srisailam devotees
-
శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం (ఫొటోలు)
-
శ్రీశైలంలో కనుల పండువగా ప్రభోత్సవం (ఫొటోలు)
-
Ugadi 2024: కనులపండువగా శ్రీగిరి క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు (ఫొటోలు)
-
Maha Shivratri: భక్తులతో కిటకిటలాడిన శ్రీశైలం (ఫొటోలు)
-
గవర్నర్‌కు దుర్గగుడి, శ్రీశైలం దసరా ఉత్సవాల ఆహ్వానాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం టెంపుల్: విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా మహోత్సవాల ఆహా్వన పత్రికలను బుధవారం వేర్వేరుగా అందజేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు, శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో డి.పెద్దిరాజు కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. అనంతరం ఆలయాల అర్చకులు వేద ఆశీర్వచనం పలకగా, ఈవో, చైర్మన్లు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డికి విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఆహా్వన పత్రిక అందజేశారు. శ్రీశారదాపీఠాధిపతులకు శ్రీశైలం నవరాత్రుల ఆహ్వానం సింహాచలం: విజయదశమిని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానంలో జరిగే భ్రమరాంబికాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ఆహా్వన పత్రికను విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతికి బుధవారం అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొనాలని దేవస్థానం పండితులు, అధికారులు కోరారు. ఫిబ్రవరిలో చేపడుతున్న ఆలయ కుంభాభిషేకం గురించి వివరించారు. వైదిక, ఆగమ పద్ధతులను కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజుకు స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. -
శ్రీశైలం చరిత్ర మీకు తెలుసా? మీకు తెలియని నిజాలు
-
శ్రీశైలంలో శివ మాల వస్త్రాలు పంచిన ఎమ్మెల్యే
-
శ్రీశైలం వస్తున్నారా.? మా సత్రం ఆతిథ్యం స్వీకరించండి
శ్రీశైలం: మల్లన్న సన్నిధి శ్రీశైలంలో సత్రాలు విస్తరిస్తున్నాయి. ఏడు దశాబ్దాల క్రితం రెండు సత్రాలతో మొదలై నేడు వంద ఎకరాల విస్తీర్ణంలో వందకుపైగా వెలిశాయి. వీటిలో కొన్ని సకల సౌకర్యాలు కలిగి భక్తులకు అవసరమైన సేవలు అందిస్తున్నాయి. మరికొన్ని అన్నపూర్ణ నిలయాలుగా వర్ధిల్లుతున్నాయి. కులానికో సత్రం.. తొలుత 1955కు పూర్వం ఆర్యవైశ్యులు శ్రీశైలానికి వచ్చే భక్తుల కోసం శ్రీ వాసవీ అఖిలభారత ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, శ్రీ వీరశైవ లింగాయితీసత్రం ఏర్పడ్డాయి. ఆ కాలంలో రోడ్డుమార్గం లేకపోవడంతో అటవీమార్గం ద్వారా శివరాత్రి, ఉగాది పర్వదినాలకు భక్తులు శ్రీశైలం చేరుకునేవారు. 1957లో రోడ్డుమార్గం ఏర్పడిన తర్వాత అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ నీలం సంజీవరెడ్డి శ్రీశైలం వచ్చి మల్లన్నను దర్శించుకున్నారు. ఆ సమయంలో వాసవీసత్రాన్ని నిర్వహిస్తున్న మూర్తి వెంకటేశ్వర్లు, లింగాయితీ సత్రం ఫౌండర్ ప్రెసిడెంట్, అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ బోగిశెట్టి జోగప్ప సత్ర నిర్మాణాలకు ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించారు. ఈ రెండు కుల సత్రాలతో పాటు అప్పటికే శ్రీశైల జగద్గురు వాగీశ పండితారాధ్య పీఠంకు సంబంధించిన స్థలం ఆలయ ప్రాంగణంలో ఉండేది. ప్రస్తుతం వీరశైవ లింగాయితులకు సంబంధించిన మూడు సత్రాలు, ఆర్యవైశ్యులకు చెందిన సత్రాలు మూడు ఉన్నాయి. అనంతరం కాలంలో కరివేన బ్రాహ్మణ సత్రం, రెడ్డి, కమ్మ, కాపు, గౌడ, క్షత్రియ, వెలమ, యాదవ, నాయీబ్రాహ్మణ, రజక, కరికాల, గాండ్ల, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, వీరశైవ శరణ బసవేశ్వర, దేవాంగ, కుమ్మరి, వాల్మీకి (బోయ), ఉప్పర, ముదిరాజ్, తదితర ఎన్నో కులాల సత్రాలు శ్రీశైలంలో ఏర్పడ్డాయి. ప్రముఖ సత్రాలకు కోట్లకొద్ది డిపాజిట్లు ఉన్నాయి. వీటి ద్వారా నిర్వహణ కొనసాగిస్తున్నారు. పలు సత్రాల్లో 100కు పైగా గదులు, సూట్లు, ప్రత్యేక కాటేజీలు సైతం ఉన్నాయి. కాగా శ్రీశైల దేవస్థానం ఆయా సత్రాలకు కనిష్టంగా 50 సెంట్లు, గరిష్టంగా 4 నుంచి 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించింది. దాతల సహకారంతో.... ఏ సత్రమైనా అభివృద్ధి చెందాలంటే దాతల సహకారం ఎంతో అవసరం. దేవస్థానం కూడా గదుల నిర్మాణం, అన్నదానం తదితర వాటికి దాతల సహకారం తీసుకుంటుంది. అయితే, లక్షల్లో విరాళాలు ఇచ్చిన దాతలకు వసతి, దర్శన సౌకర్యాల విషయంలో వెసులుబాటు కల్పిస్తుంది. అదే సత్రాల నిర్వాహకులు రూ. 2 లక్షలు ఆపై విరాళం ఇచ్చిన దాతల పేరుపై గది కేటాయింపు చేస్తారు. ఏడాదిలో 30 నుంచి 60 రోజుల పాటు సదరు దాత ఉచితంగా వసతి కల్పిస్తారు. అన్నదానంలో పాలు పంచుకోవాలంటే రూ.216, రూ.516 కనిష్టంగా చెల్లించాలి. దాతల గోత్రనామాలతో అన్నదానం చేస్తారు. శాశ్వత పద్ధతిపై ఏడాదిలో ఒక్కరోజు అన్నదానానికి రూ. 1,116 నుంచి ఆపై విరాళాలు ఇవ్వవచ్చు. -
శ్రీశైలం : అంగరంగ వైభవంగా ఉగాది మహోత్సవాలు (ఫోటోలు)
-
Srisailam : శివ నామస్మరణతో మార్మోగిన శ్రీశైల క్షేత్రం (ఫొటోలు)
-
శ్రీశైలానికి పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)
-
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
-
రణరంగంగా మారిన శ్రీశైలం..
సాక్షి, కర్నూలు: శ్రీశైలంలో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక సత్రం ముందు ఉన్న టీ దుకాణం దగ్గర గొడవ ప్రారంభమైంది. ఈ గొడవలో స్థానికులు, కర్ణాటక వాసల మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం దాడికి దారితీసింది. ఈ క్రమంలో స్థానికులు కర్ణాటక వాసిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. దీంతో హుటాహుటిన దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, శ్రీశైలంలో కర్నాటకవాసిపై దాడి చేయడం జీర్ణించుకోని కన్నడిలు ఆగ్రహంతో స్థానికంగా ఉన్న షాపులను ధ్వంసం చేసి నిప్పటించారు. ఈ క్రమంలో ఆలయ పరిసరాల్లో ఉన్న దుకాణాలు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళ గంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లల్లోని, తాత్కాలిక షాపులను పూర్తిగా ద్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన ఈఓ లవన్న, జగద్గురువు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 చెన్న సిద్ధరామ పండితారాధ్య, శివాచార్య, కర్ణాటక స్వామిజీలతో మాట్లాడి ప్రత్యేక పోలీస్ బృందాలతో పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. -
శ్రీశైలంలో ఘనంగా రధోత్సవం (ఫొటోలు)
-
భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం
-
శ్రీశైల మల్లన్న సన్నిధికి కాలినడకన భక్తులు (ఫొటోలు)
-
శ్రీశైల క్షేత్రానికి భారీగా వెళుతున్న భక్తులు
-
శ్రీశైలంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
ఈ అభిషేకాన్ని దర్శించడం ఎన్నో జన్మల సుకృతం
‘సిరిగిరి మల్లన్నను శరణన్న చాలు పరమపాతక కోట్లు భస్మమై తూలు’ అని శ్రీశైల ప్రశస్తి. శ్రీ పర్వతం లేదా శ్రీశైలం అంటే కైలాసనాథునికి పరమ ప్రీతి. ఇక తెలుగువారికి శివుడంటే ఉన్న ప్రీతికి సాక్ష్యాలు అవసరం లేదు. అసలు త్రిలింగాల వల్లే తెలుగు పదం ఆవిర్భవించిందని కదా మన నమ్మకం. అందుకే శివాలయం లేని ఊరు మనకు తెలుగునాట కనిపించదు. మన శివాలయాల్లో విశిష్టమైన మహత్తుగల క్షేత్రం శ్రీశైలం మహాశివరాత్రి శ్రీశైలంలో రమణీయ, భక్తి భావతరంగిత చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. సర్వం శివమయంగా కనిపించే ఈ క్షేత్రాన్ని మహాశివరాత్రినాడు దర్శించడమే మహాభాగ్యం. క్షేత్రంలో ఎక్కడ ప్రతిష్ఠిత శివలింగం ఉన్నా దర్శనం చేసుకోవడానికి, అభిషేకంలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తి చూపిస్తారు. అనువైన ప్రతిచోటా అడుగడుగునా లింగార్చనలు జరుగుతూ ఉంటాయి. ఆ అభిషేకాలను చూడడమే ధన్యం అనుకున్న భక్తులు తామూ ఒక్క మారేడుదళమైనా ఆ సాంబయ్యపై ఉంచాలని పోటీపడతారు. సిద్ధులు, యోగులు, తపస్వులు ఎందరో మామూలు మానవులలో కలిసిపోయి సంచరిస్తూ ఉంటారు. ఆనందంతో నాట్యం చేసేవారు. మల్లికార్జునుని భక్తిగీతాలు పాడేవారు, శంఖాలు పూరించేవారు. వాద్యఘోషతో కైలాసనాథునికి జయజయనాదాలు చేసేవారు, పురాణ శ్రవణం చేసేవారు ఇలా అందరూ ఏదో ఒక విధంగా ఆనాటితో జన్మధన్యం అనుకుంటూ ఆనందపడేవారే. శివరాత్రి వైభవ సంప్రదాయాలు ఉద్వేగ భరిత క్షణాలు సంధ్యాసమయంలో ప్రారంభమవుతాయి అఖిలలోకాలకు ప్రభయై వెలిగే అచలేశ్వరునికి ప్రభోత్సవం సిద్ధమవుతుంది. స్వామి అమ్మవార్లు ప్రభపైకి విచ్చేస్తారు. అందమైన ప్రభపై చిత్రవిచిత్ర పుష్పాలతో అలంకరణ జరుగుతుంది. ఆదిదంపతులు పురవీధుల్లో ప్రభలపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరిస్తారు. సూర్యాస్తమయం ఆవుతుంది. శ్రీశైల ఆలయం చుట్టూ ఉండే సాలుమండపాలపై, మెట్లపై ఇతర మండపాలలో ఎక్కడ చూసినా జనమే కానవస్తారు. వారందరి ఎదురుచూపులన్నీ పాగాలంకరణ కోసమే. మరోవైపు ఆలయంలో లింగోద్భవకాల రుద్రాభిషేక ఏర్పాట్లలో అర్చకగణం మునిగిపోతుంది. లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, పాగాలంకరణ ఒకేసమయంలో ప్రారంభమవుతాయి. దివ్యతీర్థజలాలతో, విశేషద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అఖిల జగత్తుకు మూలాధారమైన ఆదిదేవునికి జరిగే ఈ అభిషేకాన్ని దర్శించడం ఎన్నో జన్మల సుకృతం. అభిషేకం పూర్తయ్యే సమయానికి కొంచెం ముందుగా పాగాలంకరణ పూర్తవుతుంది. ఒక్కసారిగా అంతటా వెలుగులు ప్రసరిస్తాయి. కళ్లముందు పాగాలంకరణతో మెరిసిపోయే స్వామి. నుదుట బాసికం పెట్టుకుని, పాగా చుట్టుకున్న మల్లన్న, భ్రమరాంబికాదేవితో కల్యాణం జరిపించుకోవడానికి చంద్రవతీ కల్యాణ మంటపానికి విచ్చేస్తాడు. లోకహితం కోసం జరిగే ఆదిదంపతుల కల్యాణోత్సవం... రెండు కన్నులు వాలని రసవత్తర ఘట్టాన్ని తిలకించాలంటే శ్రీశైలం సందర్శించాలి. మల్లికార్జునా! ఆదుకో! శివరాత్రి: ఇన్ని గంటలు శివార్చన చేస్తే పుణ్యం! -
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
-
మల్లన్న ఆలయంలో నందీశ్వరుడికి అభిషేకాలు
-
భక్తులతో కిటకిటలాడిన శ్రీశైలం
కర్నూలు, శ్రీశైలం ప్రాజెక్ట్: కార్తీకమాసం మొదటి ఆదివారం సందర్భంగా శ్రీశైలం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 60 వేలమంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని ఆలయాధికారుల అంచనా. తెల్లవారుజామున పవిత్ర పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేకువ జామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. 4.30 గంటల నుంచి భక్తులను స్వామి అమ్మవార్ల సర్వ దర్శనం, ఆర్జిత సేవలకు అనుమతించారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు రద్దీ కారణంగా సుప్రభాత సేవ, మహా మంగళ హారతి సేవ, టిక్కెట్లను నిలిపివేశారు. భక్తులకు క్యూలలో మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం, ఉదయం వేళల్లో పాలు పంపిణీ చేశారు. శివదీక్షా శిబిరాల్లో వనభోజనాలు ఏర్పాటు చేశారు. అన్నదాన మందిరంలో భక్తుల సౌకర్యార్థం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్తీక దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీకదీపారాధన చేసుకునే భక్తులకు ఆలయ ఉత్తరభాగం నుంచి ప్రత్యేక ప్రవేశం కల్పించారు. -
శ్రీశైలం దేవస్థానం లో చిరుత సంచారం