
నటుడు విశాల్ అన్నదానం
తమిళసినిమా: విశాల్ నటుడిగానే కాకుండా ఇతరత్రా కూడా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో భాగంగానే ఇటీవల తన అభిమాన సంఘాలను ప్రజా సంఘంగా మార్చి ప్రజాసేవకు కార్యరూపం దాల్చారు. అంతేకాకుండా దక్షిణ భారత నటీనటుల సంఘం వ్యవహారంలో కూడా తన వాయిస్‌ను గట్టిగానే వినిపిస్తున్నారు. త్వరలో జరగనున్న ఈ సంఘం ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా తాజాగా విశాల్ తన లోని మానవత్వానికి నిదర్శనంగా మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివా రం ఉదయం తన సోదరి ఐశ్వర్యతో కలసి స్థానిక కీల్పాక్కం చర్చ్‌లోని 200 మందికి అనాథలకు అన్నదానంతో పాటు చీరలు, ధోవతులు పంచిపెట్టారు.