వేలవేల వందనాలు
⇔ వాడవాడలా వైఎస్సార్ జయంతి వేడుకలు
⇔ వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం, ఘన నివాళులు
⇔ పేదలకు అన్నదానం, రక్తదాన శిబిరాలు, పండ్లు, బ్రెడ్ల పంపిణీ
⇔ అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు, వైఎస్ అభిమానుల హాజరు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు జిల్లాలో శుక్రవారం వాడవాడలా ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు వైఎస్సార్ అభిమానులు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు పాలభిషేకాలతో పాటు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. వైఎస్ జయంతిని పురస్కరించుకొని పేదలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణి చేశారు. రక్తదాన శిబిరాలు, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామానా
⇔ వైఎస్ జయంతి వేడుకలు జరిగాయి. ఒంగోలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యాలయంలో వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.
⇔ మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, పార్టీ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డిలు వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి.
⇔ కొండపి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా జయంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
⇔ దర్శి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాలల్లో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
⇔ చీరాల నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ వరికూటి అమృతపాణిలు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచారు.
⇔ అద్దంకిలో పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి రోగులకు పండ్లు పంచారు.
⇔ యర్రగొండపాలెం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, ఎంపీపీ విజయభాస్కర్‌తో పాటు ఆయా మండలాల పార్టీ శ్రేణులు వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
⇔ గిద్దలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
⇔ కందుకూరు నియోజకవర్గంలో కొల్లూరి కొండయ్య, గంగిరెడ్డి, రమేష యాదవ్‌ల ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
⇔ సంతనూతలపాడు నియోజకవర్గంలో పార్టీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో నాయకులు జయంతి వేడుకలు నిర్వహించారు.
⇔ పర్చూరు నియోవర్గంలో పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు.
⇔ కనిగిరి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బుర్రా మధుసూదనయాదవ్ ఆధ్వర్యంలో అన్నీ మండలాల్లో వైఎస్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు.