారా కూడా ఆహార వితరణ ప్రారంభించింది. తిరుమలలోని రద్దీ ప్రదేశాల్లోను, కాలినడక మార్గాల్లోను భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తోంది. ఇటీవలి కాలంలో అన్నదాన పథకంలో కొన్ని కొత్త డొనేషన్ స్కీములను టీటీడీ ప్రవేశ పెట్టింది. వీటిలో భాగంగా రూ.6 లక్షలు విరాళం ఇస్తే ఆ దాత పేరుతో ఒకపూట అల్పాహారాన్ని భక్తులకు అందజేస్తారు.రూ.10 లక్షలు విరాళం ఇస్తే దాత పేరిట ఒకపూట అన్నప్రసాద వితరణను నిర్వహిస్తారు. రూ. 25 లక్షలు విరాళం ఇచ్చే దాత పేరిట ఒక రోజు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. ఇలా టీటీడీ అన్నదాన ట్రస్టులోని స్కీములకు దాతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కొందరు భక్తులు టీటీడీకి నిత్యం దాదాపు ఏడు టన్నుల కూరగాయలను ఉచితంగా పంపుతూ కొంతవరకు భారాన్ని తగ్గిస్తున్నారు. మిగిలిన అదనపు వ్యయాన్ని టీటీడీ హుండీ ఆదాయం ద్వారా వచ్చే నిధుల నుంచి భర్తీ చేస్తోంది. -
కార్మికుల ఆకలి తీర్చిన ‘ధరణి’
సిరిసిల్ల : కార్మిక వాడల్లో ‘ధరణి’ స్వచ్ఛంద సంస్థ కార్మికుల ఆకలి తీర్చింది. పట్టణంలోని గోపాల్‌నగర్‌కు చెందిన ఐన రవి ఇంట్లో శుభకార్యం సోమవారం జరిగింది. విందు భోజనం మిగిలిపోవడంతో నిర్వాహకులు ‘ధరణి’ సంస్థకు సమాచారం అందించారు. వెంటనే ఆటోలో గిన్నెలు తీసుకెళ్లి మిగిలిన విందు భోజనాన్ని సేకరించారు. పట్టణంలో పేదలు అధికంగా ఉండే గణేశ్‌నగర్ కార్మిక వాడకు తీసుకెళ్లి పంపిణీ చేశారు. వేడి వేడి విందు భోజనాన్ని కార్మికులు ఇష్టంగా తీసుకెళ్లారు. 70 మందికి సరిపడా ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధరణి సంస్థ అధ్యక్షురాలు కె.విం ధ్యారాణి, జయసింహారెడ్డి, గుజ్జె తార, అయ్యప్ప రాము, ఠాగూర్ రాజు, ఠాగూర్, వినీత్, చందర్, గడ్డం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో అమృతాహారం!
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కి పేరు. దీన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేశారు. ఇది 500 పడకల ఆసుపత్రి. ఇక్కడి రోగులకు ఆసుపత్రి సేవల్లో భాగంగా భోజనం అందుతుంది. వారికి సహాయకులుగా వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం బయట క్యాంటీన్లకు వెళ్లాల్సి వచ్చేది. వారికి కూడా ఆసుపత్రి ప్రాంగణంలోనే భోజనం అందిస్తే బాగుంటుందనే ఆలోచనతో సత్యసాయి సేవాదళ్ ట్రస్టు ఆధ్వర్యంలో మూడేళ్ల క్రితం ఉచిత నిత్యాన్నదానం ప్రారంభించారు. మధ్యాహ్నం 300–350 మంది వరకూ, రాత్రి పూట 300 మంది వరకూ రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ఇందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలనే ఉపయోగిస్తుండటం విశేషం. రిమ్స్ ప్రాంగణంలో నిత్యాన్నదానం క్యాంటీన్లో అన్నంతో పాటు సాంబారు, ఒక కూర, పచ్చడితో అరటిపండు, బొప్పాయి పండ్ల ముక్కలు కూడా అందిస్తున్నారు. తొలుత ఈ క్యాంటీన్‌కు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు మొత్తం బయట మార్కెట్లోనే కొనుగోలు చేసేవారు. అలాగాకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేసిన ఆకుకూరలు, కూరగాయలైతే రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మేలైనవనే ఉద్దేశంతో శ్రీకాకుళానికి చెందిన సామాజిక సేవకురాలు పేర్ల అనురాధ చొరవ చూపి కూరగాయల సాగు ప్రారంభించారు. ఇప్పుడు క్యాంటీన్లో రోజువారీ అవసరాలకు ఈ ప్రకృతి సాగు తోట నుంచే వెళ్తున్నాయి. ‘‘నిత్యాన్నదానం కోసం కేటాయించిన భవనం వెనుక దాదాపు వెయ్యి గజాల ఖాళీ స్థలం వృథాగా ఉండేది. దీనిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా ప్రకృతి సేద్య విధానంలో పండించిన కూరగాయలు, ఆకుకూరల రుచి చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి ఇంటి వద్ద కొన్నిరకాల కూరగాయల మొక్కలు పెంచేవాళ్లం. ఆ ఆసక్తితోనే రిమ్స్‌లో ఆ ఖాళీ స్థలం ప్రకృతి సాగు కోసం ఇవ్వాలని జిల్లా కలెక్టరును కోరాం. రెండేళ్ల క్రితం అనుమతి రాగానే బయటి నుంచి సారవంతమైన మట్టి తెప్పించి వేయించాం. పశువుల గెత్తం కూడా వేశాం. తొలుత టమాటా, మునగ, వంకాయలు, పచ్చిమిర్చి సాగు ప్రారంభించాం. తర్వాత ముల్లంగి, దొండ, గోంగూర, కొత్తిమీర.. వేశాం. వాటిలో అత్యధికంగా గోంగూర, కొత్తిమీర రోజువారీ వంటకు సరిపోతోంది. సాంబారులో వాడకానికి కంది కూడా పండిస్తున్నాం. కరివేపాకు, కొత్తిమీర, గోంగూర పూర్తిగా ఇక్కడిదే వంటకు వినియోగిస్తున్నాం. వీటికి రసాయనిక ఎరువులు వేయలేదు. కేవలం వర్మికంపోస్టు ఎరువు తీసుకొచ్చి వేస్తున్నాం. చీడపీడల సమస్య కూడా కనిపించలేదు. ఎప్పుడైనా కనిపిస్తే దశపత్ర కషాయం, వేపనూనె పిచికారీ చేయిస్తున్నాం. పంటల మధ్యలో బంతి మొక్కలు పెంచడం ద్వారా చీడపీడలను నియంత్రిస్తున్నాం. పచ్చిమిర్చి రోజూ రెండు మూడు కిలోల వరకూ వస్తాయి. వచ్చే వేసవిలో అందుబాటులోకి వచ్చేలా ఇప్పుడు కొన్ని రకాల కూరగాయల మొక్కలు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సాయి భక్తులు కాళీప్రసాద్, అన్నపూర్ణ గార్ల సహకారంతో అరటితో పాటు మామిడి, సపోట, ఉసిరి, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు పెంచుతున్నాం. సాక్షి ‘సాగుబడి’లో వచ్చే కథనాలు, సూచనలు మాకెంతో ఉపయోగపడుతున్నాయి. ఈ స్ఫూర్తితో శ్రీకాకుళంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద పూలమొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే పెంచుతున్నాం. ప్రతిరోజూ పూజలకు వాటి పూలు సరిపోతున్నాయి’’ అని అనురాధ చెబుతున్నారు. – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, ఫొటోలు: కుప్పిలి జయశంకర్ -
వైఎస్సార్‌పై అభిమానంతో అన్నదానం
-
అన్నం పెట్టే చెయ్యి!
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలంటే మనిషిలో ఏం ఉండాలి? చేతినిండా డబ్బా? కాదు... మనసు నిండా ఆర్ద్రత? నిజమే... అంతగా స్పందించే మనసు ఉన్నప్పుడే ఇలాంటి సేవ సాధ్యం. ఇందుకు నిదర్శనమే రామాంజనేయులు. పెద్ద మనసు అది గుంటూరు జల్లా, నిజాం పట్నం మండలంలోని అడవుల దీవి గ్రామం. అన్ని గ్రామాల్లో జరిగినట్లే అడవుల దీవిలో కూడా పండుగలు, పర్వదినాల్లో దేవాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానాలు జరిగేవి. ఆ అన్నదానాల సమయంలో వృద్ధులు, అనాథలు, దిక్కులేని వాళ్లు భోజనాల కోసం బారులుదీరేవారు. ఆ సంఘటన యేమినేని రామాంజనేయులిని కలచి వేసింది. పంటలు పండించి పదిమందికి అన్నం పెట్టే పల్లెలో కూడా ఇంతమంది అన్నం లేని వాళ్లు ఉన్నారా అని మధనపడ్డాడు. వయసుడిగిన వాళ్లు వేళకు అన్నం తినకపోతే సొమ్మసిల్లి పోయేటట్లు కనిపించారు. వారికి ఆ ఎండలు తగ్గే వరకు రోజుకు కనీసం ఒక్కపూటైనా కడుపునిండా అన్నం పెట్టగలిగితే అని ఆలోచించాడు. మొదట ఇరవై మంది వచ్చేవారు, ఇప్పుడు రోజూ 75 మంది భోజనం చేస్తున్నారు. భోజనం చేసి వెళ్తూ... ‘‘చల్లంగుండయ్యా...మా కోసమే ఆ దేవుడు నిన్ను పంపిండు’’ అని వృద్ధులు దీవిస్తున్నారు. చిన్న ఆలోచన! ఎండాకాలం రెణ్నెల్ల కోసం గత ఏడాది వేసవిలో మొదలైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. ఒక మంచి పని మొదలు పెట్టావు, ఆపవద్దంటూ రామాంజనేయులుకు ఊరివారంతా అండగా నిలిచారు. బతికినన్నాళ్లూ కాయకష్టం చేసి పిల్లల్ని పెంచి పెద్దచేసిన వారికి, వృద్ధాప్యంలో తిండి కోసం ఎదురు చూసే పరిస్థితి రాకూడదని, ఈ మంచిపనిని కొనసాగిద్దామని ముందుకొచ్చారు. కమిటీగా ఏర్పడి పనిచేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఏడాదంతా పని దొరకడం కష్టం. ఏడాదిలో కొన్నాళ్లపాటు ఉపాధి కోసం వలస వెళ్తుంటారు. కుటుంబాల్లో వృద్ధులు ఇంటిని కనిపెట్టుకుని కొడుకు, కోడళ్లు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ రోజులు వెళ్లదీస్తుంటారు. కొందరి పిల్లలు ఊళ్లో ఉండి కూడా ముసలి వాళ్లకు తిండి పెట్టరు. ఆ పండుటాకులకు రామాంజనేయులు అన్నం పెట్టే దేవుడయ్యాడు. పండని పొలంతో కష్టాలు! ‘‘మాకు తీరప్రాంతంలో పొలం ఉంది. పంటకు పనికిరాని పొలం. మా అమ్మనాన్నలు సాంబశివరావు, శివకుమారి. మా అక్కయ్య, తమ్ముడు, నేను... ముగ్గురం పిల్లలం. మమ్మల్ని చదివించటానికి వాళ్లెంత కష్టపడ్డారో నాకు తెలుసు. బడ్డీ్డ కొట్టు పెట్టుకుని మమ్మల్ని డిగ్రీ వరకు చదించారు. అక్కకు పెళ్లి చేశారు. అంతటి కష్టంలో ఉన్నప్పుడు కూడా మనకున్నదాంట్లోనే పదిమందికి సాయం చేయాలని చెప్పేవాళ్లు’’ ఆ మాటలే తనను నడిపించాయంటాడు రామాంజనేయులు. అతడి చొరవతో ఇప్పుడు అడవుల దీవిలో అనాథలు, వృద్ధులు ఎవరూ ఆకలి కడుపుతో పడుకోవడం లేదు. – గడ్డం వాసు, సాక్షి, రేపల్లె సంపాదనలో కొంత! పదేళ్ల కిందట డిగ్రీపట్టాతో హైదరాబాద్ వెళ్లాను. సేల్స్ ప్రమోటర్, షాపింగ్ మాల్ సుపర్‌వైజర్‌గా చేశాను. ఉద్యోగం చేస్తూండగానే సినిమా రంగంతో పరిచయమైంది. పాటలు రాసే అవకాశాలు వస్తుండటంతో ఉద్యోగం మానేశాను. నా సంపాదనతో అంతమంది ఆకలి తీర్చడం సంతోషంగా ఉంది. ఆ డబ్బు మిగుల్చుకుంటే నేను ఖరీదైన చొక్కా వేసుకుంటానేమో, ఇంకా సంపాదిస్తే పెద్ద కారులో తిరుగుతానేమో. అవేవీ ఇలాంటి సంతోషానికి సాటిరావు’’ – యేమినేని రామాంజనేయులు అంతటి భాగ్యం దక్కింది! మహత్తర కార్యక్రమంలో సేవ చేసే భాగ్యం దక్కటం ఆనందంగా ఉంది. ప్రతి రోజూ ఇంటి వద్ద భోజనాలు తయారు చేయించి వృద్ధులు, అనాథలకు పెడుతున్నాం. – పాటిబండ సాయిబాబు, కమిటీ ఉపాధ్యక్షుడు కడుపునింతా తింటున్నా! కష్టపడానికి ఓపిక లేదు. ఉండటానికి ఇల్లు లేదు. మతిస్థిమితం లేని మూగ చెల్లెలిని బంధులకు అప్పగించాను. నేను కూడా వెళ్తే వాళ్లకు భారమని వెళ్లలేదు. కానీ తిండి కోసం చాలా బాధపడేవాడ్ని. పోయిన సంవత్సరం ఆ బాబు మధాహ్నం భోజనం పెట్టటం మొదలు పెట్టాక కడుపునిండా భోజనం దొరుకుతోంది. ఆ బాబు చల్లగ ఉండాలి. – పి.రాజారావు నా బిడ్డలు వచ్చే వరకు ఇక్కడే! బిడ్డలు ఇక్కడ లేరు. రోజూ వండుకుని తినాలంటే నడుము లేచేది కాదు. రోజూ ఇక్కడే తింటున్నాను. నా బిడ్డలు వచ్చే వరకు ఇక్కడే ఈ బిడ్డ దగ్గరే అన్నం తింటాను. – తోట నాగేంద్రమ్మ -
నారాయణవనంలో అన్నదానానికి మంగళం
నారాయణవనం : పద్మావతి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమానికి టీటీడీ అధికారులు మంగళం పాడారు. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న అన్నప్రసాదాల వితరణను ఈ ఏడాది ఆపివేయడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పది రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం, రాత్రి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని ఆరేళ్ల క్రితం ప్రారంభించారు. తర్వాత అగస్తేశ్వర, వీరభద్ర స్వామి, శక్తి వినాయక ఆలయాల ఉత్సవాల్లోనూ వితరణ చేశారు. తిరుచానూరు నుంచి వాహనంలో సాంబారు, పెరుగన్నం తెచ్చి భక్తులకు అందించేవారు. కల్యాణ వెంకన్న ఆలయ బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం కాగా మధ్యాహ్నం అన్నప్రసాదాల కోసం ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్వామి వారి సేవకు వచ్చే భక్తులు నిరాశతో ఆలయ సమీపంలోని సమాచార కేంద్రం వద్దకు వచ్చి వెనుదిరిగారు. వేసవి తీవ్రత దృష్ట్యా తిరుచానూరులోని టీటీడీ క్యాంటీన్ నుంచి తెచ్చే సాంబారు, పెరుగన్నం పాడైపోతోందని ఆలయ అధికారి నాగరాజు వివరణ ఇచ్చారు. ఆలయంలో స్వామి వారి దర్శనానంతరం భక్తులకు ప్రసాదాలను అందజేస్తున్నామని తెలిపారు. -
అన్నదానం.. పుణ్యకార్యం
కర్నూలు(అర్బన్): ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే మహా పుణ్యమని జిల్లా అడిషనల్ కోర్టు జడ్జి స్వప్నరాణి అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు ఆదివారం నుంచి ఏపీ వీరశైవ లింగాయతిరెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జడ్జి స్వప్నరాణి, హైకోర్టు న్యాయవాది సునీల్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండను కూడా లెక్క చేయకుండా అత్యంత భక్తితో సుదూర ప్రాంతాల నుంచి నడిచి వెళ్తున్న వారి ఆకలి తీర్చడం ఎంతో పుణ్యకార్యమన్నారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన కన్నమడకల గ్రామానికి చెందిన సోమేశ్వరరెడ్డి, దామోదర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బాలిరెడ్డి, నాగేశ్వరరావును ఆమె అభినందించారు. సేవా సమితి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, కార్యదర్శి నాగిరెడ్డి, కార్యవర్గ సభ్యులు మహేశ్వరరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, నాగభూషణంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వామీ.. తినలేం
టీటీడీ ఆస్పత్రుల్లో రోజూ 6 వేల మందికి అన్నప్రసాదం నాణ్యత లేదంటున్న రోగులు, సహాయకులు కనీసం ప్లేట్లు కూడా కరువే పలచటి పేపర్లలో పెట్టడం వల్ల నేలపాలు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఆకలితో ఉన్న వారికి అన్నం పరబ్రహ్మ స్వరూపంగా దర్శనమిస్తుంది. అందులోనూ అనారోగ్యంతో ఉంటూ, అచేతనం గా పడిఉన్న రోగులు, వారి సహా యకులకు అన్నదానం చేసేందుకు థార్మిక సంస్థ టీటీడీ ముందుకొచ్చింది. ఆ ప్రసాదాన్ని మహా ప్రసాదంగా భావించి స్వీకరిస్తున్నారు. అరుుతే ఆసుపత్రులకు అందిస్తున్న అన్నప్రసాదంలో ఇటీవల రుచి తగ్గిందనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. నాణ్యత లేని, పుచ్చిన కూరగాయలు వాడుతున్నారని పలువురు రోగుల సహాయకులు చెబుతున్నారు. తిరుపతి మెడికల్: తిరుపతి పుణ్యక్షేత్రం కావడం, రాయలసీమకే తలమానికంగా ప్రభుత్వ, ప్రరుువేట్ ఆసుపత్రులు ఉండటంతో నిత్యం వందలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వీరితో పాటు సహాయకులు వస్తున్నా, సకాలంలో భోజన సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు. ఈనేపథ్యంలో ఆసుపత్రులకు వచ్చే రోగులకు, వారి సహాయకులకు రెండు పూటలా భోజనం అందించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం అన్నప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టారు. నగరంలోని రుయా, బర్డ్, స్విమ్స్, ఎస్వీ ఆయుర్వేద, ప్రభుత్వ మెటర్నటీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని టీటీడీ సరఫరా చేస్తోంది. ఉదయం 3,600 మందికి, సాయంత్రం 3,600 మంది చొప్పున రెండు పూటలా దాదాపు 7వేల మందికి పైగా అన్నప్రసాదం వడ్డిస్తుండటం విశేషం. గత కొన్ని రోజులుగా అన్నప్రసాదం రుచిగా లేదనీ, అన్నప్రసాదంలో వాడే కూరగాయలు నాణ్యత తగ్గిందన్న ఆరోపణలు వినిపిస్తున్నారుు. లోపించిన కూరగాయల నాణ్యత అన్నప్రసాదం (సాంబారు)లో ఉపయోగించే కూరగాయల నాణ్యత తగ్గిందని ఆరోపణలున్నారుు. సాధారణంగా సాంబారు అన్నంలో బీన్స, ముళ్లంగి, క్యారెట్, గుమ్మడి వంటి తాజా కూరగాయలు వేసి ఘుమ ఘుమలాడే రుచితో అన్నప్రసాదాన్ని వడ్డించేవారు. టీటీడీ క్యాంటీన్‌కు విరాళాల రూపంలో సరఫరా అయ్యే కూరగాయల సంఖ్య ఇటీవల పెరిగింది. వాటిని నిల్వ ఉంచే క్రమంలో కుళ్లిన , పుచ్చిన కూరగాయలను వేరుచేయాల్సి ఉన్నా చూసి చూడకుండా అలాగే వేసి వండుతున్నారనే విమర్శలున్నారుు. పైగా సాంబారు అన్నంలో కుళ్లిన కూరగాయలు దర్శనమిస్తున్నాయని రోగుల సహాయకులు ఆరోపించారు. వేడిగా ఉండటంతో గంట తరువాత సాంబారు అన్నం తింటే పాచిన వాసన వచ్చిందని వేణుగోపాల్ అనే రోగి సహాయకుడు తెలిపారు. ఈ విషయమై దీపావళి పండగ ముందు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందిచానని ఆయన చెప్పారు. వేళకు రాని అన్నప్రసాదం రోజూ సాయంత్రం పూట ఆసుపత్రుల్లో వడ్డించే అన్నప్రసాదం వేలకు రావడం లేదని రోగుల సహాయకులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు రావాల్సిన అన్నప్రసాదం రాత్రి 7 గంటలు అవుతున్నా రాదని, అంతవరకు ఆకలితో వేచిఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని సిబ్బందిని అడిగితే ‘‘మీకు అన్నం పెట్టేదే ఎక్కువ. పైగా రూల్స్ మాట్లాడుతావా’’ అంటూ తిట్ల పురాణాలకు దిగుతున్నట్టు రాయచోటికి చెందిన అంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదిలేక పక్కనే ఉన్న హోటల్లో డబ్బులు పెట్టి భోజనం కొనాల్సి వస్తోందన్నారు. ప్లేట్లు కూడా కరువే ఆసుపత్రిలో అందిస్తున్న అన్నప్రసాదానికి ప్లేట్లు కూడా కరువయ్యారుు. రోగులకు ఉదయం, సాయంత్రం రోజుకు రెండు పూటలా సాంబారన్నం, పెరుగన్నం పెడుతున్న టీటీడీ ఆ ప్రసాదాన్ని తినేందుకు భోజన ప్లేట్లు సరఫరా చేయడం లేదు. పైగా భోజన ప్లేట్లను ఆసుపత్రుల నిర్వాహకులే సమకూర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. వేడిగా ఉన్న సాంబారన్నం, పెరుగన్నం పేపరు ప్లేట్లలో వడ్డిస్తుండటంతో ఆ వేడికి పేపర్ప్లేట్లు చిరిగిపోతున్నారుు. కళ్ల ముందే చేతిలోని అన్నప్రసాదం నేలపాలవుతుండటంతో రోగుల సహాయకులు నొచ్చుకుంటున్నారు. గతంలో ప్లాస్టిక్ ప్లేట్లను సరఫరా చేసిన రెండు నెలలకే వాటికి స్వస్తి పలకడం విశేషం. పైగా వర్షం వస్తే రోగుల సహాయకులకు కూర్చుని తినేందుకు కూడా స్థలం లేదు. వర్షంలో తడుస్తూనే తినాల్సి వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. మెనూలో టిఫిన్ ఎక్కడ? టీటీడీ సరఫరా చేసే అన్నప్రసాదంలో ఉదయం పూట అల్పాహారం అందిస్తున్నట్టు మెనూలో ఉంది. అరుుతే రెండేళ్లుగా రోగులు, వారి సహాయకులకు ఎలాంటి అల్పాహారం పెట్టిన సందర్భం లేదు. దీని గురించి అడిగిన నాథుడు లేడు. అదేమని అడిగితే తమకు ఆసుపత్రి వైద్యాధికారులు సహకరించడం లేదని టీటీడీ అధికారులు చెప్పడం గమనార్హం. నాణ్యతగా పెడుతున్నాం రోజూ నాలుగైదు రకాల కూరగాయలతో పరిశుభ్రంగా తయారు చేసిన అన్నప్రసాదాన్ని వడ్డిస్తున్నాం. కూరగాయలు నాణ్యతగా ఉన్నారుు. రుచి తగ్గిందన్న ఫిర్యాదు మాకు ఇంతవరకు రాలేదు. భోజనానికి ప్లేట్లు కొరత ఉన్న మాట వాస్తవమే. దీనిని ఆయా ఆసుపత్రుల అధికారులే చూడాలి. భోజనం సరఫరా చేస్తున్న మాకు ఆసుపత్రుల నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. కనీసం ఇన్వారుుస్లోనూ సంతకం పెట్టేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. పైగా అన్నప్రసాదం రుచిలో నాణ్యత లోపించిందని తమపై నిందారోపణలు చేయడం బాధాకరం. - మురళి,సూపరింటెండెంట్, అన్నదానం, తిరుచానూరు. -
నిత్యాన్నదానానికి రూ.2,00,116 విరాళం
అన్నవరం : సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి ఇద్దరు దాతలు శనివారం రూ.2,00, 116 విరాళాలుగా సమర్పించారు. విశాఖ జిల్లా యలమంచిలికి చెందిన చల్లపల్లి సూర్య నాగేంద్ర, సూర్య వెంకటలక్ష్మీ హేమలత దంపతులు రూ. 1,00,116 విరాళాన్ని ఈఓ నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా జ్యేష్ట బహుళ చవితి నాడు తాకాశి వరలక్ష్మి పేరు మీద అ న్నదానం చేయమని కోరినట్టు అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన అద్దంకి రవికుమార్ రూ.లక్ష విరాళానికి సంబందించిన బ్యాంక్ డీడీని ఈఓకు అందజేశారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పోరంకిలోని శ్రీనివాసనగర్‌కు చెందిన యనిగళ్ల భరత్‌కుమార్ శనివారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన రూ.1,00,011 విరాళాన్ని ఆలయ ఈవో అచ్యుతరామయ్యకు ఇచ్చారు. అనంతరం దాతలకు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి నిడమానూరు ప్రాంతానికి చెందిన దాత రూ.లక్ష విరాళాన్ని బుధవారం ఆలయ అధికారులకు అందజేశారు. నిడమానూరుకు చెందిన కొత్తపల్లి వందన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ ఏఈవో అచ్యుతరామయ్యను కలుసుకుని నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116ల విరాళాన్ని అందించారు. -
అర్ధాకలిలో అమ్మ భక్తులు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : అమ్మవారి ప్రసాదం స్వీకరించడం మహాభాగ్యం.... అది అన్నప్రసాదమయినా.. ఇతర మరే ప్రసాదమయినా సరే... అయితే భక్తులు, యాత్రికుల కోసం సిద్ధం చేసిన ప్రసాదం కూలీలు, కార్మికుల పాలవుతోంది. అమ్మ సన్నిధిలో నిద్ర చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. అమ్మవారి సన్నిధిలో రాత్రి వేళ నిద్ర చేసేందుకు రాష్ట్రంలోని వివిధ‡ ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తుంటారు. వీరందరికీ దుర్గగుడి అధికారులు నిత్యం దద్దోజనం ప్రసాదాన్ని అందజేస్తుంటారు. రాత్రి 8–30 గంటల నుంచి ఈ ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. గతంలో కొండపై షెడ్డులో ఈ దద్దొజనం ప్రసాదం అందజేసేవారు. అయితే మహా మండపంలోని 1, 2వ అంతస్తులో భక్తులు నిద్ర చేసేందుకు వసతి కల్పించడంతో ఇప్పుడు మహా మండపం దిగువన ఈ ప్రసాదాన్ని రాత్రి వేళ పంపిణీ చేస్తున్నారు. భక్తులకు పంపిణీ చేసే ఈ ప్రసాదం కోసం కెనాల్ రోడ్డు, కాళేశ్వరరరావు మార్కెట్ పరిసరాలలో హోటళ్లు, ఇతర పనులు చేసుకునే కూలీలు భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచే మహా మండపం దిగువన వరసగా కూర్చుని ఉండటంతో నిజమైన భక్తులకు అమ్మవారి ప్రసాదం అందడం లేదు. తొలుత క్యూలైన్లోకి ఈ కూలీలు వచ్చి చేరడంతో భక్తులు వారి వెనుక నిల్చోవాల్సి వస్తుంది. చివరకు అరకొరగా లభించే ప్రసాదాన్ని కుటుంబం మొత్తం సర్దుకుని ఆర్ధాకలిలో అమ్మవారి సన్నిధిలో నిద్ర చేయాల్సి వస్తుందని అనకాపల్లికి చెందిన వెంకటరత్నం ఆవేదన వ్యక్తం చేసింది. అన్న ప్రసాదం పంపిణీకి పక్కనే ఉన్న ప్రసాదం కౌంటర్లు వినియోగించుకుని భక్తులందరినీ ఓ క్రమపద్ధతిలో వచ్చేలా చేయవచ్చు. ఆలయ సిబ్బంది అటువంటి చర్యలేమీ పాటించకుండా ఆరుబయట భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. నోరు, బలం ఉన్న వారు ముందుకు వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని భోజనంలా లాగించేస్తున్నారు. విశ్రాంతి మందిరాలలోనే పంపిణీ చేస్తే మేలు.... అమ్మవారి సన్నిధిలో నిద్ర చేసేందుకు వచ్చే భక్తులు, యాత్రికులకు పంపిణీ చేసే దద్దోజన ప్రసాదాన్ని విశ్రాంతి మందిరాలలోనే పంపిణీ చేస్తే సద్వినియోగం భక్తులు భావిస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో నిత్యం 300 నుంచి 500 మంది వరకు భక్తులు నిద్ర చేస్తుంటారు. భక్తులు నిద్ర చేసే మహా మండపంలోని 1, 2వ అంతస్తులలో ఈ ప్రసాద వితరణ జరిగితే అమ్మవారి ప్రసాదం అందరికీ అందుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు ఈ మార్పులు చేస్తారని భక్తులు భావిస్తున్నారు. -
వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం
సదాశివపేట రూరల్ :మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో వెంకటేశ్వరస్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. గ్రామ శివారులో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతిఏటా కల్యాణ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో కొలువైన పద్మావతీ సమేత వెంకటేశ్వరస్వామికి అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా సుప్రభాతం, అభిషేకం చేశారు. అనంతరం ఆలయంలో గణపతిహోమం చేశారు. ఈ సందర్భంగా వెంకటాపూర్ గ్రామస్తులు, భక్తులు ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 10.05 గంటలకు స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో మండల, పట్టణ ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం వెంకటేశ్వరుడు, అమ్మవార్ల విగ్రహాలను రథంలో ఉంచి వెంకటాపూర్ గ్రామంలో ఊరేగించారు. అ తర్వాత సదాశివపేట పట్టణంలోని పురవీధుల గుండా రథయాత్రను నిర్వహించారు. సదాశివపేటలోని భక్తులు రథంలో కొలువైన వెంకటేశ్వరస్వామికి పూజలు చేశారు. -
రోజూ లక్షమందికి టీటీడీ అన్నదానం
విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ప్రతి రోజూ లక్షమందికి అన్నదానం చేస్తునట్లు టీటీడీ జె.ఈ.వో శ్రీనివాసరాజు చెప్పారు. గురువారం పున్నమ్మతోటలోని టి.టీ.డీ కళ్యాణమండపంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుష్కర భక్తులకు నిత్యం లక్షమందికి అన్నప్రసాదం అందించేందుకు టీటీడీ కళ్యాణమండపంలో అత్యాధునికమైన వంటశాలను నిర్మించామని తెలిపారు. కళ్యాణమండపం నుంచి నగరంలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, వై.వీ.ఆర్. ఎస్టేట్, సీతమ్మవారి పాదాలు, సీతానగరంలోని ఉండవల్లి సెంటర్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన వసతి కల్పిస్తునట్లు తెలిపారు. అన్నదానం 23 దాకా సాగుతుందని తెలిపారు. -
దేవుడి సేవలో ఆనందం
విజయవాడ(లబ్బీపేట) : దేవుడి, సమాజ సేవలోనే ఆనందం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల, గృహనిర్మాణ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా ఏర్పాటు చేయగా, వారి ఆధ్వర్యంలో ప్రతి రోజూ లక్ష మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. అన్నప్రసాదానికి గాను నగరానికి చెందిన మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి ప్రతిరోజూ ఐదు టన్నుల కూరగాయలను అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబరావు నేతృత్వంలో ఘన్‌సన్‌సార్ సంస్థ, అరవపల్లి ఆదిత్య, మండవ సస్య, మనీష్ అగర్వాల్, సతీష్ అగర్వాల్‌లు మంగళవారం ఐదు టన్నుల కూరగాయలను టీటీడీ శ్రీవారి అన్నప్రసాదానికి అందజేశారు. ఈ సందర్భంగా కూరగాయల లారీని బృందావనకాలనీలోని ఎ కన్వెన్షన్ సెంటర్ వద్ద మంత్రి సునీత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత జెండా ఊపి ప్రారంభించారు. సునీత మాట్లాడుతూ డబ్బును సంపాదించే వారు చాలా మంది ఉంటారని, సంపాదన ఇతరులకు పెట్టే వారు తక్కువ మంది ఉంటారన్నారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ప్రస్తుత కృష్ణాపుష్కరాలో సేవలు చేసేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారని, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వల్లూరు అశోక్, బీఏ నాగు, మండవ శ్రీనివాస్, నువ్వుల రాజేష్, మండవ శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. -
పుష్కర భక్తులకు ‘ఓల్డ్ గన్నీస్‘ అన్నదానం
గుణదల : వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం తాను అన్నసమారాధన నిర్వహిస్తున్నామని ది విజయవాడ ఓల్డ్ గన్నీస్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేఉషన్ ఆద్యులు గూడెల త్రినా«ద్ అన్నారు. సోమవారం సంస్థ ఆధ్వర్యంలో కెనాల్‌రోడ్డులో వినాయకుని గుడి సమీపంలోని బ్రహ్మచారి బావాజీమఠంలో పుష్కరయాత్రికులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా 5 పుష్కరాల్లోనూ తాము భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిత్యం రెండు వేల మందికి అన్నదానం చేస్తున్నామన్నారు. సోమవారం నుంచి పుష్కరాలు ముగింపు రోజు వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నసమారాధన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బెవర నాయుడు, కార్యదర్శి బొల్లి సాంబశివరావు, కోశాధికారి శంభాన సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మజ్జి పెద్ద సత్యనారాయణ, సహాయ కార్యదర్శి మజ్జి ఈశ్వరరావు, సభ్యులు పులపా గోవిందు, గూడెల గంగాధరరావు, బేవర గంగాధర రావు, వూటకూరి సుబ్బారావు, షేక్‌మస్తాన్, అడ్డూరి రాము తదితరులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి రూ.మూడు లక్షల విరాళాలు
అన్నవరం : సత్యదేవుని నిత్య అన్నదానపథకానికి ఆదివారం రూ.మూడు లక్షల విరాళాలను భక్తులు సమర్పించారు. వీటిలో ఇద్దరు దాతలు రూ.2,02,232 విరాళాలను అందజేశారు. మరో రూ.98 వేల విరాళాలను మరి కొంతమంది భక్తులు సమర్పించారు. శంఖవరానికి చెందిన ప్రత్తిపాడు మాజీ శాసనసభ్యురాలు పర్వత బాపనమ్మ రూ.1,01,116 విరాళాన్ని ఈఓ కే నాగేశ్వరరావుకు ఆదివారం అందచేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా శ్రావణ శుద్ధ తదియ నాడు మాజీ ఎమ్మెల్యే పర్వత సుబ్బారావు పేరున అన్నదానం చేయమని ఆమె కోరారు. బాపనమ్మ వెంట టీడీపీ నాయకుడు పర్వత రాజబాబు, స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఆచంట రామకృష్ణారావు, వేంకట మహాలక్ష్మి దంపతులు కూడా సత్యదేవుని అన్నదానç ³థకానికి రూ.1,01,116 విరాళాన్ని ఈఓకి అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు అన్నదానం చేయమని కోరారు. -
శ్రీవారి అన్నదానానికి కూరగాయల వితరణ
లబ్బీపేట : స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా దేవాలయంలో ప్రతిరోజూ లక్ష మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదం అందిస్తున్నామని, వాటికి అవసరమైన కూరగాయలను దాతలు ఉచితంగా అందించడం శుభసూచికమని రాష్ట్ర సమాచార ఫౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునా«థరెడ్డి అన్నారు. మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో అరవపల్లి శేషసాయివర్మ, కావ్య, అరవపల్లి ఆధిత్య, మండవ సస్య, మండవ కాళీ అన్నపూర్ణ ఆధ్వర్యంలో రూ. 3లక్షల విలువైన కూరగాయలను గురువారం సరఫరా చేశాారు. ఈ లారీని బృందావన కాలనీలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో తీతీదే∙ఆలయ నమూనా ఏర్పాటు చేసామని, ఆ ఆలయంలో ప్రతిరోజూ లక్ష మంది భక్తులకు అన్నదానం చేస్తున్నామన్నారు. అన్నదానానికి దాతలు కూరగాయలు ఉచితంగా అందచేయడం అభినందనీయమని, దీనిని మిగిలిన వారు స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. అధికారులకు కూరగాయలు అందచేతః దాతలు అందించిన కూరగాయలను తితిదే కల్యాణ మండపంలోని అన్నప్రసాదం ట్రస్ట్ ప్రత్యేక అధికారిణి పి.చెంచులక్ష్మికి మండవ కుటుంబరావు అందించారు. ఈ సందర్భంగా చెంచులక్ష్మి మాట్లాడుతూ స్వామివారి ప్రసాదంలో భాగంగా టమాటా రైస్, పులిహోర అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ క్యాటరింగ్ ఆఫీసర్ జీఎల్ఎన్ శాస్త్రి పాల్గొన్నారు. ఫొటో 11 విఐఇ 41– తితిదే అన్నదానానికి కూరగాయల లారీని జెండా ఊపి ప్రారంభిస్తున్న పల్లె రఘునాథరెడ్డి , మండవ కుటుంబరావు తదితరులు -
రోజూ 50వేల మందికి అన్నదానం
కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని సంగమేశ్వరం వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రతి రోజు కనీసం 50వేల మందికి అన్నదానం చేయడానికి అయా సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. సంగమేశ్వరంలో పుష్కర బాధ్యతలు నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ సీహెచ్ హరికిరణ్...అన్నదానం చేయడానికి వచ్చిన ఏడు సంస్థలకు అవసరమైన స్థలాలను కూడా చూపించారు. అన్నదాన కార్యక్రమాలు 12వ తేదీ నుంచి మొదలై పుష్కరాలు ముగిసే వరకు ఉంటాయి. వీరికి గ్యాస్, పాలు సరఫరా చేసేందుకు పౌరసరఫరాల సంస్థకు, విజయ పాల డెయిరీకి ఆదేశాలు ఇచ్చారు. అన్నదానానికి ముందుకు వచ్చిన సంస్థలు ఇవే... –సంగమేశ్వరం గ్రామానికి చెందిన శేషన్న, గ్రామస్తులు, కర్నూలుకు చెందిన గురుదత్త కపాలయం, ఉమామహేశ్వర నిత్య అన్నదాన సంస్థ, యాగంటిస్వామి రూరల్ డెవలప్మెంటు సొసైటీ (బనగానపల్లి), కర్నూలుకు చెందిన భారత్ వికాస్ పరిషత్, ఓర్వకల్లు మండల ఐక్య పొదుపు సంఘం, అహోబిలSబ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం. – ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కొలనుభారతిలో ప్రతిరోజు 6000 మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. -
సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి రూ.లక్ష విరాళం
అన్నవరం : సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి నెల్లూరుకు చెందిన పూజా కన్స్ట్రక్షన్స్ అధినేత తిరుమర్ల నరేంద్రరెడ్డి రూ.1.00,116 విరాళాన్ని దేవస్థానం ఈఓ నాగేశ్వరరావుకు ఆదివారం అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా ఆగస్టు 15న అన్నదానం చేయాలని దాత కోరినట్లు అధికారులు తెలిపారు. -
వేలవేల వందనాలు
⇔ వాడవాడలా వైఎస్సార్ జయంతి వేడుకలు ⇔ వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం, ఘన నివాళులు ⇔ పేదలకు అన్నదానం, రక్తదాన శిబిరాలు, పండ్లు, బ్రెడ్ల పంపిణీ ⇔ అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు, వైఎస్ అభిమానుల హాజరు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు జిల్లాలో శుక్రవారం వాడవాడలా ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు వైఎస్సార్ అభిమానులు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు పాలభిషేకాలతో పాటు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. వైఎస్ జయంతిని పురస్కరించుకొని పేదలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణి చేశారు. రక్తదాన శిబిరాలు, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామానా ⇔ వైఎస్ జయంతి వేడుకలు జరిగాయి. ఒంగోలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యాలయంలో వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ⇔ మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, పార్టీ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డిలు వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ⇔ కొండపి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా జయంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ⇔ దర్శి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాలల్లో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ⇔ చీరాల నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ వరికూటి అమృతపాణిలు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచారు. ⇔ అద్దంకిలో పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి రోగులకు పండ్లు పంచారు. ⇔ యర్రగొండపాలెం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, ఎంపీపీ విజయభాస్కర్‌తో పాటు ఆయా మండలాల పార్టీ శ్రేణులు వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ⇔ గిద్దలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ⇔ కందుకూరు నియోజకవర్గంలో కొల్లూరి కొండయ్య, గంగిరెడ్డి, రమేష యాదవ్‌ల ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ⇔ సంతనూతలపాడు నియోజకవర్గంలో పార్టీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో నాయకులు జయంతి వేడుకలు నిర్వహించారు. ⇔ పర్చూరు నియోవర్గంలో పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. ⇔ కనిగిరి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బుర్రా మధుసూదనయాదవ్ ఆధ్వర్యంలో అన్నీ మండలాల్లో వైఎస్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు. -
కడుపు నింపుతూ.. కన్నీళ్లు తుడుస్తూ..
ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే వారు తిరిగి ఎప్పుడు వెళ్లిపోతారా అని ఎదురుచూసే కాలమిది. ఇలాంటి పరిస్థితుల్లో కర్నూలు పెద్దాసుపత్రికి వచ్చే వందలాది మంది రోగుల సహాయకులకు ప్రతిరోజూ భోజనం పెట్టడం సాధారణ విషయం కాదు. దాతలెంత సహకారం అందిస్తున్నా ఇక్కడ పని చేసే సద్గురు దత్త కృపాలయం వారు పేదలకు సేవ చేయడంలోనే భగవంతుడిని చూసుకుంటున్నారు. అది ఆకలితో అలమటించి వచ్చే వారిలోనేనైనా, ఆత్మీయులు చనిపోతే బాధలో ఉండేవారిలోనైనా ఒక్కటే. అందుకే ఈ రెండు కార్యాల్లో తమ వంతుగా సేవ చేస్తున్నారు. మానవసేవే మాధవ సేవగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. - కర్నూలు(హాస్పిటల్) * పెద్దాసుపత్రిలో రోజూ వెయ్యి మందికి అన్నదానం * రోగులను, మృతదేహాలను తరలించేందుకు వాహనాలు * బృందావనంగా వైకుంఠ క్షేత్రం * సద్గురుదత్త కృపాలయం సేవలు విస్తృతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అధికంగా వచ్చేది పేదవారే. వీరిలో చాలా మంది రోజూ మూడుపూటలా కడుపునిండా తినలేని దుస్థితిలో ఉంటారు. బయట హోటళ్లలో భోజనం చేయాలంటే ఒక్కొక్కరికి ఒక పూటకు రూ.60కు పైగానే ఖర్చు అవుతుంది. ఇలా ఖర్చుచేయలేని వారు ఆ పూటకు పస్తులుంటారు. ఉదయం టిఫిన్ చేసి మళ్లీ రాత్రి కాస్త తిని పడుకుంటారు. మరికొందరు స్టవ్‌తో పాటు నిత్యాసర వస్తువులు తెచ్చుకుని ఆసుపత్రి పరిసరాల్లో వండుకుని తింటారు. అది కూడా అన్నం, రసం లేదా పచ్చడితో సరిపుచ్చుకుంటారు. ఇలాంటి వారికి కనీసం ఒక పూటైనా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో 2012 జనవరి 29వ తేదీన ఆసుపత్రిలో నిత్యాన్నసేవ ప్రారంభించారు. ఇందుకోసం ఆసుపత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం పక్కన అధికారులు ఒక భవనాన్ని కేటాయించారు. దాన్ని ఆధునీకరించి నిత్యాన్నసేవను ప్రారంభించారు. మొదట్లో 500 మందితో ప్రారంభమైన ఈ సేవ నాలుగు నెలలకే 1000కి చేరుకుంది. ప్రస్తుతం ప్రతిరోజూ 1200 మంది దాకా ఇక్కడ భోజనం చేస్తున్నారు. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ భోజనం పెడతారు. అన్నం, పప్పు/సాంబార్, మజ్జిగ అందిస్తారు. ప్రతి శనివారం, పండుగ రోజుల్లో ఏదైనా తీపి వంటకాన్ని వడ్డిస్తారు. ఇందులో సేవ చేయడానికి నగరంలోని పలువురు రిటైర్డ్ ఉద్యోగులు 25 నుంచి 30 మంది ప్రతి రోజూ వస్తారు. మొత్తం కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉండి వెళతారు. సద్గురు దత్త కృపాలయం ట్రస్ట్‌కు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్. శ్రీనివాసగుప్త, ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం, కార్యదర్శిగా జె. రత్నాలశెట్టి, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసరావు, మల్లారెడ్డి, కోశాధికారిగా పి. బాలసుధాకర్ వ్యవహరిస్తున్నారు. సేవ చేయడంతో ఆత్మసంతృప్తి నేను నాలుగేళ్ల నుంచి నిత్యాన్నసేవలో పాల్గొంటున్నాను. నిత్యాన్నసేవలో పాల్గొనడంతో నాకు ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. ఆకలితో ఉన్న వాడికి కడుపునింపితే కలిగే మానసికానందం వెలకట్టలేనిది. - పి. బాలసుధాకర్, కోశాధికారి ఎంత సంపాదించినా జానెడు పొట్టకోసమే మనిషి ఎంత కష్టపడ్డా జానెడు పొట్టకోసమే. అది మనిషి మనిషికీ కష్టపడే విధానం, తెలివితేటల్తో సంపాదించడంలో తేడా ఉంటుంది. ఉన్న వారు లేనివారికి పెట్టడం మానవధర్మం. అది లేకపోతే ఈ జన్మకు పరమార్థం లేదు. నేను నిత్యాన్నసేవతో పాటు వైకుంఠ క్షేత్రంలో సేవలందిస్తాను. - జయంతి క్రిష్ణమూర్తి, వ్యాపారి అన్నదానం ఎంతో బాగుంది మాది వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామం. నా భార్య రజిత కాన్పు కోసం నాలుగు రోజుల క్రితం వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే భోజనం చేస్తున్నాను. ఇంట్లో భోజనం చేసిన విధంగా ఇక్కడ పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి సమయంలో ఒకపూట భోజనం మాకు ఎంతో ఉపయోగకరం. - బి. రవి, వెల్దుర్తి శ్మశాసనమే భావనే ఉండదు ఆరేళ్ల క్రితం మా బంధువు ఒకరు చనిపోతే శ్మశానానికి వెళ్లాను. అక్కడ ప్రతి పనికీ డబ్బు అడుగుతుంటే బాధ అనిపించింది. ఇప్పుడు అదే శ్మశానాన్ని సద్గురుదత్త కృపాలయం వారు బృందావనంగా మార్చారు. ఇప్పుడు అంతా ఉచిత సేవలే. ఈ సంస్థలో ఎక్కడా వ్యక్తులు కనిపించరు. కేవలం ట్రస్ట్ సేవలే కనిపిస్తాయి. - రమేష్‌బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సద్గురుదత్త కృపాలయం సేవల ఫోన్ నెంబర్లు వైకుంఠరథం : సతీష్‌కుమార్, సెల్ నెం.9849017744 నిత్యాన్నసేవ : రమేష్‌బాబు, సెల్ నెం. 9160551283 సి. రాముడు, సెల్ నెం. 9440996919 -
అన్నప్రసాదంపై ఆటలు
► రూ.50 లక్షలతో తాత్కాలిక అన్నదానం షెడ్డు నిర్మాణం ► మరో చోట పర్మినెంట్ బిల్డింగ్ ► ప్రస్తుతం రోజుకు రూ.12 వేల అద్దెతో సత్రం లీజుకు.. ► వృథా ఖర్చులపై భక్తుల ఆగ్రహం సాక్షి, విజయవాడ: దుర్గగుడి అధికారులు తీసుకునే నిర్ణయాలు ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలా. నష్టం చేకూర్చేలా, భక్తులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వంట చేసుకునేందుకు అన్నదాన భవనం నిర్మించారు. ప్రస్తుతం దేవాలయంలో అభివృద్ధి పేరుతో ఈ భవనాన్ని తొలగించారు. ప్రస్తుత అద్దె భవనంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేవస్థానానికి వచ్చిన భక్తులేనా ? దేవస్థానంలో రోజుకు 5 వేల మందికి భోజనం పెట్టాలనే నిబంధన ఉంది. కొండపై నుంచి దిగువకు మార్చిన తరువాత అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకంటే వన్‌టౌన్‌లోని చిరు వ్యాపారస్తులే ఎక్కువగా తింటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అమ్మ వారి దర్శనమైన తరువాత పక్కనే భోజనశాల ఉంటే అక్కడకు వెళతారు. ఇప్పుడు కొండ దిగువకు మార్చడంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ షెడ్లు లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం 9 గంటలకే అన్నదానం ప్రారంభమవుతోంది. ఇది కాళేశ్వరరావు మార్కెట్లో, కెనాల్ రోడ్డులో పనిచేసే కూలీలకు వరంగా మారింది. కొండపైన అన్నదానం జరిగేటప్పుడు సాధారాణ రోజుల్లో 3500 మంది వచ్చేవారు. శుక్ర, ఆదివారాల్లో 4200 మంది భోజనం చేసేవారు. ప్రస్తుతం సత్రంలో రోజుకు 4200 మంది, శుక్ర, ఆదివారాల్లో 4500 మంది భక్తులు భోజనాలు చేస్తున్నారు. అదనంగా తినే భక్తులంతా అమ్మ దర్శనం అయిన తరువాత భోజనశాలకు వస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా అమ్మ సొమ్ము దుర్వినియోగం కాదా? అని కొందరు భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తాం అన్నదానం పర్మినెంట్ బిల్డింగ్ నిర్మించాక..తాత్కాలిక షెడ్డును భక్తుల విశ్రాంతి మందిరంగా ఉపయోగిస్తాం. బయటి భక్తులు అన్నదానానికి రావడాన్ని అరికట్టేందుకు త్వరలోనే బార్ కోడింగ్, ట్యాగ్ విధానాన్ని అమలు చేస్తాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటాం. - చంద్రశేఖర్ ఆజాద్, దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శృంగేరీ సత్రంలో తాత్కాలిక అన్నదానం అర్జున వీధిలోని శృంగేరి వడ్లమన్నాటి వారి సత్రంలో తాత్కాలిక అన్నదాన కార్యక్రమం ఆరో తేదీ నుంచి ప్రారంభించారు. దసరా, భవానీ దీక్షల సమయంలో ఈ శృంగేరి సత్రాన్ని అద్దెకు తీసుకుని అన్నదానం చేస్తుంటారు. ప్రస్తుతం రోజుకు రూ.15 వేలు చొప్పున అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. శృంగేరి సత్రానికి దగ్గరలోనే ఇరిగేషన్‌కు చెందిన పాత భవన సముదాయం స్థలాన్ని దేవస్థానం తీసుకుంది. ఇక్కడ పాత భవనాలను తొలగించి నెల రోజుల్లోగా తాత్కాలిక షెడ్డు వేసి అన్నదానం కార్యాక్రమాన్ని అక్కడకు మార్చాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. దీని కోసం సుమారు రూ.50 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనాలు వేశారు. పుష్కరాల తరువాత షెడ్లను తొలగించి దాని స్థానంలో పర్మినెంట్ బిల్డింగ్ నిర్మిస్తారు. అద్దె భవనం, తాత్కాలిక షెడ్ల కోసం సుమారు అర కోటి ఖర్చు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పుష్కరాల తరువాత పక్కా భవనాలు నిర్మించి అప్పుడే కిందకు అన్నదానం మార్చితే వచ్చే నష్టం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అమ్మవారి ఫిక్స్డ్ డిపాజిట్లను తీసి ఇలా తాత్కాలిక పనులకు కేటాయించడం సరికాదనే వాదన వినిపిస్తున్నాయి. పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వీరంతా షెడ్డుల్లోనే కూర్చుని భోజనాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ షెడ్డుల్లోనైనా సరైన వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. -
‘భారతీ సిమెంట్స్’ ఆధ్వర్యంలో అన్నదానం
జోగిపేట(మెదక్): మెదక్ జిల్లా జోగిపేట లోని శ్రీజోగినాథ ఆలయ రథోత్సవాల్లో భాగంగా బుధవారం శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ‘భారతీ సిమెంట్స్’ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ మేనేజర్ పీఎస్.కరుణాకర్, డిప్యూటీ మేనేజర్ సతీష్‌కుమార్ ప్రారంభించారు. సుమారు మూడువేల మంది భక్తులు భోజనాలు చేశారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్‌కు ఆలయ రథోత్సవ కమిటీ అభినందనలు తెలిపింది. సంస్థ టెక్నికల్ మేనేజర్ నరేష్ కుమార్, ఇంజనీర్ గణేష్, జోగిపేట షిర్టీ సాయిబాబా ట్రేడర్స్ యాజమాని సీహెచ్.నర్సింలు, సంగారెడ్డికి చెందిన శ్రీ బాలాజీ సాయిరాం ట్రేడర్స్ యాజమాని కృష్ణకాంత్, నగర పంచాయతీ చైర్పర్సన్ ఎస్.కవిత సురేందర్‌గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అన్నదానానికి హాస్టల్ విద్యార్థులు...
వీరఘట్టం (నీలానగరం) : పలు సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు పలు ఉత్సవాల సమయంలో గ్రామాల్లో జరుగుతున్న అన్నదానాలకు వెళ్తున్నారు. ఇందుకు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నారు. అరుుతే హాస్టళ్లలో మాత్రం ఆ పూట విద్యార్థులకు భోజనం పెడుతున్నట్టు రికార్డుల్లో చూపిస్తూ బిల్లులు కాజేస్తున్నారు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా నీలానగరంలో శుక్రవారం జరిగిన అన్నదాన కార్యక్రమానికి గ్రామంలోని హాస్టల్ విద్యార్థులు వెళ్లారు. అయితే హాస్టల్లో భోజనం వండినట్టు చూపించారు. సెలవు రోజు విద్యార్థులను హాస్టళ్లలో ఉంచి ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి తర్ఫీదు ఇవ్వాలి. అందుకు విరుద్దంగా శుక్రవారం నీలానగరం హాస్టల్‌ను ఉదయం 9 గంటలకు సాక్షి వెళ్లినపుడు ఒకే ఒక విద్యార్థి ఉన్నాడు. మిగిలిన విద్యార్థులేరి అని అడిగితే నీలానగరం, కుమ్మరిగుంట గ్రామాల్లో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి వెళ్లినట్టు తెలిపాడు. ఇదీ విషయం... నీలానగరంలో అధునాతన హంగులతో ఎస్సీ బాలుర వసతి గృహాన్ని నిర్మించారు. ప్రత్యేక హాస్టళ్లు ఎత్తి వేయడంతో ఇక్కడ మూడు నుంచి 9వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 40 మంది విద్యార్థులున్నారు. వీరిలో సగం మంది స్థానికంగా ఉన్నవారు కావడంతో రాత్రి ఇక్కడ 20 నుంచి 25 మంది విద్యార్థులు మాత్రమే ఉంటున్నట్లు పలువురు చెబుతున్నా. గ్రామంలో అప్పుడప్పుడు గ్రామంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలకు విద్యార్థులు హాజరు కావడం పరిపాటిగా మారింది. అధికారులు మాత్రం హాస్టళ్లలోనే విద్యార్థులు భోజనం చేస్తున్నట్లు బిల్లులు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు పర్యవేక్షించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై వార్డెన్ జోగినాయుడును సాక్షి అడుగ్గా శుక్రవారం మధ్యాహ్నం 25 మంది విద్యార్థులు హాస్టల్లోనే భోజనం చేసినట్టు చెప్పడం విశేషం. అన్నదానానికి వెళ్ళారు.. ఉదయం హాస్టల్లో భోజనం చేసి అందరూ కుమ్మరిగుంట, నీలానగరంలో జరుగుతున్న అన్నదానం కార్యక్రమానికి వెళ్లారు. నేను కూడా వెళ్తున్నాను. - ఆర్.రాజు, 8వ తరగతి విద్యార్ధి, ఎస్సీ హాస్టల్ విద్యార్థి, నీలానగరం ఊరులో భోజనాలు ఉన్నాయి... ఊరులో శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం జరుగుతున్నందున పిల్లలంద రూ ఊరులోకి భోజనాలకు వెళ్ళారు. అందుకే మధ్యాహ్నం వంట చేయలేదు. - పి.సురేష్, వంట మనిషి -
మల్లాం ఆలయంలో వైఎస్సార్ సీపీ నేత పూజలు
చిట్టమూరు: మండల పరిధిలోని మల్లాం గ్రామంలో స్వయంభువుగా కొలువైన వళ్లీదేవ సేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డిలు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు మూలం భానుప్రకాష్ శర్మ పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి చిత్రపటం బహూకరించారు. ఆలయ అభివద్ధి, కోనేరు నిర్మాణానికి సహయ సహకారాలు అందిస్తామన్నారు. భక్తులకు అన్నదానం: ఆలయంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని వైస్సార్ సీపీ నాయకులు ప్రారంభించారు. ఉభయకర్తలుగా ఓడూరు గిరధర్ రెడ్డి, ఇందూరు రోహన్ సాయిలు వ్యవహరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా జాయింట్ సెక్రటరీ పేరం మధునాయుడు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి చెన్నారెడ్డి బాబురెడ్డి, నాయకులు కళత్తూరు రామ్మోహన్ రెడ్డి, ఓడూరు సుందరరామిరెడ్డి, పెళ్లకూరు సర్పంచ్ బైనా చంద్రశేఖర్ రెడ్డి, కామిరెడ్డి మోహన్ రెడ్డి, ఓడూరు రమణారెడ్డి, అన్నమనేని రామకష్ణనాయుడు, చెన్నారెడ్డి చెంచురాఘవరెడ్డి పాల్గొన్నారు. -
పుష్కర భక్తులకు అన్నదానం
-
నటుడు విశాల్ అన్నదానం
తమిళసినిమా: విశాల్ నటుడిగానే కాకుండా ఇతరత్రా కూడా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో భాగంగానే ఇటీవల తన అభిమాన సంఘాలను ప్రజా సంఘంగా మార్చి ప్రజాసేవకు కార్యరూపం దాల్చారు. అంతేకాకుండా దక్షిణ భారత నటీనటుల సంఘం వ్యవహారంలో కూడా తన వాయిస్‌ను గట్టిగానే వినిపిస్తున్నారు. త్వరలో జరగనున్న ఈ సంఘం ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా తాజాగా విశాల్ తన లోని మానవత్వానికి నిదర్శనంగా మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివా రం ఉదయం తన సోదరి ఐశ్వర్యతో కలసి స్థానిక కీల్పాక్కం చర్చ్‌లోని 200 మందికి అనాథలకు అన్నదానంతో పాటు చీరలు, ధోవతులు పంచిపెట్టారు. -
తిరుమలలో అన్నదానానికి 30 ఏళ్లు
చిత్తూరు: తిరుమల క్షేత్రంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా నిర్వహిస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు అన్నారు. 1985, ఏప్రిల్ 6న రోజుకు రెండు వేల మందితో అన్నదాన కార్యక్రమం ప్రారంభం కాగా... అది నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. ఆదివారం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనంలో ఈవో సాంబశివరావు విలేకరులతో మాట్లాడారు. అన్నదాన కార్యక్రమం 30 ఏళ్లుగా భక్తుల ఆకలి తీర్చిందన్నారు. రోజుకు 45 వేలు, వారాంతంలో రోజుకు 55 వేలు, పర్వదినాల్లో లక్ష మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నట్టు తెలిపారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరులో రోజుకు 1.16 లక్షల నుంచి 1.42 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నట్టు వెల్లడించారు. 3.6 లక్షల మంది దాతలు ఇచ్చిన రూ.591.36 కోట్ల విరాళాలపై వచ్చే రూ.40 కోట్ల వడ్డీతోపాటు, టీటీడీ రూ.30 కోట్ల గ్రాంట్ కలుపుకుని ఏడాదికి రూ.70 కోట్ల ఖర్చుతో నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇకపై భక్తులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతపై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డెప్యూటీ ఈవోలు వేణుగోపాల్, రమణ, సరోజిని, పీఆర్వో రవి తదితరులు పాల్గొన్నారు. -
మిన్నంటిన సంబరాలు
ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ పతాకాల ఆవిష్కరణ, వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు పేదలకు అన్నదానం రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగింది. పార్టీ శ్రేణులు వాడవాడలా వైఎస్సార్ సీపీ పతాకాన్ని ఎగుర వేసి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాలుగేళ్ల ప్రస్థానాన్ని నేతలు మననం చేసుకున్నారు. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల పక్షాన పోరుబాట సాగిస్తూ ఆదర్శ నేత అని నిరూపించుకున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తరువాత ఒక్క హామీ కూడా నెరవేర్చక ప్రజలను మోసగించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, బాబు మోసాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిన అవసరముందని నేతలు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరుబాట సాగిస్తున్న విషయం ఇప్పటికే ప్రజలు గమనిస్తున్నారని, వీటిని మరింతగా ప్రజల్లోకి తీసుకుపోయి వారికి అండగా నిలవాల్సిన అవసరముందని వైఎస్సార్ సీపీ నేతలు కార్యకర్తలకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విప్లవాత్మక రీతిలో అమలు చేసిన ప్రజాసంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు మరింతగా కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్తూరులో పలుచోట్ల జరిగిన వేడుకల్లో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవితోపాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుపతి నియోజకవర్గంలో స్థానిక నేతల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెయ్యి మంది పేదలకు అన్నదానం చేశారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. పూతలపట్టులో రాజారత్నంరెడ్డి ఆధ్వర్యంలో, ఐరాలలో మహిళా నాయకురాలు శైలజాచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కుప్పం నియోజకవర్గంలో మండల కన్వీనర్ వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గవ్యాప్తంగా పార్టీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.మదనపల్లె నియోజకవర్గపరిధిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబ్జాన్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జెండా ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. పలమనేరు నియోజకవర్గంలో పార్టీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్వీట్లు పంచారు. సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. పీలేరు నియోజకవర్గంలో జిల్లా అధికార ప్రతినిధి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అన్ని మండలాల్లోనూ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఎంపీ కోటాలో మంజూరైన గ్యాస్ కనెక్షన్లను పేద మహిళలకు పంపిణీ చేశారు. పుత్తూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపల్ చైర్మన్‌తోపాటు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈకార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రముఖుల పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.పార్టీ జెండా ఆవిష్కరించి, కార్యక్రమాలను నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచారు. మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోనూ వేడుకలను నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దిన వేడుకలు ఘనంగా జరిగాయి. జీడీనెల్లూరు నియోజకవర్గంలో స్థానిక నేతల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. -
పుష్కరాల్లో రోజూ 40 వేల మందికి అన్నదానం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) :రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా నిత్యం సుమారు 40 వేల మందికి అన్నసమారాధన నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్యవైశ్య సంఘాధ్యక్షుడు గాదంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వైఎంహెచ్ఏ హాలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఆర్యవైశ్య సంఘం జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నికైందన్నారు. కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. సంఘం గౌరవాధ్యక్షునిగా మాటూరి వీర వెంకట నర్సింహ మూర్తి, ప్రధాన కార్యదర్శిగా వంకాయల శ్రీనివాసరావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా సుగ్గిశెట్టి నూకరాజు, కోశాధికారిగా జల్లిపల్లి వైకుంఠరావు, అదనపు కోశాధికారిగా నుదురుపాటి శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శిగా సుగ్గిశెట్టి వీరవెంకట శేషనాగ హనుమంతరావు, చీఫ్ కో-ఆర్డినేటర్ చక్కా గంగా సత్యనారాయణ ఎన్నికయ్యారని తెలిపారు. వీరితో పాటు సుమారు 60 మంది కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నట్లు వివరించారు. ఈ నెల 8వ తేదీన జరుగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, శిద్ధా రాఘవరావులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరౌతారన్నారు. కొత్త కార్యవర్గం 2015 నుంచి 2017 వరకూ పదవిలో ఉంటుందన్నారు. తమ పదవీ కాలంలో సంఘ బలోపేతానికి, వివిధ కార్యక్రమాల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, వాటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపాన్ని ఏసీ సౌకర్యంతో ఆధునికీకరిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. -
పెళ్లి రోజున అన్నదానం!
పెళ్లి రోజున సూపర్‌స్టార్ రజనీకాంత్, లతా దంపతులు అనాథల సేవలో గడపనున్నారు. సూపర్‌స్టార్ వివాహం 1981 ఫిబ్రవరి 26న జరిగింది. వీరి దాంపత్య జీవితం గురువారానికి 34 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ పెళ్లి రోజును రజనీకాంత్ , లతా దంపతులు అనాథల సేవలో గడపడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా తలైవర్ ఫౌండేషన్ తరపున కాట్టాన్ కొళత్తూరులోని శివానంద గురుకుల ఆశ్రమంలో 320 మంది అనాథ బాలలకు 60 మంది వయసు మళ్లిన వారికి అన్నదానం చేయనున్నారు. కార్యక్రమంలో రజనీకాంత్ అభిమాన సంఘం నిర్వాహకులు సైదైరవి, వాలాజా కలిప్ పాల్గొననున్నారు. అదే విధంగా రజనీ అభిమానులు నృత్య దర్శకుడు లారెన్స్ నిర్మించిన అంబత్తూరులోని శ్రీ రాఘవేంద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇంకా నగరంలోని పలు దేవాలయాల్లో రజనీకాంత్, లత దంపతుల పేర్లతో అర్చన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.