స్వామీ.. తినలేం | Quality ledantunna patients, aides | Sakshi
Sakshi News home page

స్వామీ.. తినలేం

Published Tue, Nov 8 2016 2:25 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

స్వామీ.. తినలేం

స్వామీ.. తినలేం

టీటీడీ ఆస్పత్రుల్లో రోజూ 6 వేల మందికి అన్నప్రసాదం
నాణ్యత లేదంటున్న రోగులు, సహాయకులు
కనీసం ప్లేట్లు కూడా కరువే
పలచటి పేపర్లలో పెట్టడం వల్ల నేలపాలు

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఆకలితో ఉన్న వారికి అన్నం పరబ్రహ్మ స్వరూపంగా దర్శనమిస్తుంది. అందులోనూ అనారోగ్యంతో ఉంటూ, అచేతనం గా పడిఉన్న రోగులు, వారి సహా యకులకు అన్నదానం చేసేందుకు థార్మిక సంస్థ టీటీడీ ముందుకొచ్చింది. ఆ ప్రసాదాన్ని మహా ప్రసాదంగా భావించి స్వీకరిస్తున్నారు. అరుుతే ఆసుపత్రులకు అందిస్తున్న అన్నప్రసాదంలో ఇటీవల రుచి తగ్గిందనే ఆరోపణలు వినిపిస్తున్నారుు.  నాణ్యత లేని, పుచ్చిన కూరగాయలు వాడుతున్నారని పలువురు రోగుల సహాయకులు చెబుతున్నారు.

తిరుపతి మెడికల్: తిరుపతి పుణ్యక్షేత్రం కావడం, రాయలసీమకే తలమానికంగా ప్రభుత్వ, ప్రరుువేట్ ఆసుపత్రులు ఉండటంతో నిత్యం వందలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వీరితో పాటు సహాయకులు వస్తున్నా, సకాలంలో భోజన సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు. ఈనేపథ్యంలో  ఆసుపత్రులకు వచ్చే రోగులకు,  వారి సహాయకులకు రెండు పూటలా భోజనం  అందించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం అన్నప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టారు. నగరంలోని రుయా, బర్డ్, స్విమ్స్, ఎస్వీ ఆయుర్వేద, ప్రభుత్వ మెటర్నటీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని  టీటీడీ సరఫరా చేస్తోంది. ఉదయం 3,600 మందికి, సాయంత్రం 3,600 మంది చొప్పున రెండు పూటలా దాదాపు 7వేల మందికి పైగా అన్నప్రసాదం వడ్డిస్తుండటం విశేషం. గత కొన్ని రోజులుగా అన్నప్రసాదం రుచిగా లేదనీ, అన్నప్రసాదంలో వాడే కూరగాయలు నాణ్యత తగ్గిందన్న ఆరోపణలు వినిపిస్తున్నారుు. 

లోపించిన కూరగాయల నాణ్యత
అన్నప్రసాదం (సాంబారు)లో ఉపయోగించే కూరగాయల నాణ్యత తగ్గిందని ఆరోపణలున్నారుు. సాధారణంగా సాంబారు అన్నంలో బీన్‌‌స, ముళ్లంగి, క్యారెట్, గుమ్మడి వంటి తాజా కూరగాయలు వేసి ఘుమ ఘుమలాడే రుచితో అన్నప్రసాదాన్ని వడ్డించేవారు. టీటీడీ క్యాంటీన్‌కు విరాళాల రూపంలో సరఫరా అయ్యే కూరగాయల సంఖ్య ఇటీవల పెరిగింది. వాటిని నిల్వ ఉంచే క్రమంలో కుళ్లిన , పుచ్చిన కూరగాయలను వేరుచేయాల్సి ఉన్నా చూసి చూడకుండా అలాగే వేసి వండుతున్నారనే విమర్శలున్నారుు. పైగా సాంబారు అన్నంలో కుళ్లిన కూరగాయలు దర్శనమిస్తున్నాయని రోగుల సహాయకులు ఆరోపించారు. వేడిగా ఉండటంతో గంట తరువాత సాంబారు అన్నం తింటే పాచిన వాసన వచ్చిందని  వేణుగోపాల్ అనే రోగి సహాయకుడు తెలిపారు. ఈ విషయమై దీపావళి పండగ ముందు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందిచానని ఆయన చెప్పారు.

వేళకు రాని అన్నప్రసాదం
రోజూ సాయంత్రం పూట ఆసుపత్రుల్లో వడ్డించే అన్నప్రసాదం వేలకు రావడం లేదని రోగుల సహాయకులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు రావాల్సిన అన్నప్రసాదం రాత్రి 7 గంటలు అవుతున్నా రాదని, అంతవరకు ఆకలితో వేచిఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని సిబ్బందిని అడిగితే ‘‘మీకు అన్నం పెట్టేదే ఎక్కువ. పైగా రూల్స్ మాట్లాడుతావా’’ అంటూ తిట్ల పురాణాలకు దిగుతున్నట్టు రాయచోటికి చెందిన అంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదిలేక పక్కనే ఉన్న హోటల్లో డబ్బులు పెట్టి భోజనం కొనాల్సి వస్తోందన్నారు.

ప్లేట్లు కూడా కరువే
ఆసుపత్రిలో అందిస్తున్న అన్నప్రసాదానికి ప్లేట్లు కూడా కరువయ్యారుు. రోగులకు ఉదయం, సాయంత్రం  రోజుకు రెండు పూటలా సాంబారన్నం, పెరుగన్నం పెడుతున్న టీటీడీ ఆ ప్రసాదాన్ని తినేందుకు భోజన ప్లేట్లు సరఫరా చేయడం లేదు. పైగా భోజన ప్లేట్లను ఆసుపత్రుల నిర్వాహకులే సమకూర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. వేడిగా ఉన్న సాంబారన్నం, పెరుగన్నం పేపరు ప్లేట్లలో వడ్డిస్తుండటంతో ఆ వేడికి పేపర్‌ప్లేట్లు చిరిగిపోతున్నారుు. కళ్ల ముందే చేతిలోని అన్నప్రసాదం నేలపాలవుతుండటంతో రోగుల సహాయకులు నొచ్చుకుంటున్నారు. గతంలో ప్లాస్టిక్ ప్లేట్లను సరఫరా చేసిన రెండు నెలలకే వాటికి స్వస్తి పలకడం విశేషం.  పైగా వర్షం వస్తే రోగుల సహాయకులకు కూర్చుని తినేందుకు కూడా స్థలం లేదు. వర్షంలో తడుస్తూనే తినాల్సి వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. 

మెనూలో టిఫిన్ ఎక్కడ?
టీటీడీ సరఫరా చేసే అన్నప్రసాదంలో ఉదయం పూట అల్పాహారం అందిస్తున్నట్టు మెనూలో ఉంది. అరుుతే రెండేళ్లుగా రోగులు, వారి సహాయకులకు ఎలాంటి అల్పాహారం పెట్టిన సందర్భం లేదు. దీని గురించి అడిగిన నాథుడు లేడు. అదేమని అడిగితే తమకు ఆసుపత్రి వైద్యాధికారులు సహకరించడం లేదని టీటీడీ అధికారులు చెప్పడం గమనార్హం.

నాణ్యతగా పెడుతున్నాం
రోజూ నాలుగైదు రకాల కూరగాయలతో పరిశుభ్రంగా తయారు చేసిన అన్నప్రసాదాన్ని వడ్డిస్తున్నాం. కూరగాయలు నాణ్యతగా ఉన్నారుు. రుచి తగ్గిందన్న ఫిర్యాదు మాకు ఇంతవరకు రాలేదు. భోజనానికి ప్లేట్లు కొరత ఉన్న మాట వాస్తవమే. దీనిని ఆయా ఆసుపత్రుల అధికారులే చూడాలి.  భోజనం సరఫరా చేస్తున్న మాకు ఆసుపత్రుల నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. కనీసం ఇన్‌వారుుస్‌లోనూ సంతకం పెట్టేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. పైగా అన్నప్రసాదం రుచిలో నాణ్యత లోపించిందని తమపై నిందారోపణలు చేయడం బాధాకరం.   - మురళి,సూపరింటెండెంట్, అన్నదానం, తిరుచానూరు.            

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement