అన్నదానం.. పుణ్యకార్యం
అన్నదానం.. పుణ్యకార్యం
Published Sun, Feb 19 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
కర్నూలు(అర్బన్): ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే మహా పుణ్యమని జిల్లా అడిషనల్ కోర్టు జడ్జి స్వప్నరాణి అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు ఆదివారం నుంచి ఏపీ వీరశైవ లింగాయతిరెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జడ్జి స్వప్నరాణి, హైకోర్టు న్యాయవాది సునీల్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండను కూడా లెక్క చేయకుండా అత్యంత భక్తితో సుదూర ప్రాంతాల నుంచి నడిచి వెళ్తున్న వారి ఆకలి తీర్చడం ఎంతో పుణ్యకార్యమన్నారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన కన్నమడకల గ్రామానికి చెందిన సోమేశ్వరరెడ్డి, దామోదర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బాలిరెడ్డి, నాగేశ్వరరావును ఆమె అభినందించారు. సేవా సమితి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, కార్యదర్శి నాగిరెడ్డి, కార్యవర్గ సభ్యులు మహేశ్వరరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, నాగభూషణంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement